Jump to content

Amaravati IT sector


sonykongara

Recommended Posts

వీరపనేని గూడెంలో మరో పారిశ్రామిక లేఅవుట్‌
21-02-2018 09:22:21

విజయవాడ: వీరపనేనిగూడెంలో మరో పారిశ్రామిక లే అవుట్‌ సిద్ధమౌతోంది. రెవెన్యూశాఖ నుంచి స్వాధీనం చేసుకున్న 100 ఎకరాల భూముల్లో యాభై ఎకరాలను ఏపీఐఐసీ ఇండస్ర్టియల్‌ పార్క్‌గా విభజించి లే అవుట్‌ వేసింది. ఇందులో 70 నుంచి 80 వరకు ప్లాట్లుగా విభజించనున్నట్టు సమాచారం. మిగిలిన యాభై ఎకరాలను ఒక బిట్‌గా ఉంచాలని నిర్ణయించారు. ఈ బిట్‌లో ప్రభుత్వం సూచించిన మేరకు చర్యలు చేపట్టాలని ఏపీఐఐసీ నిర్ణయించింది. ఐటీపార్కు కోసం పలుసంస్థలు ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. దీంతో ఐటీకి కానీ, ఐటీయేతర అవసరాల కోసం కానీ ఈ స్థలాన్ని కేటాయించాలని ఏపీఐఐసీ అధికారులు నిర్ణయించారు. ఇప్పటికే ఈ స్థలం సమీపంలోనే 81ఎకరాలలో ఇండస్ర్టియల్‌ పార్క్‌ (ఐపీ)ని అభివృద్ధి చేశారు. అమరావతి ఇండస్ర్టియల్‌ అసోసియేషన్‌ నేతృత్వంలో హైదరాబాద్‌ నుంచి 71 సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎ్‌సఎంఈ)కు సంబంధించిన యూనిట్లు ఏర్పాటుకానున్నాయి. ఇప్పటికే ఆయా యూనిట్లకు ప్లాట్లను కేటాయించారు. ఏపీఐఐసీ, అమరావతి అసోసియేషన్‌ల మధ్యన సేల్‌డీడ్‌ కూడా జరిగింది. తాము పొందిన స్థలాలలో అమరావతి అసోసియేషన్‌ తరపున ముందుకు వచ్చిన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు యూనిట్లను ఏర్పాటు చేయటమే ఇక మిగిలి ఉంది.

Link to comment
Share on other sites

  • Replies 75
  • Created
  • Last Reply

ఐటీ టవర్‌కు పచ్చజెండా
21-02-2018 09:40:42

కేసరపల్లి హైటెక్‌ సిటీలో రెండో నిర్మాణానికి పర్యావరణ అనుమతులు
స్పందించని సీఆర్డీఏ
రెండు నెలల క్రితమే శంకుస్థాపన చేసిన మంత్రి నారా లోకేష్‌
(ఆంధ్రజ్యోతి, విజయవాడ): కేసరపల్లి ఎల్‌అండ్‌టీ - ఏపీఐఐసీ హైటెక్‌ సిటీలో రెండవ ఐటీ టవర్‌ నిర్మాణానికి పర్యా వరణ అనుమతులు వచ్చాయి. ఐటీ సెజ్‌లో భాగంగా గతంలో హైటెక్‌ సిటీలో మొదటిగా నిర్మించిన ‘మేథ’ టవర్‌ నిర్మాణానికి ఎలాంటి అడ్డంకులు ఎదురు కాకుండానే పర్యావరణ అనుమతులు వచ్చాయి. దీంతో రెండవ టవర్‌ నిర్మాణానికి కూడా పర్యావరణ ఇబ్బదులు ఎదురుకావని ముందుగా భావించినట్టుగానే జరిగింది. టవర్‌ నిర్మాణానికి పర్యావరణ అనుమతులు వచ్చినా సీఆర్‌డీఏ అనుమతులు మాత్రం రావాల్సి ఉంది. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్‌ రెండు నెలల క్రితం ఐటీ టవర్‌కు శంకుస్థాపన చేశారు. ఈ క్రమంలో ఆరు నెలల్లో భవన నిర్మాణం చేపట్టాలని సూచించారు. ఎల్‌అండ్‌టీ భాగస్వామ్య సంస్థ అయిన ఏస్‌ అర్బన్‌ అనే సంస్థ దీని నిర్మాణ పనులు చేపడుతోంది. కాంట్రాక్టు సంస్థ ముందస్తుగానే సన్నద్ధమైంది. ఐటీ టవర్‌ నిర్మాణానికి అనుమతుల కోసం సీఆర్‌డీఏకు దరఖాస్తు చేసుకుని మెటీరియల్‌ను సిద్ధం చేసింది.
 
