Jump to content

Amaravati IT sector


sonykongara

Recommended Posts

  • Replies 75
  • Created
  • Last Reply
మైటెక్‌ సిటీగా మంగళగిరి
నేడు 16 ఐటీ కంపెనీలను ప్రారంభించనున్న మంత్రి లోకేష్‌
ఎన్‌ఆర్‌టీ టెక్‌ పార్కులో 13 మంగళగిరి ఆటోనగర్‌ ఐటీ పార్కులో 3
తక్షణం 600 మందికి ఉపాధి
ఏడాదిలో మరో 1600 మందికి
మంగళగిరి - న్యూస్‌టుడే
16ap-main3a.jpg

మరావతి రాజధాని ప్రాంతమైన మంగళగిరిని మైటెక్‌ సిటీగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యాచరణ కార్యరూపం దాలుస్తోంది. ఈ క్రమంలో మంగళగిరి ఎన్‌ఆర్‌టీ టెక్‌ పార్కు(13), ఆటోనగర్‌ ఐటీ పార్కు(3)ల్లో 16ఐటీ కంపెనీలను ఐటీ మంత్రి లోకేష్‌ బుధవారం ప్రారంభిస్తున్నారు. వీటి ఏర్పాటుతో తక్షణం 600 మందికి ఉపాధి లభిస్తుంది. ఏడాదిలో మరో 1600 మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తారు. సాంకేతిక విద్య చదివిన రాష్ట్ర యువత ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా రాజధాని అమరావతిలోనే అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. మంగళగిరి ఆటోనగర్‌ ఐటీ పార్కులో ఇప్పటికే మూడు ఐటీ కంపెనీలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. వీటిలో 500 మంది పని చేస్తున్నారు.

ఉద్యోగుల రక్షణకు ప్రత్యేక పోలీసు పెట్రోలింగ్‌
ఐటీ ఉద్యోగులకు రవాణా సదుపాయం కోసం ఏపీఎస్‌ ఆర్‌టీసీతో ప్రభుత్వం సంప్రదించి ఐటీ పార్కు వద్ద బస్‌స్టాప్‌ ఏర్పాటు చేసింది. దీంతో ఆటోనగర్‌ ఐటీ పార్కు వరకు విజయవాడ నుంచి బస్సులు నడుపుతున్నారు. అదేవిధంగా ఉద్యోగుల రక్షణ కోసం  ప్రత్యేకంగా పోలీసు పెట్రోలింగ్‌ వాహనం నిరంతరం గస్తీ తిరిగేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఉద్యోగులు, ఐటీ సంస్థల్లో శిక్షణకు రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చే వారికి హాస్టల్‌ వసతి కోసం అపార్టుమెంట్లలో ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు.

పరిశోధన అభివృద్ధికి వేద ఐఐటీ
తాజగా ఐటీలో పరిశోధన అభివృద్ధికి మరో భారీ సంస్థను రాజధానిలో ఏర్పాటు చేస్తున్నారు. గుంటూరు విద్యానగర్‌లో ఈ సంస్థ ఏర్పాటు కాబోతోంది. వేద ఐఐటీగా దీన్ని పిలుస్తారు. ఇక్కడ వీఎల్‌ఎస్‌ఐ, చిప్‌ డిజైనింగ్‌ వంటి పరిశోధనలు జరుగుతాయి.

కామర్స్‌ పట్టభద్రుల కోసం
రాజధానిలో వస్తున్న ఐటీ సంస్థలతో పాటు ఐటీకి అనుబంధంగా స్టేట్‌ సాఫ్ట్‌ ఫైనాన్స్‌ కామర్స్‌ కంపెనీని ఏర్పాటు చేస్తున్నారు. గన్నవరంలోని మేధా టవర్స్‌లో దీన్ని నెలకొల్పుతున్నారు. కామర్స్‌ పట్టభద్రులను ఎంపిక చేసి వెయ్యి మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు. ఇప్పటికే ఈ సంస్థ కోసం 250 మందికి శిక్షణ ఇస్తున్నారు.

విద్యార్థులకు కార్యశాల
ఐటీ సంస్థల ప్రారంభోత్సవం సందర్భంగా ఎన్‌ఆర్‌టీ మంగళగిరిలో ఒక వర్క్‌షాపును నిర్వహిస్తోంది. రాష్ట్రంలోని 1500 నుంచి 2వేల మంది విద్యార్థులు హాజరయ్యేలా ఏర్పాట్లు చేశారు. ఐటీ అభివృద్ధి, శిక్షణ, ఉపాధి అవకాశాలు, ఐటీ రిసెర్చ్‌, వెంచర్‌ క్యాపిటల్‌ వంటి అంశాలపై మంత్రి లోకేష్‌ విద్యార్థులకు వివరిస్తారని ఏపీ ఎన్‌ఆర్‌టీ సీఈవో రవి వేమూరి తెలిపారు. హైదరాబాద్‌లో ఐటీ ప్రాంతం హైటెక్‌ సిటీగా పేరుగాంచిన విధంగా మంగళగిరిలో ఐటీ ప్రాంతం మైటెక్‌ సిటీగా అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు.

16ap-main3b.jpg
Link to comment
Share on other sites

మరావతికి ఇన్‌వెకాస్‌!
18-01-2018 01:54:37
 
  • సెమీ కండక్టర్ల తయారీలో ప్రపంచంలో ఈ సంస్థది రెండో స్థానం
అమరావతి, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): అమరావతిలో ప్రఖ్యాత సెమీ కండక్టర్ల తయారీ సంస్థ ఇన్‌వెకాస్‌ ఏర్పాటు కానుంది. ప్రపంచంలోని సెమీ కండక్టర్ల తయారీ కంపెనీల్లో ఇన్‌వెకాస్‌ రెండో స్థానంలో ఉంది. ఈ కంపెనీలో మూడు వేల మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. ఇన్‌వెకా్‌సకు అనుబంధంగా ఉండే వేద ఐఐటీ అమరావతిలో ఎం.టెక్‌ కోర్సును ప్రారంభించనుంది.
 
ఈ కోర్సుకు జేఎన్‌టీయూ కాకినాడ గుర్తింపు ఇవ్వనుంది. ప్రపంచస్థాయిలో సినీ ప్రేమికులను అలరించిన బాహుబలి చిత్రానికి గ్రాఫిక్స్‌ను అందించింది వేద ఐఐటీనే. బుధవారం మంత్రి నారా లోకేశ్‌ సమక్షంలో ఇన్‌వెకాస్‌ చైర్మన్‌ ఆంజనేయులు, ఏపీఎన్‌ఆర్‌టీ సీఈవో సాంబశివరావు మధ్య వేద ఐఐటీ ఏర్పాటుకు సంబంధించిన ఒప్పందం కుదిరింది. గన్నవరం మేథా టవర్స్‌లో స్టేట్‌ స్ర్టీట్‌ అనే కంపెనీని ఆన్‌లైన్‌లోనే ప్రారంభించారు.
 
