sonykongara Posted February 2, 2019 Author Posted February 2, 2019 వడివడిగా ‘ముడా’ పోర్టు పైలాన్ పనులు విద్యుత్తు కాంతుల్లో కొండపల్లి సూర్యారావుపేట (విజయవాడ), న్యూస్‌టుడే: మచిలీపట్నం పోర్టు పనుల శంకుస్థాపనకు రంగం సిద్ధమైంది. ఈ నెల 7న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేతుల మీదుగా మచిలీపట్నం పోర్టు పైలాన్‌ను ఆవిష్కరించనున్నారు. ‘గేట్ వే ఆఫ్ ప్రాస్పరిటీ’ పేరుతో ‘ముడా’ పోర్టు పైలాన్‌ను డిజైన్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు ‘వెల్‌కం గేట్‌వే’గా ఆకర్షణీయంగా దీన్ని తీర్చిదిద్దుతున్నారు. మైక్రోకాస్మిక్ డిజైన్‌తో ఆంధ్రప్రదేశ్ విజన్‌ను తెలియజేసేలా ఈ పైలాన్‌కు రూపకల్పన జరుగుతోంది. ఈ పైలాన్‌ను ఈ నెల 7న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేతుల మీదుగా ఆవిష్కరణకు సిద్ధం చేస్తున్నారు.రి కొండపల్లి ఖిల్లా ఉత్సవాలు ఈ నెల 3న ప్రారంభమవుతున్నాయి. దీని కోసం కొండపల్లి ఖిల్లాను రంగు రంగుల లేజర్‌లైట్లతో సుందరంగా అలంకరించారు.
sonykongara Posted February 3, 2019 Author Posted February 3, 2019 వెలుగు జిలుగుల ఖిల్లా కొండపల్లి03-02-2019 08:01:16 నేటి సాయంత్రం ఐదు గంటలకు 30 నిమిషాల లేజర్ షో ఒకే సారి 400 మంది వీక్షించే విధంగా ఏర్పాట్లు కొండపల్లి ఖిల్లా (ఇబ్రహీంపట్నం): రెండు రోజుల పాటు జరిగే కొండపల్లి ఖిల్లా ఉత్సవాలకు సర్వం సిద్ధం చేశారు. పురావస్తుశాఖ కమిషనర్ వాణీమోహన్ నేతృత్వంలో అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. కోటను విద్యుత్ కాంతులతో అలంకరించారు. కోట పరిసర ప్రాంతాలు వెలుగుతో విరాజిల్లుతున్నాయి. కోట ప్రాశస్త్యాన్ని వివరించే విధంగా 30 నిమిషాల నిడివి గల లేజర్ షో ఏర్పాట్లు పూర్తి చేశారు. ఒకే సారి 400 మంది ప్రజలు వీక్షించే విధంగా ఏర్పాట్లు చేశారు. తొలి రోజు యూత్ హాస్టల్స్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో 12 రకాల సాహస క్రీడలు ప్రదర్శించనున్నారు. 16 రాష్ట్రాల నుంచి 250 మంది మహిళా, పురుష క్రీడాకారులు, ఆరు దేశాలకు చెందిన 10 మంది క్రీడాకారులు పాల్గొననున్నారు. పర్యాటకులను బస్సుల ద్వారా ఖిల్లాపై తీసుకువెళ్లనున్నట్లు తెలుస్తోంది.
Yaswanth526 Posted February 4, 2019 Posted February 4, 2019 (edited) Edited February 4, 2019 by Yaswanth526
sonykongara Posted February 4, 2019 Author Posted February 4, 2019 కొండపల్లి చరిత్రను దశదిశలా వ్యాపింపజేస్తాం ఖిల్లా ఉత్సవాల్లో మంత్రి దేవినేని ఉమా ఇబ్రహీంపట్నం, న్యూస్‌టుడే: కొండపల్లి చరిత్రను దశదిశలా వ్యాపింపజేస్తామని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. విజయవాడకు సమీపంలోని కొండపల్లి ఖిల్లా ఉత్సవాలను ఆదివారం కృష్ణా జిల్లా కలెక్టర్ లక్ష్మీకాంతంతో కలసి మంత్రి ..కోట ప్రాంగణంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ దాదాపు 10 శతాబ్దాల చరిత్ర కొండపల్లి కోటకు ఉందని, దీని గురించి ప్రపంచం మొత్తం తెలుసుకునేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. అందులో భాగంగానే ఉత్సవాలను నిర్వహిస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం ఉత్సవాల్లో పాల్గొంటారని తెలిపారు. అనంతరం పురావస్తు శాఖ ఆధ్వర్యంలో కోటను ఏలిన రాజులకు సంబంధించి రూపొందించిన లేజర్ షోను ప్రదర్శించారు. ఉత్సవాలతో పాటు యూత్ హాస్టల్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో సాహస క్రీడలను నిర్వహించారు. కార్యక్రమాన్ని పురావస్తు శాఖ కమిషనర్ కె.వాణీమోహన్ పర్యవేక్షించారు.
Recommended Posts
Create an account or sign in to comment
You need to be a member in order to leave a comment
Create an account
Sign up for a new account in our community. It's easy!
Register a new accountSign in
Already have an account? Sign in here.
Sign In Now