సీఆర్‌డీఏ నుంచి ఇంకా అనుమ తులు రాలేదు. దీంతో ఐటీ టవర్‌ పనుల్లో జాప్యం నడుస్తోంది. మంత్రి నారా లోకేష్‌ నిర్దేశించిన విధంగా సకాలంలో పనులు జరిగే పరిస్థితి కనిపించటం లేదు. దీనికి సంబం ధించి ఏపీఐఐసీ అధికారులు తక్షణం రంగంలోకి దిగి వీలైనంత త్వరగా సీఆర్‌డీఏ స్థాయిలో సమస్యను పరిష్కరించటానికి చొరవ చూపాల్సి ఉంది.

Link to comment
Share on other sites

మారనున్న ‘కృష్ణా’ స్వరూపం
27-02-2018 08:19:07

ఐటీలో రూ.517కోట్ల పెట్టుబడులు
11,600 మందికి ఉపాధి అవకాశాలు
భాగస్వామ్య సదస్సులో ఒప్పందాలు
విజయవాడ: కృష్ణా స్వరూపం... విజయవాడ రూపం మారనున్నది. ఇప్పటికే విజయవాడ చుట్టుపక్కల నిర్మాణ రంగం పరుగులు తీస్తుండగా, గన్నవరం ఐటీ హబ్‌ హంగులు మరింత వేగంగా పరుగులు తీయనున్నాయి. వివిధ భారీ పరిశ్రమలకు సంబంధించి రూ.1450 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి ఆయా సంస్థలు ముందుకు రాగా, ఐటీ రంగంలో రూ.517 కోట్లు పెట్టుబడులతో నాలుగు సంస్థలు ముందుకు అడుగు వేశాయి. విశాఖపట్నంలో మూడు రోజులపాటు జరిగిన భాగస్వామ్య సదస్సులో ఈ ఒప్పందాలు జరిగాయి. ఛానల్‌ సాఫ్ట్‌ కంప్యూటర్‌ సర్వీసెస్‌ రూ.2కోట్ల పెట్టుబడులు పెట్టి, 300 మందికి ఉపాధి కల్పించనుంది. ఇప్పటికే గొల్లపూడి కాల్‌సెంటర్‌ను ప్రారంభించిన కార్వే మరో డేటా మేనేజ్‌మెంట్‌ సర్వీసెస్‌ను రూ.390కోట్లతో ప్రారంభించనుంది. దీనివల్ల పదివేల మంది ఉద్యోగవకాశాలు లభిస్తాయి. ఎస్పీ పైన్‌నెట్‌ సంస్థ రూ.75కోట్ల పెట్టుబడితో కార్యకలాపాలు మొదలుపెట్టనుంది. దీంతో వెయ్యి మంది నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుంది. రూ.50కోట్లతో హాడియా మాండ్‌స్టార్‌ సంస్థ 300 మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తుంది. మొత్తంగా అటు భారీ పరిశ్రమలు, ఇటు ఐటీ సంస్థలకు సంబంధించి రూ.1967 ఒప్పందాలు భాగస్వామ్య సదస్సులో జరగడం విశేషం. త్వరలోనే ఈ పరిశ్రమలన్నీ కార్యకలాపాలను ప్రారంభించనున్నాయి. వీటితో బెజవాడ స్వరూపం పూర్తిగా మారిపోతున్నదని అధికారవర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

Link to comment
Share on other sites

మేథ టవర్‌లో.. హెచ్‌సీఎల్‌
06-03-2018 07:19:55
 
636559175960017602.jpg
  • తాత్కాలికంగా అద్దె భవనంలో ఏర్పాటు
  • 65 వేల చదరపు అడుగుల స్థలాన్ని తీసుకున్న హెచ్‌సీఎల్‌
  • వారంలో ఇంటీరియర్‌ పనులు..
  • మరికొద్ది రోజుల్లో కార్యకలాపాలు ప్రారంభం
  • భవన నిర్మాణం పూర్తయ్యే వరకు ఇక్కడే..
 
