Jump to content

C B N

chintakai

Recommended Posts

గద్ద ముసలిది అయిపోయింది ! చూపు తగ్గిపోయింది.వేట సంగతి దేవుడెరుగు,అసలు తిండే చిక్కడం లేదు.తెచ్చి పెట్టే దిక్కు లేదు.అయ్యో అని దగ్గరకు తీసే నాథుడే కనిపించపోయె ! మేఘాలకి పైన ఎగురుతూ వర్షాన్ని కూడా గెలిచినట్టు కనిపించిన గద్ద ఇప్పుడు బిత్తర చూపులు చూస్తోంది. ఆకాశం నుంచి నేరుగా గురిపెట్టిన బాణంలా లక్ష్యం మీదకి దిగిన గద్దకి ఇప్పుడు దిక్కు తోచడం లేదు ! పైగా గద్ద వాలితే ఈసురోమన్నట్టుగా కనిపించసాగాయ్ పరిసరాలు.ఇలాంటి సమయంలో ఆ గద్ద కనిపించకుండా పోయింది.కొండ మూలల్లోకి, తనంతట తానుగా తనలోకి తాను జారుకుంది ! గద్దకు తన సమస్య ఏంటో తెలుసు.వయసు పెరుగుతున్న కొద్దీ పరిస్థితులు ప్రతికూలంగా మారుతున్న కొద్దీ తన బతుకు ఏమవుతుందో అర్థమైంది.అందుకే రిపేర్ మొదలు పెట్టింది. తనకి తాను చేసుకునే ప్రకృతి చికిత్స ఇది !

ముందుగా రాయికేసి ముగ్గును చెక్కుకోవడం మొదలు పెట్టింది.ఎందుకంటే సూదిలా ఉండే ముక్కు ఇపుడు మరీ పెరిగి వంకర తిరిగిపోయింది.అందుకే ఆహారం నోటికి చిక్కడం లేదు.ఏదీ పొట్టకి దక్కడం లేదు.పెరిగిన ముక్కు కొన చెక్కుకుంది.కొన్ని రోజులు చెక్కిన తర్వాత ముక్కు సూదంటుగా మారింది.ఆ సూదంటు ముక్కుతో ఇప్పుడు కాలి గోళ్లు తీసుకోవడం మొదలు పెట్టింది.గోళ్లు బాగా పెరిగిపోయాయ్.అవలీలగా ఆహారాన్ని చీల్చిన కాళ్లు కొన్నాళ్లుగా పని చేయడం లేదు !అందుకే ఈ సూది ముక్కుతో ఆ గోళ్లు తీసుకుంది.తర్వాత,గోళ్లు తీసిన కాళ్లలో రెక్కలకి నగిషీలు పెట్టుకోవడం మొదలు పెట్టింది.గద్ద ఈ నాటిది కాదు.దాదాపు 30 ఏళ్లు దాటిపోయాయ్.అందుకే రెక్కలు కాదు ఈకలు పెరిగాయ్.అవసరమైన ఈకలు అవన్నీ ! రెక్కలకి లెక్కలేనంత భారం.బరువు పెరిగిపోయి ఎగరలేనంతగా తయారైంది అందుకే ! ఆ ఈకలన్నిటినీ క్రమంగా కాళ్లతో దూసేయడం మొదలు పెట్టింది.దూసింది..దూసింది.అనవసర ఈకలన్నీ పోయి బరువు తగ్గింది.ఒంట్లో నూతన ఉత్సాహం వచ్చింది.అయినా కంట్లో ఇంకా పదును పెరగలేదు. కళ్లకొచ్చిన పొరల్నీ కాళ్ల గోళ్లకో క్రమంగా తప్పిస్తూ సుప్త చేతనావస్థలో కొన్నాళ్లు అలా ఉండిపోయింది. ఇదంతా కొన్ని నెలల పాటు జరిగే ప్రకృతి చికిత్స. ! అన్నీ అయ్యాక ఓ రోజు నూతనోత్సాహంతో కీచ్ మని శబ్దం చేస్తూ ఆకాశంలో వేటకు బయల్దేరుతుంది అలనాటి రారాజు.ఇది పునర్జన్మ.ఓ ముప్ఫై ఏళ్లకి మూలన పడే పరిస్థితి వచ్చాక స్వ చికిత్సతో గద్ద తిరిగి పుంజుకుంటుంది ఇలా ! ఆ తర్వాత మరో 30 ఏళ్లకి కానీ దానికి మళ్లీ అలాంటి అవసరం పడదు. దీన్నే రిడప్షన్ అంటారు.ఆకాశం నుంచి మూలకి పడిన గద్ద - మళ్లీ పుంజుకొని నింగిని శాసించే చక్రం ఇది.

