Jump to content

Siddhugwotham

Members
  • Posts

    12,987
  • Joined

  • Last visited

  • Days Won

    11

Everything posted by Siddhugwotham

  1. “వెన్నుపోటు” ర్యాలీలో బొత్సకు తీవ్ర అస్వస్థత! ఎన్నికల ఫలితాలు వచ్చి ఏడాది అయిన సందర్భంగా వైసీపీ అధినేత జగన్ పిలుపునిచ్చిన వెన్నుపోటు దినాన్ని నిర్వహిస్తూ బొత్స తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. విజయనగరంలో ర్యాలీ చేసిన ఆయన ఎండలో వాహనంపై నిలబడి ప్రసంగిస్తున్నారు. ఆ సమయంలో ఒక్క సారిగా ఆయన అలా నిలబడిపోయారు. అలా కళ్లు ఆర్పకుండాచూస్తూ.. కిందపడిపోయారు. హుటాహుటిన ఆయనను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. బొత్స ఆరోగ్య పరిస్థితిపై సమాచారం ఆస్పత్రి వర్గాల నుంచి తెలియాల్సిన ఉంది. బొత్స సత్యనారాయణకు తీవ్రమైన హృద్రోగ సమస్యలు ఉన్నాయి. ఎన్నికలకు కొద్ది నెలల ముందు ఆయనకు ఓపెన్ హార్ట్ సర్జరీ అయింది. అప్పటి నుంచి బయట తీవ్రమైన ఒత్తిడి ఉండే కార్యక్రమాలు, రాజకీయ వేదికలకు దూరంగా ఉంటున్నారు. ఎక్కువగా ప్రెస్మీట్లకే పరిమితమవుతున్నారు. అయితే ఎన్నికల సమయంలో ఆయన తన భార్యకు విశాఖ టిక్కెట్ ఇప్పించుకున్నారు. తాను చీపురుపల్లి నుంచి పోటీ చేశారు. ఈ క్రమంలో ఆయన ఎన్నికల సమయంలో ఒత్తిడికి గురయ్యారు. ఇటీవల ఆయన పూర్తిగా ప్రెస్ మీట్లకే పరిమితయ్యారు. ఎన్నికల ఫలితాలు వచ్చి ఏడాది అయిపోయిన సందర్భంగా వెన్నుపోటు దినాన్ని గట్టిగా జరపాలని పార్టీ కార్యాలయం ఆదేశించింది. ముఖ్య నేతలంతా పాల్గొంటేనే వారు పార్టీలో ఉన్నట్లుగా భావిస్తామని హెచ్చరికలు పంపారు. దాంతో బొత్స సత్యనారాయణ ర్యాలీలో పాల్గొనాల్సి వచ్చింది. వడ దెబ్బ తగిలి ఉంటుందని పార్టీ నేతలు చెబుతున్నారు.
  2. ee ad yemti intha chandaalamga vundi...
  3. motham yenni cinemalu teesaadu...
