Jump to content

International Institute of Digital Technology,Tirupati


Recommended Posts

They will be established at the new campus coming up on the outskirts of Tirupati

In a shot in the arm to the International Institute of Digital Technologies (IIDT) set up four months ago, IT and networking giant

Cisco and Kii Corporation of Japan have agreed to establish Centres of Excellence (CoE) on the new campus coming up on the outskirts of Tirupati.

 

While Cisco will start a CoE on Internet of Things, cyber security and analytics, Kii Corporation will establish a centre for research and development on IoT-related applications shortly.

Asked to comment on the feedback in four months of their journey after setting up India’s premier institute in digital technologies, Special Chief Secretary and IT Advisor to Chief Minister J.A. Chowdary told The Hindu that the industry-centric pedagogy and out-of-the-box approach to do away with regimented education syllabus had evoked a big response from various sectors.

The IIDT is now conducting classes for the first batch of students admitted to the one-year post-graduate programme in cyber security and business analytics at Sri Venkateswara University in Tirupati, he said. Their thrust was on making them acquire knowledge in new age technologies as well as improve communication skills to become global leaders.

“We have tied up with 80 big names in IT world. We are in the process of arranging global mentors on an average one for two students to get proper mentoring and guidance lifelong like Godfathers,” Mr. Chowdary said, declaring that their dream was to develop the IIDT on the lines of ISB, Hyderabad.

He said that for the first batch students had preferred to quit lucrative careers in Amazon, TCS and Infosys to learn digital skills at the IIDT. He exuded confidence that there would be encouraging response for the second batch for which an all-India entrance test would be conducted on June 25.

 

Courses in Vizag

Mr. Chowdary disclosed that they were planning to introduce courses soon in Visakhapatnam on artificial intelligence and machine learning, blockchain and financial technology (fintech) as part of a decision to transform the city into a fintech valley. Stating that the students would get more than one placement offer, he said that due to severe shortage of trained manpower there would be no worry about getting lucrative opportunities.

Ambitious plans

He said that during his interaction with the students at Tirupati he found that some were interested to prove entrepreneurship by setting up start-ups. Mr. Chowdary indicated that the new campus would come up at Renigunta on the outskirts of Tirupati. There are plans to function from the Incubation Tower and another new building is coming up near the Tirupati International Airport with a built-up area of 50,000 to 60,000 sq.ft., accommodation blocks and recreation facilities sometime in September or October.

The first phase campus will be shifted to a permanent campus once 50 acres of land is allotted to the IIDT. The institute is managed by A.P. Electronics and IT Agency, an autonomous society floated by the A.P. Government. The temporary campus will also be home to world-class incubation facilities and a cyber security laboratory.

Link to comment
Share on other sites

  • 2 weeks later...
విశాఖ, అమరావతిల్లో ‘డిజిటల్‌’ కోర్సులు
 
 
636326578203055011.jpg
  • సెప్టెంబరు నుంచి తరగతులు ప్రారంభం
  • రాష్ట్ర ఐటీ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ జేఏ చౌదరి
విశాఖపట్నం, జూన్‌ 9 (ఆంధ్రజ్యోతి): ఆధునిక ప్రపంచానికి అవసరమైన సైబర్‌ సెక్యూరిటీ నిపుణులను అందించేందుకు త్వరలో విశాఖపట్నం, అమరావతిల్లో డీప్‌ డిజిటల్‌ టెక్నాలజీ కోర్సులను ప్రారంభించనున్నట్టు రాష్ట్ర ఐటీ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ జేఏ చౌదరి తెలిపారు. ఆయన ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడుతూ తిరుపతిలో ఏర్పాటు చేసిన ఇంటర్నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ డిజిటల్‌ టెక్నాలజీ (ఐఐడీటీ) యూనివర్సిటీకి అతి తక్కువ కాలంలో పేరు ప్రఖ్యాతులు వచ్చాయన్నారు. అక్కడ 11 నెలల వ్యవధి గల సైబర్‌ సెక్యూరిటీ, బిజినెస్‌ ఎనలిటిక్స్‌పై రెండు పీజీ కోర్సులను ఫిబ్రవరిలో ప్రారంభించగా, నాలుగు నెలల్లోనే ఆ విద్యార్థులకు బహుళ జాతి కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయన్నారు.
 
