sonykongara Posted June 20, 2017 Author Posted June 20, 2017 కొండవీడుకు కొత్త శోభ సంక్రాంతి నాటికి ఇస్కాన్ తొలి దశ వేద విశ్వవిద్యాలయం నిర్వహణకు ఏర్పాట్లు గుంటూరు జిల్లా కొండవీడు సమీపంలో నిర్మిస్తున్న ఇస్కాన్ స్వర్ణమందిర ఆలయం నిర్మాణం సంక్రాంతి నాటికి తొలిదశ పూర్తి కానుంది. కొండవీడు ఘాట్ రోడ్డు నిర్మాణం పూర్తి కావడంతో కొండవీడు కోట, కొండపై ఉన్న ప్రకృతి అందాలను తిలకించడానికి క్రమంగా పర్యటకుల సందడి మొదలైంది. ఈ క్రమంలో కొండవీడు సమీపంలో రూ.200 కోట్లతో ఇస్కాన్ ఆలయం, వేద విశ్వవిద్యాలయం, ఆవులపై పరిశోధన కేంద్రం, గురుకుల పాఠశాల ఏర్పాటుతో ఈ ప్రాంతం ఆధ్యాత్మిక, పర్యటక కేంద్రంగా ప్రగతి పట్టాలెక్కనుంది. అమరావతి: తొలిదశ నిర్మాణాన్ని రూ.100 కోట్లతో పూర్తి చేసే దిశగా పనులు వేగంగా జరుగుతున్నాయి. క్షేత్రస్థాయిలో నిర్మాణాలు చేపడుతూనే మరోవైపు వివిధ ప్రాంతాల్లో ముడి పదార్థాల లభ్యత ఆధారంగా వివిధ అంశాలకు సంబంధించి నిర్మాణాలు కొనసాగుతున్నాయి. రాజస్థాన్ నుంచి తెచ్చిన గులాబిరంగు నాపరాయితో 108 మండపాలను ప్రధాన మందిరం చుట్టూ ఆకర్షణీయంగా నిర్మించారు. ఆధ్యాత్మిక కేంద్రంతో పాటు యువతను సన్మార్గంలో నడిపించేలా ప్రత్యేక కార్యక్రమాల నిర్వహణకు నిర్మాణాలు చేపడుతున్నారు. ఇవన్నీ సంక్రాంతి నాటికి పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలన్న లక్ష్యంతో పనులు జరుగుతున్నాయి. కొండవీడు కోట, చారిత్రక వెన్నముద్ద గోపాలస్వామి ఆలయం, పురాతన ఆలయాలతో పాటు ఇస్కాన్ వారు నిర్మిస్తున్న ఆలయం పూర్తి కావడంతో ఈ ప్రాంతం అభివృద్ధి చెందనుంది. ఆధ్యాత్మికతతో పాటు విజ్ఞానం ఇస్కాన్ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న ఆలయంలో కృష్ణుని ఆలయంతో పాటు విజ్ఞానాన్ని అందించే పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇక్కడ నిర్మిస్తున్న స్వర్ణహంస మందిరం, కొండవీడు కొండల నుంచి వచ్చే స్వచ్ఛమైన గాలితో ఈ ప్రాంతం మొత్తం సాయంత్రమైతే ఆహ్లాదంగా మారుతోంది. ఇక్కడే వేద విశ్వవిద్యాలయంతో పాటు గురుకుల పాఠశాల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఫైన్ ఆర్ట్స్, సాంస్కృతిక పాఠ్యాంశాలు బోధిస్తారు. ఆవుకు సంబంధించి పరిశోధన కేంద్రం ఏర్పాటు చేస్తారు. ఇప్పటికే ఇస్కాన్ ఆధ్వర్యంలో బృందావనం, మాయాపూర్, బెల్గాం తదితర ప్రాంతాల్లో ఆవు, ఆవు వ్యర్థాలతో మందుల తయారీపై పరిశోధనలు జరుగుతున్నాయి. ఇప్పటివరకు ఆవు మూత్రం, పేడతో 68 రకాలు వ్యాధులకు మందులు తయారు చేసి వాడుతున్నారు. ఆవు మూత్రాన్ని శుద్ధి చేసి లీటరు రూ.180కు విక్రయిస్తున్నారు. ఔషధ విలువలు ఉన్న ఆవు వ్యర్థాలపై మరిన్ని పరిశోధనలు చేయడానికి కొండవీడులో