Jump to content

Police capability


APDevFreak

Recommended Posts

Dongaluni pattukoleru gani common man meeda baaga egurutaru. 

See how they handled this ..no protocol...no backup...no usage of technology and brain.

అదిగో దొంగ.. ఇదిగో పోలీస్‌! 
పోలీసులను హడలెత్తించిన ముఠా 
ఆఖరి దాకా పరుగులు తీసిన ఎస్సై 
రక్షణార్థం మూడు రౌండ్లు కాల్పులు 
మధ్యలోనే తప్పుకొన్న అధికారులు... 
atp-gen7a.jpg

సమయం 1.35 గంటలు.. నగరం గాఢ నిద్రలో ఉంది. ఒక వాహనం గంటకు 140 కి.మీ. వేగంతో పరుగులు తీస్తోంది. దానిని పోలీసు వాహనాలు శరవేగంగా వెంబడిస్తున్నాయి. తెల్లవారుజామున 3.30 గంటల వరకు ఇదే తీరు.. పోలీసు వాహనాలు ఉరుకులు పరుగులు తీశాయి. అలసిన కొన్ని వాహనాలు పక్కకు తప్పుకొన్నాయి. ఆఖరి దాకా ఓ ఎస్సై వెంటాడారు. ఈక్రమంలో ఆయనపై ఆగంతకులు ఎదురుదాడి చేసి.. ఏకంగా పోలీసు వాహనాన్ని, ఓ అంబులెన్స్‌ను ధ్వôసం చేశారు. ప్రాణ రక్షణార్థం మూడు రౌండ్లు కాల్పులు జరిపారు. మొత్తంగా పోలీసులకు ముచ్చెమటలు పట్టించిన చోరుల ముఠా అవలీలగా పరారైంది. సస్పెన్స్‌ థ్రిల్లర్‌ను తలపించేలా ఉన్న ఈ కథేమిటో మీరే చదవండి...

న్యూస్‌టుడే, అనంత నేరవార్తలు

అనంత నగర పోలీసులు, స్థానికుల వివరాల మేరకు... శుక్రవారం అర్ధరాత్రి దాటాక 12.57 గంటల సమయంలో పాతూరులోని బ్రహ్మంగారి దేవాలయం వద్ద ఓ ట్రక్కు ఆగింది. రోడ్డుపై పడుకొని ఉన్న పశువులను ట్రక్కులో ఎక్కించడానికి చోరుల ముఠా ప్రయత్నించింది. కూడలిలో ఉన్న యువకులు ఈ విషయాన్ని గమనించారు. ట్రక్కు వద్దకు వెళ్లి ఎవరు మీరు? పశువులను ఎందుకు ఎక్కిస్తున్నారని ప్రశ్నించారు. దీంతో యువకులకు, చోరుల ముఠా మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అప్రమత్తమైన ముఠా సభ్యులు అక్కడి నుంచి జారుకున్నారు. యువకులు ఈ విషయాన్ని పోలీసులకు చేరవేశారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు.. కర్ణాటక రిజిస్ట్రేషన్‌ నంబరుతో ఉన్న ట్రక్కు (కేఏ 34.. 0701) కోసం నిఘా ఉంచారు. అక్కడి నుంచి ట్రక్కు అరవింద్‌నగర్‌లోకి వెళ్లగా.. గుర్తించి వెంబడించారు. దీనిని గమనించిన దొంగలు పోలీసులపై రాళ్లు రువ్వి పోలీసు వాహనాలను ఢీ కొడుతూ దూసుకెళ్లారు. ముఠా సభ్యులు ట్రక్కులోనే రాళ్లు కూడా ఉంచుకొని కన్పించిన పోలీసులపై రాళ్లు రువ్వడంతో పోలీసులు కొంత వెనుకంజ వేశారు. అనంత ట్రాఫిక్‌, ఒకటో పట్టణం, మూడో పట్టణం, నాలుగో పట్టణ రక్షక్‌ జీపులు ట్రక్కును వెంటాడాయి. ట్రక్కు అరవింద్‌నగర్‌ నుంచి సప్తగిరి కూడలికి చేరుకొని అక్కడి నుంచి కలెక్టరేట్‌ దగ్గరకు వెళ్లింది. కలెక్టరేట్‌ సమీపంలో కుడి మలుపు తీసుకొని వీధిలోకి వెళ్లి తిరిగి ప్రధాన రహదారిపై వచ్చింది. ఈక్రమంలో మూడో పట్టణ పోలీసుల జీపును ఢీ కొట్టింది. అక్కడ నుంచి చోరుల ట్రక్కు వెనక్కి తిరిగి తాడిపత్రి బస్టాండ్‌కు చేరుకుంది. అక్కడ మరో పోలీసు జీపును ఢీ కొనడంతో పోలీసులు ఆగిపోయారు. తాడిపత్రి కూడలి నుంచి గుత్తి రోడ్డువైపు ట్రక్కు పరుగులు తీసింది.

