Jump to content

ప్రపంచంలోనే బరువైన బాలికకు బెజవాడలో చికిత్స


Recommended Posts

ప్రపంచంలోనే బరువైన బాలికకు బెజవాడలో చికిత్స
03-08-2018 11:47:15
 
636688936367604443.jpg
  • 185 కిలోల బాలికకు విజయవంతంగా చికిత్స
  • అరుదైన వ్యాధితో ప్రపంచంలోనే బరువైన బాలికగా గుర్తింపు
  • నగరంలో వైద్యం.. నెలలో 45 కిలోలు తగ్గిన వైనం
విజయవాడ: 180 అరటిపళ్లు.. 14 కేజీల బియ్యం.. 8 కేజీల బంగాళాదుంపలు.. 8 కేజీల చేపలు. సుమన్‌ ఖటూన్‌ అనే తొమ్మిదేళ్ల బెంగాలీ బాలిక వారం రోజుల మెనూ ఇది. ఇంత ఆరగించినా ఆకలి తీరేదా అంటే.. లేదనే చెప్పాలి. అందుకే బెంగాలీ స్వీట్లు, కేక్స్‌ లాగించేసేది. ఫలితంగా 9 ఏళ్లలోనే 92 కేజీల బరువు పెరిగింది. ప్రపంచంలోనే బరువైన బాలికగా పేరు తెచ్చుకుంది. కాసేపు నిలుచోలేని, కూర్చోలేని పరిస్థితితో స్కూలుకు దూరమైంది. ఇది 2014లోని మాట. వయసుతోపాటు బాలిక ఆకలి పెరిగింది. దీంతో 14 ఏళ్లకే 185 కేజీల బరువుకు చేరుకుంది. ఊబకాయాన్ని మోయలేక.. కాళ్లు వంగిపోయి.. ఆయాసం.. అలర్జీ వేధించసాగాయి. వేరొకరి సాయం లేకపోతే నడవలేని స్థితి.
 
ఉచితంగా చికిత్స
ఈ స్థితిలో ఉన్న సుమన్‌కు ఉచితంగా శస్త్రచికిత్స చేసి.. నెలరోజుల్లో దాదాపు 45 కిలోల బరువు తగ్గించడం ద్వారా ఆమెకు సరికొత్త జీవితాన్ని ప్రసాదించారు నగరానికి చెందిన డాక్టర్‌ కొంగర రవికాంత్‌. బేరియాట్రిక్‌ సర్జన్‌గా మంచిపేరు సంపాదించుకున్న ఆయన నిరుపేద రోగులకు బేరియాట్రిక్‌ ట్రస్టు ద్వారా ఉచితంగా శస్త్రచికిత్సలు చేస్తున్నారు. విషయం తెలుసుకొని పశ్చిమబెంగాల్‌ మాటియాలా నుంచి సుమన్‌ తల్లిదండ్రులు విజయవాడ వచ్చారు. వారి దయనీయస్థితిని తెలుసుకొని నెలరోజులుగా తన ఆస్పత్రి (ఎండో కేర్‌ హాస్పిటల్‌)లోనే ఉంచి ఉచితంగా శస్త్రచికిత్స చేశారు. ఉచితంగానే మందులు, భోజన వసతి కల్పించారు. ప్రస్తుతం బాలిక సంపూర్ణ ఆరోగ్యంతో వేరొకరి ఆసరా లేకుండా తన పనులు తాను చేసుకోగలుగుతోంది. ఇకపై చదువుపై శ్రద్ధపెట్టి డాక్టర్‌ అవుతానంటోంది సుమన్‌.
 
గురువారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి శస్త్రచికిత్స వివరాలను డాక్టర్‌ రవికాంత్‌ వివరించారు. లెఫ్టిన్‌ అనే హార్మోన్‌ లోపం వల్ల బాలిక బరువు పెరుగుతున్నట్లు గుర్తించారు. కేవలం ద్రవపదార్థాలనే ఆహారంగా అందిస్తూ కొన్ని మాత్రలను ఇవ్వడం ద్వారా కాళ్లు, శరీరంలోకి చేరిన నీటిని యూరిన్‌ రూపంలో బయటకు పోయేలా చేశారు. వారం రోజులకే బాలిక 10 కేజీల బరువు తగ్గింది. ఆరోగ్యం నిలకడగా ఉండటంతో గతనెల 20న గ్యాస్ట్రిక్‌ స్లీవ్‌ శస్త్రచికిత్స చేసి కొంత కొవ్వును తొలగించారు. తగిన ఆహార నియమాలతో ప్రస్తుతం ఆమె బరువు 140 కేజీలకు చేరుకుంది. ఆరునెలల్లో మరో 70 కేజీలు తగ్గే అవకాశం ఉందని డాక్టర్‌ రవికాంత్‌ తెలిపారు. రూ.10లక్షలయ్యే చికిత్సను ఉచితంగా చేశామన్నారు.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...