  4. This video has always separate fan base...
  5. ఫేక్ ట్వీట్స్ వేస్తున్న జగన్ కు దిమ్మతిరిగే జవాబు ఇచ్చిన నారా లోకేష్. ప్రజా జీవితంలోనూ, వ్యక్తిగత జీవితంలోనూ ఫెయిల్ అయిన జగన్ రెడ్డి గారు ఇప్పటికైనా బాధ్యతగా వ్యవహరించాలి. చిన్నప్పుడే టెన్త్ పేపర్లు ఎత్తుకుపోయిన మీ నుంచి హుందాతనం ఆశించడం తప్పే! యూనిఫామ్ దగ్గర నుండి చిక్కీ వరకూ పార్టీ రంగులు, మీ పేరు పెట్టుకొని ఇప్పుడు విలువలు మాట్లాడటం మీకే చెల్లింది. ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం, ఉచితంగా ఇచ్చే టెక్స్ట్ బుక్స్ రద్దు చేసిన మీరూ మాట్లాడటమేనా? అధికారంలో ఉన్నప్పుడు ఉపాధ్యాయులను మద్యం షాపుల ముందు కాపలా పెట్టిన మీరు ఇప్పటికీ వారి పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు. జి.ఓ 117, ఇతర అసంబద్ధ నిర్ణయాల వలన మీ ఐదేళ్ల ఏలుబడిలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 12 లక్షల మంది విద్యార్థులు ప్రైవేట్ స్కూళ్ల బాట పట్టారు. ఉపాధ్యాయులను, విద్యార్థులను సిద్ధం చెయ్యకుండానే వెయ్యి పాఠశాలల్లో సిబిఎస్ఈ పరీక్షా విధానాన్ని మీరు తీసుకొచ్చారు. నేను మంత్రి అయిన వెంటనే నిర్వహించిన టెస్ట్ లో 90శాతం మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. పదో తరగతి ఫెయిల్ అయితే చదువుకు దూరం అయ్యే ప్రమాదం ఉంది, ముఖ్యంగా ఆడపిల్లలు అయితే చదువు ఆపించి పెళ్లి చేస్తారు. వారి భవిష్యత్తు కోసం ఆలోచించే సిబిఎస్ఈ పరీక్షా విధానాన్ని వాయిదా వేసాం. ప్రణాళికాబద్ధంగా ఉపాధ్యాయులను, విద్యార్థులను సిద్ధం చేసిన తరువాతే సిబిఎస్ఈ పరీక్షా విధానాన్ని అమలు చెయ్యాలని నిర్ణయం తీసుకున్నాం. మీరు ఐబి తీసుకొచ్చానని కల కంటున్నట్టు ఉన్నారు. ఐబి అమలు రిపోర్ట్ కోసం రూ.5 కోట్లు ఖర్చు చేసారే తప్ప ఐబి అమలు చెయ్యలేదు. ఇక టోఫెల్ చెప్పే ఉపాధ్యాయులు లేకుండానే అమలు చేసానని జబ్బలు చరుచుకోవడం మీకే చెల్లింది. రూ.4500 కోట్ల ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు, గుడ్ల దగ్గర నుండి చిక్కీల వరకూ రూ.1000 కోట్లు బకాయిలు నా నెత్తిన పెట్టి పోయారు. మీ హయాంలో ఉపాధ్యాయుల బదిలీల కోసం నాటి మంత్రి డబ్బులు వసూలు చేసింది బహిరంగ రహస్యం. ఉన్నత విశ్వవిద్యాలయాలను రాజకీయ కేంద్రాలుగా మార్చి మీరు ఆడిన వికృత క్రీడ అందరూ చూసారు. మీరు భ్రష్టు పట్టించిన వ్యవస్థను గాడిన పెట్టేందుకు నిరంతరం శ్రమిస్తున్నాను. టీచర్ ట్రాన్స్ఫర్ యాక్ట్ ద్వారా రాజకీయాలకు అతీతంగా ఉపాధ్యాయుల బదిలీ ప్రక్రియ చేపడుతున్నాం. కేజీ నుండి పీజీ వరకూ పాఠ్య ప్రణాళిక మారుస్తున్నాం. వన్ క్లాస్ వన్ టీచర్ లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తున్నాం. పుస్తకాల బరువు తగ్గించాం, విలువలతో కూడిన విద్య అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేసాం. విద్యార్థులకు అందించే కిట్స్ దగ్గర నుండి అనేక పథకాలకు మహనీయుల పేర్లు పెట్టాం. ఇంటర్ విద్యార్థులకు ఉచితంగా టెక్స్ట్ బుక్స్ అందించాం, మధ్యాహ్న భోజన పథకాన్ని తిరిగి ప్రారంభించాం. యూనివర్సిటీల పనితీరు మెరుగుపర్చేందుకు ఉత్తమ వ్యక్తులను వైస్ ఛాన్సలర్స్ గా నియమిస్తున్నాం. పదోతరగతి పరీక్ష పేపర్ల మూల్యాంకనంలో తమకు అన్యాయం జరిగిందని విద్యార్థులు భావించినప్పుడు రీ కౌంటింగ్/రీ వెరిఫికేషన్ కోరడం ఎప్పటినుంచో జరుగుతున్న ప్రక్రియ. ఈ ఏడాది 45,96,527 లక్షల విద్యార్థుల జవాబు పత్రాలను మూల్యాంకనం చేయడం జరిగింది. రీ కౌంటింగ్ / రీ వెరిఫికేషన్ తరువాత మార్కులలో వ్యత్యాసం వచ్చిన జవాబు పత్రాల సంఖ్య 11,175. అనగా 99.75 శాతం ఖచ్చితత్వంతో మూల్యాంకనం జరిగింది. మానవ తప్పిదం 0.25 శాతం మాత్రమే. ఈ ఏడాది కూడా 34,709 మంది విద్యార్థులు 66,363 స్క్రిప్టుల రీ కౌంటింగ్/ రీ వెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు.ఇందులో 10,159 మంది విద్యార్థుల 11,175 స్క్రిప్టుల (16.8శాతం) వ్యత్యాసాలను గుర్తించి, సరిచేయడం జరిగింది. బాధ్యులపై చర్యలు కూడా తీసుకున్నాం. ఈ తేడాలు జగన్ రెడ్డి గారి జమానాలో 2022లో 41,694 స్క్రిప్టుల రీ కౌంటింగ్/ రీ వెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అందులో 8,235 స్క్రిప్టుల (20 శాతం) వ్యత్యాసాలను గుర్తించారు. 2023లో 61,887 స్క్రిప్టుల రీ కౌంటింగ్/ రీ వెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అందులో 10,987 స్క్రిప్టుల (18 శాతం) వ్యత్యాసాలను గుర్తించారు. 2024లో 55,930 స్క్రిప్టుల రీ కౌంటింగ్/ రీ వెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అందులో 9,231 స్క్రిప్టుల (17 శాతం) వ్యత్యాసాలను గుర్తించారు. మీ హయాంలో కనీసం ఈ వివరాలను బయట పెట్టే ధైర్యం కూడా చెయ్యలేదు. ఈ వాస్తవాలను మరుగున పెట్టి మాపై బురద జల్లడం సిగ్గుచేటు. ఇక పరీక్షల నిర్వహణ సరిగా లేదని, పేపర్లు లీకయ్యాయని నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు. గ్రూప్ - 1 లాంటి కీలకమైన ప్రశ్నపత్రాలను హాయ్ ల్యాండ్ లాంటి ప్రైవేటు రిసార్ట్లో వాచ్ మెన్లతో దిద్దించింది మీరు కాదా? ధనదాహంతో లక్షలాది మంది యువత భవిష్యత్తుతో చెలగాటం ఆడింది మీరు కాదా? ప్రజా ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది. రీ వెరిఫికేషన్లో తేడాలు గుర్తించిన విద్యార్థులకు అర్జేయుకేటీల్లో అడ్మిషన్లకు జూన్ 10వరకు అవకాశం ఇచ్చాం. ఇతర అడ్మిషన్ల విషయంలో కూడా సమయం ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నాం.
  6. No.. Kannada is not from Tamil... Malayalam is from Tamil.... At least he need to take back his words....
  7. Balayyatho oka cinema padithe baagundu
  8. వంశీ కుటుంబంలో జగన్ మార్క్ చిచ్చు ! వల్లభనేని వంశీ కుటుంబంలో జగన్ మార్క్ చిచ్చు పెట్టేందుకు రెడీ అయ్యారు. గన్నవరం ఇంచార్జ్ గా వంశీ స్థానంలో ఆయన భార్యను నియమిస్తామని ప్రచారం ప్రారంభించారు. వంశీ భార్య పంకజశ్రీకి ఇంచార్జ్ గా ఇస్తారని వైసీపీ వర్గాలు లీక్ చేశాయి. వల్లభనేని వంశీ కేసుల్లో ఇరుక్కున్నందున ఆయన బయట తిరగడం కష్టమని ఆయనకు అన్యాయం జరగకుండా.. ఆయన భార్యకు ఇంచార్జ్ పోస్టు ఇస్తామని చెబుతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే కొన్ని కుటుంబాల్లో ఇలాగే జగన్ చిచ్చు పెట్టేశారు. దువ్వాడ శీను కుటుంబం నాశనం అయిపోయింది. నందిగం సురేష్ భార్యకూ అలాంటి సంకేతాలే ఇచ్చారు.. ఆమె హోంమినిస్టర్ అనే లెక్కల్లో ఉన్నారు. మరికొంత మంది కుటుంబాల విషయంలో ఇలాగే జగన్ వ్యవహరిస్తున్నారు. తన భార్యను రాజకీయాల్లోకి తేవడం వంశీకి ఇష్టం లేదని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఇద్దరి మధ్య అంత సఖ్యత లేదని ..గతంలో ఆమె కేసు పెట్టారన్న ప్రచారం కూడా ఉంది. వంశీకి ఇప్పుడు దాదాపు అన్ని కేసుల్లో బెయిల్ లభించింది. ఒక్క కేసులో మాత్రమే పెండింగ్ ఉంది. ఇంకా పీటీ వారెంట్లు వేసే అవకాశం లేదు. ఇప్పటికే నాలుగు నెలలు అవుతున్నందున.. ఆయన బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఆయనను ఇంచార్జ్ గా తప్పించి ఆయన భార్యకు చాన్స్ ఇస్తామని చెప్పడం కుట్రేనని ఆయన వర్గీయులు భావిస్తున్నారు. ఇలా ప్రచారం చేసి చివరికి దుట్టా కుటుంబానికి చాన్స్ ఇస్తారని కూడా అనుమానిస్తున్నారు.