వాహనాలు ఢీ కొడుతూ... 
ఈ సమయంలో నాలుగో పట్టణ ఎస్సై శేఖర్‌ తన రక్షక్‌ వాహనంతో వెంబడించారు. గుత్తి రోడ్డు నుంచి జాతీయ రహదారి మీదుగా తపోవనం చేరుకుంది. తపోవనం వద్ద ట్రక్కును పట్టుకోవడానికి మూడో పట్టణ పోలీసుల జీపు వచ్చింది. కాస్త ముందుకు పోయిన తర్వాత జీపు ట్రక్కును వెంబడించలేకపోయింది. ఈ రహదారి వద్ద ట్రక్కు గంటకు 140 కి.మీ వేగంతో పరుగులు తీసింది. అత్యాధునిక పోలీసు వాహనాలు ట్రక్కు వేగాన్ని అందుకోలేకపోయాయి. అయినా ఎస్సై శేఖర్‌ ట్రక్కును అనుసరిస్తూ వెళ్లారు. తపోవనం కూడలి నుంచి రుద్రంపేట కూడలికి చేరుకొని ఆలమూరు రోడ్డులోకి వెళ్లారు. అక్కడ కి.మీ. దూరం వెళ్లాక దొంగలు ట్రక్కును ఆపారు. ఇదే అదనుగా ఎస్సై శేఖర్‌ దొంగలు దొరికేశారని సంబర పడిపోయారు. అదే ఉత్సాహంతో ట్రక్కు ముందుకు వెళ్లి జీపును ఆపారు. అప్పటికే అప్రమత్తంగా ఉన్న ట్రక్కు డ్రైవర్‌ పోలీసు వాహనాన్ని ఢీ కొట్టి వెళ్లిపోయాడు. దీంతో పోలీసు వాహనం పొలాల్లోకి పడిపోగా... అదృష్టవశాత్తు పోలీసులకు దెబ్బలు తగలలేదు. అక్కడికి వచ్చేసరికి ఎస్సైతోపాటు ఇద్దరు కానిస్టేబుళ్లు మాత్రమే ఉన్నారు.

ఒకే ఒక్కడు... 
అక్కడ రోడ్డుపైకి వచ్చి ఎస్సై శేఖర్‌ నిల్చున్నారు.. అదే మార్గంలో అంబులెన్సు రావడంతో అందులో ఎక్కి ట్రక్కును ఎస్సై ఒక్కరే వెంబడించారు. ఎస్సైతో పాటు అంబులెన్సు డ్రైవర్‌ మాత్రమే ఉన్నాడు. మరో కి.మీ. దూరం వెళ్లాక ట్రక్కు డ్రైవర్‌ వాహనాన్ని ఆపాడు. ఈవిషయాన్ని గమనించిన ఎస్సై ఈసారి ట్రక్కు ముందు వాహనం ఆపకుండా వెనుకనే అంబులెన్సును ఆపారు. ట్రక్కులో ఉన్న దొంగలు అంబులెన్సుపై రాళ్లు రువ్వారు. ఎస్సై వాహనంలో ఉండగా.. ట్రక్కు వేగంగా వెనక్కి వచ్చి అంబులెన్సును ఢీ కొట్టింది. దీంతో ఎస్సై శేఖర్‌ గత్యంతరం లేని పరిస్థితిలో వాహనంపై మూడు రౌండ్లు కాల్పులు జరిపారు. దొంగలు ట్రక్కులో అదే రోడ్డులో కొంతదూరం ముందుకు వెళ్లి వెనక్కి వచ్చారు. అంబులెన్సు స్టార్ట్‌ కాకపోవడంతో ఎస్సై రోడ్డు పక్కనే ఉండిపోయారు. వెనక్కి వచ్చిన ట్రక్కు వేగంగా తిరిగి నగరంలోకి వెళ్లింది. ఈవిషయాన్ని గమనించిన ఎస్సై శేఖర్‌ సెట్‌లో పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడి నుంచి నగరంలోకి వచ్చిన ట్రక్కు మారుతీనగర్‌ నుంచి సవేరా ఆసుపత్రి వైపు వెళుతూ జాతీయ రహదారిపైకి చేరుకుంది. అనంతరం కర్ణాటక వైపు వెళ్లిపోయింది.

