Nfan from 1982 Posted May 11, 2018 Posted May 11, 2018 13 hours ago, Hello26 said: This looks so awesome ...rajasam kanipistondi. Great work by the people who made this centuries ago
sonykongara Posted May 24, 2018 Author Posted May 24, 2018 కృష్ణానది వద్ద నిలిచిన సౌండ్, లైటింగ్ షో పనులు24-05-2018 07:09:35 ఏడు నెలల క్రితం శంకుస్థాపన కాంట్రాక్టర్‌కు బిల్లుల చెల్లింపులో జాప్యం టూరిజం అధికారుల అలసత్వమే కారణమా? అమరావతి: అమరావతి వారసత్వ నగరంగా కేంద్రప్రభుత్వం గుర్తించిన విషయం విదితమే. కోట్లాది నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అయితే, అమరేశ్వర స్వామి ఆలయ సమీపంలోని స్నానఘాట్ వద్ద కృష్ణానదిలో రూ. 4.8 కోట్లతో ఏర్పాటుచేస్తున్న సౌండ్ అండ్ లైటింగ్ సిస్టమ్, లేజర్ షోకు సంబంధించిన పనులు కొద్ది రోజులుగా నిలిచిపోయాయి. ఏడు నెలల క్రితం స్థానిక శాసనసభ్యుడు డాక్టర్ కొమ్మాలపాటి శ్రీధర్ శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారు. లేజర్ షోకు సంబంధించి విద్యుత్ బోర్డులు బిగించారు. నదిలో కూడా ప్రత్యేక పైపుల ద్వారా విద్యుత్ కనెక్షన్‌ను ఏర్పాటుచేశారు. సౌండ్‌కు సంబంధించి స్పీకర్ బాక్సులు ఘాట్‌లో ఏర్పాటుచేశారు. పనులు చివరికి వచ్చే సరికి టూరిజం ఇంజనీరింగ్ అధికారులు కాంట్రాక్టర్‌కు బిల్లులు మంజూరు చేయడంలో ఆలసత్వం వహిస్తున్నందున పనులు నిలుపుదల చేసి వెళ్లినట్లు స్థానికులు అంటున్నారు. ప్రధాన రహదారిలో విద్యుత్ లైట్లు, సత్తెనపల్లి రోడ్‌లో ఎల్‌ఈడీ లైట్లు ఏర్పాటుచేసి నెలలు గడుస్తున్నా... వాటికి కనెక్షన్ ఇవ్వకపోవడంతో నిరుపయోగంగా దర్శనమిస్తున్నాయి. ఇప్పటికైనా టూరిజం అధికారులు స్పందించి పనులు పూర్తి చేయాల్సిన అవసరం ఉంది.
sonykongara Posted September 8, 2018 Author Posted September 8, 2018 వారసత్వ నగరానికి మణిహారం08-09-2018 07:35:59 అమరావతిలో రూపుదిద్దుకోనున్న ధ్యానబుద్ధ వనం పనులు ప్రారంభించిన టూరిజం అధికారులు అమరావతి: అమరావతి వారసత్వ నగరంలో ధ్యానబుద్ధ ప్రాజెక్టు ఎదురుగా నదీ తీరంలో సుమారు పది ఎకరాల్లో ధ్యానబుద్ధ వనం నిర్మించనున్నారు. హృదయ్ పథకం నిధులతో రూ.6కోట్లతో నిర్మించనున్న ఈ వనం వారసత్వ అమరావతికి మణిహారం కానుంది. ధ్యానబుద్ధ ప్రాజెక్ట్టు ఎదురుగా గతంలో కాలచక్ర మహాసభలు నిర్వహించిన 16.5 ఎకరాల ప్రైవేటు స్థలం భూసేకరణ ద్వారా పరిహారం చెల్లించి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. అందులో ధ్యానబుద్ధ వనం నిర్మించేందుకు టూరిజం అధికారులు పనులు ప్రారంభిస్తున్నారు. శుక్రవారం ముళ్లకంపను తొలగించి హద్దులు నిర్ణయించారు. ఈ వనంలో టెంపుల్ హౌస్, పర్యాటక వసతి కేంద్రం నిర్మించనున్నారు. రూ.6కోట్లతో నిర్మించే వనంలో పర్యాటకులకు సౌకర్యాలతో పాటు ఆహ్లాదకర వాతావరణాన్ని ఏర్పాటు చేయనున్నారు. బుద్ధిస్ట్ సర్క్యూట్ అభివృద్ధిలో బాగంగా ఈ ధ్యానబుద్ధ నిర్మాణం జరగనుంది. నూతనంగా నిర్మించనున్న ధ్యాన బుద్ధవనంతో పర్యాటకులకు, యాత్రికులకు మరింత ఆహ్లాదం కలుగుతుందనడంలో సందేహం లేదు.
