Jump to content

తెరాస తాజా మాజీ ఎమ్మెల్యేకు చేదు అనుభవం


sonykongara

Recommended Posts

సిరిసిల్ల పట్టణం: రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రంలో శుక్రవారం జరిగిన మంత్రి కేటీఆర్‌ బహిరంగ సభలో నేరేళ్ల బాధితులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. రెండేళ్ల క్రితం జరిగిన నేరేళ్ల ఘటన బాధితులకు మంత్రి ఇప్పటి వరకూ ఎలాంటి న్యాయం చేయకపోగా.. తమపై పోలీసులతో థర్ఢ్ డిగ్రీ ప్రయోగించారని నినదిస్తూ బాధితులు బర్తు బానయ్య, కోల హరీశ్‌ ఆత్మహత్యకు యత్నించారు. తమతో పాటు తెచ్చుకున్న కిరోసిన్‌ పోసుకొని నిప్పంటించుకోబోయారు. అప్రమత్తమైన పోలీసులు వారిని అడ్డుకొని తంగళ్లపల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు

Link to comment
Share on other sites

  • Replies 280
  • Created
  • Last Reply
ప్రచారానికి వెళ్లిన టీఆర్ఎస్ అభ్యర్థికి చేదు అనుభవం
01-12-2018 10:28:31
 
636792570354750938.jpg
  • వైరాలో మదన్‌లాల్‌ అడ్డగింత
  • లంబాడాలకు వ్యతిరేకంగా మాట్లాడారంటూ నిరసన
కారేపల్లి(ఖమ్మం): ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి బాణోత్‌ మదన్‌లాల్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ఆయనను కొందరు అడ్డుకున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కారేపల్లి మండల పరిధిలోని భాగ్యనగర్‌ తండాకు వెళ్లారు. ఈ సందర్భంగా స్థానికులు ఆయనను అడ్డుకున్నారు. కొంతకాలంగా మదన్‌లాల్‌ లంబాడాలను కించపరిచే విధంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఆయన ప్రచార వాహనం ముందు బైఠాయించి ఆందోళనకు దిగారు. మదన్‌లాల్‌ తమ గ్రామంలో పర్యటించడానికి అంగీకరించబోమన్నారు. ఈ క్రమంలో మదన్‌లాల్‌ అనుకూలురు కొందరు స్థానికులతో వాదనకు దిగారు. కొందరు మదన్‌లాల్‌కు వ్యతిరేకంగా, మరికొందరు అనుకూలంగా నినాదాలు చేశారు. అయితే.. ఈ విషయం ముందుగానే పసిగట్టిన పోలీసులు అప్పటికే గ్రామానికి వచ్చారు. ఇరువర్గాలనూ శాంతింపజేశారు. అనంతరం మదన్‌లాల్‌ గ్రామంలో ఎన్నికల ప్రచారాన్ని ముగించుకుని వెళ్ళిపోయారు.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...