భలే పోలీసులు.... 
చోరుల ముఠా అనంత పోలీసులను రెండు గంటలపాటు నగరంలో నాలుగు దిక్కులు తిప్పుతూ ముప్పుతిప్పలు పెట్టించింది. ఈ రెండు గంటల సమయంలో నగర ఠాణాలలోని పోలీసు అధికారులు అందరూ రోడ్డుపైకి వచ్చి ట్రక్కు వెళ్లే దారిపై ఓ లారీని అడ్డుపెట్టినా దొంగలు ట్రక్కు దిగి పారిపోయే వారు. ఈ క్రమంలో దొంగలను పట్టుకోవడం సులభమయ్యేది. ఒక దొంగ దొరికినా అందరినీ గుర్తించడానికి వీలయ్యేది. ఆలమూరు రోడ్డు నుంచి ట్రక్కు వెనక్కి వస్తుందని ఎస్సై శేఖర్‌ చెప్పిన వెంటనే నాలుగో పట్టణ పోలీసులు, ఇతర పోలీసులు ఎవరైనా అప్రమత్తమై రుద్రంపేట ఆలమూరు రోడ్డువైపు ఓ లారీని రోడ్డుకు అడ్డంగా ఆపి ఉంటే దొంగల వాహనం అక్కడే ఆగిపోయేది. నగరంలో ఒక్కో ఠాణాలో ఒక సీఐ, ఐదుగురు చొప్పున ఎస్సైలు పని చేస్తున్నారు. నగరంలోని అన్ని ఠాణాలు కలిపితే 30 మంది ఎస్సైలు ఉన్నారు. వీరు అప్రమత్తమై రోడ్డుపైకి వచ్చినా దొంగలు జిల్లా సరిహద్దులు దాటేవారు కాదు.

ట్రక్కును ప్రత్యేకంగా చేయించారా? 
అనంత పోలీసులు ట్రక్కులో ఉన్న దొంగలను పట్టుకోవడానికి రెండు గంటలు పోరాడారు. ఆఖరికి పట్టుకోలేకపోయారు. ట్రక్కు చోదకుడు అత్యంత అనుభవం ఉన్న వ్యక్తి కావడంతోనే అతివేగంతో నడుపుతూ పోలీసు వాహనాలను ఢీ కొడుతూ వెళ్లిపోయాడు. చోరులు పశువుల తరలింపు కోసమే వాహనాన్ని ప్రత్యేకంగా తయారు చేయించారా? అనే అనుమానాలు వస్తున్నాయి. ట్రక్కు అత్యధిక వేగంగా వెళ్లడంతోపాటు పోలీసు జీపులను ఢీ కొన్నా ఆ వాహనం ఏ మాత్రం దెబ్బ తినలేదు. దీంతో ప్రత్యేకంగా తయారు చేయించారా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గత రెండు నెలలుగా రాత్రుళ్లు పశువులు చోరీకి గురవుతున్నాయని బాధితులు పేర్కొంటున్నారు. ట్రక్కులో వచ్చిన ముఠా సభ్యుల వేషధారణ పరిశీలిస్తే బిహార్‌కు చెందిన వారుగా ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. బలమైన దేహదారుఢ్యం కలిగి ఉండటంతో ఒక వ్యక్తే పశువును ముందు భాగాన మెడను పట్టుకొని ట్రక్కులోకి లాక్కెళుతున్నారు. దీనిని బట్టి పరిశీలిస్తే కర్ణాటక దొంగలు కాకపోవచ్చనే అనుమానాలు వస్తున్నాయి.

