Jump to content

RamaSiddhu J

Members
  • Posts

    27,311
  • Joined

  • Last visited

  • Days Won

    9

Everything posted by RamaSiddhu J

  1. Arabian sea lo kalusthanante manakemosthundi
  2. Todays Menu: Morning :4 dates + green tea Afternoon: 4 Chapatis with Dal and curry Night : 2 Mangoes + 6 dates + Green Tea
  3. పులిచింతల ప్రాజెక్టు 10గేట్లు ఎత్తివేత గుంటూరు(కలెక్టరేట్‌): ఆంధ్రప్రదేశ్‌లో కురుస్తున్న కురుస్తున్న వర్షాలకు తోడు ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదనీటితో పులిచింతల ప్రాజెక్టు జలకళను సంతరించుకుంది. దీంతో అధికారులు ప్రాజెక్టులోని 10 గేట్లను 4మీటర్ల మేర ఎత్తి నీటిని కిందికి విడుదల చేస్తున్నట్లు గుంటూరు జిల్లా కలెక్టర్‌ కాంతిలాల్‌ దండే తెలిపారు. జలాశయానికి 4.6లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా... 2.5లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా ముంపు గ్రామాల ప్రజలను అప్రమత్తం చేసి పునరావాస కేంద్రాలకు తరలించామని, వారికి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు.
  4. వాగులో చిక్కుకున్న ఆర్టీసీ బస్సుక్రోసూరు: గుంటూరు జిల్లాను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. కుండపోతగా కురుస్తున్న వర్షాలతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో పలు మార్గాల్లో వాహన రాకపోకలు నిలిచిపోయాయి. ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు క్రోసూరు మండలంలోని వూటుకూరు వాగులో ఈరోజు మధ్యాహ్నం చిక్కుకుపోయింది. వాగు దాటుతున్న సమయంలో ఒక్కసారిగా వరదనీరు ముంచెత్తడంతో బస్సు మధ్యలో నిలిచిపోయింది. దీంతో 47 మంది ప్రయాణికులు ఆపదలో చిక్కుకున్నారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్‌.. జిల్లా కలెక్టర్‌ కాంతిలాల్‌ దండే దృష్టికి తీసుకెళ్లారు. దీంతో బాధితులను హెలికాప్టర్‌ ద్వారా రక్షించేందుకు అధికారులు ప్రయత్నం చేస్తున్నారు.
  5. నరసరావుపేట జలమయం నరసరావుపేట: భారీ వర్షానికి గుంటూరు జిల్లా నరసరావుపేట జలమయమైంది. సమీపంలోని వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పట్టణంలోని కత్తచెరువుకు భారీగా వరదనీరు వచ్చి చేరింది. దీంతో సత్తెనపల్లి రోడ్డులో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. బీసీ కాలనీ జలమయమైంది. గుంటూరు రోడ్డులో స్వర్గపురి వద్ద నాలుగు అగడుగుల మేర నీరు ప్రవహిస్తోంది. రహదారిపై నీటిని మళ్లించేందుకు డివైడర్లను పగులగొట్టారు. మరోవైపు ఎల్లమంద గ్రామం వద్ద ఏడుమంగళ వాగు పొంగి ప్రవహిస్తోంది. దీంతో వాగు పరీవాహక ప్రాంతమైన బుడగజంగాల కాలనీ, ఎలుకలు కాలనీ, నాయీబ్రాహ్మణ కాలనీ ల్లోకి నీరు చేరింది. కేసానిపల్లి గ్రామం వద్ద ఎస్‌ఆర్‌కేటీ కాలనీలో కూడా భారీగా వర్షపు నీరు చేరింది. రాయిపాడు, లక్ష్మీనారాయణపురంలోకి భారీగా వరద నీరు రావడంతో అనేక ఇళ్లు జలదిగ్భందంలో చిక్కుకున్నాయి. లింగంకుంట్ల గ్రామంలోని మంచినీటి చెరువులోకి భారీగా వర్షపు నీరు చేరడంతో పక్కనే ఉన్న ఎస్సీ కాలనీ జలమయమైంది. సహయక చర్యల్లో భాగంగా బాధితులకు పదివేల పులిహోర ప్యాకెట్లు, 50వేల మంచినీటి ప్యాకెట్లను అందించనున్నట్లు ఆర్డీవో జి.రవీంద్ర తెలిపారు. మున్సిపల్‌ కమిషనర్‌ భానుప్రతాప్‌, డీఎస్పీ నాగేశ్వరరావు తదితరులు వరద ప్రాంతాల్లో సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. దాచేపల్లి వద్ద నాగులేరులో లారీ కొట్టుకుపోయింది.