sonykongara Posted September 22, 2018 Author Posted September 22, 2018 బౌద్ధ క్షేత్రాలకు నూతన శోభ 22-09-2018 08:52:33 స్వదేశీ దర్శన్ కింద బౌద్ధవలయం అభివృద్ధి అమరావతి, అనుపు పర్యాటక ప్రదేశాలకు నిధులు.. రూ.2 కోట్లకు పైగా మంజూరయ్యే అవకాశం గుంటూరు: కేంద్ర ప్రభుత్వ పర్యాటక శాఖ స్వదేశీ దర్శన్ కార్యక్రమం కింద బౌద్ధ వలయం అభివృద్ధికి దేశంలోని వివిధ రాష్ట్రాలతో పాటు మన రాష్ట్రాన్ని కూడా ఎంపిక చేసింది. ఇందుకోసం రూ.5.233 కోట్ల నిధులను మంజూరు చేసింది. రాష్ట్రం మొత్తం మీద ఆరు బౌద్ధ క్షేత్రాలను అభివృద్ధి చేసేందుకు నిర్ణయం తీసుకోగా అందులో గుంటూరు జిల్లాకు చెందిన అమరావతి, అనుపు ప్రదేశాలకు చోటు దక్కింది. ఇటీవలే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బౌద్ధవలయం అభివృద్ధికి శంకుస్థాపన చేసిన నేపథ్యంలో త్వరలోనే పనులు ప్రారంభమౌతాయని పర్యాటక వర్గాలు భావిస్తున్నాయి. మౌలిక సదుపాయాల కల్పన జరిగితే ఈ రెండు బౌద్ధ క్షేత్రాలకు మరింత పర్యాటక శోభ సంతరించుకొంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 17 బౌద్ధ క్షేత్రాలు ఉన్నప్పటికీ స్వదేశీ దర్శన్ ప్రాజెక్టులో ఆరు ప్రదేశాలకే చోటు దక్కింది. అందులో జిల్లాకు చెందిన రెండు ప్రదేశాలు ఉండటం విశేషం. గతంలో ఆలనపాలన లేకుండా ఉండే బౌద్ధక్షేత్రాల అభివృద్ధికి జిల్లా యంత్రాంగమే శ్రీకారం చుట్టింది. అమరావతిలో నిర్మించిన ధ్యానబుద్ధ ప్రాజెక్టు నేడు అంతర్జాతీయంగా పేరు, ప్రఖ్యాతలు సంపాదించుకొంది. అలానే భట్టిప్రోలులోనూ ఇదే వ్యూహాన్ని పర్యాటక శాఖ నోడల్ ఆఫీసర్ మల్లికార్జునరావు అమలు చేస్తున్నారు. అక్కడ చెరువులో స్లీపింగ్ బుద్ధుని నిర్మిస్తున్నారు. ఇది కూడా భవిష్యత్తులో పర్యాటకులను ఆకట్టుకొంటుందని భావిస్తున్నారు. స్వదేశీ దర్శన్ ప్రాజెక్టులో ప్రధానంగా అంతర్గత రోడ్లు, కాలిబాటలు, ధ్యానమందిరాలు, టాయ్‌లెట్స్, పచ్చదనం, టూరిజం హోటళ్లు వంటివి ఏర్పాటు చేసి పర్యాటకులను ఆకర్షించేందుకు చర్యలు తీసుకొంటారు. అయితే ఎంతో చారిత్రక విశిష్టత కలిగిన భట్టిప్రోలు బౌద్ధస్థూపాన్ని స్వదేశీ దర్శన్ ప్రాజెక్టులో విస్మరించడంపై స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఈ విషయాన్ని మంత్రి నక్కా ఆనంద్‌బాబు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీనిని పరిగణనలోకి తీసుకొన్న సీఎం రాష్ట్ర ప్రభుత్వ నిధులతో భట్టిప్రోలులో కొన్ని అభివృద్ధి పనులు చేపట్టాలని పర్యాటక శాఖ అధికారులను ఆదేశించారు. ఇదిలావుంటే గత ఏడాది సెప్టెంబర్ నెలలో స్వదేశీ దర్శన్ ప్రాజెక్టుని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించగా 12 నెలల తర్వాత శంకుస్థాపన దశకు రావడంపై బౌద్ధ పర్యాటక ప్రేమికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరికొన్ని నెలలు గడిస్తే ఎన్నికల కోడ్ రానుండటంతో ఆలోపే ఈ పనులు పూర్తి చేయాలని కోరుతున్నారు.