సరిగ్గా ఇప్పుడు చంద్రబాబు కూడా ఇలాంటి సంధి కాలంలోనే నిలిచాడు.కొన్నాళ్లుగా కనిపించడం లేదు. కనిపించడం తగ్గించి విశ్రాంతి తీసుకుంటున్న బాబు అక్కడితో ఆగిపోకూడదు.చికిత్స తీసుకోవాలి.తనని తాను తీర్చి దిద్దుకోవాలి.బ్లెస్సింగ్ ఇన్ డిజ్ గైజ్ అన్నట్టు,ఇలాంటి కలిసి రాని కాలంలోనూ కమలం ఓ రకంగా సాయమే చేస్తోంది చంద్రబాబుకి ! రెక్కల్లో లెక్క లేకుండా పెరిగిపోయిన ఈకల్ని బీజేపీ పెకలిస్తోంది.అలాంటి ఈకలు ఊడిపోతే, తోక నుంచి రాలిపోతే గద్దకి వచ్చేది ఉత్సాహమే తప్ప నష్టం కాదు.చంద్రబాబుతోపాటు టీడీపీ సానుభూతి పరులు కూడా తెలుసుకోవాల్సిన విషయం ఇది ! ఇక పెరిగిన గోళ్లను తీసుకోవడం,ముక్కుకు సాన పట్టి మళ్లీ పదును పెంచుకోవడం,అదును అందుకోవడం లాంటివి చంద్రబాబు వ్యూహాత్మకంగా వేయాల్సిన అడుగులే!తనని తాను సరిదిద్దుకుంటూ పార్టీకి కొత్త నెత్తురు ఎక్కిస్తూ సమయానుకూలంగా మారుతూ లోటుపాట్లను పూడ్చుకుంటూ అడుగు వేస్తే , గరుడగా మారిన గద్దలా చంద్రబాబు కూడా ఛాంపియన్ గా అవతరించగలడు.

చంద్రబాబుకి ఈ ప్రయత్నంలో పెద్దగా తోడు కూడా అవసరం లేదు.ఎందుకంటే చంద్రబాబు అవసరం జనానికి ఉన్నప్పుడు - జనం చంద్రబాబును కోరుకున్నప్పుడు - ఇక బాబు చూపించినోడే లీడర్. టీడీపీ జెండా ఎత్తి పట్టుకున్నోడే నాయకుడు. అందుకే ఎవరో ఫినిష్ చేస్తే ఫినిష్ అయిపోడానికి టీడీపీ ఏమీ పళ్లెంలో వడ్డించిన గుజరాత్రీ డోక్లా కాదు !అయినా చంద్రబాబు 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఒడ్డున కూర్చొని సేదరీతిన సందర్భాలు కన్నా ఏటికి ఎదురీది ఒడ్డుకు చేరిన దాఖలాలే ఎక్కువ !ఇంత చెప్పిన తర్వాత కూడా వయసు గురించి ఎవడైనా మాట్లాడితే మాత్రం చేసేదేం లేదు ! గద్ద ముసలిది అయిపోయింది - దగ్గర నుంచి మళ్లీ చదవండి !