  9. *నిస్సహాయ కేసీఆర్ !* “అధికారం కోసం తోబుట్టువులు ఒకరినొకరు విశ్వసించరు. అధికారం కోసం కుటుంబ బంధాలు తెగిపోతాయి ” అని చాణక్యుడు తన అర్థశాస్త్రంలో రాజకీయ అధికారం కోసం కుటుంబంలో జరిగే వివాదాల గురించి క్రీస్తు పూర్వం 300 ఏడాదిలోనే చెప్పాడు. అంటే రాజకీయం, అధికారం కోసం ఒకే కుటుంబంలో రక్తం పంచుకు పుట్టినవారి మధ్య పోరాటాలు, యుద్ధాలు అనేవి కొత్త కాదు. వింత కాదు. రాజకీయానికి ఉన్న ప్రధాన లక్షణం అదే. ప్రస్తుతం భారత రాష్ట్ర సమితిలో జరుగుతున్న పరిణామాలు చూస్తే వింత కాదు..రోత కాదని అర్థం చేసుకోవచ్చు. వాళ్లేదో అధికారదాహంతో కుటుంబంలో చిచ్చు పెట్టుకుంటున్నారని నిందలు వేయాల్సిన అవసరం లేదు. రాజకీయం రక్త సంబంధీకుల మధ్య చిచ్చు పెట్టడం.. కుటుంబాలను చీల్చడం.. ఒకరి ముఖాలను ఒకరు చూసుకోలేనంత స్థాయికి దిగజార్చేస్తుంది. ఇప్పుడు బీఆర్ఎస్‌లో అదే జరుగుతోంది. అయితే ఎప్పుడైనా .. కరెక్ట్ చేయడానికి పెద్ద మనిషి లేనప్పుడు. ఉన్నా ఆయన మాట ఎవరూ విననప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కానీ బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఇంకా కనుసైగలతో శాసించే పొజిషన్ లో ఉండగానే ఇలాంటివి జరగడం మాత్రం అనూహ్యం. మొదటి సారి కవిత తిరుగుబాటు కల్వకుంట్ల కవిత అన్న కేటీఆర్ కు వ్యతిరేకంగా ఇప్పటి వరకూ బహిరంగంగా ఒక్క మాట మాట్లాడలేదు. గత కొన్నేళ్ల నుంచి అన్నాచెల్లెళ్ల మధ్య ఆధిపత్య పోరాటం నడుస్తోందన్న గాసిప్స్ మాత్రం ఉన్నాయి. కానీ ఎప్పటికప్పుడు వాటిని బహిరంగంగా తమ అనురాగాన్ని, అన్నాచెల్లెళ్ల మధ్య బంధాన్ని ప్రదర్శించడం ద్వారా చేతలతో ఖండిస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు మాత్రం బహిర్గతం అయ్యాయి. అవి ఏ దశకు వెళ్తాయో తెలియదు కానీ రాజకీయాలు మాత్రం జోరుగా సాగుతున్నాయి. కవిత అమెరికాలో ఉన్నప్పుడు ఆమె తండ్రి కేసీఆర్‌కు రాసిన లేఖ లీక్ అయింది. ఆ లేఖను కవితే లీక్ చేశారని ఆమె కాంగ్రెస్ కోవర్టు అన్నట్లుగా కేటీఆర్ ప్రెస్‌మీట్‌లో పరోక్షంగా ఆరోపణలు చేశారు. ఆ స్పందనకు కవిత చాలా సీరియస్‌గా స్పందించారు. కేటీఆర్ కు పార్టీ నడిపే సామర్థ్యం లేదని తనపై తప్పుడు ఆరోపణలు చేయిస్తున్నారని ఘాటుగానే స్పందించారు. ఈ వ్యవహారంతో కల్వకుంట్ల ఫ్యామిలీ రాజకీయాలు బహిరంగమయ్యాయి. అధికారం కోసం కుటుంబం రోడ్డున పడుతోందని