 
కామర్స్‌ విద్యార్థులకు తగిన శిక్షణ ఇచ్చి ఉద్యోగాల్లోకి తీసుకునే ఈ కంపెనీలో వెయ్యిమందికి ఉపాధి లభించనుంది. హెచ్‌సీఎల్‌తోపాటు ఈ రెండు కంపెనీల రాక అమరావతి వాతావరణాన్ని మార్చివేయనుంది. ఈ సందర్భంగా ఇన్‌వెకాస్‌ చైర్మన్‌ ఆంజనేయులు మాట్లాడుతూ... మూడుతరాలతో కలిసి పనిచేసే అవకాశం తనకు కలిగిందన్నారు. తాను పల్నాడులో పుట్టానని, ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రి అయినప్పుడు కాకినాడలో అమరావతి ఎలక్ర్టానిక్స్‌ అనే కంపెనీ పెట్టామని తెలిపారు.
 
 
ఈసీ టీవీ, కోణార్క్‌ టీవీలను ఉత్పత్తి చేసే వాళ్లమని చెప్పారు. ఆ తర్వాత ముంబై, అక్కడి నుంచి అమెరికా వెళ్లి కంపెనీ ప్రారంభించానన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక భారత్‌కు సెమీ కండక్టర్ల తయారీ టెక్నాలజీ అవసరం అంటే హైదరాబాద్‌ వచ్చామన్నారు. ఆ తర్వాత లోకేశ్‌ ఫోన్‌ చేసి అమరావతికి రావాలని కోరడంతో ఇక్కడకు వచ్చినట్లు తెలిపారు. తమ వేద ఐఐటీలో చదివిన వారికి తామే ఉద్యోగ అవకాశం కల్పిస్తామని చెప్పారు. మరోవైపు మంగళగిరి ఐటీ పార్కు నుంచే మంత్రి లోకేశ్‌ గుంటూరులో ఏర్పాటు చేసిన డిజిటల్‌ ఇంక్‌ అనే ఐటీ కంపెనీని ఆన్‌లైన్‌లో ప్రారంభించారు. ఐటీ, ఐవోటీ అంశాల్లో ఇది శిక్షణ ఇస్తుంది.
Link to comment
Share on other sites

టార్టప్‌లకు 100 కోట్ల నిధి
18-01-2018 01:53:29
 
636518372105726441.jpg
  • టై-అమరావతి, ఆంధ్రా ఏంజెల్స్‌ ప్రారంభం
అమరావతి, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ వినియోగంలో ఆంధ్రప్రదేశ్‌ అగ్రభాగాన ఉందని ఐటీ, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేశ్‌ చెప్పారు. స్టార్ట్‌పలకు సహాయ సహకారాలను అందించే టై- అమరావతి చాప్టర్‌, ఆంధ్రా ఏంజెల్స్‌ను మంత్రి లోకేశ్‌ బుధవారం విజయవాడలో ప్రారంభించారు. వచ్చేనెలలో స్టార్టప్‌ పాలసీని తీసుకొస్తామన్నారు. కొత్త ఆవిష్కరణలకు వేదికలైన స్టార్ట్‌పలను ప్రోత్సహించేందుకు రూ.100 కోట్ల నిధిని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. కొత్త ఆవిష్కరణలు, కంపెనీలు వస్తే రాష్ట్రంలో మార్కెటింగ్‌కు ఎలాంటి ఢోకా ఉండదన్నారు. మరోవైపు... గుంటూరు రింగ్‌ రోడ్డులో డిజిటల్‌ లింక్‌ సాఫ్ట్‌వేర్‌ సంస్థను మంత్రులు చినరాజప్ప, నక్కా ఆనందబాబు ప్రారంభించారు.
Link to comment
Share on other sites

ఏపీలో ఐవోటీ ఎక్సలెన్స్‌ కేంద్రం
మంత్రి నారా లోకేష్‌తో భేటీలో హెచ్‌పీ సంస్థ ఉపాధ్యక్షురాలి వెల్లడి
ఈనాడు - అమరావతి
25ap-state1a.jpg

ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ ఎక్సలెన్స్‌ కేంద్రం ఏర్పాటుకు హ్యూలెట్‌ ప్యాకార్డ్‌ (హెచ్‌పీ) సంస్థ ముందుకొచ్చింది. దావోస్‌ పర్యటనలో ఉన్న ఐటీ, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి నారా లోకేష్‌తో గురువారం జరిగిన భేటీలో ఆ సంస్థ ఉపాధ్యక్షురాలు ఆనా పింజుక్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. ఐవోటీలో తమకు ఎంతో సామర్థ్యముందని, ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని ఆమె పేర్కొన్నారు. అమెరికా పర్యటనకు వచ్చినప్పుడు తమ కంపెనీని సందర్శించాలని మంత్రిని ఆహ్వానించారు. ఏపీలో రియల్‌టైమ్‌ గవర్నెన్స్‌, సెన్సార్లు, డ్రోన్ల వినియోగం గురించి ఆమెకు లోకేష్‌ వివరించారు. అనంతరం సీఐఐ ఆధ్వర్యంలో ‘నూతన ప్రపంచీకరణలో ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి’ అనే అంశంపై జరిగిన సదస్సులో కేంద్ర మంత్రి సురేష్‌ ప్రభుతో కలిసి మంత్రి పాల్గొన్నారు. సేవల రంగంలో వస్తున్న విప్లవాత్మక మార్పులకు, అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ప్రైవేటు కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుని విశ్వవిద్యాలయాలు, అకాడమీలు ఏర్పాటు చేస్తున్నామని లోకేష్‌ తెలిపారు. మ్యూసిగ్మా కంపెనీతో కలిసి డేటా సైంటిస్టులను తీర్చిదిద్దేందుకు అకాడమీ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఆరోగ్య సేవల రంగంలో పెట్టుబడులకు విస్తృత అవకాశాలున్నాయని, రాష్ట్ర ప్రభుత్వంతో కలసి పనిచేయాలని, పూర్తి సహకారం అందిస్తామని అబ్రాజ్‌ క్యాపిటల్‌ మేనేజింగ్‌ పార్ట్‌నర్‌ కీటో డి బోయర్‌ను లోకేష్‌ కోరారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంతో కలసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని, త్వరలో పూర్తిస్థాయి ప్రణాళికతో మీ ముందుకు వస్తామని బోయర్‌ పేర్కొన్నారు.

