Jump to content

Humiliated Dalit in AP


kurnool NTR

Recommended Posts

దిల్లీ: ఆంధ్రప్రదేశ్ లో దళిత యువకుడికి పోలీసులు శిరోముండనం చేసిన కేసుపై భారత రాష్ట్రపతి కార్యాలయం స్పందించింది. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ బాధితుడికి అండగా నిలబడేందుకు ప్రత్యేక అధికారిని నియమించారు. దీంతో ఏపీకి చెందిన సాధారణ పరిపాలన విభాగానికి ఈ కేసుకు సంబంధించిన దస్త్రం బదిలీ అయింది. అసిస్టెంట్ సెక్రటరీ జనార్ధన్ బాబును కలవాలని, కేసు విషయంలో ఆయనకు సహకరించాలని బాధితుడు వరప్రసాద్ కు రాష్ట్రపతి కార్యాలయం సూచించింది. దీంతో త్వరలో పూర్తి ఆధారాలతో బాధితుడు జనార్ధన్ బాబును కలవనున్నారు.
 

తూర్పుగోదావరి జిల్లా సీతానగరంలో స్థానిక వైకాపా నాయకుడి అనుచరుడి ఫిర్యాదు మేరకు ఇటీవల వెదుళపల్లిలో వరప్రసాద్ అనే ఎస్సీ యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. తీవ్రంగా గాయపర్చడంతోపాటు పోలీస్ స్టేషన్ లోనే అతడికి శిరోముండనం చేశారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అనంతరం ఈ ఘటనతో మనస్తాపం చెందిన వరప్రసాద్ తాను నక్సలైట్లలో కలుస్తానంటూ ఇటీవల రాష్ట్రపతికి లేఖ రాశారు. వరప్రసాద్ లేఖపై రాష్ట్రపతి స్పందించి చర్యలు తీసుకున్నారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...