పరిశోధన కేంద్రం ఏర్పాటు చేస్తున్నారు. పరిశోధన కేంద్రంతో పాటు రైతులకు ఆవు వ్యర్థాలతో వివిధ విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీపై శిక్షణ ఇవ్వనున్నారు. ఆవుల సంరక్షణపైనా ప్రత్యేక దృష్టి సారిస్తారు. ఇక్కడే గోలోక బృందావనం నిర్మించి ఆధ్యాత్మికతకు సంబంధించిన చిత్రాలు ప్రదర్శిస్తారు. ఇస్కాన్ ఆలయ పరిసరాల్లోనే యువత సన్మార్గంలో పయనించేలా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడానికి ప్రత్యేక నిర్మాణాలు చేపడుతున్నారు. మన సంస్కృతి, సంప్రదాయాలను యువతకు వివరించి వాటి ప్రాధాన్యతలను తెలియజేసి ఆచరించేలా ఉద్బోధిస్తారు. పాశ్చాత్య పోకడలను అలవర్చుకుని యువత భవిష్యత్తును సమస్యల మయం చేసుకోకుండా చిత్రాలు, సందేశాల ద్వారా చైతన్యం తీసుకొచ్చేలా కార్యక్రమాలకు రూపకల్పన చేశారు. పర్యటకంగా ప్రగతి నవ్యాంధ్ర రాజధానికి 50 కి.మీ దూరంలో చారిత్రాత్మకమైన కొండవీట కోట ఉంది. కొండపైన సుందరమైన ప్రకృతి దృశ్యాలతో పాటు మూడు చెరువులు ఉన్నాయి. వీటిలో ఏడాది పొడవునా నీటి లభ్యత ఉంటోంది. కొండవీడు కోటకు ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా రూ.37 కోట్లతో కొండపైకి ఘాట్ నిర్మించారు. కొండపైకి వెళ్లడానికి ట్రెక్కింగ్ నిర్వహించాలన్న యోచనలో పర్యటకశాఖ ఉంది. కొండపైకి వెళ్లే దారిలో పర్యటకశాఖ ఆకర్షణీయంగా ముఖద్వారం నిర్మించింది. ఇక్కడ ఇంకా పలు అభివృద్ధి కార్యక్రమాలకు పర్యటకశాఖ ప్రణాళికలు రూపొందించడంతో దేవాదాయశాఖ నుంచి భూమి సైతం ప్రభుత్వం కేటాయించింది. కొండ కింది భాగంలో పర్యటకులు బస చేయడానికి వీలుగా నిర్మాణాలు, మౌలిక వసతుల కల్పనకు నిర్మాణాలు చేపడుతున్నారు. కొండవీడు చుట్టూ పర్యటక ప్రాంతాల అభివృద్ధి చెందడం, రాజధాని జిల్లాలో నిర్మిస్తుండటంతో పర్యటకపరంగా ఈ ప్రాంతం కీలకంగా మారింది. ఇక్కడే ఇస్కాన్ ఆలయం నిర్మాణం జరుగుతోంది. జనవరి నాటికి తొలిదశ నిర్మాణం ఇస్కాన్ ఆలయం తొలిదశ నిర్మాణాన్ని జనవరి నాటికి పూర్తి చేసే ప్రణాళికతో ముందుకెళ్తున్నాం. రూ.100కోట్లతో ఆలయ నిర్మాణం, 108 మండపాలు రాజస్థాన్ నుంచి తెచ్చిన సామగ్రితో నిర్మాణం చేపడుతున్నాం. ఆవులపై పరిశోధన, రైతుశిక్షణ కేంద్రాలు, వేదవిద్య, గురుకుల పాఠశాల తదితర నిర్మాణాలు దశల వారీగా పూర్తి చేస్తాం. ప్రస్తుతం తొలిదశ నిర్మాణం పూర్తికి పనులు వేగవంతం చేశాం. -సత్య గోపీనాథ్ దాస్, దక్షిణ భారతదేశ అధ్యక్షుడు, ఇస్కాన్