లోకేష్‌ అమెరికా పర్యటన 28 నుంచి
రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా మంత్రి నారా లోకేష్‌  ఈ నెల 28 నుంచి ఫిబ్రవరి 5 వరకు అమెరికాలో పర్యటించనున్నారు.దావోస్‌లో ఉన్న అయన నేరుగా అమెరికా వెళ్తారు. ప్రభుత్వ ఐటీ సలహాదారు జె.ఎ.చౌదరి, ఎన్‌ఆర్‌టీ వ్యవహారాల సలహాదారు రవికుమార్‌ వేమూరు, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఫైబర్‌ లిమిటెడ్‌ సలహాదారు వి.హరిప్రసాద్‌, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి కె.విజయానంద్‌, ఆంధ్రప్రదేశ్‌ ఆర్థికాభివృద్ధి బోర్డు(ఏపీఈడీబీ) సీఈవో జాస్తి కృష్ణకిశోర్‌, ఆర్టీజీ సీఈవో బాబు.ఎ మంత్రి వెంట ఉంటారు. వీరి అమెరికా పర్యటనకు అనుమతిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీచేసింది.

Link to comment
Share on other sites

ఆంధ్రకు అలీబాబా!
చంద్రబాబుతో అలీబాబా క్లౌడ్‌ అధ్యక్షుడు సైమన్‌ హూ భేటీ
  రాష్ట్రంలో డేటాసెంటర్‌  ఏర్పాటుకు హామీ
  పారిశ్రామిక నగరం నెలకొల్పేందుకు ఆనంద్‌ మహీంద్రాకు సీఎం ఆహ్వానం
  రాష్ట్రంలో కార్యకలాపాలు చేపట్టాలని ‘రహేజా’కు విజ్ఞప్తి
   పారిశ్రామిక ప్రముఖులతో ముఖ్యమంత్రి సమావేశాలు
ఈనాడు - అమరావతి
25ap-main4a.jpg

ఆంధ్రప్రదేశ్‌లో డేటా సెంటర్‌ ఏర్పాటు చేస్తామని చైనాకి చెందిన క్లౌడ్‌ కంప్యూటింగ్‌ దిగ్గజ సంస్థ అలీబాబా క్లౌడ్‌ ప్రకటించింది. ఆ సంస్థ అధ్యక్షుడు సైమన్‌ హూ ఇతర పారిశ్రామిక ప్రముఖులు దావోస్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబుతో బుధవారం రాత్రి సమావేశమయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను సీఎం వివరించారు. ఏపీని సందర్శించాల్సిందిగా ఆహ్వానించారు. ఇ-కామర్స్‌ రంగంలో అంతర్జాతీయ ఖ్యాతి గడించిన అలీబాబా క్లౌడ్‌ భారతదేశంలో మొదటి డేటాసెంటర్‌ను ముంబయిలో ఏర్పాటు చేస్తోంది. రెండో కేంద్రాన్ని ఈ ఏడాది చివరకు ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేస్తామని చంద్రబాబుకి సైమన్‌ హూ హామీ ఇచ్చారు. మరింత త్వరగా ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కోరారు. ‘‘మీ ఉత్సాహం, వేగవంతమైన నిర్ణయాలు నన్నెంతో ముగ్ధుణ్ని చేశాయి. మీ అభిమానిగా మార్చేశాయి. త్వరలోనే డేటా సెంటర్‌ ఏర్పాటు చేస్తాం’’ అన్నారు. ‘‘మీ సహకారంతో అమరావతిని స్మార్ట్‌ టెక్నలాజికల్‌  సిటీగా రూపొందించాలన్నది మా అభిమతం. సాంకేతికత వినియోగంలో ఇప్పటికే దేశంలో అగ్రస్థానంలో ఉన్న మా రాష్ట్రంతో అలీబాబా చేతులు కలిపి, సహకరిస్తే అద్భుతాలు సాధించగలం’’ అని చంద్రబాబు అన్నారు. వ్యవసాయంలో సూక్ష్మ పోషకాలు, క్రిమి సంహారకాలు, రసాయన ఎరువుల్ని అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉత్పత్తి చేయాలని తాము వాంఛిస్తున్నామని ఈ దిశగా ఎనలిటిక్స్‌ రంగంలో సహకారం కోరుతున్నామని తెలిపారు. షాంఘైలో తాము ఇదే తరహా సేవలందిస్తున్నామని చెప్పిన సైమన్‌ హూ, త్వరలోనే తమ బృందంతో ఆంధ్రప్రదేశ్‌కు వస్తామని, ఏయే రంగాల్లో ఏ మేరకు సహకారం అందించగలమో అధ్యయనం చేస్తామని తెలిపారు. షాంఘైలో తమ సంస్థ కార్యకలాపాల పరిశీలనకు చైనా రావాలని చంద్రబాబును ఆహ్వానించారు.

సెజ్‌ తరహాలో ప్రపంచశ్రేణి పారిశ్రామిక నగరం.. సెజ్‌ తరహాలో ప్రపంచశ్రేణి పారిశ్రామిక నగరం నిర్మించాలనుకుంటున్నామని మహీంద్రా గ్రూపు సంస్థల అధిపతి ఆనంద్‌ మహీంద్ర చెప్పగా, దాన్ని తమ రాష్ట్రంలోనే ఏర్పాటు చేయాలని, అన్ని విధాలా సహకరిస్తామని సీఎం వివరించారు. అమరావతిలో నడిపేందుకు పర్యావరణహిత ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీలో సహకరించాలని కోరారు. నైపుణ్య శిక్షణ ప్రక్రియలో భాగస్వాములవ్వాలని విజ్ఞప్తి చేశారు. అంతకు ముందు ఒక ప్యానల్‌ చర్చలో మీ విజన్‌ ఏంటి అని చంద్రబాబుని ఆనంద్‌ మహీంద్రా ప్రశ్నించారు. ‘‘మా రాష్ట్రాన్ని ప్రపంచానికే ఒక ఆదర్శంగా తీర్చిదిద్దడం నా కల’’ అని ముఖ్యమంత్రి బదులిచ్చారు. ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులు తెచ్చేందుకు తాము చొరవ తీసుకుంటామని, అన్ని అవకాశాలను పరిశీలిస్తామని జాన్సన్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ ప్రతినిధి యుల్లి జాన్సన్‌ తెలిపారు. హైదరాబాద్‌ మైండ్‌స్పేస్‌ తరహాలో అమరావతి, విశాఖ, హిందూపురంలలో ఆఫీస్‌ స్పేస్‌ భవంతుల నిర్మాణం చేపట్టాలని రహేజా గ్రూప్‌ని చంద్రబాబు కోరారు.