Link to comment
Share on other sites

Story bavundi.  Anthakanna better story cheppeda.  Group of birds ni kapade Gadda musalidi ayndi.  Tana avasaram anubhavam tana group ki undi ani ardam cheskondi . Vayasu ,marina hunting techniques drustya ippudu kotta vi implement cheyatam kastam ani bhavinchi reality ardam cheskoni tana group lo oka young efficient gadda ni train chesindi tana venaka undi vantlo vopika (power) undagane.  A young gadda ippudu edigi tana guruvu anubhavam swathahaga Kalam nerpina latest techniques kalipi best ga tayarayyi group ni inko 20 yrs kapadindi.  Adi chusi old gadda anandam tho kannumusindi 

Link to comment
Share on other sites

good write-up...

but since 2004 we are facing series of troubles...

Two times in opposition

Formation of TG and party has lost it's base in TG

Though we came to power in AP, we acted like opposition in AP and YSRCP feels like ruling party.

Now we lost AP 2. When we will get good days again?

Link to comment
Share on other sites

1 hour ago, koushik_k said:

Story bavundi.  Anthakanna better story cheppeda.  Group of birds ni kapade Gadda musalidi ayndi.  Tana avasaram anubhavam tana group ki undi ani ardam cheskondi . Vayasu ,marina hunting techniques drustya ippudu kotta vi implement cheyatam kastam ani bhavinchi reality ardam cheskoni tana group lo oka young efficient gadda ni train chesindi tana venaka undi vantlo vopika (power) undagane.  A young gadda ippudu edigi tana guruvu anubhavam swathahaga Kalam nerpina latest techniques kalipi best ga tayarayyi group ni inko 20 yrs kapadindi.  Adi chusi old gadda anandam tho kannumusindi 

Alanti gadda lu TDP lo levu. Neeku nachhina gadda ni select chesukoni switch aipovachhu. 

Link to comment
Share on other sites

2 minutes ago, koushik_k said:

ade pani cbn chesi unte peddayana antha bhada tho chanipoyevaru kadu kada.. 

Peddayana meeda prema okksariga puttukostundi enduko. Innellu leni 'Peddayana meeda prema' ippude ravataniki karanam party otama? 

Odipothe okalaga geliste okalaga mare abhiprayalu party ki avasaramledu

Link to comment
Share on other sites

1 minute ago, Royal Nandamuri said:

Peddayana meeda prema okksariga puttukostundi enduko. Innellu leni 'Peddayana meeda prema' ippude ravataniki karanam party otama? 

Odipothe okalaga geliste okalaga mare abhiprayalu party ki avasaramledu

cbn kuda ostundi ga saraina time lo elections time lo. ..  NDA lo unnappudu bharat ratna gurthu radu.. digagane gurtocchestundi party vallaki. ..          ikkada gelupu votamulu kadu samasya.. nayakatvam samasya.. adi undapatte a roju NTR ni dincharu.. Repu CBN ni evarokallu dinchali. 

Link to comment
Share on other sites

28 minutes ago, koushik_k said:

cbn kuda ostundi ga saraina time lo elections time lo. ..  NDA lo unnappudu bharat ratna gurthu radu.. digagane gurtocchestundi party vallaki. ..          ikkada gelupu votamulu kadu samasya.. nayakatvam samasya.. adi undapatte a roju NTR ni dincharu.. Repu CBN ni evarokallu dinchali. 

Dinchukomanu chethanaithe... Evaru vaddu annaru??

Link to comment
Share on other sites

30 minutes ago, koushik_k said:

cbn kuda ostundi ga saraina time lo elections time lo. ..  NDA lo unnappudu bharat ratna gurthu radu.. digagane gurtocchestundi party vallaki. ..          ikkada gelupu votamulu kadu samasya.. nayakatvam samasya.. adi undapatte a roju NTR ni dincharu.. Repu CBN ni evarokallu dinchali. 

Evaro okaru anatam lone telustundi akkada evaru keru ani. Peru kooda cheppaleni vadu evado vachi em uddaristado meeke teliyali

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...