విమర్శించేవారు రాజకీయాల్లో ఉంటారు కానీ.. ఇదేమీ వింత కాదు. ఇలాంటి సమస్య అంతా ఎవరో ఒకరు తమకు అన్యాయం జరుగుతోందని గట్టిగా నమ్మినప్పుడే వస్తుంది. ఇప్పుడు బీఆర్ఎస్‌లో కవిత అలాంటి పరిస్థితుల్లో ఉన్నారు. తనను పార్టీ దూరం పెడుతోందని.. రాజకీయ భవిష్యత్ లేకుండా చేయాలని అనుకుంటున్నారని .. పూర్తిగా రాజకీయ వారసత్వం కేటీఆర్ మాత్రమే సొంతం చేసుకోవాలని అనుకుంటున్నారని ఆమె బలంగా నమ్ముతున్నారు. ఇటీవలి కాలంలో జరుగుతున్న పరిణామాలు కూడా అలాగే ఉన్నాయి. కవిత ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టు అయి దాదాపుగా ఆరు నెలల పాటు జైల్లో ఉండి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ రాజకీయాల్లో ఆమెకు ఎలాంటి పాత్రా లేకుండా పోయింది. పార్టీ వ్యవహారాలపై ఎలాంటి సమాచారం లేదు. కొద్ది నెలల పాటు సైలెంట్ గా ఉండి ఆ తర్వాత తెలంగాణ జాగృతి పేరుతో తన రాజకీయం తాను చేయడం ప్రారంభించారు. అది ఇప్పుడు సొంత పార్టీ దిశగా వెళుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. కవిత పట్ల కేసీఆర్ చూపిన వివక్షే కారణం అధికార వాంఛ బంధాలను ఎంతగా దూరం చేస్తుందో చాలా ఉదాహరణలు ఉన్నాయి.. తమకే దక్కాలి.. తమకు పోటీ ఇంకొకరు ఉండకూడదన్న దురుద్దేశం ఈ బంధాలను మరింతగా దూరం చేస్తుంది. కేటీఆర్, కవిత ఇష్యూలో ఈ రెండు కారణాలు కనిపిస్తున్నాయి. కవిత బీఆర్ఎస్ పార్టీపై తనకూ వారసత్వపు హక్కు ఉందని గట్టిగా నమ్ముతున్నారు. పార్టీలో మరో పవర్ సెంటర్ ఉండకూడదని కేటీఆర్ అనుకుంటున్నారు. అందుకే సోదరి అయినప్పటికీ ఆమెను నిర్దాక్షిణ్యంగా పార్టీకి దూరం చేసే వ్యూహాలు పన్నారు. నిజామాబాద్‌లో కవిత ఓడిపోవడం వెనుక కుట్ర ఉందని ఆమె నమ్ముతున్నారు. మొన్నటి ఎన్నికల్లో జైల్లో ఉండటం వల్ల పోటీ కూడా చేయలేకపోయారు. కారణం ఏదైనా కవిత యాక్టివ్ రాజకీయాల్లో ఉండటం కేటీఆర్‌కు ఇష్టం లేదు. బయటకు తెలిసిన దాని కన్నా.. అంతర్గతంగా కేటీఆర్ ఈ విషయంలో చాలా చేశారన్న విషయం ఇప్పుడిప్పుడే బయటకు వస్తోంది. అన్నా చెల్లెళ్ల మధ్య రాజకీయం ఎవరూ ఊహించని టర్న్ తీసుకుంది. ఎవరికీ అర్థం కాని విషయం.. కేసీఆర్ ఎందుకు చక్కదిద్దలేకపోతున్నారనే. కేసీఆర్ చాణక్యుడని బీఆర్ఎస్ పార్టీ వర్గాలు గట్టి నమ్మకంతో ఉంటాయి. పాలనలో ఉన్నప్పుడు చాలా పెద్ద పెద్ద సమస్యల్ని ఆయన చాలా సులువుగా మౌనంగానే ఉండి.. చివరికి