విజయవాడ: మరికొద్ది రోజులలోనే హిందుస్తాన్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(హెచ్‌సీఎల్‌ ) టెక్నాలజీస్‌ కార్యకలాపాలు కేసరపల్లిలోని అద్దె భవనంలో ప్రారంభం కాబోతున్నాయి. భవన నిర్మాణం పూర్తి కావటానికి ఎంత లేదన్నా ఏడాది సమయం పడుతుంది కాబట్టి.. ముందుగా తమ సంస్థ కార్యకలాపాలు ప్రారంభించాలని హెచ్‌సీఎల్‌ సంస్థ నిర్ణయించింది. ‘మేథ’ టవర్‌లో 65 వేల చదరపు అడుగుల స్థలాన్ని హెచ్‌సీఎల్‌ సంస్థ అద్దెకు తీసుకుంది. వారం రోజుల్లో హెచ్‌సీఎల్‌ సంస్థ ఇంటీరియర్‌ పనులు ప్రారంభించబోతోంది. ఇంటీరియర్‌ పనులు పూర్తి కాగానే.. తన కార్యకలాపాలను ప్రారంభిస్తుంది.
 
గన్నవరంలో హెచ్‌సీఎల్‌ ఏర్పాటు చేయబోయే ప్రాజెక్టును స్పెషల్‌ ఎకనమిక్‌ జోన్‌ (సెజ్‌) కిందకు తీసుకు రావటానికి ఆ సంస్థ ప్రయత్నాలు చేస్తోంది. హెచ్‌సీఎల్‌ సంస్థ సెజ్‌ కింద ప్రాజెక్టును ఏర్పాటు చేయాలనుకుంటున్న విషయాన్ని ఆంధ్రజ్యోతి కథనంగా ప్రచురించింది. ఏపీఐఐసీ నుంచి ఇందుకు కావాల్సిన డాక్యుమెంట్లను హెచ్‌సీఎల్‌ సంస్థ తీసుకుంటోంది. హెచ్‌సీఎల్‌కు గన్నవరంలో ఏపీఐఐసీ కేటాయించిన 27 ఎకరాలలో హైరైజ్‌ భవన నిర్మాణానికి శ్రీకారం చుడుతుంది. వారికి కేటాయించిన స్థలంలో పాత భవనాలు, చెట్ల తొలగింపు, నేల చదును వంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. భవన నిర్మాణ పనులు ప్రారంభించటానికి శంకుస్థాపన కార్యక్రమాన్ని ఈ నెలలోనే నిర్వహించటానికి హెచ్‌సీఎల్‌ సిద్ధం చేస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు చేత శంకుస్థాపన చేయటానికి ఏర్పాట్లు చేసుకుంటోంది.
 
అశోక్‌ లేల్యాండ్‌తో సేల్‌ అగ్రిమెంట్‌ !
మల్లవల్లిలో బస్‌ బాడీ బిల్డింగ్‌ యూనిట్‌కు అప్పగించిన 75 ఎకరాలకు సంబంధించి అశోక్‌ లేల్యాండ్‌ సంస్థతో ఏపీఐఐసీ అధికారులు సోమవారం సేల్‌ డీడ్‌ ప్రక్రియను ప్రారంభించారు. నూజివీడు సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయంలో ఈ ప్రక్రియ ప్రారంభమైంది. సేల్‌ డీడ్‌ రాసుకోవటం పూర్తయింది. ఏపీఐఐసీ తరపున జడ్‌ఎం శరత్‌బాబు, అశోక్‌ లేల్యాండ్‌ ప్రతినిధి శర్మలు పరస్పరం సేల్‌ అగ్రిమెంట్‌పై సంతకాలు చేసుకున్నారు. అగ్రిమెంట్‌ ఈ రోజు డేట్‌తోనే ఉంది. సబ్‌ రిజిస్ర్టార్‌ వేరే ఒక ముఖ్యమైన పనిలో ఉండి అందుబాటులో లేకపోవటంతో ఆయన సంతకం చేయటమే మిగిలి ఉంది. దాదాపుగా సేల్‌ అగ్రిమెంట్‌ కుదిరినట్టే లెక్క.
Link to comment
Share on other sites