sonykongara Posted October 15, 2018 Author Posted October 15, 2018 ఆహ్లాద భరితం... అమరావతి సందర్శనంఅమరావతి, న్యూస్‌టుడే నవ్యాంధ్ర నూతన రాజధానికి అమరావతి నామకరణం చేశారంటే ఇట్టే అర్థమవుతుంది. చర్రిత్రలో అమరావతికి ఉన్న విశిష్టత ఎంతటిదో... ‘అమరావతి’ ప్రాచీన చరిత్రకు నిలువెత్తు నిదర్శనం. ఓ వైపు కృష్ణమ్మ పరవళ్లు, పరమ శివుడు కొలువై ఉన్న పంచారామం, మరోవైపు బుద్ధుడు నడియాడిన పుణ్య భూమి, శాతవాహనుల రాజధానిగా వెలుగొందిన ప్రదేశం... ఇన్ని విశిష్టతలు ఉన్న అమరావతి రాష్ట్రంలోనే ప్రముఖ ఆధ్యాత్మిక, పర్యాటక ప్రాంతంగా విశేష ఆదరణ పొందుతోంది. రాజధానిగా అమరావతి పేరును నామకరణం చేసినప్పటి నుంచి ఇక్కడికి వచ్చే పర్యాటకుల సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో సమయాభావంతో... వీలు కుదరక దసరా సెలవుల్లో దూర ప్రాంతాలను సందర్శించలేని వారు... దగ్గరలోని అమరావతి ప్రాంతాన్ని... అక్కడి విశేషాలను తనివితీరా చూసి ఆనందాన్ని ఆహ్లాదాన్ని పొందవచ్చు. పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలన్న తలంపుతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ పథకాల ద్వారా కోట్లాది రూపాయల నిధులను వెచ్చించి అమరావతికి సకల హంగులను ఒనగూర్చాయి. నవ్యాంధ్ర సచివాలయంనవ్యాంధ్ర నూతన సచివాలయం అమరావతికి 20 కి.మీ. దూరంలో విజయవాడ ప్రధాన రహదారిని ఆనుకొని ఉన్న వెలగపూడి గ్రామంలో ఉంది. విజయవాడ వెళ్లే బస్సుల ద్వారా ఇక్కడకు చేరుకొవచ్చు. అమరావతి పర్యటన ముగించుకొని విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరి వెళ్లే పర్యాటకులు సచివాలయాన్ని సందర్శించవచ్చు. సందర్శకుల కోసం ప్రత్యేక సమయాలు కేటాయించి ప్రభుత్వం సందర్శనార్థం లోపలకి అనుమతిస్తుంది. ఆర్టీసీ బస్సులు నేరుగా సచివాలయం మీదుగా ఆయా ప్రాంతాలకు వెళ్తాయి. అనంతరం 10 కి.మీ. సమీపంలో ఉన్న మంగళగిరి లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానాన్ని దర్శించవచ్చు. అమరేశ్వరాలయం ఆకట్టుకుంటున్న లేజర్ షోవిజయవాడకు 41 కి.మీ... గుంటూరుకు 32 కి.మీ.ల దూరంలో ఉన్న అమరావతిలో కృష్ణమ్మ తీరాన కొలువై ఉన్న అమరేశ్వరాలయం పంచారామ క్షేత్రాలలో ప్రథమమైనది. దేవేంద్రుడే స్వయంగా శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజలు నిర్వహించాడన్నది ప్రతీతి. బాల చాముండికా సమేత అమరేశ్వరుని దర్శిస్తే సకల పాపాలు తొలగి పుణ్యం లభిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. శివుడు అభిషేక ప్రియుడు కావడంతో స్వామి వారికి నిత్య కళ్యాణం, అభిషేకాది కైంకర్యాలు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. ప్రస్తుతం ఉన్న అమరేశ్వరాలయాన్ని రాజావాసిరెడ్డి వెంకటాద్రినాయుడు బహుద్దూరు నిర్మించారన్నది ప్రతీతి. దసరాకి అమరేశ్వరాలయాన్ని ప్రత్యేకంగా అలంకరించి... ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని దేవదాయ శాఖ ప్రత్యేక వసతులను సమకూర్చింది. ఇటీవల పర్యాటక శాఖ రూ.5 కోట్లతో ఆలయం వద్ద వాటర్ లేజర్ షోను ఏర్పాటు చేసింది. వైకుంఠపురం ఆలయంఅమరావతికి 9 కి.మీ. దూరంలో విజయవాడ రహదారి వెంట వైకుంఠపురం కృష్ణా నది తీరాన ఉత్తర వాహిణిలో క్రౌంచగిరి కొండపై కొలువై ఉన్న కళియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వరుని దేవస్థానం ఉంది. రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు ఇక్కడకు చేరుకొని స్వామివారిని దర్శిస్తుంటారు. భక్తుల రద్దీ దృష్ట్యా దేవాదాయ శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. వైకుంఠపురం వెంకటేశ్వరుని సన్నిధి సమీపాన తిరులమ తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో తిరుపతి నమూనా ఆలయాన్ని నిర్మించేందుకు ప్రభుత్వం అవకాశాలను పరిశీలిస్తోంది. ఈ ఆలయ సమీపానే వైకుంఠపురం దాములూరు మధ్య రిజర్వాయరు నిర్మించడానికి రూ.2 వేల కోట్లతో ప్రభుత్వం ఇటీవల టెండర్లు పిలిచింది. వైకుంఠపురం నుంచి 8 కి.మీ. దూరంలో అనంతవరం గ్రామంలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించవచ్చు. పులిచింతల ప్రాజెక్టుఅమరావతికి 60 కి.మీ. ఎగువన అచ్చంపేట మండలంలో కృష్ణా నదిపై కేఎల్ రావు సాగర్ పులిచింతల ప్రాజెక్టు ఉంది. పచ్చని ప్రకృతి సోయగాలు, గిరిజిన తండాలు, కొండకోనల నడుమన సాగే ప్రయాణం పర్యాటకులకు మధురానుభూతిని అందిస్తుంది. ప్రాజెక్టుపై నుంచి కృష్ణమ్మ అందాలను తిలకించవచ్చు. వారంతపు సెలవులలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి అధిక సంఖ్యలో విద్యార్థులు, పర్యాటకులు ఇక్కడకు వస్తుంటారు. ప్రాజెక్టు సమీపాన కృష్ణా జిల్లా వేదాద్రి నరసింహస్వామి ఆలయం మాదిపాడు సత్తెమతల్లి దేవస్థానం, చింతపల్లిలో రాజావాసి రెడ్డి వెంకటాద్రి నాయుడు కాలం నాటి కోట ప్రముఖంగా ఉన్నాయి. కేంద్ర పురావస్తు సంగ్రహాలయం...అమరావతిలో కేంద్ర పురావస్తు ప్రదర్శనశాల పేరుతో ఉన్న సెంట్రల్ మ్యూజియంలో అమరావతి స్తూపం నుంచి సంగ్రహించిన అత్యంత సుందరమైన పాలరాతి శిల్పాలను తిలకించవచ్చు. వీటిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సాంస్కృతిక చిహ్నంగా ఉన్న పూర్ణకుంభ శిల్పం, పద్మాలంకృత సూచి ఫలకం, బుద్ధ ధర్మ చక్రం నిలువెత్తు బుద్ధ విగ్రహం తదితరాలు ఉన్నాయి. పర్యాటకశాఖ అమరావతి, బుద్ధ చరిత్రను వివరిస్తూ బస్టాండ్ ఎదురుగా వారసత్వ మ్యూజియాన్ని నిర్వహిస్తోంది. అమరావతి మహాస్తూపంబుద్ధ భగవానుని మహాపరినిర్యాణం అనంతరం ఆయన ధాతువులను ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రదేశాలలో నిక్షిప్తం చేస్తూ స్తూపాలను నిర్మించారు. అందులో అమరావతి స్తూపం ఒకటి. అందువల్లే దీనిని బుద్ధ ధాతు గర్భ స్తూపంగా పిలుస్తారు. అత్యంత సుందరంగా దీనిని ఆనాటి శిల్పులు అర్ధగోళాకారంలో దాదాపు 150 అడుగుల ఎత్తున నిర్మించారు. స్తూపానికి ఉన్న దక్షిణాయక వేదిక కింద బుద్ధుని ధాతువులను భద్రపరిచారు. బ్రిటీష్ అధికారి కల్నన్ కాలెన్ మెకంజీ ఈ స్తూపం వద్ద తవ్వకాలు చేపట్టి ఆ ధాతువులను వెలికితీసి అమరావతి మ్యూజియంలో పదిల పరిచారు.అమరావతి స్తూపం కాలక్రమేణా శిథిలమైనా నేటికీ దాని ప్రతిబింబాన్ని ఇక్కడ చూడవచ్చు. నేటికి భౌద్ధ సన్యాసులు వాటి సందర్శనార్థం ప్రపంచ నలుమూలల నుంచి అమరావతికి వస్తుంటారు. ధ్యానబుద్ధ విగ్రహ 125 అడుగులు125 అడుగుల బుద్ధుని ప్రతిమ నవ్యాంధ్ర పేరు చెబితే ముందుగా గుర్తొచ్చేది ధ్యానబుద్ధ విగ్రహం. రాజధానికి ప్రతిబింబంగా నిలుస్తున్న ధ్యానబుద్ధ అమరావతిలో కృష్ణమ్మ తీరాన కొలువుదీరిన అపురూప కట్టడం. బుద్దుడు నడియాడిన పుణ్యభూమిగా అమరావతి చరిత్రకెక్కింది. బుద్ధుడికి సంబంధించిన ఆనవాళ్లు నేటికీ అమరావతిలో నిక్షిప్తమై ఉన్నాయి. ఇన్ని ప్రత్యేకతలు ఉన్న అమరావతికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న బుద్ధిస్టులను ఆకర్షించాలన్న లక్ష్యంతో 2005లో ప్రభుత్వం పర్యాటక శాఖ ఆధ్వర్యంలో 125 అడుగుల ధ్యానబుద్ధ విగ్రహ నిర్మాణానికి శ్రీకారం చుట్టి 2015 నాటికి అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం పర్యాటక శాఖ జేడీగా ఉన్న రేగుళ్ల మల్లికార్జునరావు ధ్యానబుద్ధ రూపశిల్పి. అద్భుత నిర్మాణం ఆవిష్కృతం కావడంలో ఆయన పాత్ర ఎనలేనిది. పర్యాటక శాఖ రూ.5 కోట్లతో బుద్ధుడికి లేజర్ లైటింగ్‌ను ఏర్పాటు చేసింది. బుద్ధుని చరిత్రను పర్యాటకులకు అందించాలన్న లక్ష్యంతో రూ.7 కోట్లతో ధ్యానబుద్ధ ఎదురుగా ఉన్న స్థలంలో నందన వన నిర్మాణానికి ఇటీవల శ్రీకారం చుట్టింది.
Nandamuri Rulz Posted November 13, 2018 Posted November 13, 2018 Ee roju 9:30 pm ki abn lo special program vesaadu.. bhavana vijayam ani... Covering amaravathi ground work.. good one
Recommended Posts
Create an account or sign in to comment
You need to be a member in order to leave a comment
Create an account
Sign up for a new account in our community. It's easy!
Register a new accountSign in
Already have an account? Sign in here.
Sign In Now