  6. సత్తెనపల్లిలో స్తంభించిన రాకపోకలు సత్తెనపల్లి: బుధవారం అర్ధరాత్రి నుంచి గుంటూరు జిల్లా సత్తెనపల్లి పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఎడతెరిపి లేకుండా సుమారు 6 గంటలపాటు కురిసిన వర్షంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. సత్తెనపల్లి మీదుగా హైదరాబాద్‌ వెళ్లే వాహనాలు పట్టణంలోని బసవమ్మవాగు వద్ద నిలిచిపోయాయి. రాజపాలెం మండలంలోని అనుపాలెం వద్ద వాగు పొంగి ప్రవహిస్తుండటంతో రాకపోకలకు అంతరాయమేర్పడింది. సత్తెనపల్లి నుంచి నరసరావుపేట, అచ్చంపేటకు వెళ్లే రహదారులు వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారాయి. సత్తెనపల్లిలో కురిసిన భారీ వర్షంతో పట్టణంలోని నాగన్నకుంట, సుందరయ్యనగర్‌, వెంకటపతికాలనీ, యానాదికాలనీ, కొత్తపేట ప్రాంతాలు జలదిగ్భందంలో చిక్కుకున్నాయి. సహాయక చర్యలకు వర్షం అడ్డంకిగా మారడంతో బాధితులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. సత్తెనపల్లిలో 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు రెవెన్యూ అధికారుల తెలిపారు.
  7. ఇంటర్నెట్‌డెస్క్‌: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. అర్థరాత్రి నుంచి గుంటూరు, ప్రకాశం, కృష్ణా, కర్నూలు జిల్లాలతో పాటు పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరదనీరు రహదారులపై ప్రవహిస్తుండటంతో గుంటూరు జిల్లాలోని నరసరావుపేట, సత్తెనపల్లి ప్రాంతంలో రవాణా వ్యవస్థ స్తంభించింది. పిడుగురాళ్ల వద్ద రైలు పట్టాలపైకి వరద నీరు చేరడంతో పలుమ రైళ్ల రాకపోకలకు అంతరాయమేర్పడింది. నిలిచిపోయిన రైళ్లు భారీ వర్షంతో పాటు వాగులు పొంగి పట్టాలపైకి నీరుచేరడంతో గుంటూరు జిల్లాలోని బెల్లంకొండ-పిడుగు రాళ్ల మధ్య ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌ను నిలిపివేశారు. హైదరాబాద్‌ నుంచి విజయవాడ వెళ్లే అమరావతి ఎక్స్‌ప్రెస్‌ నడికుడిలో నిలిపివేశారు. పిడుగు రాళ్ల మండలం అనుపాలెం సమీపంలో మాచర్ల-భీమవరం ప్యాసింజర్‌ రైలును, సత్తెనపల్లి మండలం ధూళిపాళ్ల-రెడ్డిగూడెం మధ్య రైల్వే ట్రాక్‌పై వర్షపునీరు చేరడంతో రెడ్డిగూడెం వద్ద పల్నాడు ఎక్స్‌ప్రెస్‌ను, నల్గొండ జిల్లా మిర్యాలగూడలో కృష్ణా ఎక్స్‌ప్రెస్‌ నిలిపివేశారు. రైళ్లు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
  8. గుంటూరు: అల్పపీడన ప్రభావంతో గుంటూరు జిల్లాలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో పలు మార్గాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. నరసరావుపేట మండలం జొన్నలగడ్డ వాగు ఉద్ధతి పెరగడంతో కాజ్‌వే కొట్టుకుపోయింది. దీంతో గుంటూరు-హైదరాబాద్‌ మార్గంలో వాహన రాకపోకలు నిలిచిపోయాయి. వాహనాలు ఎటూ కదల్లేని పరిస్థితిలో రహదారిపైనే భారీ సంఖ్యలో నిలిచిపోయాయి.
  9. Down Stream Ayacut given preference over upsteam so Krishna delta given preference first
  10. eppudo chesaru...monna pushkarala daka unnaru janam akkada
×
×
  • Create New...