sonykongara Posted November 27, 2017 Author Posted November 27, 2017 డిసెంబర్‌లోగా కొండవీడు ఘాట్ రోడ్డు పూర్తి27-11-2017 07:11:03 అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం.. పుస్తకావిష్కరణ సభలో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు (ఆంధ్రజ్యోతి, గుంటూరు): కొండవీడును అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర మంత్రి ప్రత్తిపాటి పల్లారావు తెలిపారు. డిసెంబర్ లోపు కొండవీడు ఘాట్ రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేస్తామన్నారు. ఇప్పటికే రూ.60 కోట్లతో ఘాట్ రోడ్డు, కొండపైకి మెట్లు, ఇతర మౌలిక వసతులను మెరుగు పరుస్తున్నట్లు తెలిపారు. జెడ్పీ మీటింగ్ హాలులో ఆదివారం కల్లి శివారెడ్డి రచించిన కొండవీడు చరిత్ర పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్య మంత్రి చంద్రబాబు కొండవీడును అభివృద్థి చేయడానికి వివిధ ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించినట్లు చెప్పారు. సీఎం చంద్రబాబు జనవరి, ఫిబ్రవరిలో కొండవీడులో పర్యటిస్తారు. మూడు నెలల లోపు రాష్ట్ర ప్రభుత్వం కొండవీడు ఉత్సవాలను జరపాలని నిర్ణయించిందన్నారు. కొండవీడు పరిసర ప్రాంతాల్లో హెల్త్ యూనివర్సిటీ, హిల్ రిసార్ట్స్, ఉద్యానవన పరిశోధన కేంద్రం, కళాశాల ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. పురావస్తు శాఖ నిపుణుడు, అమరావతి కల్చరల్ సీఈవో ఈమని శివనాగిరెడ్డి మాట్లాడుతూ భావితరాలకు కొండవీడు చరిత్రను తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాలరెడ్డి మాట్లాడుతూ కొండవీడు అభివృద్ధి అందరు ఐకమత్యంగా పని చేస్తున్నట్లు కితాబిచ్చారు. కొండవీడు అభివృద్ధి కమిటీ కన్వీనర్, పుస్తక రచయిత కల్లి శివారెడ్డి మాట్లాడుతూ కొండవీడు ప్రాంత అభివృద్ధికి ప్రణాళికలు రూపొందినట్లు తెలిపారు. కొండవీడు చరిత్ర, అభివృద్థిపై రూపొందించిన వెబ్‌సైట్‌ను మంత్రి పుల్లారావు ప్రారంభించారు. కల్లి శివారెడ్డి రచ్చించిన కొండవీడు గ్రంథాన్ని మంత్రి పుల్లారావు, ఎమ్మెల్యే వేణుగోపాలరెడ్డి, డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి, డాక్టర్ కేవీ సుజాత, చాంబర్ ఆఫ్ కామర్స్ నాయకుడు బూసిరెడ్డి మల్లేశ్వరరెడ్డి, న్యాయవాది ఆరెకూటి సంజీవరెడ్డి, జడ్పీ సీఈవో నాగార్జునసాగర్, టీడీపీ నేత చిట్టిబాబు తదితరులు ఆవిష్కరించారు. కార్యక్రమానికి ముందు కొండవీడు చరిత్రపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. కార్యక్రమంలో కల్లి నాగ మల్లేశ్వరరెడ్డి, టీడీపీ మాచర్ల ఇన్‌చార్జి చలమారెడ్డి, డీసీఎంఎస్ జీఎం హరగోపాలం, మాజీ ఎంపీపీ రాఘవరెడ్డి, యడ్ల బాలాజి, కన్యకా పరమేశ్వరి దేవస్థానం చైర్మన్ దేవరశెట్టి సత్యనారాయణ, న్యాయవాది మోదుగుల పాపిరెడ్డి, కొర్రపాటి నాగేశ్వరరావు, జిల్లా ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ కమిటీ సభ్యుడు శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.