ఈ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోనూ డిజిటల్‌ కోర్సులు ప్రారంభించాలని నిర్ణయించామని తెలిపారు. తొలుత విశాఖపట్నం, ఆ తర్వాత అమరావతిల్లో కొత్త కోర్సులు అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెప్పారు. వీటికి ఇప్పటికే ఆనలైన రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయన్నారు. సెప్టెంబరు నుంచి తరగతులు ప్రారంభిస్తామని చెప్పారు. విశాఖలో బ్లాక్‌చెయిన టెక్నాలజీ, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స (మెషిన లెర్నింగ్‌) కోర్సులు కొత్తగా వస్తాయన్నారు. విశాఖ, అమరావతిల్లో తరగతుల నిర్వహణకు అనువైన ప్రాంగణాలను ఎంపిక చేసేందుకు కసరత్తు జరుగుతోందని తెలిపారు.
Link to comment
Share on other sites

  • 2 months later...
  • 1 month later...
  • 2 months later...
 
 
తిరుపతి ఐఐడీటీకి దేశంలో నాలుగో స్థానం
తిరుపతిలోని ఏడాది క్రితం ప్రారంభించిన ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజిటల్‌ టెక్నాలజీస్‌ (ఐఐడీటీ) దేశంలోనే నాలుగో స్థానంలో నిలిచింది. దేశంలో వివిధ సంస్థల్లో ఆఫర్‌ చేస్తున్న అనలటికల్‌ కోర్సులు, వాటిలోని అధ్యాపకులు, ప్లేస్‌మెంట్స్‌ కోసం చేసుకున్న ఒప్పందాలు తదితర అంశాలను అధ్యయనం చేసి ఈ ర్యాంకు ఇచ్చారు. ఐఐఎం-కోల్‌కతాలోని పీజీ డిప్లొమా ఇన్‌ బిజినెస్‌ అనలటిక్స్‌ మొదటి స్థానంలో నిలిచింది. కోల్‌కతా ప్రాక్సీస్‌ బిజినెస్‌ స్కూల్‌, బెంగళూరు మణిపాల్‌ గ్లోబల్‌ అకాడమీ ఆఫ్‌ డాటా సైన్స్‌ ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచాయి. ప్రారంభించిన కొద్దికాలంలోనే తిరుపతి ఐఐడీటీ దేశంలోనే నాలుగో స్థానంలో నిలవడం ఆనందంగా ఉందని ఐటీ శాఖ వర్గాలు పేర్కొన్నాయి. అనలటిక్స్‌ ఇండియా సంస్థ ఈ ర్యాంకింగ్‌లిచ్చింది.
Link to comment
Share on other sites

13 hours ago, sonykongara said:
 
 
తిరుపతి ఐఐడీటీకి దేశంలో నాలుగో స్థానం
తిరుపతిలోని ఏడాది క్రితం ప్రారంభించిన ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజిటల్‌ టెక్నాలజీస్‌ (ఐఐడీటీ) దేశంలోనే నాలుగో స్థానంలో నిలిచింది. దేశంలో వివిధ సంస్థల్లో ఆఫర్‌ చేస్తున్న అనలటికల్‌ కోర్సులు, వాటిలోని అధ్యాపకులు, ప్లేస్‌మెంట్స్‌ కోసం చేసుకున్న ఒప్పందాలు తదితర అంశాలను అధ్యయనం చేసి ఈ ర్యాంకు ఇచ్చారు. ఐఐఎం-కోల్‌కతాలోని పీజీ డిప్లొమా ఇన్‌ బిజినెస్‌ అనలటిక్స్‌ మొదటి స్థానంలో నిలిచింది. కోల్‌కతా ప్రాక్సీస్‌ బిజినెస్‌ స్కూల్‌, బెంగళూరు మణిపాల్‌ గ్లోబల్‌ అకాడమీ ఆఫ్‌ డాటా సైన్స్‌ ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచాయి. ప్రారంభించిన కొద్దికాలంలోనే తిరుపతి ఐఐడీటీ దేశంలోనే నాలుగో స్థానంలో నిలవడం ఆనందంగా ఉందని ఐటీ శాఖ వర్గాలు పేర్కొన్నాయి. అనలటిక్స్‌ ఇండియా సంస్థ ఈ ర్యాంకింగ్‌లిచ్చింది.

I planned I planned I planned ani cheppukontam

Link to comment
Share on other sites

1 hour ago, Hello26 said:

Fantastic news ...this is how CBN created knowledge economy by creating excellence centers and institutes in advanced technologies 

Fantastic news ...this is how CBN created knowledge economy by creating excellence centers and institutes in advanced technologies.

 

I couldn't find an option to "Edit" my own post. So, I quoted myself to correct my statement.

