Jump to content

Cruise Ship Terminal in Bhimili, vizag.


Recommended Posts

భీమిలిలో క్రూయిజ్‌ టెర్మినల్‌
ప్రపంచ పర్యాటకానికి మణిహారంగా విశాఖ
ఈనాడు - విశాఖపట్నం
17ap-panel16a.jpg

విశాఖపట్నం నగరానికి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న భీమిలిలో రూ.300 కోట్ల వ్యయంతో ‘అంతర్జాతీయ క్రూయిజ్‌ టెర్మినల్‌’ నిర్మించాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం భావిస్తోంది. ప్రభుత్వం, విశాఖ పోర్టు సంయుక్తంగా ఈ ప్రాజెక్టును పూర్తి చేయనున్నాయి. విశాఖకు అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించడంతోపాటు, నగరంలో పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి ఈ టెర్మినల్‌ ఉపయుక్తంగా ఉంటుందని భావిస్తున్నారు. సాధారణంగా విదేశీ పర్యాటకుల్లో పలువురు క్రూయిజ్‌లలో ప్రయాణానికి ఆసక్తి చూపిస్తుంటారు. ఈ విధమైన పర్యాటకాన్ని అందిపుచ్చుకోవడంలో దేశంలో... కేరళ అగ్రస్థానంలో ఉంది. ఏటా కనీసం 50 వరకు విదేశీ క్రూయిజ్‌ నౌకలు ఆ రాష్ట్రంలోని కోచికి వస్తున్నాయి. దీంతో ఆ రాష్ట్రానికి అంతర్జాతీయ పర్యాటక ప్రాధాన్యం పెరిగింది. కేరళ తరహాలోనే విశాఖకు విదేశీ క్రూయిజ్‌లు వచ్చేలా విస్తృత మౌలిక సదుపాయాల్ని అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు భావించారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి పోర్టు ఛైర్మన్‌ ఎం.టి.కృష్ణబాబుతో మాట్లాడారు. క్రూయిజ్‌ల ద్వారా వచ్చే విదేశీ పర్యాటకులను ఆకర్షించడానికి వీలుగా ఉండాలంటే టెర్మినల్‌ ఎలా ఉండాలి? ఎంత వ్యయం అవుతుంది? ఎలాంటి మౌలిక సదుపాయాల్ని ఏర్పాటు చేయాలి? ఏమి వసతులు ఉండాలన్న అంశంపై నివేదిక కోరారు. దీంతో పోర్టు అధికారులు ఆ మేరకు ప్రాథమిక నివేదిక తయారుచేస్తున్నారు.

త్వరలో డి.పి.ఆర్‌..
- ఎం.టి.కృష్ణబాబు, పోర్టు ఛైర్మన్‌
17ap-panel16b.jpg క్రూయిజ్‌లలో పర్యటిస్తూ ప్రపంచంలోని వివిధ ప్రాంతాలను సందర్శించే అంతర్జాతీయ పర్యాటకానికి డిమాండ్‌ పెరిగింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని భీమిలిలో ‘అంతర్జాతీయ క్రూయిజ్‌ టెర్మినల్‌’ నిర్మించడానికి చేయాల్సిన ఏర్పాట్లపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నివేదిక కోరారు. పోర్టులోని ఇంజినీర్లతో ప్రాథమిక అంచనా వేయించగా రూ. 300 కోట్ల వ్యయమవుతుందని తేలింది. ఒకేసారి రెండువేల మందితో వచ్చే క్రూయిజ్‌ నౌకలను నిలపడానికి వీలుగా జెట్టీ, బ్రేక్‌వాటర్‌ (జెట్టీ వద్ద నీరు నిశ్చలంగా ఉండడానికి వీలుగా సముద్రంలో బండరాళ్లతో నిర్మించే గోడ), అంతర్జాతీయ ప్రమాణాలతో టెర్మినల్‌ భవనం తదితరాలు నిర్మించాల్సి ఉంటుంది. నిపుణులైన కన్సల్టెన్సీ సంస్థతో త్వరలో సవివర పథక నివేదిక (డి.పి.ఆర్‌.) తయారు చేయించిన అనంతరం రాష్ట్రప్రభుత్వ సహకారంతో నిర్మాణం మొదలుపెడతాం.

 

Link to comment
Share on other sites

swas bro, ni kala niravere laga undi.

 

 

Cruise terminals are rare in mumbai, gujarat, chennai lo ne unayi in whole india.

 

Big ships ravali ante we need to build a big terminals we can use it for tourism income 100's of crores vastundi to govt

Link to comment
Share on other sites

Cruise terminals are rare in mumbai, gujarat, chennai lo ne unayi in whole india.

 

Big ships ravali ante we need to build a big terminals we can use it for tourism income 100's of crores vastundi to govt

ఒకేసారి రెండువేల మందితో వచ్చే క్రూయిజ్‌ నౌకలను నిలపడానికి వీలుగా జెట్టీ, బ్రేక్‌వాటర్‌ (జెట్టీ వద్ద నీరు నిశ్చలంగా ఉండడానికి వీలుగా సముద్రంలో బండరాళ్లతో నిర్మించే గోడ), అంతర్జాతీయ ప్రమాణాలతో టెర్మినల్‌ భవనం తదితరాలు నిర్మించాల్సి ఉంటుంది.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...