DVSDev Posted January 29, 2018 Posted January 29, 2018 I have been to this fort and the Chinni Krishna Temple - the Temple is unique and one of its kind and no other place in India with such Butter Krishna as idol
Guest Urban Legend Posted January 31, 2018 Posted January 31, 2018 On 1/29/2018 at 6:53 PM, sonykongara said:
sonykongara Posted April 18, 2018 Author Posted April 18, 2018 ఏపీలోనూ గోల్కొండ!18-04-2018 10:05:58 మన గోల్కొండ... కొండవీడు గుంటూరు, ఏప్రిల్ 17(ఆంధ్రజ్యోతి): కొండవీడు కోటను అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపడుతున్నాయి. ప్రధానంగా గుంటూరు - చిలకలూరిపేట, నరసరావుపేట - పేరేచర్ల వయా ఫిరంగిపు రం, గుంటూరు - పేరేచర్ల వయా నల్లపాడు, వెంగళాయపాలెం రోడ్ల నుంచి కొండవీడుకు మౌలిక వసతులను మెరుగుపరుస్తున్నారు. ప్రధానంగా కొం డపైకి రూ.30.5 కోట్లతో 5.1 కిలోమీటర్లు ఘాట్‌రోడ్డు పనులు పూర్తయ్యాయి. ఈ ఘాట్ రోడ్డుకు అ నుసంధానంగా బోయపాలెం - కొండవీడు కోట (పుట్టకోట) రోడ్డును డబుల్ రోడ్డుగా మార్చారు. ఏడు మీటర్ల వెడల్పున 8 కిలోమీటర్ల పొడవునా దీనిని అభివృద్ధి చేయడంతో ఆయా ప్రాంతాల నుంచి కొండపైకి వెళ్ళడానికి అవకాశం కలిగింది. కొండవీడు కోటలో 30వేల చదరపు అడుగుల విస్తీర్ణంతో అఖిల భారత రెడ్ల సంక్షేమ సంఘం రూ.5 కోట్లతో మ్యూజియం నిర్మిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక శాఖ ద్వారా రూ.23 లక్షలతో అతిథి గృహాన్ని, రూ.34 లక్షలతో కోట గ్రామంలో స్వాగత ద్వారాన్ని నిర్మించారు. కొండవీడు కోటపై వెదుళ్ళ చెరువు, ముత్యాలమ్మ చెరువు (కూనలమ్మచెరువు), పుట్టలమ్మ చెరువులను రూ.2.4 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం మరమ్మతులు చేపట్టింది వెదుళ్ళ చెరువులో పర్యాటక శాఖ ద్వారా బోటింగ్‌ను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. కోట చుట్టూ ఉన్న 24 బురుజులను, కోట ప్రకారాన్ని 20 కిలోమీటర్ల పొడువునా మరమ్మతులు చేయడానికి 3.5 కోట్లు మంజూరు చేశారు. ఇస్కాన్ ఆధ్వర్యంలో .. కోట అభివృద్ధిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఇస్కాన్ సంస్థకు చంఘీజ్‌ఖాన్‌పేట, కొండవీడు ప్రాంతాల్లో సుమారు 80 ఎకరాలను అప్పగించింది. దీనిలో 17 ఎకరాల్లో ఇస్కాన్ మందిరం, 3.5 ఎకరా ల్లో గోశాలను నిర్మించారు. మొత్తం 108 మందిరాల నిర్మాణాలను చేపట్టగా.. ఇప్పటికీ 90 పూర్తయ్యాయి. కొండవీడు కోటలో అనాథ పిల్లల శరణాలయం, చంఘీజ్‌ఖాన్ పేటలో వృద్ధుల ఆశ్రయాన్ని నిర్మించాలని ఇస్కాన్ ప్రతిపాదించింది. సుమారు రూ.500 కోట్లతో ఇస్కాన్ సంస్థ ఇక్కడ విద్యాసంస్థలను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. అదేవిధంగా కొండవీడు పరిసర ప్రాంతాల్లో పెద్దఎత్తున సేవా కార్యక్రమాలు చేపట్టడానికి నాదెండ్ల మండలానికి చెందిన ఓ సంస్థ ముందుకు వచ్చింది. ఇప్పటికే ఈ సంస్థ మ్యూజియం నిర్మాణానికి విరాళాలు ఇచ్చిం ది. చిలకలూరిపేట ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కొండవీడును అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి విశేష కృషి చేస్తున్నారు. అన్ని రంగాల్లో కొండవీడు అభివృద్ధి.. అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా కొండవీడును అభివృద్ధి చేయడానికి కేం ద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. కొండవీడు కోటకు రెండు వైపులా అంతర్గత రహదారులు నిర్మిస్తున్నారు. ఘాట్ రోడ్డు నిర్మాణం పూర్తయింది. ఇస్కా న్ సంస్థ సుమారు రూ.500 కోట్లతో అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుంది. -కల్లి శివారెడ్డి, కొండవీటి అభివృద్ధి కమిటీ కన్వీనర్
Recommended Posts
Create an account or sign in to comment
You need to be a member in order to leave a comment
Create an account
Sign up for a new account in our community. It's easy!
Register a new accountSign in
Already have an account? Sign in here.
Sign In Now