Jump to content

Kondapalli Fort & Mulapadu


Recommended Posts

  • Replies 136
  • Created
  • Last Reply

Top Posters In This Topic

కొండపల్లి ఖిల్లాకు రూ.100కోట్లు

 

ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు

4ap-state1a_2.jpg

ఈనాడు, విజయవాడ: దేశంలోనే ప్రముఖ పర్యాటక కేంద్రంగా కొండపల్లి కోటను అభివృద్ధి చేసేందుకు వచ్చే నాలుగేళ్లలో రూ.100కోట్లతో అభివృద్ధి పనులను చేపట్టనున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వెల్లడించారు. సోమవారం ఈ కోటపై జరుగుతున్న వేడుకల ముగింపు సభకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అమరావతికి మణిహారంగా ఖిల్లా మారుతుందన్నారు. ఇక్కడి బొమ్మలకు దేశవిదేశాల్లో మంచి ఆదరణ ఉందని, మరింత ప్రాచుర్యం కలిగించేందుకు అవసరమైన చర్యలను చేపడతామని చెప్పారు. దీనికి పూర్వవైభవాన్ని తేవడానికి పురావస్తు, పర్యాటకశాఖల ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్‌ నేతృత్వంలో కొండపల్లి ఫోర్ట్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీని ఏర్పాటు చేయనున్నామని ప్రకటించారు. గత ఏడాదిగా రూ.10.9కోట్లతో పునరుద్ధరణ పనులను చేపట్టారన్నారు. రాజుల చరిత్రను తెలుసుకునేలా ఒక యాప్‌ను రూపొందించామని, లేజర్‌ షో, త్రీడీ ప్రొజెక్షన్‌ మ్యాపింగ్‌ వంటివి ఏర్పాటు చేశామని చెప్పారు. రాజధానికి వచ్చే వారు కొండపల్లి కోటను సందర్శించేలా చర్యలు తీసుకుంటామని, పర్యాటకులు ఆహ్లాదంగా గడిపేందుకు అవసరమైన అన్ని మౌలిక వసతులను కల్పిస్తామని వివరించారు. ఈ కోట చుట్టూ ఉన్న 25,500 ఎకరాల స్థలంలో పరిమళభరితమైన, ఔషధ గుణాలు కలిగిన వృక్షాలను పెంచనున్నామని తెలిపారు. ప్రముఖ చరిత్రకారులు ఈమని శివనాగిరెడ్డి రాసిన కొండపల్లి ఖిల్లా చరిత్ర పుస్తకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేతుల మీదుగా ఆవిష్కరించారు.  మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, పురావస్తుశాఖ కమిషనర్‌ వాణీమోహన్‌, పర్యాటశాఖ కార్యదర్శి ముఖేష్‌కుమార్‌ మీనా, జిల్లా కలెక్టర్‌ లక్ష్మీకాంతం, తదితరులు పాల్గొన్నారు.

 

Link to comment
Share on other sites

కొండపల్లి కోటకు మహర్దశ 

నాలుగేళ్లలో సమగ్ర అభివృద్ధికి ప్రణాళిక 
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వెల్లడి 
ఘనంగా ముగిసిన రెండు రోజుల ఉత్సవం

