Jump to content

ఏపీకి అన్ని నీళ్లెందుకు?


KING007

Recommended Posts

ఏపీకి అన్ని నీళ్లెందుకు?
29-01-2018 01:12:45
 
636527919209942189.jpg
  • గోదావరి నుంచి తరలిస్తున్నారు..
  • కృష్ణా నీటివాటాలో కోత పెట్టాలి
  • 512 నుంచి 150 టీఎంసీలకు తగ్గించాలి
  •  తెలంగాణకు 299 టీఎంసీల నుంచి 661 టీఎంసీలకు పెంచాలి
  •  ట్రైబ్యునల్‌లో వాదనకు తెలంగాణ సిద్ధం
  •  సమావేశాలు వచ్చే నెల 22కు వాయిదా
హైదరాబాద్‌, జనవరి 28 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌కు కృష్ణా నీటి కోటాలో భారీగా కోత విధించాలని తెలంగాణ ప్రభుత్వం కోరుతోంది. ఏపీ సర్కారు గోదావరి నుంచి నీటిని కృష్ణా బేసిన్‌కు భారీగా తరలిస్తున్నందున ఆ కోత పెట్టాలంటూ బ్రిజే్‌షకుమార్‌ ట్రైబ్యునల్‌ ముందు వాదించాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఏపీకి కేటాయించిన 512 టీఎంసీల్లో 362 టీఎంసీల కోత విధించి, 150 టీఎంసీలకు పరిమితం చేయాలని కోరనుంది. ఈ మేరకు ట్రైబ్యునల్‌లో సమర్పించడానికి ప్రత్యేక పత్రాన్ని రూపొందించింది. త్వరలో జరిగే ట్రైబ్యునల్‌ సమావేశాల్లో ఇరు రాష్ర్టాలూ తమ వాదనలు వినిపించడానికి సిద్ధమవుతున్నాయి.
 
ఈ క్రమంలోనే.. తెలంగాణకు భారీగా నీటిని తగ్గించాలని కోరుతూ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ట్రైబ్యునల్‌లో అఫిడవిట్‌ దాఖలు చేసింది. ఈ అఫిడవిట్‌లో తెలంగాణలోని భూముల్లో వరి పంట పండదని, ఒక వేళ పండించినా నీరు ఎక్కువగా అవసరం ఉంటుందని, తక్కువ దిగుబడి వస్తుందని ఏపీ తన అఫిడవిట్‌లో పేర్కొంది. ఆ అఫిడవిట్‌పై ఇప్పటికే కౌంటర్‌ను దాఖలు చేసిన తెలంగాణ ప్రభుత్వం.. ఏపీ వాదనలకు దీటుగా సమాధానం ఇవ్వాలని, ట్రైబ్యునల్‌లో బలంగా వాదించాలని నిర్ణయించింది. ఏపీకి నీటి కోటాను ఎందుకు తగ్గించాలో తగు సమాచారాన్ని సమర్పించనుంది.
 
45లో 43 టీఎంసీలివ్వాలి..
ఆంధ్రప్రదేశ్‌లో కృష్ణా నీటిపై ఆధారపడే ప్రాంతాలు తగ్గిపోతున్నాయని తెలంగాణ సర్కారు అంచనా వేస్తున్నది. ముఖ్యంగా గోదావరి నీటిని పట్టిసీమ ద్వారా కృష్ణాకు ఈ ఏడాది ఇప్పటికే సుమారు 100 టీఎంసీలే తరలించారు. పోలవరం ప్రాజెక్టులో భాగంగా పట్టిసీమను చేపట్టినట్టు ఏపీ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. పోలవరం నిర్మాణం ఆలస్యం అవుతున్నందున దీనిని చేపట్టామని చెప్పారు. నిజానికి పోలవరం నుంచి కృష్ణా బేసిన్‌కు 80 టీఎంసీల నీటిని తరలించాల్సి ఉంది. అయితే ఇందులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 45 టీఎంసీలను, కర్నాటకకు 21 టీఎంసీలను మహారాష్ట్రకు 14 టీఎంసీలను కేటాయించాల్సి ఉంది. రాష్ట్ర విభజన జరిగినందున ఉమ్మడి రాష్ట్రానికి ఉద్దేశించిన 45 టీఎంసీలను రెండు రాష్ట్రాలూ పంచుకోవాల్సి ఉంటుంది. ఈ నిబంధన ప్రకారం ఈ 45 టీఎంసీల్లో 43 టీఎంసీలను, దాంతోపాటు మరింత కృష్ణా నీటిని తమ రాష్ర్టానికి కేటాయించాల్సి ఉంటుందని తెలంగాణ కోరనుంది.
  •  ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కృష్ణా నీటిని భారీగా ఇతర బేసిన ్లకు మళ్లిస్తోందని సుమారు 350 టీఎంసీలను కృష్ణా బేసిన్‌లో కాకుండా పెన్నా వంటి ఇతర బేసిన్లకు తరలిస్తున్నారని వాదిస్తోంది.
  •  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ట్రైబ్యునల్‌ 811 టీఎంసీల నికర జలాల్ని కేటాయించగా.. విభజన తర్వాత అందులో 512 టీఎంసీలను ఏపీ, 299 టీఎంసీల నీటిని తెలంగాణ వినియోగించుకుంటునాయి. అయితే ఈ కోటాలో మార్పులు కోరాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. కాగా.. ఈ నెల 31 నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకూ జరగాల్సిన ట్రైబ్యునల్‌ సమావేశాలు వాయిదా పడ్డాయి. వీటిని ఫిబ్రవరి 22వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు ట్రైబ్యునల్‌ నుంచి టి-సర్కారుకు సమాచారం అందింది.
Link to comment
Share on other sites

14 minutes ago, koushik_k said:

This is expected.  Gadkari kuda Tamil nadu ki water ivvali antunnadu e river integration nundi..  God knows what tribunal decides. 

TN lo emiina benfit vastundi emo ani oka trail vesadu.......TN vallu BJP ani vinapadithe vote tho kalcheese laga vunnaru....evadu ina BJP tho tie-up discuss antene vadini Assam chese la vunnaru.....final ga river linking valla use ledu ani aa Gagkari gadu money memu evvamu ani statement echadu....

 

 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...