మేథ టవర్‌లో.. హెచ్‌సీఎల్‌
06-03-2018 07:19:55
 
636559175960017602.jpg
  • తాత్కాలికంగా అద్దె భవనంలో ఏర్పాటు
  • 65 వేల చదరపు అడుగుల స్థలాన్ని తీసుకున్న హెచ్‌సీఎల్‌
  • వారంలో ఇంటీరియర్‌ పనులు..
  • మరికొద్ది రోజుల్లో కార్యకలాపాలు ప్రారంభం
  • భవన నిర్మాణం పూర్తయ్యే వరకు ఇక్కడే..
 
విజయవాడ: మరికొద్ది రోజులలోనే హిందుస్తాన్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(హెచ్‌సీఎల్‌ ) టెక్నాలజీస్‌ కార్యకలాపాలు కేసరపల్లిలోని అద్దె భవనంలో ప్రారంభం కాబోతున్నాయి. భవన నిర్మాణం పూర్తి కావటానికి ఎంత లేదన్నా ఏడాది సమయం పడుతుంది కాబట్టి.. ముందుగా తమ సంస్థ కార్యకలాపాలు ప్రారంభించాలని హెచ్‌సీఎల్‌ సంస్థ నిర్ణయించింది. ‘మేథ’ టవర్‌లో 65 వేల చదరపు అడుగుల స్థలాన్ని హెచ్‌సీఎల్‌ సంస్థ అద్దెకు తీసుకుంది. వారం రోజుల్లో హెచ్‌సీఎల్‌ సంస్థ ఇంటీరియర్‌ పనులు ప్రారంభించబోతోంది. ఇంటీరియర్‌ పనులు పూర్తి కాగానే.. తన కార్యకలాపాలను ప్రారంభిస్తుంది.
 
గన్నవరంలో హెచ్‌సీఎల్‌ ఏర్పాటు చేయబోయే ప్రాజెక్టును స్పెషల్‌ ఎకనమిక్‌ జోన్‌ (సెజ్‌) కిందకు తీసుకు రావటానికి ఆ సంస్థ ప్రయత్నాలు చేస్తోంది. హెచ్‌సీఎల్‌ సంస్థ సెజ్‌ కింద ప్రాజెక్టును ఏర్పాటు చేయాలనుకుంటున్న విషయాన్ని ఆంధ్రజ్యోతి కథనంగా ప్రచురించింది. ఏపీఐఐసీ నుంచి ఇందుకు కావాల్సిన డాక్యుమెంట్లను హెచ్‌సీఎల్‌ సంస్థ తీసుకుంటోంది. హెచ్‌సీఎల్‌కు గన్నవరంలో ఏపీఐఐసీ కేటాయించిన 27 ఎకరాలలో హైరైజ్‌ భవన నిర్మాణానికి శ్రీకారం చుడుతుంది. వారికి కేటాయించిన స్థలంలో పాత భవనాలు, చెట్ల తొలగింపు, నేల చదును వంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. భవన నిర్మాణ పనులు ప్రారంభించటానికి శంకుస్థాపన కార్యక్రమాన్ని ఈ నెలలోనే నిర్వహించటానికి హెచ్‌సీఎల్‌ సిద్ధం చేస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు చేత శంకుస్థాపన చేయటానికి ఏర్పాట్లు చేసుకుంటోంది.
 