amr-brk1a_68.jpg

ఈనాడు, విజయవాడ - ఇబ్రహీంపట్నం, న్యూస్‌టుడే: కొండపల్లి కోటకు మహర్దశ పట్టనుంది. పూర్తి స్థాయిలో పర్యాటక థామంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు. కోటకు వచ్చే మార్గాన్ని సైతం నేరుగా ఇబ్రహీంపట్నం నుంచి వేయనున్నట్లు ప్రకటించారు. కొండపల్లికోట ఉత్సవాలు, సాహస క్రీడలు సోమవారంతో ముగిశాయి. ముగింపు వేడుకకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొండపల్లి కోటకు రూ.9.5 కోట్లతో రహదారులను అభివృద్ధి చేయడంతో పాటు తిరుమల మాదిరిగా మెట్ల మార్గం కూడా ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. భవిష్యత్తులో కొండపల్లి కోట, పవిత్ర సంగమం ప్రాంతం, రూ.1680 కోట్లతో కూచిపూడి ఐకానిక్‌ బ్రిడ్జి వంటివి ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా అగ్రస్థానంలో నిలపనున్నాయన్నారు. రెండు రోజుల పాటు జరిగిన కొండపల్లి కోట ఉత్సవాలు, సాహసక్రీడల్లో యువత పెద్దఎత్తున పాల్గొన్నారు. యూత్‌ హాస్టల్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో జుమెరింగ్‌, రాక్‌ క్లైంబింగ్‌, ర్యాప్లింగ్‌, జిప్‌లైన్‌, జొరాబిన్‌ వంటి సాహస క్రీడలను ఏర్పాటు చేశారు. వీటిని దిగ్విజయంగా నిర్వహించడంలో కీలకంగా వ్యవహరించిన వారికి ముఖ్యమంత్రి చేతులమీదుగా జ్ఞాపికలు, ప్రశంసా పత్రాలను అందించారు. రెండో రోజు ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థులు ప్రదర్శించిన నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కొండపల్లి ఖిల్లా ముఖ ద్వారం వద్ద ఉన్న హజరత్‌ సయ్యద్‌ గాలిబ్‌ షహీద్‌ రెహమతుల్లా దర్గాను ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి ఫకీర్లు ఘనంగా డప్పు వాయిద్యాలతో స్వాగతం పలికారు. దర్గాలో మతగురువులు, ముస్లిం పర్సనల్‌ లా బోర్డు ఆంధ్రప్రదేశ్‌ ఛైర్మన్‌ అల్తాఫ్‌రజా, మొయిన్‌ తదితరుల ఆధ్వర్యంలో ఫతేహ్‌ నిర్వహించారు. పవిత్ర వస్త్రాన్ని చంద్రబాబుకు కప్పి, తలకు టోపీని తొడిగారు. అనంతరం మత గురువుల ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కార్యక్రమంలో ముస్లిం పర్సనల్‌ లా బోర్డు ఆంధ్రప్రదేశ్‌ ఛైర్మన్‌ అల్తాఫ్‌ రజా, తదితరులు పాల్గొన్నారు. 
లేజర్‌ షో, ఖిల్లా చిత్ర ప్రదర్శన.. 
కొండపల్లి ఖిల్లాలో తాజాగా ఏర్పాటు చేసిన లేజర్‌షో ఆకట్టుకుంది. రెండో రోజు లేజర్‌షోను చూసేందుకు పెద్దఎత్తున సందర్శకులు తరలివచ్చారు. ఆహ్లాదకరమైన సంగీతం నడుమ సాగిన లేజర్‌షో కనులపండువగా సాగింది. కొండపల్లి ఖిల్లా మధ్యలో ఏర్పాటు చేసి మ్యూజియంను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. పురాతన రాతి విగ్రహాలు, శిలలను మ్యూజియంలో వివరాలతో సహా పొందుపరిచారు. అలనాటి రాజులకు సంబంధించిన వివరాలను వారి మాటల్లోనే వివరించేలా ఆధునిక సాంకేతికతను వినియోగించి రూపొందించిన యాప్‌ ఆకట్టుకుంటోంది. అనంతరం.. ఖిల్లాకు పడమర భాగంలో ఏర్పాటు చేసిన నాడు-నేడు చిత్రాలను ముఖ్యమంత్రి ఆసక్తిగా తిలకించారు. ఖిల్లా ఉత్సవాల మొదటి రోజున జరిగిన పొరపాటు రెండో రోజు కొనసాగకుండా పోలీసులు జాగ్రత్తపడ్డారు. ముఖ్యమంత్రి పర్యటనను దృష్టిలో పెట్టుకొని సాధారణ వాహనాలను పైకి అనుమతించలేదు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సుల్లో మాత్రమే అందరినీ కోట వద్దకు తరలించారు. దీంతో ట్రాఫిక్‌ ఇబ్బందులు తప్పాయి. సాయంత్రం సమయంలో మాత్రం నిబంధనలను సడలించడంతో కొద్దిపాటి ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తాయి. 
పెరిగిన విహంగ వీక్షకులు.. 
పవిత్ర సంగమం వద్ద ఏర్పాటు చేసిన హెలీకాప్టర్‌లో సోమవారం ఎక్కువ మంది విహరించారు. ఒక రౌండుకు ఒక్కొక్కరికి రూ.2500 ధర నిర్ణయించినప్పటికీ.. భారీగా తరలివచ్చి మరీ ఎక్కారు. సోమవారం ఒక్కరోజే దాదాపు 300 మందికి పైగా హెలీకాప్టర్‌ ఎక్కి విహరించారని నిర్వాహకులు వెల్లడించారు. కొండపల్లి ఖిల్లా ఉత్సవాల్లో భాగంగా పవిత్ర సంగమం వద్ద నిర్వహించిన కార్యక్రమాలు ఆకట్టుకొన్నాయి. ముందుగా తెలుగు తల్లి పాటతో కార్యక్రమాలు ప్రారంభం కాగా నవహారతి సమయంలో విరామం పాటించారు. అనంతరం హాస్యం, మిమిక్రీ, సినీగీతాల కార్యక్రమాలను నిర్వహించారు. 
అభినందించిన ముఖ్యమంత్రి.. 
ఖిల్లా వద్ద నిర్వహించిన కార్యక్రమాలతో పాటు కోట మరమ్మతులు, మ్యూజియం ఏర్పాటుకు శక్తి వంచన లేకుండా కృషి చేసిన పురావస్తు శాఖ కమిషనర్‌ వాణీమోహన్‌, పర్యాటకశాఖ కార్యదర్శి ముఖేష్‌కుమార్‌ మీనా, పనులను నిర్వహించిన బొర్రా క్రాంతికుమార్‌ను ముఖ్యమంత్రి ప్రత్యేకంగా అభినందించారు. గుత్తేదారు ఎంతో ఓపికగా పనులను చేపట్టారని, కోటకు గత రూపు తీసుకొచ్చేందుకు.. బెల్లం ఊట, కలబంద, గోగునారలతో కలిపిన మిశ్రమంతో తీర్చిదిద్దారని.. పురావస్తుశాఖ అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.