ముఠా దొరికేనా?... 
ముఠా వచ్చిన వాహనంపై కేఏ 34.. 0701గా నంబరు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వాహనం వేగంగా వెళుతుండటంతో నంబరు సరిగా కనిపించలేదు. బ్రహ్మంగారి ఆలయం వద్ద ఆపిన చోట చిత్రంలో కర్ణాటక నంబరు ఉన్నట్లు గుర్తించారు. అయితే ముఠా సభ్యులు ఏదైనా ఇతర నంబరును వేసుకొని వచ్చి ఉండవచ్చు. పశువులను చోరీ చేయడానికి పక్కా ప్రణాళికతో వచ్చిన ముఠా ఆ వాహనం నంబరునే వేసుకొని వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. దీంతో పోలీసులు కర్ణాటకకు చెందిన పేరు మోసిన దొంగల చిత్రాలతో సీసీ ఫుటేజీలను సరిపోల్చి చూస్తున్నారు. 7 లేక 8 మంది ముఠాలో సభ్యులు ఉన్నట్లు పోలీసులు ప్రాథమికంగా తేల్చారు. ట్రక్కులో ముందు భాగాన ముగ్గురు కూర్చొని ఉండగా వెనుక భాగంలో నలుగురు లేక ఐదుగురు ఉన్నట్లు సీసీ ఫుటేజీల ద్వారా తెలుస్తోంది.

సింహాలు ఎక్కడ?... 
నగరంలో కొందరు ఎస్సైలు ఒకటో సింహం, రెండో సింహం, మూడో సింహం అంటూ సామాజిక మాద్యమాల్లో పోస్టులు పెట్టి ప్రచారం చేస్తున్నారు. సామాన్యులపై ప్రతాపం చూపుతూ సింహాలుగా చెప్పుకొంటున్నారు. వీరి అనుయాయులుగా ఉంటున్న కానిస్టేబుళ్లు సామాజిక మాధ్యమాలలో విశేషంగా పోస్టులు పెడుతూ అధికారులను సింహాలుగా చిత్రీకరిస్తున్నారు. ఇలాంటి సింహాలు క్లిష్ట పరిస్థితుల్లో ఎక్కడికి వెళ్లాయని నగర వాసులు చర్చించుకుంటున్నారు. సింహాలు కరడుగట్టిన చోరుల ముఠాలపై ప్రతాపం చూపితే బాగుంటుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు

Link to comment
Share on other sites

42 minutes ago, abhi said:

Too bad they should haves atleast try to shoot tires of vehicles to stop 

Disappointing point enti ante vallu aa van lo venakki vocharu alamuru road nundi high way kinda town lo ki into maruthi nagar. akkade aa high way kinda 4th town police station untadi. kaneesam akkada station bayataki vochi road meeda evaina baricades addam pettaleka poyaru mana policelu. telivi leni sannasulu anipisthadi mana policelu. :D

Link to comment
Share on other sites

15 minutes ago, LuvNTR said:

Disappointing point enti ante vallu aa van lo venakki vocharu alamuru road nundi high way kinda town lo ki into maruthi nagar. akkade aa high way kinda 4th town police station untadi. kaneesam akkada station bayataki vochi road meeda evaina baricades addam pettaleka poyaru mana policelu. telivi leni sannasulu anipisthadi mana policelu. :D

 

Link to comment
Share on other sites

1 hour ago, LuvNTR said:

Disappointing point enti ante vallu aa van lo venakki vocharu alamuru road nundi high way kinda town lo ki into maruthi nagar. akkade aa high way kinda 4th town police station untadi. kaneesam akkada station bayataki vochi road meeda evaina baricades addam pettaleka poyaru mana policelu. telivi leni sannasulu anipisthadi mana policelu. :D

Yeah Marie intha metagha vuntharu Anie expect cheyaledhu 

Link to comment
Share on other sites

2 hours ago, abhi said:

Too bad they should haves atleast try to shoot tires of vehicles to stop 

Ha avunu..

