Jump to content

ఎన్డీయే నుంచి బయటకు


Recommended Posts

అమరావతి: ఎన్డీయే నుంచి బయటకు వచ్చే అంశంపై కీలక నిర్ణయం తీసుకునేందుకు తెలుగుదేశం పొలిట్‌బ్యూరో శుక్రవారం సమావేశం కానుంది. రేపు సాయంత్రం ఐదుగంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన భేటీ కానున్న పొలిట్‌బ్యూరోలో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించి తదుపరి వ్యూహం సిద్ధం చేసుకోనున్నారు.

తెలుగుదేశాన్ని దెబ్బతీసేందుకు మహాకుట్ర జరుగుతోందంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్‌లో నేతల వద్ద ప్రస్తావించాక భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఎన్డీయేలో ఇంకా కొనసాగడం భావ్యంకాదనే అభిప్రాయాన్ని అధికశాతం నేతలు వ్యక్తం చేశారు. జగన్‌, జనసేనలను భాజాపా దగ్గరకు చేర్చుకుని ఆడిస్తున్న నాటకం కుట్రలో భాగమనే నిర్ధారణకు తెలుగుదేశం నేతలు వచ్చారు. కేంద్రంలో పదవులు వదులుకుని రాష్ట్ర ప్రయోజనాలకోసం తాము పోరాడుతుంటే ఆ ఉద్యమాన్ని నీరుగార్చే విధంగా పవన్‌కళ్యాణ్‌తో భాజాపా స్ర్కిప్టు చదివించిందని తెలుగుదేశం అభిప్రాయపడింది. దీనిపై తక్షణమే నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందనే భావనకు అధినేత చంద్రబాబు వచ్చారు. ఇందుకు అనుగుణంగా రేపు సాయంత్రం పొలిట్‌బ్యూరో సమావేశం నిర్వహించి ఎన్డీయే నుంచి తెలుగుదేశం వైదొలుగుతోందనే నిర్ణయాన్ని ప్రకటించనున్నట్లు సమాచారం.

Link to comment
Share on other sites

టీడీపీ పొలిట్‌బ్యూరో శుక్రవారం అత్యవసర సమావేశం కానుంది. ఈ భేటీలో ప్రధానంగా ఎన్డీయే నుంచి బయటకు రావడంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. తమకు వ్యతిరేకంగా అనేక శక్తులను ప్రొత్సహించడంపై టీడీపీ ఆగ్రహంగా ఉంది. తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా రాష్ట్రంలో మహాకుట్ర జరుగుతోందని, ఈ కుట్రలో భాగంగానే నిన్న పవన్ కల్యాణ్ మాట్లాడారని టీడీపీ గట్టిగా భావిస్తోంది. ఇదే అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం ఉదయం మీడియా సమావేశంలో కూడా స్పష్టం చేశారు. ఇదే అంశంపై చంద్రబాబు ఇవాళ అసెంబ్లీలో మాట్లాడే అవకాశం ఉన్నట్లు తెలియవచ్చింది. పవన్ వెనుక బీజేపీ ఉందని ప్రచారం ఉధృతంగా జరుగుతున్న తరుణంలో... బీజేపీ తమకు వ్యతిరేకంగా కుట్ర చేస్తోందని, అటువంటప్పుడు కేంద్రంలో సంకీర్ణంలో ఉండాల్సిన అవసరం ఏంటని టీడీపీలో కొంతమంది నేతలు వ్యాఖ్యానిస్తున్నారు

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...