Edited by Hello26
Link to comment
Share on other sites

  • 2 months later...
  • 1 month later...
రాష్ట్రంలోనూ హైటెక్‌సిటీ నిర్మిస్తాం: లోకేశ్
25-03-2018 02:49:28
 
636575429682890527.jpg
  • 2029కి రాష్ట్రంలో నాలుగు సైబరాబాద్‌లు: లోకేశ్‌
తిరుపతి, మార్చి 24: 2019లో మళ్లీ అధికారంలోకి రాగానే రాష్ట్రంలో హైటెక్‌ సిటీని ఏర్పాటు చేస్తామని ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ చెప్పారు. తిరుపతి సమీపంలోని ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజిటల్‌ టెక్నాలజీ్‌స(ఐఐడీటీ) గ్రాడ్యుయేషన్‌ డే వేడుకలను శనివారం అమరరాజా ఆవరణలోని ఆడిటోరియంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంతోపాటు ఏపీఐటీఏ మెగా జాబ్‌ ఫెయిర్‌ ముగింపు కార్యక్రమంలోనూ ఆయన పాల్గొన్నారు. 2022 కల్లా డిజిటల్‌ టెక్నాలజీలో దేశంలోనే ఏపీని మొదటిస్థానంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నామన్నారు. తిరుపతిలో 150ఎకరాల్లో రిలయన్స్‌ సంస్థ ఎలక్ర్టానిక్స్‌ పార్క్‌ ఏర్పాటు చేయనుందన్నారు.
 
2029 నాటికి రాష్ట్రంలో నాలుగు సైబరాబాద్‌లు ఏర్పాటు చేయాలని ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. ఉద్యోగాల కల్పనకు లోకేశ్‌ సమక్షంలో ఏపీఐటీఏ, వీఎంవేర్‌, యూత్‌ఫర్‌ జాబ్స్‌ కంపెనీల మధ్య ఒప్పందం కుదిరింది. తిరుపతి విమానాశ్రయ రహదారిలో ఏర్పాటు చేసిన ఐఐడీటీ సెంటర్‌ను లోకేశ్‌ ప్రారంభించారు. చంద్రబాబును తప్పుబడుతూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా లేఖ రాసిన తీరు బాధాకరమని లోకేశ్‌ వ్యాఖ్యానించారు. పవన్‌ కల్యాణ్‌కు తప్పుడు డైరెక్షన్‌ ఇచ్చి విమర్శలు చేయిస్తున్నారన్నారు.
Link to comment
Share on other sites

Link to comment
Share on other sites

 

#MinisterNaraLokesh met with SAS Asia Pacific CTO, on GoAP plans to establish an “Analytics Innovation Lab (AIL). @naralokesh - Performance delivered. #Lokesh365 @tdptrending @ncbn @BangaloreTDP @ChennaiTdpForum @iarjunchowdary @RamMNK @sri_0811 @achantaraja @GangadharThati

DZxsSJZVAAA3SN2.jpg
Link to comment
Share on other sites

  • 3 weeks later...
ఐఎస్‌బీ తరహాలో ఐఐడీటీ: మంత్రి లోకేశ్‌
20-04-2018 02:25:41
 
ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజిటల్‌ టెక్నాలజీ్‌స(ఐఐడీటీ)ని ఐఎ్‌సబీ తరహాలో అభివృద్ధి చేయాలని మంత్రి నారా లోకేశ్‌ నిర్దేశించారు. ప్రస్తుతం సైబర్‌ సెక్యూరిటీ, బిజినెస్‌ అనలిటిక్స్‌ కోర్సులు అందిస్తున్న సంస్థ కార్యకలాపాలను ఉపాధి కల్పనే లక్ష్యంగా విస్తరించాలన్నారు. ఐఐడీటీపై మంత్రి గురవారమిక్కడ సమీక్ష నిర్వహించారు.
Link to comment
Share on other sites

  • 4 months later...
ఐఎస్‌బీ తరహాలో ఐఐడీటీ!