మా రాష్ట్రం మీకు అనుకూలం: శానిటరీవేర్‌ రంగంలో పేరుగాంచిన లిగ్జిల్‌ గ్రూప్‌ సీఈఓ కిన్యా సెటోతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. ఆక్వా సిరామిక్‌ రంగంలో ప్రపంచంలోనే అత్యాధునిక సాంకేతికత తమ సొంతమని మూడు దశల్లో రూ.1500 కోట్ల పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉన్నామని, భారత్‌లో వివిధ ప్రాంతాలు పరిశీలిస్తున్నామని కిన్యా సెటో తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ మీకు అన్ని విధాలా భేషుగ్గా ఉంటుందని, పెట్టుబడులతో వస్తే అన్ని విధాలా సహకరిస్తామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. తమకు నైపుణ్యం కలిగిన కార్మికులు అవసరమవుతారని కిన్యా సెటో చెప్పగా, ఆంధ్రప్రదేశ్‌ నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా శిక్షణ ఇప్పిస్తామని సీఎం పేర్కొన్నారు.

25ap-main4c.jpg

అమరావతికి తోడ్పడండి: ప్రసిద్ధ వైమానిక సంస్థ ‘డస్సాల్ట్‌’ గ్రూపు అధ్యక్షుడు, సీఈఓ బెర్నార్డ్‌ ఛార్లెస్‌... తాము రూపొందించిన సాంకేతిక పరిజ్ఞానాల్ని వినియోగించి గత సంవత్సరం వైమానిక రవాణాలో ప్రమాదాల్లేకుండా నివారించామని తెలిపారు. అమరావతి నగర నిర్మాణంలో తాము అలాంటి సాంకేతికతే అవసరమని భావిస్తున్నామని, సహకరించాలని ముఖ్యమంత్రి కోరారు.

* టిల్మాన్‌ గ్లోబల్‌ హోల్డింగ్స్‌ (టీజీహెచ్‌) సంస్థ ఛైర్మన్‌, సీఈఓ సంజీవ్‌ అహుజా, బిజినెస్‌ అప్లికేషన్స్‌లో వరల్డ్‌ లీడర్‌గా ఉన్న ‘శాప్‌’ ప్రతినిధులు కూడా ముఖ్యమంత్రితో సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో కర్మాగారం ఏర్పాటు చేయాల్సిందిగా అల్ఘానిమ్‌ ఇండస్ట్రీస్‌ సీఈఓ ఒమర్‌ అల్ఘానిమ్‌ను సీఎం ఆహ్వానించారు. తమ బృందాన్ని పంపించేందుకు ఒమర్‌ అంగీకరించారు.

* ఫైజర్‌ కంపెనీ నిమోనియా నివారణకు రూపొందించిన వ్యాక్సిన్‌కు తక్షణం అనుమతులు మంజూరు చేస్తామని ఫైజర్‌ వ్యాక్సిన్స్‌ ప్రెసిడెంట్‌ సుశాన్‌ సిల్బర్‌మ్యాన్‌కు ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.

25ap-main4b.jpg

ముగిసిన సీఎం దావోస్‌ పర్యటన
ముఖ్యమంత్రి చంద్రబాబు బృందం నాలుగు రోజుల దావోస్‌ పర్యటన గురువారంతో ముగిసింది. ఆయన శుక్రవారం ఉదయానికి విజయవాడ చేరుకుంటారు. సీఎంతో మంత్రులు యనమల రామకృష్ణుడు, నారా లోకేష్‌, ప్రభుత్వ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్‌, ఉన్నతాధికారులు దావోస్‌ పర్యటనకు వెళ్లారు.

Link to comment
Share on other sites

  • 2 weeks later...

రాజధాని ప్రాంతంలో 
మరో 12 ఐటీ కంపెనీలు 
సుమారు 1300 ఉద్యోగాల కల్పన 
ఈ నెల 17న ప్రారంభం 
రావడానికి సిద్ధంగా మరో 20 సంస్థలు
ఈనాడు అమరావతి: రాష్ట్రంలో మరో 12 చిన్న, మధ్య తరహా ఐటీ కంపెనీలు ఏర్పాటవుతున్నాయి. ఈ నెల 17న వీటిని ఐటీ శాఖ మంత్రి లోకేష్‌ ప్రారంభిస్తున్నారు. ఇవన్నీ రాజధాని ప్రాంతంలోనే వస్తున్నాయి. మంగళగిరి సమీపంలోని ఏపీ ఎన్‌ఆర్‌టీ టెక్‌పార్కులో 9 కంపెనీలు, మంగళగిరిలోని పైకేర్‌ ఐటీ పార్కులో మరో మూడు కంపెనీలు ఏర్పాటవుతున్నాయి. ఇవన్నీ ఏపీ ఎన్‌ఆర్‌టీ సంస్థ చొరవతో వస్తున్న కంపెనీలు. వీటిలో 90 శాతం అమెరికా కంపెనీలు, బ్రిటన్‌కు చెందినవి ఒకటి రెండు, మన దేశంలో వేరే ప్రాంతంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న కంపెనీ ఒకటి ఉన్నాయని ఏపీఎన్‌ఆర్‌టీ సొసైటీ అధ్యక్షుడు రవి వేమూరి ‘ఈనాడు’కి తెలిపారు. ఈ కంపెనీలు రావడంతో తక్షణం 5-6 వందల మందికి ఉద్యోగాలు లభిస్తాయని, ఈ కంపెనీలు పూర్తి స్థాయిలో పనిచేయడం మొదలు పెట్టాక సుమారు 1300 మందికి ఉపాధి లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ 12 కంపెనీలతో కలిపి ఇంత వరకు ఏపీ ఎన్‌ఆర్‌టీ ద్వారా రాష్ట్రానికి వచ్చిన కంపెనీల సంఖ్య 53కి చేరినట్టు ఆయన తెలిపారు. వీటిలో ఎక్కువ కంపెనీలు విశాఖ, విజయవాడ, మంగళగిరి ప్రాంతాల్లో ఏర్పాటైనట్టు ఆయన వెల్లడించారు. మరో 20 వరకు కంపెనీలు ఇక్కడికి రావడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు.
 

