Jump to content

Vishnukumar raju into tdp?


Saichandra

Recommended Posts

  • పార్టీ సమావేశాలకు దూరంగా విష్ణుకుమార్‌ రాజు
  • నియోజకవర్గంలో సొంతంగా సర్వే
  • 47 శాతం ఓటర్లు టీడీపీ వైపు మొగ్గు
విశాఖపట్నం, డిసెంబరు 29(ఆంధ్రజ్యోతి): విశాఖ ఉత్తరం ఎమ్మెల్యే విష్ణుకుమార్‌ రాజు తన రాజకీయ భవిష్యత్తుపై కీలక నిర్ణయం తీసుకొనే దిశగా అడుగులు వేస్తున్నారు. బీజేపీ పక్ష నేతగా రాష్ట్రంలోని పలు సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావిస్తూ గుర్తింపు తెచ్చుకున్నారు. హామీల అమలు, ప్రత్యేక హోదా తదితర అంశాల నేపథ్యంలో బీజేపీ, టీడీపీ విడాకులు తీసుకొన్న తరువాత రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులతో ఆయన ఒకింత ఒత్తిడికి లోనవుతున్నట్లు సహచరులు చెపుతూ వస్తున్నారు. రాష్ట్రానికి బీజేపీ అన్యాయం చేస్తున్నదని స్పష్టంగా తెలుస్తున్నా పార్టీ విధానాలను బలపరుస్తూ మాట్లాడాలని పై నుంచి ఒత్తిళ్లు రావడంతో అడకత్తెరలో పోకచెక్కలా నలిగిపోతున్నారని వినికిడి. ఈ నేపథ్యంలో గత మూడు నెలలుగా ఆయన పార్టీ సమావేశాలకు గైర్హాజరవుతున్నారు. అదే సమయంలో జిల్లా అధికార యంత్రాంగం నిర్వహించే సభలు, సమావేశాలకు హాజరవుతున్నారు. సహజంగానే ఇది రెండు పార్టీల్లోనూ చర్చనీయాంశమైంది.
 
పోటీ నిర్ణయం కోసం సర్వే...
ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీ తరపున మళ్లీ పోటీ చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందో అన్న అనుమానం విష్ణుకుమార్‌ రాజును గత కొద్దికాలంగా పీకుతోంది. ప్రజల నుంచి పైసా ఆశించకుండా అన్నీ చేస్తున్నా.. పార్టీ ప్రభావం తప్పకుండా ఉంటుంద ని ఆయన అభిమానులు, సన్నిహితులు ఆయనకు చెబుతూవస్తున్నారు. ఈ నేపథ్యంలో... ‘అసలు నియోజకవర్గంలో పరిస్థితి ఏమిటి?’, ‘ఎమ్మెల్యేగా ఆయన పనితీరు ఏ విధంగా ఉందని అనుకుంటున్నారు?’ వంటి 15 ప్రశ్నలతో ప్రజానాడిని తెలుసుకోవడానికి ఆయన మిత్రబృందం నియోజకవర్గంలో సర్వే చేయించింది. ఫలితం ఎమ్మెల్యేకి అనుకూలంగా వచ్చింది. అది చూసిన తరువాత పోటీ చేసే తీరాలన్న నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు. ఆ సర్వేలో ఎక్కువ మంది ప్రజలు వచ్చే ఎన్నికల్లో టీడీపీకే ఓట్లు వేస్తామని పేర్కొన్నారని తెలిసింది.
 
వైసీపీలో చేరను: విష్ణుకుమార్‌ రాజు
బయట జరుగుతున్న ప్రచారాంశాన్ని ఎమ్మెల్యే వద్ద ‘ఆంధ్రజ్యోతి’ ప్రాస్తావించిం ది. తనదైన శైలిలో బిగ్గరగా నవ్వుతూ.. చెప్పదలుచుకున్న విషయాన్ని కుండబద్దలు కొట్టారు. ‘‘నేను వైసీపీలో చేరే ప్రసక్తే లేదు. కొన్ని కోర్టు కేసులకు హాజరు కావలసి వుండడం వల్ల ఢిల్లీ, అమరావతిల్లో జరిగే పార్టీ సమావేశాలకు గైర్హాజరవుతున్న మాట వాస్తవమే. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా పోటీ చేస్తాను. నన్ను కొన్ని పార్టీలు కోరుకుంటున్నాయి. భవిష్యత్తే అన్నీ నిర్ణయిస్తుంది’’ అన్నారు.
Link to comment
Share on other sites

4 hours ago, Ntrforever said:

@sagarkurapati your comments please 

Yes morning ne chedham anukonna.

Aparichithudu character ki brand ambassador ethanu janallo negative aythe emi ledhu, BJP nunchi poti chesthe deposits kuda ravu, maa area khsetriyas antha present TDP vaipu ne unnaru but TDP ki leader ledu sabbam is third grade leader tdp ki vadthe rajulu kkraju ysrcp ki vestharu.

So Vishnu Kumar raju vasthe we should welcome, kamma and raju dominated area lo pakka 20+ majority if TDP aythe

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...