అశోక్‌ లేల్యాండ్‌తో సేల్‌ అగ్రిమెంట్‌ !
మల్లవల్లిలో బస్‌ బాడీ బిల్డింగ్‌ యూనిట్‌కు అప్పగించిన 75 ఎకరాలకు సంబంధించి అశోక్‌ లేల్యాండ్‌ సంస్థతో ఏపీఐఐసీ అధికారులు సోమవారం సేల్‌ డీడ్‌ ప్రక్రియను ప్రారంభించారు. నూజివీడు సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయంలో ఈ ప్రక్రియ ప్రారంభమైంది. సేల్‌ డీడ్‌ రాసుకోవటం పూర్తయింది. ఏపీఐఐసీ తరపున జడ్‌ఎం శరత్‌బాబు, అశోక్‌ లేల్యాండ్‌ ప్రతినిధి శర్మలు పరస్పరం సేల్‌ అగ్రిమెంట్‌పై సంతకాలు చేసుకున్నారు. అగ్రిమెంట్‌ ఈ రోజు డేట్‌తోనే ఉంది. సబ్‌ రిజిస్ర్టార్‌ వేరే ఒక ముఖ్యమైన పనిలో ఉండి అందుబాటులో లేకపోవటంతో ఆయన సంతకం చేయటమే మిగిలి ఉంది. దాదాపుగా సేల్‌ అగ్రిమెంట్‌ కుదిరినట్టే లెక్క.
Link to comment
Share on other sites

ఏపీకి డెలాయిట్‌, హెచ్‌పీ!
07-03-2018 01:13:12
 
636559819930169553.jpg
  • త్వరలోనే పూర్తి ప్రతిపాదనలు
  • పలు కంపెనీలతో లోకేశ్‌ భేటీ
  • 21 రోజుల్లోనే అనుమతులిస్తాం
  • ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం
న్యూఢిల్లీ/అమరావతి, మార్చి 6 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌లో కంపెనీ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనలపై డెలాయిట్‌, హెచ్‌పీ సానుకూలంగా స్పందించాయి. త్వరలోనే పూర్తిస్థాయి ప్రతిపాదనలతో ఏపీకి వస్తామని సూచించాయి. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ ఢిల్లీ పర్యటన సందర్భంగా మంగళవారం పలు కంపెనీల సీఈవోలతో భేటీ అయ్యారు. సులభతర వ్యాపారంలో ఏపీ నంబర్‌వన్‌గా ఉందని, ఇక్కడ పరిశ్రమ ఏర్పాటుకు కావాల్సిన అన్ని అనుమతులు 21 రోజుల్లోనే ఇస్తున్నామని మంత్రి తెలిపారు.
 
 
ఏపీలో డెలాయిట్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ ఏర్పాటు చేయాలని ఆ కంపెనీని కోరారు. ఏపీతో కలిసి పనిచేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, త్వరలోనే పూర్తిస్థాయి ప్రతిపాదనలతో వస్తామని డెలాయిట్‌ సీఈవో పునీత్‌ రెంజెన్‌ తెలిపారు. హెచ్‌పీ కంపెనీ ప్రతినిధులతోనూ లోకేశ్‌ భేటీ అయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని కోరారు. ఆ సంస్థ మేనేజర్‌ అమితాబ్‌ నాగ్‌ దీనికి సానుకూలంగా స్పందించారు.
 
 
10 ఫోన్లలో రెండు ఏపీ నుంచే
నోబెల్‌ గ్రూప్‌ కన్జ్యూమర్‌ ఎలక్ర్టానిక్స్‌ డైరక్టర్‌ సరబ్‌జిత్‌ సింగ్‌, యాహో మొబైల్‌ కంపెనీ ఎండీ చన్ర్పీత్‌ సింగ్‌, కిమాషీ ఎలక్ర్టానిక్స్‌ సీఈవో అనిల్‌ గుప్తాలతో లోకేష్‌ విడివిడిగా భేటీ అయ్యారు. ఈ సంస్థలు మొబైల్‌ ఫోన్లు, ఎల్‌ఈడీ టీవీలు, పవర్‌ బ్యాంకులు, యూఎస్బీ డేటా కేబుళ్లు, మొబైల్‌ చార్జర్లను ఉత్పత్తి చేస్తున్నాయి. వారితో లోకేశ్‌ మాట్లాడుతూ... దేశంలో ఉత్పత్తి అవుతున్న ప్రతి 10 ఫోన్లలో రెండు ఏపీలోనే తయారవుతున్నాయని చెప్పారు.
 
