Jump to content

ఏపీలో టీడీపీతో పొత్తు లేదని తేల్చేశారు...


sonykongara

Recommended Posts

ఏపీలో టీడీపీతో పొత్తు లేదని తేల్చేశారు...!
14-01-2019 18:11:11
 
636830862717412825.jpg
  • టీడీపీతో కాంగ్రెస్‌కి పొత్తులేదన్న కేంద్ర మాజీ మంత్రి
  • పళ్లంరాజుకి సోనియా కుటుంబంతో సాన్నిహిత్యం
  • రాజకీయ వర్గాల అనుమానాలకు చెక్‌ పెట్టిన పళ్లంరాజు
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి-కాకినాడ)
రాష్ట్రాభివృద్ధికి మోకాలడ్డుతున్నారన్న కారణంగా బీజేపీతో టీడీపీ తెగతెంపులు చేసుకుంది. కాంగ్రెస్‌తో దోస్తీ కట్టింది. రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలోనూ కాంగ్రెస్‌తో పొత్తు ఉంటుందని అందరూ ఊహించారు. అయితే కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, కుటుంబపెద్ద సోనియాగాంధీలకు అత్యంత సన్నిహితుడిగా పేరొందిన పళ్లంరాజు టీడీపీతో కాంగ్రెస్‌కి పొత్తులేదని తేల్చేశారు. పళ్లంరాజు గత కేంద్ర కేబినెట్‌లో కీలకమైన రక్షణశాఖ మంత్రి పదవి నిర్వహించారు. పళ్లంరాజు కుటుంబానికి, ఇందిరాగాంధీ కుటుంబానికి మూడు తరాల అనుబంధం ఉంది.
 
పళ్లంరాజు కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు సైతం ఎటువంటి రాజకీయ వివాదాస్పదమైన ప్రకటనలు ఇచ్చేవారు కాదు. కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీతో మాట్లాడిన తర్వాతే రాష్ట్రంలో టీడీపీతో పొత్తులేదన్న అంశంలో పళ్లంరాజు స్పష్టత ఇచ్చి ఉంటారని ఆయన వర్గీయులు చెబుతున్నారు. టీడీపీతో పొత్తు ఉంటే.. కాకినాడ లోక్‌సభ నుంచి పళ్లంరాజు పొత్తులో భాగంగా కాంగ్రెస్‌ నుంచి పోటీ చేస్తారని ఇన్నాళ్లూ ఊహాగానాలు సాగాయి. పొత్తులేదని ఆయనే స్వయంగా తేల్చేయడంతో ఇక అన్ని స్థానాలలోనూ టీడీపీ విడిగా పోటీచేసే అవకాశం కన్పిస్తోంది.
Link to comment
Share on other sites

4 hours ago, Royal Nandamuri said:

Subham.Congress ki seat lu ichi elections tarvata vallatho matalu pade kharma tappiddi

seat lu ichi, vote lu ichi... vallani pogidi dandalu petti, tappulu kappi puchi, thitlu sapanardhalu, etc yenno paddam ga baffas tho..

paniki rani alliances aapithe better, congress party cannot bring votes in AP..

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...