Link to comment
Share on other sites

హెచ్‌సీఎల్‌కు 28.98 ఎకరాలు
06-02-2018 08:58:25

కలెక్టర్‌కు ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు
విజయవాడ (గన్నవరం): ఎట్టకేలకు గన్నవరం మండలం కేసరపల్లిలోని ఏపీఎస్‌ఆర్టీసీ జోనల్‌ ట్రైనింగ్‌ అకాడమీ స్థలాన్ని హెచ్‌సీఎల్‌ కంపెకి ప్రభుత్వం కేటాయించింది. ఆర్‌ఎస్‌ నంబర్‌ 20/3, 4, 8, 16/4లోని 28.98 ఎకరాల స్థలానికి తక్షణమే అడ్వాన్స్‌ పోజిషన్‌ ఇవ్వాలంటూ జిల్లా కలెక్టర్‌ లక్ష్మీకాంతంకు ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వచ్చాయి. గతంలోనే ప్రభుత్వం ఆ స్థలాన్ని హెచ్‌సీఎల్‌కు కేటాయించింది. అయితే ప్రస్తుతం అందులో ఆర్టీసీ జోనల్‌ ట్రైనింగ్‌ అకాడమీ ఉండటంతో ప్రత్యామ్నాయ స్థలం కోసం అఽధికారులు అన్వేషించారు. ఈ నేపథ్యంలో గన్నవరం మండలం సూరంపల్లి శివారున విజయవాడ - నూజివీడు ఆర్‌ అండ్‌ బీ రహదారికి సమీపంలో ఆర్‌ఎస్‌ నంబర్‌ 191-2లో 7.61 ఎకరాలు, ఆర్‌ఎస్‌ నంబర్‌ 194లో 13.31 ఎకరాలు, ఆర్‌ఎస్‌ నంబర్‌ 196-1, 2లో 4.10 ఎకరాలను (మొత్తం 25.02 ఎకరాలు) ఆర్టీసీకి కేటాయించాలంటూ కలెక్టర్‌కు ప్రభుత్వం సూచించింది. అయితే కేసరపల్లిలోని అకాడమీలో ఆర్టీసీ భవనాలు ఉన్నందున, కొత్త భవన నిర్మాణాల కోసం రూ.29.40 కోట్లను కూడా ప్రభుత్వం కేటాయించింది. తక్షణమే ఆర్టీసీ స్థలాన్ని ఏపీఐఐసీ ద్వారా హెచ్‌సీఎల్‌ కంపెనీకి అడ్వాన్స్‌ పోజిషన్‌ ఇవ్వాలంటూ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ మన్మోహన్‌సింగ్‌ ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. ఇదిలావుండగా, స్థలాన్ని తీసుకున్న మూడేళ్లలోగా హెచ్‌సీఎల్‌ కంపెనీ కార్యకలాపాలను చేపట్టాలని ప్రభుత్వం సూచించింది. అందుకు భిన్నంగా వ్యవహరిస్తే భూమిని తిరిగి వెనక్కి తీసుకుంటామని ప్రభుత్వం ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఒకవేళ ఆర్టీసీ అకాడమీ స్థలంలో చెరువులు, కుంటలు ఉంటే వాటిని పూడ్చివేయవద్దని కూడా తెలియజేసింది. ప్రస్తుతం ఉన్న రోడ్లు, అంతర్గత రహదారులను యధావిధిగా కొనసాగించేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్‌కు ప్రభుత్వం సూచించింది.

Link to comment
Share on other sites

ఐటీ హబ్ @మంగళగిరి
10-02-2018 10:07:10

ఐటీ సంస్థల కోసం మరో 30 ఎకరాలు!
పదిరోజుల్లో ఏపీఐఐసీకి స్వాధీనం కానున్న భూమి
మరిన్ని ప్రభుత్వ భూముల కోసం గాలింపు
సైబరాబాద్‌గా మారనున్న మంగళగిరి ప్రాంతం
మంగళగిరి మరో సైబరాబాద్‌గా మారనుంది. ఇప్పటికే 22 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటుచేసిన ఐటీ పార్కుకు తోడు మరో 30 ఎకరాల్లో ఐటీపార్కు-2 ప్రాజెక్టును చేపట్టేందుకు రంగం సిద్ధం చేశారు. అంతేకాదు పట్టణంలో ఖాళీగా వున్న ప్రభుత్వ భూముల్లో ఐటీ ప్రాజెక్టులను పెద్దఎత్తున ఏర్పాటు చేయించి మంగళగిరిని ఐటీ కేంద్రంగా తీర్చిదిద్దాలని ఐటీశాఖ మంత్రి నారా లోకేష్‌ పట్టుదలగా ఉన్నారు. ఈ ప్రణాళికను కార్యరూపంలోకి తెచ్చేందుకు మంగళగిరి పరిసర ప్రాంతాలలో ఖాళీగా వున్న ప్రభుత్వ భూములను గుర్తించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.
 
మంగళగిరి: రాజధాని అమరావతి ఏరియాలోని అమరావతి, మంగళగిరితోపాటు గన్నవరం ప్రాంతాలను ఐటీ కేంద్రాలుగా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర ఐటీశాఖ మంత్రి నారా లోకేష్‌ పదేపదే ప్రకటిస్తున్నారు. చెప్పిందే తడవుగా ఐటీరంగం అభివృద్ధికి వేగంగా చర్యలు తీసుకుంటున్నారు. మంగళగిరిలో ఇప్పటికే ఏపీఐఐసీకి చెందిన 22 ఎకరాల్లో ఐటీ పార్కును నెలకొల్పి పై డాటా, పై కేర్‌, వీ సాఫ్ట్‌ వంటి దిగ్గజ సంస్థలను మంత్రి లోకేష్‌ ఏర్పాటు చేయించారు. తాజాగా మంగళగిరి బైపాస్‌ వెంబడి ఓ ప్రైవేటు భవన సముదాయయంలో ఏపీ ఎన్నార్టీ పార్కు పేరిట మరో 16 ఐటీ సంస్థలను ప్రారంభింపజేశారు. ఈ వేగాన్ని కొనసాగిస్తూ మంగళగిరిలో మరో రెండొందల ఎకరాల విస్తీర్ణంలో పెద్దఎత్తున ఐటీ రంగాన్ని విస్తరించాలని మంత్రి లోకేష్‌ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ క్రమంలో పట్టణంలోని బైపాస్‌ రోడ్డు వెంబడి వున్న 95 ఎక రాల అసైన్డు భూమిని గుర్తించారు. ఈ భూమి ఇప్పటికే సగం విస్తీర్ణంలో ఆక్రమణలకు గురైవుంది. ప్రస్తుతం మిగిలివున్న యాభై ఎకరాల్లో సుమారు 30 ఎకరాలను ఐటీ పార్కు-2 కోసం వినియోగించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది.
 