ఈనాడు-తిరుపతి: ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజిటల్‌ టెక్నాలజీ(ఐఐడీటీ)ని ఐఎస్‌బీ తరహాలో తీర్చిదిద్దేందుకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదముద్ర వేసింది. ఇందుకోసం ఐఐడీటీని సెక్షన్‌ 8 కంపెనీగా ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనకు ఆమోదించింది. గురువారం అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు నిర్ణయాలు తీసుకున్నారు. రానున్న రెండేళ్ల కాలంలో పెట్టుబడి, నిర్వహణ వ్యయం కింద రూ.97.95 కోట్లను మంజూరు చేశారు. ఐఐడీటీని లాభాపేక్ష లేని సెక్షన్‌ 8 కంపెనీగా నమోదు చేయనున్నారు. ఈ సెక్షన్‌ కింద నమోదుకావడం ద్వారా నిర్వహణ వ్యవస్థ, స్పష్టమైన విధాన నిర్ణయాలతో పారదర్శక, జవాబుదారీ సంస్థగా రూపొందనుంది. తిరుపతిలోని ఐఐడీటీలో రానున్న విద్యా సంవత్సరం(2019) నుంచి కొత్త కార్యక్రమాలను ప్రవేశపెట్టనున్నారు. దీనివల్ల మొత్తం 250 మంది విద్యార్థులకు ప్రవేశాలు లభిస్తాయని భావిస్తున్నారు. 2021 నాటికి మొత్తం 400 మంది విద్యార్థులు పెరుగుతారని ఆశిస్తున్నారు. పేరు పొందిన విద్యా సంస్థలు దీనికి మెంటారుగా ఉంటాయి. పరిశ్రమల నిపుణులు సలహాదారుగా వ్యవహరిస్తారు. సిస్కో, జనరల్‌ ఎలక్ట్రికల్‌, సిటీబ్యాంక్‌, మైండ్‌ ట్రీ లాంటి ప్రధాన సంస్థలకు చెందిన నిపుణులు మెంటార్లుగా వ్యవహరించనున్నారు. ఐటీ, ఐవోటీ రంగాల్లో ప్రవేశిస్తున్న వినూత్న సాంకేతిక మార్పులను అధ్యయనం చేస్తారు. ఇది విద్యార్థులను తీర్చిదిద్దేందుకు దోహదపడుతుందని మంత్రిమండలి అభిప్రాయపడింది. ఇంజినీర్లు, వ్యాపారవేత్తలను కొత్తతరం సాంకేతిక నైపుణ్యంలో నేర్పరులను చేయడం కోసం 2017 జనవరిలో సంస్థను ప్రాంభించారు. ఈ సంస్థ గత విద్యా సంవత్సరాల్లో బిజినెస్‌ అనలిటిక్స్‌, సైబర్‌ సెక్యూరిటీ తదితర అంశాల్లో కోర్సులు నిర్వహించింది. దేశంలో ఈ తరహా సంస్థ ఏర్పాటు ఇదే ప్రథమం.

Link to comment
Share on other sites

  • 2 weeks later...
ప్రపంచస్థాయిలో ఐఐడీటీ
21-09-2018 04:14:54
 
  • రూ.97.95 కోట్లు కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వం
  • దేశంలోనే తొలి వర్చువల్‌ వర్సిటీ తిరుపతిలో
అమరావతి, సెప్టెంబరు 20(ఆంధ్రజ్యోతి): తిరుపతిలోని ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజిటల్‌ టెక్నాలజీ(ఐఐడీటీ)ని ప్రపంచస్థాయి సంస్థగా తీర్చిదిద్దే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ క్రమంలో ఐఐడీటీకి రూ.97.95 కోట్లు కేటాయించింది. హైదరాబాద్‌లోని ఇంటర్నేషనల్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ తరహాలో ఈ సంస్థను సెక్షన్‌-8 కంపెనీగా నమోదు చేశారు. దేశంలోనే తొలి వర్చువల్‌ విశ్వవిద్యాలయంగా దీన్ని పేర్కొంటున్నారు. ఈ ఏడాది 250 మంది విద్యార్థులను ఇది చేర్చుకోనుంది. 2021 నాటికి ఈ సంఖ్యను 400లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
Link to comment
Share on other sites

ఐఐడీటీకి రూ.97.95 కోట్లు

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ డిజిటల్‌ సాంకేతిక సంస్థ(ఐఐడీటీ)కు రూ.97.95 కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దేశంలోనే మొట్టమొదటి వర్చువల్‌ విశ్వవిద్యాలయంగా దీన్ని ఏర్పాటు చేశారు. 2016-17లో ప్రారంభమైన ఈ సంస్థలో 2019నాటికి 250మంది విద్యార్థులు, 2021కి 400మంది విద్యార్థులకు ప్రవేశాలు కల్పించనున్నారు. తాత్కాలిక భవనాల్లో కొనసాగుతున్న ఈ సంస్థ మౌలిక సదుపాయాల కల్పనకు ఈ నిధులు విడుదల చేశారు. 2020-21వరకు ఈ సంస్థకు ప్రభుత్వం నిధులు కేటాయించనుంది.

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...