ఒక్క నిర్ణయంతో పరిష్కరించేసేవారు. కానీ ఇప్పుడు కుటుంబంలో ఏర్పడిన వివాదం.. పార్టీలో చీలికకు కారణం అవుతున్నా ఆయన చక్కదిద్దలేకపోతున్నారు. కుమార్తె రాజకియాల విషయంలో కేసీఆర్ సంతృప్తిగా లేరని సంకేతాలు వస్తున్నాయి. వివాదం ప్రారంభమైనప్పుడు ఆయన పట్టించుకోలేదు. ఇప్పుడు పూర్తిగా చేయి దాటిపోయినప్పుడు కూడా పెద్దగా జోక్యం చేసుకుంటున్నట్లుగా కనిపించడం లేదు. కవితతో మాట్లాడాలని ఎంపీ , బంధువు అయిన దామోదర్ రావును పంపించారు. తర్వాత బోయినపల్లి వినోద్ కుమార్ ను పంపించారు. కానీ తండ్రి, కూతుళ్ల మధ్య ఈ మధ్యవర్తులెందుకన్న సందేహం సహజంగానే ఎవరికైనా వస్తుంది. వారి మధ్య అంత గ్యాప్ ఎందుకు వచ్చింది?. సహజంగా తండ్రి కుమార్తె మీదనే ఎక్కువ ప్రేమ చూపిస్తారని అంటారు. కానీ ఇక్కడ కేసీఆర్ … కవిత విషయంలో అంత ఎక్కువగా అభిమానం చూపిస్తున్నట్లుగా కూడా కనిపించడం లేదు. కవిత పిల్లలతో కంటే..కేటీఆర్ కుమారుడితోనే కేసీఆర్ కు ఎక్కువ అనుబంధం. ఏదైనా.. ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి కవిత కంటే కేటీఆర్ కే కేసీఆర్ ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. కేటీఆర్ దారికి అడ్డం రావొద్దని కవితకు పరోక్షంగా సంకేతాలు పంపుతున్నారు. అంటే ఇక్కడ కవిత కుటుంబ పరంగా కూడా వివక్ష ఎదుర్కొంటున్నారని అనుకోవచ్చు. ఈ పరిణామాలు కవితను మరింత పట్టుదలగా మార్చారని ప్రస్తుత రాజకీయ పరిణామాలు నిరూపిస్తున్నాయి. బీఆర్ఎస్‌ను బీజేపీలో విలీనం చేసే ప్రయత్నాల్లో కేసీఆర్ కల్వకుంట్ల కవిత పోరాడితే పోయేదేం లేదని అనుకుంటున్నారు. బీఆర్ఎస్ పార్టీలో కేటీఆర్ తో సమానంగా ప్రాధాన్యం దక్కితే ఆమె రాజీ పడిపోయే అవకాశం ఉంది. రేపు కేటీఆర్ కు సీఎం పదవి ఇచ్చినా ఆమె అభ్యంతరం చెప్పకపోవచ్చు.. కానీ తనకూ ప్రాధాన్యం ఉండాలని కోరుకుంటారు. గతంలో కేసీఆర్ తన పార్టీని జాతీయ పార్టీగా మార్చినప్పుడు.. రాష్ట్ర రాజకీయాలు కేటీఆర్‌కు..జాతీయ రాజకీయాలు కవితకు అప్పచెప్పారు. కవిత కేసీఆర్ జాతీయ రాజకీయ వ్యవహారాలన్నీ చూసుకున్నారు. కానీ తాను ఒకటి తలిస్తే విధి మరొకటి తలచిందన్నట్లుగా.. బీఆర్ఎస్ జాతీయ రాజకీయాల దశలన్నీ కుప్పకూలిపోయాయి. చివరికి ఒక్క లోక్ సభ ఎంపీ లేరు. ఉన్న రాజ్యసభ ఎంపీలు ఉంటారో లేదో తెలియదు. అలాంటి స్థితికి వెళ్లిపోయింది. ఇప్పుడు సొంత రాష్ట్రంలో బలపడటమే కీలకం. పార్లమెంట్ ఎన్నికల్లో సగం సీట్లలో డిపాజిట్లు కోల్పోవడం.. ప్రత్యామ్నాయ పార్టీగా బీజేపీ ఎదుగుతూండటం బీఆర్ఎస్ భవిష్యత్ ను కలవరపరిచేదే. బీఆర్ఎస్ ఇప్పుడు ఉనికి సమస్యల్లో ఉందని ఆ పార్టీ అగ్రనేతలకు తెలుసు. కాంగ్రెస్ పై వ్యతిరేకత పెరిగిపోయి.. ప్రజలు బీఆర్ఎస్ వైపు చూసే అవకాశాల్లేవు. బీజేపీకి కూడా ఓ చాన్స్ ఇద్దామనకుుంటారు. అందుకే కేసీఆర్ తెలివిగా రాజకీయ అడుగులు వేసే ప్రయత్నాల్లో ఉన్నారు. బీజేపీతో పొత్తు లేదా విలీనం దిశగా పార్టీని నడిపిస్తున్నారు. ఈ విషయం రాజకీయంగా కనీస అవగాహన ఉన్న ఎవరికైనా అర్థమయిపోతుంది. దేశంలో చాలా ప్రాంతీయ పార్టీలు తమ ఉనికిని కాపాడుకోవడానికి బీజేపీతో సామరస్యంగా ఉండేందుకు ప్రయత్నిస్తూ ఉంటాయి. వైసీపీ అదే చేస్తూ బతికి బట్టకడుతోంది. టీడీపీ సందర్భాన్ని బట్టి విబేధిస్తూ వచ్చింది. ఇప్పుడు బీజేపీతో పొత్తులో ఉండి పార్టీని బలోపేతం చేసుకుంటోంది. కానీ అన్ని పార్టీలు అలాంటి వ్యూహాత్మక రాజకీయాలు చేయలేవు. కేసీఆర్ చేసిన రాజకీయాల వల్ల బీజేపీకి ఆ పార్టీ పై పెద్దగా నమ్మకం లేదు. అదే సమయంలో తెలంగాణలో బీజేపీ బలంగా ఎదుగుతోంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో తిరుగులేని విధంగా పుంజుకుంటోంది. దక్షిణ తెలంగాణలో టీడీపీ సపోర్టు ఉంటే చాలని అనుకుంటోంది. అందుకే బీఆర్ఎస్ పై పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. కానీ విలీనం అంటే మాత్రం.. ఆశపడే చాన్స్ ఉంది. ఆ దిశగానే కేసీఆర్ ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారని కవిత నేరుగానే చెప్పేశారు. అదే జరిగితే తన రాజకీయ భవిష్యత్ మరింత గందరగోళంలో పడుతుందని.. కవిత నిర్ణయానికి వచ్చారు అందర్నీ ఒప్పించేలా వ్యవహరించలేకపోతున్న కేసీఆర్ అయితే కేసీఆర్ తన రాజకీయ పయనం.. పార్టీ భవిష్యత్ గురించి.. రాజకీయాల్లో పార్టీకి పిల్లర్లుగా ఉన్న వారితో ఎందుకు చర్చించడం లేదన్నదే ఇక్కడ సందేహం. వారికి పరిస్థితుల గురించి చెప్పి.. ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాం మీరందరూ సహకరించాలని చెప్పి ఒకే దారిలో తీసుకు రావొచ్చు. పార్టీలో ఎవరికి ఎలాంటి ప్రాధాన్యం దక్కుతుందో ముందే క్లారిటీ ఇచ్చి పరిస్థితుల్ని సర్దుబాటు చేయవచ్చు. కానీ ఎందుకు ఆయన సర్ది చెప్పలేకపోతున్నారో సామాన్య బీఆర్ఎస్ కార్యకర్తకు కూడా అర్థం కావడం లేదు. బీఆర్ఎస్ ఓ ప్రాంతీయ పార్టీ చీలికలు వస్తే అసలు ఏ చీలిక కూడా ఉనికి కాపాడుకోవడం సాధ్యం కాదు. కేసీఆర్ సాధించిన విజయాలకు ఆయన ఇమేజ్ ఆకాశంలో ఉండాలి. కానీ ఓడిపోయిన తర్వాత ఆయన ఇమేజ్ మరీ దారుణంగా తయారయింది. బయటకు రాకపోవడమో.. మరో కారణమో కానీ ఇప్పుడు ఆయన గురించి మాట్లాడుకునేవారు తగ్గిపోయారు. కుటుంబంలో ఏర్పడిన గొడవల్ని సర్దుబాటు చేయలేక.. పార్టీని గాడిలో పెట్టలేక ఆయన సతమతమవుతున్నారని అనుకోవచ్చు. కేసీఆర్ ఇప్పుడు కవితను బుజ్జగించే పరిస్థితుల్లో లేరు. అలాగని ఆలే నరేంద్ర, విజయశాంతి, ఈటల రాజేందర్ తో పాటు హరీష్ రావు వంటి వారిని వాడుకుని వదిలేసినట్లుగా కుమార్తెను బయటకు పంపించడానికి ఆయనకు మసస్కరించకపోవచ్చు. కానీ ఏం చేయలేకపోతున్నారు. ఇలాంటి పరిస్థితి ఓ దిగ్గజ రాజకీయ నేతకు రావడం అసాధారణమే అనుకోవచ్చు. బీఆర్ఎస్ చీలితే ఏ ముక్కకైనా మనుగడ కష్టం ! కేటీఆర్ నాయకత్వ సామర్థ్యంపై బీఆర్ఎస్ మెజార్టీ నేతలకు నమ్మకం లేదు. కేవలం కేసీఆర్ ను చూసి మాత్రమే వారు కేటీఆర్ కు మద్దతు పలుకుతున్నారు. కేటీఆర్ కన్నా రెండింతలు ఎక్కువగా హరీష్ రావు నాయకత్వంపై పార్టీ నేతలకు నమ్మకం ఉంది. కేటీఆర్ కవిత కన్నా హరీష్ రావు అయితేనే బీఆర్ఎస్ ను సమర్థంగా ముందుకు తీసుకెళ్లరని మెజార్టీ క్యాడర్ అభిప్రాయం కూడా. కానీ బయటకు చెప్పలేరు. అలా చెప్పడం వల్ల మొదటగా నష్టపోయేది హరీష్ రావే. కానీ కేసీఆర్ కు ఇచ్చిన మాట ప్రకారం ఆయన బయటకు రావడం లేదు. రేపు కేటీఆర్, కవిత పార్టీ మాదంటే మాది అని కొట్లాడుకుంటున్న సమయంలో హరీష్ రావు వారిద్దరి వైపు ఉండే అవకాశం లేదు. తనదారి తాను చూసుకుంటారు. మొత్తం పార్టీని తన గుప్పిట్లో తెచ్చుకుంటారు. అప్పుడు పిట్టపోరు..పిట్టపోరు పిల్లి తీర్చిందన్నట్లుగా వారు హరీష్ రావు పార్టీ వైపు దీనంగా చూడాల్సి రావొచ్చు. ఈ పరిణామాలన్నింటినీ కేసీఆర్ అలా నిస్సహాయంగాచూస్తూండిపోతారు. ఆయన ఏమీ చేయలేరు.. చేయాలని అనుకోవడం లేదు.
  10. వల్లభనేని వంశీకి మెరుగైన వైద్య చికిత్స కోసం విజయవాడ ఆయుష్ హాస్పిటల్ కు తరలించాలని హైకోర్టు ఆదేశం. వంశీ ఆరోగ్య పరిస్థిని సీల్డ్ కవర్ లో హైకోర్టుకు సమర్పించమని ఆయుష్ హాస్పిటల్స్ ఎం డీ ఆదేశించిన హైకోర్టు..!
  11. వీడిని make-up లేకపోతే ఎవరూ గుర్తుపట్టలేరేమో!!!
  12. Amaravathi lo ycp andagathhela parade yeppudu
×
×
  • Create New...