పైకేర్‌తో ప్రారంభం
ఇక్కడి ఆటోనగర్‌ వెంబడి ఏర్పాటుచేసిన ఐటీ పార్కులో మొట్టమొదటి ఐటీ సంస్థ పై కేర్‌ ప్రారంభోత్సవ కార్యక్రమంలోనే మంగళగిరిలో 200 ఎకరాల విస్తీర్ణంలో ఐటీ రంగాన్ని ఏర్పాటు చేస్తామని మంత్రి లోకేష్‌ ప్రకటించారు. బైపాస్‌కు తూర్పుగా వున్న ఏరియాలో.. అవసరమైతే భూ సేకరణ చేసైనా యువతకు ఉపాధిని కల్పించే లక్ష్యంతో పెద్దఎత్తున ఐటీసంస్థలను నెలకొల్పేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మంత్రి లోకేష్‌ ఆశించిన విధంగా భూసేకరణ చేయకుండానే అటువైపుగా వున్న ప్రభుత్వ ఖాళీ అసైన్డు భూములను అధికారులు గుర్తించే పనిలో పడ్డారు. ఈ ప్రయత్నాల్లో రత్నాలచెరువు ఏరియాలో వున్న 95 ఎకరాల అసైన్డుభూమిని గుర్తించి ప్రభుత్వానికి నివేదించారు. సదరు భూమిలో ప్రస్తుతానికి యాభై ఎకరాల మేర మాత్రమే ఖాళీగా వుంది. మిగతా భూమిలో ఆక్రమిత నివాసాలు వున్నాయి. ఖాళీగా వున్న యాభై ఎకరాల్లో ఓ 30 ఎకరాలను ఐటీ పార్కు-2 కోసం కేటాయించేందుకు రంగం సిద్ధం చేశారు. ప్రభుత్వ ఉద్దేశాన్ని గమనించిన కొందరు తెలివిగా గత కొద్ది రోజులుగా ఆ ప్రాంతంలో షెడ్లను నిర్మించడం ఆరంభించారు. ఈ షెడ్లను రెవెన్యూ అధికారులు రెండుమూడు రోజులుగా తొలగిస్తున్నారు. మరో వారం పది రోజుల్లో 30 ఎకరాల భూమిని ఐపీఐఐసీకి స్వాధీనం చేసేందుకు రెవెన్యూ అధికారులు సంసిద్ధమైపోయారు. అనంతరం ఏపీఐఐసీ ఇక్కడ ఐటీ పార్క్‌-2 వెంచర్‌ను నెలకొల్పుతుంది.
 
భూసేకరణకు వెళ్లకుండానే..
ఐటీ శాఖమంత్రి లోకేష్‌ ఆదేశాల మేరకు మంగళగిరిలో మరిన్ని ఐటీ సంస్థలను ఏర్పాటు చేయించేందుకు అవసరమైన భూములను సమీకరించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. భూసేకరణకు వెళ్లకుండానే అందుబాటులో వున్న ఖాళీ ప్రభుత్వ భూములను వినియోగించుకోవాలని అఽధికారగణం భావిస్తోంది. ఈ ప్రయత్నాల్లో భాగంగా గుం టూరు ఛానల్‌ దాటాక తెనాలిరోడ్డు వెంబడి ఇరువైపులా వున్న ఖాళీ అసైన్డు భూములను గుర్తించారు. ఈ భూములు సుమారు వందెకరాలకు పైబడి వున్నాయి. ఈ భూముల విషయాన్ని అధికారులు ఇప్పటికే కలెక్టరు దృష్టికి తీసుకెళ్లారు. ఈ భూముల్లో పెద్దఎత్తున ఐటీపార్కును అభివృద్ధి చేయవచ్చునని అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదించారు.

Link to comment
Share on other sites

http://www.andhrajyothy.com/artical?SID=535788

సిద్ధమవుతున్న ఏపీఐఐసీ హెడ్‌క్వార్టర్స్‌
13-02-2018 07:40:53

మంగళగిరి ఐటీ పార్కులో రాష్ట్ర ప్రధాన కార్యాలయం
జీ+10 భవన సముదాయం
రూ.90 కోట్ల వ్యయంతో పూర్తయిన సివిల్‌ పనులు
వచ్చే నెలలో శుభారంభం
మంగళగిరి: రాష్ట్ర పరిశ్రమల మౌలిక సదుపాయాల కల్పనాసంస్థ (ఏపీఐఐసీ) ప్రధాన కార్యాలయం మంగళగిరిలో కొలువుదీరబోతుంది. రాష్ట్ర విభజనానంతరం ఆ సంస్థ ప్రధాన కార్యాలయాన్ని విజయవాడ గురునానక్‌రోడ్డులోని ఓ ప్రైవేటు అద్దెభవనంలో నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ప్రధాన కార్యాలయానికి సొంత భవనాన్ని సమకూర్చుకోవాలన్న ఆలోచనతో మంగళగిరి కేంద్రంగా సదరు కార్యాలయ భవనాన్ని నిర్మించాలని ఆ సంస్థ నిర్ణయించింది. ఇందుకోసం మంగళగిరి ఆటోనగర్‌ పక్కనే సరికొత్తగా 22.17 ఎకరాల విస్తీర్ణంలో ఐటీ పార్కు పేరుతో వేసిన వెంచర్‌లో తమ సంస్థ ప్రధాన కార్యాలయం కోసం జీ+10 భవన సముదాయ నిర్మాణాన్ని చేపట్టింది. ఐటీ పార్కులో కామన్‌ ఫెసిలిటీస్‌ సెంటరు కోసం ఉద్దేశించిన 2.26 ఎకరాల్లో ఈ బహుళ అంతస్థుల భవన నిర్మాణాన్ని చేపట్టారు. రూ.90 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ భవన నిర్మాణాన్ని ఏపీఐఐసీ శరవేగంతో పూర్తిచేసింది. ఏడాది పూర్తికాకుండనే నిర్మాణ పనులను పూర్తిచేయడం విశేషంగానే చెప్పుకోవాలి.
 
రెండు లక్షల చదరపు  అడుగల విస్తీర్ణం
జీ+10 రూపంలో మొత్తం రెండు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం వచ్చేలా ఈ భవన నిర్మాణం చేపట్టారు. ఇందులో పార్కింగ్‌ నిమిత్తం రెండు సెల్లార్లను ఏర్పాటుచేశారు. భవన సముదాయంలో పై మూడు అంతస్థులను ఏపీఐఐసీ తన కార్యాలయాలకోసం వినియోగించుకోనుంది. మిగిలిన ఎనిమిది అంతస్థులను పరిశ్రమల శాఖ, ఇతర ప్రభుత్వ కార్యాలయాలు, మరికొన్ని ఐటీ సంస్థల కోసం అద్దెలకు ఇవ్వనుంది. ఇంచుమించు సివిల్‌ పనుల మొత్తాన్ని పూర్తి చేసుకున్న ఈ భవన సముదాయానికి ప్రస్తుతం తుది మెరుగులను అద్దుతున్నారు. మరో నెల రోజుల్లో అన్నిరకాల పనులను పూర్తి చేయించి మార్చి మొదటివారంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేత భవనాన్ని ప్రారంభింపజేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
 
రెండో భవనం కోసం ఏర్పాట్లు
ప్రస్తుతం ఐటీ పార్కు కామాన్‌ ఫెసిలిటీస్‌ సెంటరులో నిర్మించిన ప్రస్తుత జీ+10 భవన సముదాయానికి పక్కనే మరో నూతన భవన సముదాయాన్ని నిర్మించేందుకు ఏపీఐఐసీ సన్నద్ధమవుతోంది. మంగళగిరి ఏరియాను ఐటీ కేంద్రంగా అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం పట్టుదలగా ఉండడంతో ఐటీ సంస్థల ఏర్పాటుకు
వీలుగా మరో బహుళ అంతస్తుల భవన సముదాయాన్ని నిర్మించి అద్దెలకు ఇవ్వాలని ఏపీఐఐసీ భావిస్తోంది. ఈ మేరకు డీపీఆర్‌ కోసం కన్సల్టెన్సీని కూడా నియమించారు. లక్ష చదరపు అడుగుల విస్తీర్ణం వచ్చేలా ఈ నూతన భవనాన్ని నిర్మించాలనిప్రతిపాదించింది. ఇప్పటికే నిర్మాణం పూర్తి చేసుకున్న తొలి భవన సముదాయం ప్రారంభోత్సవంతో పాటే రెండో భవన నిర్మాణానికి శంకుస్థాపన జరిపించాలని భావిస్తోంది.

Link to comment
Share on other sites

ఏపీలో కంపెనీ ఏర్పాటు చేస్తాం: ఫస్ట్ అమెరికన్ ప్రతినిధులు
15-02-2018 12:29:16

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కంపెనీ ఏర్పాటుకు ఫస్ట్ అమెరికా(ఇండియా) కంపెనీ ముందుకు వచ్చింది. గురువారం ఉదయం మంత్రి నారా లోకేష్‌తో ఫస్ట్ అమెరికా (ఇండియా) కంపెనీ వైస్ ప్రెసిడెంట్ రఘు, ప్రతినిధులు సమావేశమయ్యారు. ల్యాండ్ రికార్డ్స్ బ్లాక్ చైన్ టెక్నాలజీ వేదికపైకి తీసుకొస్తున్నామని ఈ సందర్భంగా లోకేష్ తెలిపారు. రాష్ట్రంలో ఫైబర్ గ్రిడ్ ఏర్పాటు చేశామన్నారు. ఏపీలో కంపెనీ ఏర్పాటు చేయాలని మంత్రి లోకేష్ కోరారు. దీనిపై కంపెనీ ప్రతినిధులు స్పందిస్తూ విజయవాడలో కంపెనీ ఏర్పాటు చేసి కార్యకలాపాలు విస్తరిస్తామని తెలిపారు. టైటిల్, ఇన్సూరెన్స్ సర్వీసెస్‌ను ఫస్ట్ అమెరికన్ కంపెనీ అందిస్తోంది.

Link to comment
Share on other sites

నవ్యాంధ్రలో మెల్లమెల్లగా ఐటీ రంగం జోరందుకుంటోంది... ఐటీ కంపెనీలతో పాటు... వాటిని పెట్టాలనుకునేవారికి పెట్టుబడులు సమకూర్చే సంస్థలు, వాటిలో పనిచేయాలనుకునే యువతకు శిక్షణ ఇచ్చే ఏజెన్సీలు... ఇలా అన్నింటితో కూడిన సమగ్రమైన ‘ఐటీ వాతావరణం’ వస్తోంది... రాజధాని అమరావతి ఏరియాలోని అమరావతి, మంగళగిరితోపాటు గన్నవరం ప్రాంతాలను ఐటీ కేంద్రాలుగా అభివృద్ధి చెందుతున్నాయి.. మంగళగిరిలో ఇప్పటికే ఏపీఐఐసీకి చెందిన 22 ఎకరాల్లో ఐటీ పార్కును నెలకొల్పి పై డాటా, పై కేర్‌, వీ సాఫ్ట్‌ వంటి దిగ్గజ సంస్థలు రూపుదిద్దుకున్నాయి... తాజాగా మంగళగిరి బైపాస్‌ వెంబడి ఎన్‌ఆర్‌టీ టెక్‌ పార్కు(13), ఆటోనగర్‌ ఐటీ పార్కు(3)ల్లో 16ఐటీ కంపెనీలను ఐటీ మంత్రి లోకేష్‌ ప్రారంభించారు...


 


అయితే ఇక్కడ ఐటి కంపెనీల స్థాపన కోసం డిమాండ్ ఎక్కువుగా ఉంది... దీంతో, ఈ వేగాన్ని కొనసాగిస్తూ మంగళగిరిలో మరో రెండొందల ఎకరాల విస్తీర్ణంలో పెద్దఎత్తున ఐటీ రంగాన్ని విస్తరించాలని మంత్రి లోకేష్‌ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ క్రమంలో పట్టణంలోని బైపాస్‌ రోడ్డు వెంబడి వున్న 95 ఎక రాల అసైన్డు భూమిని గుర్తించారు. ఈ భూమి ఇప్పటికే సగం విస్తీర్ణంలో ఆక్రమణలకు గురైవుంది. ప్రస్తుతం మిగిలివున్న యాభై ఎకరాల్లో సుమారు 30 ఎకరాలను ఐటీ పార్కు-2 కోసం వినియోగించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది...

