Jump to content

Svsc Censor Canceled Today


tatadocomo

Recommended Posts

దర్శక రత్న దాసరి నారాయణరావు రూల్స్ ని తనకనుగుణంగా మార్చుకోవడంలో సిద్దహస్తుడనే విషయం మరోమారు బట్టబయలయ్యింది. రీసెంట్ గా రామ్ చరణ్ తేజ నటించిన 'నాయక్' సినిమా ఈ నెల 9న విడుదలవుతుంది. ఈ సినిమా హక్కులను దాసరి తన సిరి మీడియా ద్వారా కైవసం చేసుకోవడానికి విశ్వప్రయత్నం చేశారు. ఒకానొక సమయంలో ఈ సినిమా హక్కులను దాసరి కైవసం చేసుకున్నారని వార్తలు కూడా వచ్చాయి. ఎందుకో దాసరికి మాత్రం ఈ సినిమా హక్కుల విషయంలో మొండి చెయ్యి ఎదురయ్యింది.

అప్పటినుంచీ ఈ సినిమా మీద ఆయన మండిపడుతున్నారు. నాయక్ మూవీ విడుదలయిన కొద్దిరోజులకే సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు కూడా రిలీజ్ కానుండటంతో ధియేటర్ల కొరత ఏర్పడింది. ఈ కొరతకి కారణం దాసరి నారాయణరావు అని సమాచారం. కమల్ హసన్ నటించిన విశ్వరూపం సినిమాను దాసరి నారాయణరావు సిరి గ్రూప్ పంపిణీ చేస్తుంది. పండగ సమయాలలో డబ్బింగ్ సినిమాలను విడుదల చెయ్యకూడదనే రూల్ టాలీవుడ్ లో వున్నా ఆ సినిమాని సంక్రాంతి బరిలో నింపారు. విశ్వరూపం సినిమా కోసం దాసరి చాలా ధియేటర్లను బ్లాక్ చెయ్యడం జరిగింది. పంతానికి పోయి మహేష్, రామ్ చరణ్ లాంటి పెద్ద హీరోల సినిమాలకు పోటీగా విశ్వరూపం సినిమాని విడుదల చెయ్యడం వల్ల, ఆ సినిమా ఏ మాత్రం అటూ ఇటూ అయినా దాసరికి పెద్ద షాక్ తప్పకపోవచ్చు?

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...