 

Link to comment
Share on other sites

అదరహో...! 

ముగిసిన కొండపల్లి ఖిల్లా ఉత్సవాలు

amr-brk3a_48.jpg

కొండపల్లి ఖిల్లా ఉత్సవాలు ముగిశాయి. వేడుకల్లో రెండో రోజు సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. మరోవైపు సాహస క్రీడలు కనువిందు చేశాయి. విద్యార్థుల నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. లేజర్‌ షో, ఖిల్లా చిత్ర   ప్రదర్శనకు ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. మ్యూజియాన్ని చూసి కోట విశేషాలను తెలుసుకున్నారు. పవిత్ర సంగమం వద్ద ఏర్పాటు చేసిన హెలీకాప్టర్‌లో విహరించేందుకు సందర్శకులు ఆసక్తి చూపారు. సాంస్కృతిక కార్యక్రమాలు, ఎగ్జిబిషన్‌ అలరించాయి. మంత్రి దేవినేని ఉమా, జిల్లా కలెక్టర్‌ లక్ష్మీకాంతం, అధికారులు, ప్రజాప్రతినిధులు, కొండపల్లి గ్రామస్థులు పాల్గొన్నారు.

amr-brk3b.jpg

- ఇబ్రహీంపట్నం, న్యూస్‌టుడే

 

Link to comment
Share on other sites

  • 2 weeks later...
  • 2 weeks later...

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...