First time Van mundu parking.

next Ambulance lo chasing

Van back parking.

Malli last lo bihar gang based on the physique and experienced in driving.

Luckily culprits daggara guns levu, other wise the police would have been dead by now.

 

 

 

Link to comment
Share on other sites

Inka pattukoledu.

 

పశువుల దొంగలు దొరికేనా! 
అనంతకు పలు ముఠాలు 
గత చోరీలపైనా పోలీసుల ఆరా 
atp-gen7a.jpg

అనంత నేరవార్తలు, న్యూస్‌టుడే: అనంతలో పశువుల దొంగలు పోలీసులను హడలెత్తించిన విషయం విదితమే. పోలీసులపై తిరగబడి చోరీలకు యత్నించే ముఠాలు కర్ణాటక నుంచి అనంతలోకి వస్తున్నట్లు గుర్తించారు. ఈనెల 27న అర్దరాత్రి పశువుల దొంగతనానికి వచ్చిన ముఠా బళ్లారి పరిసర ప్రాంతాలకు చెందినదిగా పోలీసులు ప్రాథమికంగా తేల్చారు. అయితే ఆరోజు నగరంలోకి వచ్చిన ముఠాలు ఎన్ని అనే అంశంపై పోలీసులు స్పష్టంగా పేర్కొనడం లేదు. రెండు, మూడు ముఠాలు నగరంలో సంచరించినట్లు అనుమానాలు వస్తున్నాయి. అదే రోజు రాత్రి గుత్తి రోడ్డులో వాహనంలో పశువులను ఎత్తుకెళ్లిన దృశ్యాలు సీసీ కెమెరాలకు దొరికినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని పోలీసులు ధ్రువీకరించడం లేదు.

పోలీసులు గుర్తించిన వాహనం బళ్లారి రోడ్డు వైపుగా వెళ్లినట్లు సమాచారం. వాహనంపై ఉన్న నంబరు ట్రాక్టరు నంబరుగా గుర్తించడంతో పోలీసులకు ఎలాంటి ఆధారం లభించలేదు. అనంత పోలీసులు సర్వశక్తులు ఒడ్డి ఉంటే జిల్లా సరిహద్దులు దాటేలోగా వాహనాలను పట్టుకునే వారని సీనియర్‌ పోలీసు అధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆ రోజు రాత్రి కొందరు అధికారులు పట్టుసడలించినట్లు విమర్శలు వస్తున్నాయి. పోలీసు వాహనాలు వేగంగా వెళ్లలేపోయాయి. ఆ ఉద్దేశంతోనే ఉన్నతాధికారులు రోడ్డు భద్రత వాహనాలతో పాటు గతంలో ఎస్పీ వినియోగిస్తున్న ఓ క్వాలీస్‌ వాహనాన్ని నగర ఠాణాకు కేటాయించారు. గతంలో ఇదే తరహాలో కర్ణాటక ముఠాలు మరణాయుధాలతో ప్రవేశించగా అనంత పోలీసులు పట్టుకున్నారు. 2015లో కరుడు గట్టిన నేరస్థుడు,  బళ్లారికి చెందిన అనూప్‌సింగ్‌ శ్రీనివాసనగర్‌లో చోరీకి వచ్చాడు. ఆ సమయంలో అనూప్‌సింగ్‌ను గస్తీ విధుల్లో ఉన్న పోలీసులను గుర్తించి వెంబడించారు. ఆ సమయంలో సింగ్‌ గాలిలోకి కాల్పులు జరిపాడు. ఎట్టకేలకు పోలీసులు పట్టుకున్నారు. జిల్లా సరిహద్దులోని చెక్‌పోస్టులలో సిబ్బందిని అప్రమత్తం చేయడంతోనే ఇలాంటి ముఠాలకు అడ్డుకట్ట వేయడం సాధ్యమవుతుంది.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...