రాష్ట్రంలో ఐటీ విస్తరణకు రెండు, మూడు మార్గాల్లో కార్యక్రమాలు నడుస్తున్నాయి. ఐటీ శాఖ నేరుగా కంపెనీలను తీసుకొస్తుండడం... రెండోది ఏపీ ఎన్నార్టీ చొరవతో ఐటీ సంస్థలు రావడం! ఏపీఎన్నార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఏర్పాటుచేసిన నాలుగు ఐటీ టవర్లు ఇప్పటికే కంపెనీలతో నిండిపోయాయి... విజయవాడ ఆటోనగర్‌లో ఇండ్‌వెల్‌ టవర్స్‌, మహానాడు రోడ్‌లోని కే-బిజినెస్‌ స్పేసెస్‌, గన్నవరం సమీపంలోని మేథా టవర్స్‌, అదేవిధంగా మంగళగిరి ఐటీ పార్కులోని మేథా టవర్స్‌... ఈ నాలుగూ ఐటీ కంపెనీలతో కళకళలాడుతున్నాయి. ఇప్పుడు 60 వేల చదరపు అడుగులతో ఉన్న ఏపీఎన్నార్టీ టెక్‌పార్కు కూడా సాఫ్ట్‌వేర్‌ కంపెనీలతో నిండుతోంది. కొత్తగా వచ్చే సంస్థలకోసం గన్నవరంతోపాటు, విజయవాడ - గుంటూరు మధ్య ఉన్న పలు భారీ భవనాలను ఐటీ శాఖ, ఏపీఎన్నార్టీ అద్దెకు తీసుకుంటున్నాయి. సగం అద్దె ఐటీశాఖ భరిస్తుండగా, సగం అద్దెను మాత్రం సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు చెల్లించేలా ప్రోత్సాహకం ఇస్తున్నారు.

Link to comment
Share on other sites

అమరావతి రాజధాని ప్రాంతంలో హిందుస్థాన్‌ కార్పొరే షన్‌ లిమిటెడ్‌ (హెచ్‌సీఎల్‌) కంపెనీ వచ్చిన సంగతి తెలిసిందే... గన్నవరం దగ్గర కేసరపల్లిలో ఎల్‌అండ్‌టీ హై టెక్‌ సిటీ పక్కన 28.72 ఎకరాలను హెచ్‌సీఎల్‌కు ఇవ్వటానికి అధికారికంగా ఒప్పందం కుదిరింది.... రాజాధనిలో ఈ మొట్టమొదటి భారీ ఐటీ ప్రాంగణం ఏర్పాటుకు పనులు ప్రారంభమయ్యాయి... రాజధాని పరిధిలో ఇప్పటికే 37కు పైగా ఐటీ సంస్థలు ఏర్పాటైనప్పటికీ అవన్నీ 500లోపు ఉద్యోగులు ఉన్న కంపెనీలే. తొలిసారి వేల మంది ఉద్యోగులకు ఉపాధిని కల్పించే పెద్ద ఐటీ ప్రాంగణం గన్నవరం విమానాశ్రయం ఎదురుగా దుర్గాపురంలో కేటాయించిన స్థలంలో రూపుదిద్దుకుంటోంది.


 


రెండు దశల్లో 28 ఎకరాలలో ఏర్పాటు చేస్తున్న ఈ ప్రాంగణం దక్షిణ భారతదేశంలోనే అత్యంత కీలకమైనదిగా మారనుంది... రాజధాని పరిధిలో ఇప్పటికే 37కు పైగా ఐటీ సంస్థలు ఏర్పాటైనప్పటికీ అవన్నీ 500లోపు ఉద్యోగులు ఉన్న కంపెనీలే. తొలిసారి వేల మంది ఉద్యోగులకు ఉపాధిని కల్పించే పెద్ద ఐటీ ప్రాంగణం గన్నవరం విమానాశ్రయం ఎదురుగా దుర్గాపురంలో కేటాయించిన స్థలంలో రూపుదిద్దుకుంటోంది. రెండు దశల్లో 28 ఎకరాలలో ఏర్పాటు చేస్తున్న ఈ ప్రాంగణం దక్షిణ భారతదేశంలోనే అత్యంత కీలకమైనదిగా మారనుంది.

కళంకారీ నేత, కొండపల్లి బొమ్మలను ప్రతిబింబించేలా అమరావతి బౌద్ధ శిల్ప నిర్మాణ శైలిలో ఈ నూతన భవంతుల్ని నిర్మించనున్నారు. గన్నవరం విమానాశ్రయం సమీపంలో నిర్మించనున్న ఈ భవనాలను విమానాలు దిగే సమయంలో ఆకాశంలో నుంచి చూస్తే ఈ నిర్మాణాలు అద్భుతంగా కనిపిస్తాయి... ఇది ఇలా ఉండగా, మేథాటవర్స్‌లో రెండు లక్షల చదరపు అడుగులు ఉండగా 70వేల వరకూ ఇంకా ఖాళీ ఉంది... దీనిలో త్వరలో హెచ్‌సీఎల్‌ స్టేట్‌స్ట్రీట్‌ సంస్థ తమ సంస్థను నెలకొల్పబోతోంది. ఈ సంస్థలో వెయ్యి మంది వరకూ ఉపాధి దొరకనుంది. ఈ సంస్థ ఏర్పాటు చేస్తే మేధాటవర్స్‌ పూర్తిగా నిండిపోతుంది.

Link to comment
Share on other sites

ఏపీకి ఫేస్‌బుక్ గ్రీన్‌సిగ్నల్
20-02-2018 20:35:46

అమరావతి: మంత్రి లోకేశ్‌ను ఫేస్‌బుక్ ప్రతినిధులు కలిశారు. ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని చెప్పారు. ప్రతి ఒక్కరికి ఇంటర్నెట్‌ సదుపాయానికి కృషి చేస్తామన్నారు. గ్రామాల్లో మహిళలు తయారు చేసే ఉత్పత్తుల ఆన్‌లైన్‌ మార్కెటింగ్‌కు డిజిటల్‌ ట్రైనింగ్‌ ఇస్తామని అన్నారు. అధునాతన టెక్నాలజీతో రూపొందించిన ప్రొడక్స్ట్‌ని వినియోగించి ఏపీలో ప్రైటెట్‌ ప్రాజెక్ట్స్‌ నిర్వహిస్తామని వెల్లడించారు. నూతన టెక్నాలజీలు అన్ని ఏపీలో పైలెట్‌ ప్రాజెక్ట్స్‌గా చేయాలని ఈ సందర్భంగా ఫేస్‌బుక్‌ ప్రతినిధులను మంత్రి నారా లోకేష్‌ కోరారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు ఇంటర్నెట్‌ ప్రాథమిక హక్కుగా మారబోతుందన్నారు. ప్రతి ఇంటికి ఇంటర్నెట్ సదుపాయం కల్పిస్తామన్నారు. ఏపీలో ఫేస్‌బుక్ విస్తరణకు ఫైబర్ గ్రిడ్ ఉపయోగపడుతుందని చెప్పారు. గ్రామాల్లో తయారు చేసే ఉత్పత్తుల ఆన్‌లైన్‌ మార్కెటింగ్‌కు ఫేస్‌బుక్‌ సహకారం అవసరమని మంత్రి లోకేష్‌ అన్నారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...