Jump to content

Ivaala Bharath Bandh


Sushanth

Recommended Posts

  • Replies 79
  • Created
  • Last Reply

చంద్రబాబు, ములాయం సహా పలువురి అరెస్టు

 

న్యూఢిల్లీ : జంతర్‌మంతర్‌ నుంచి పార్లమెంట్‌కు ర్యాలీగా బయల్దేరిన విపక్ష నేతలను అడ్డుకునేందుకు పోలీసులు యత్నించారు. ఈ క్రమంలోనే పలువురు పోలీసు బారికేడ్లను దాటుకుని ముందుకెళ్లారు. ఈ నేపథ్యంలో టీడీపీ చీఫ్‌ చంద్రబాబు, ఎస్పీ చీఫ్‌ ములాయం సహా పలువురిని పోలీసులు అరెస్టు చేశారు. వీరిని జంతర్‌మంతర్‌ పోలీసు స్టేషన్‌కు తరలించారు.

Link to comment
Share on other sites

* హైదరాబాద్ : బంద్ సందర్భంగా ఎంజీబీఎస్ బస్‌స్టాండ్ ఎదుట వాపక్షాలు ఆందోళనకు దిగాయి. పోలీసులు వారిని అడ్డుకోవడంతో కొద్దిసేపు వాగ్వాదం నెలకొంది. అనంతరం సీపీఐ నేత నారాయణ సహా, టీడీపీ, బీజేపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.

* నెల్లూరు : జిల్లా వ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. ఆర్టీసీ డిపో ఎదుట ఆందోలన కారులు నిరసన తెలపడంటో పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు.

* విశాఖపట్నం : మద్దిలపాలెంలో విపక్షాలు రాస్తారోకో చేపట్టారు. నేషనల్ హైవేపై కార్యకర్తలు కబడ్డీ ఆట ఆడుతూ నిరసన తెలిపారు.

* విజయనగరం : జిల్లాలో బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. సాలూరు, బొబ్బిలి, పార్వతీపురంలో ఆందోళనకారులు వాహనాలను అడ్డుకున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు మూతపడ్డాయి. రైల్వే స్టేషన్‌లో హౌరా ఎక్స్‌ప్రెస్‌ను ఆందోళనకారులు అడ్డుకున్నారు.

* మహబూబ్‌నగర్ : జిల్లాలోని ఆర్టీసీ డిపో ఎదుట విపక్షాలు ధర్నా చేపట్టాయి. దీంతో జిల్లావ్యాప్తంగా బస్సులు నిలిచిపోయాయి.

* చిత్తూరు : జిల్లాలో బంద్ కొనసాగుతోంది. డిపోలలో బస్సులు ఎక్కడిక్కడ నిలిచిపోయాయి. వ్యాపార, విద్యా సంస్థలు మూతపడ్డాయి.

* విజయవాడ : నగరంలోని బస్టాండ్ దగ్గర విపక్షాలు ఆందోళన చేపట్టారు. బస్సులు కదలకుండా ఆందోళనకారులు అడ్డుకున్నారు. ఏలూరు రోడ్డులో ఆందోళనకారులపై పోలీసులు లాఠీచార్జి చేశారు. సీపీఎం నేత బాబూరావు సహా, పలువురిని అరెస్ట్ చేవారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...