చిప్‌ డిజైన్‌ నుంచి పూర్తిస్థాయి వస్తువుల తయారీ వరకు రాష్ట్రంలో తయారయ్యేలా మౌలిక వసతులను కల్పిస్తున్నామని తెలిపారు. త్వరలోనే రిలయన్స్‌ 150 ఎకరాల్లో ఎలక్ర్టానిక్స్‌ తయారీ కంపెనీ ఏర్పాటు చేయనుందన్నారు. దీంతో దేశంలో ఉత్పత్తయ్యే ప్రతి 10 ఫోన్లలో ఐదు ఏపీలోనే తయారవుతాయన్నారు.
Link to comment
Share on other sites

ఏపీలో పెట్టుబడులకు హెచ్‌పీ ఆసక్తి 
దిల్లీ పర్యటనలో పలు సంస్థల సీఈవోలతో లోకేశ్‌ భేటీ 
06ap-main8a.jpg
ఈనాడు డిజిటల్‌, అమరావతి: త్రీడీ ప్రింటింగ్‌, డిజిటలీకరణ, వీఆర్‌ రంగాల్లో రాష్ట్రంతో కలిసి పనిచేయడానికి హెచ్‌పీ సంస్థ అంగీకరించింది. ఏఆర్‌లో సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ ఏర్పాటు సహా విద్యార్థులకు శిక్షణనిచ్చేందుకు ముందుకొచ్చింది. దిల్లీ పర్యటనలో ఉన్న మంత్రి నారా లోకేశ్‌ మంగళవారం సాఫ్ట్‌వేర్‌, మొబైల్‌, ఎలక్ట్రానిక్‌ సంస్థల డైరెక్టర్లు, సీఈవోలను కలిశారు. డెలాయిట్‌ సంస్థ గ్లోబల్‌ సీఈవో పునీత్‌ రెంజెన్‌, నోబెల్‌ గ్రూపు కన్జ్యూమర్‌ ఎలక్ట్రానిక్స్‌ డైరెక్టర్‌ సరబ్‌జిత్‌ సింగ్‌, కిమాషీ ఎలక్ట్రానిక్స్‌ సీఈవో అనిల్‌గుప్తా, యూహో మొబైల్‌ కంపెనీ ఎండీ చన్‌ప్రీత్‌ సింగ్‌తో లోకేశ్‌ వేర్వేరుగా భేటీ అయ్యారు. రాష్ట్రంలో వ్యాపారానికి ఉన్న అవకాశాలను వారికి వివరించి పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. రాష్ట్రంలో ఎలక్ట్రానిక్‌ తయారీ రంగం అభివృద్ధి చెందుతోందని.. మొబైల్‌, ఎలక్ట్రానిక్స్‌ కంపెనీలు పెద్ద ఎత్తున ఏపీలో పెట్టబడులు పెడుతున్నాయని వివరించారు. ఇప్పటికే 150 ఎకరాల్లో ఎలక్ట్రానిక్స్‌ పార్క్‌ ఏర్పాటుకు రిలయన్స్‌ ముందుకొచ్చిందని తెలిపారు. హెచ్‌సీఎల్‌ సహా ఫాక్స్‌కాన్‌, సెల్‌కాన్‌, కార్బన్‌, డిక్సన్‌లాంటి ఫోన్ల కంపెనీలు రాష్ట్రంలో ఇప్పటికే కార్యకలాపాలు ప్రారంభించాయని తెలిపారు. దేశంలో తయారవుతున్న పది ఫోన్లలో రెండు ఏపీవేనని వివరించారు. భవిష్యత్తులో వీటి సంఖ్య ఐదుకు పెరుగుతుందని తెలిపారు. ఎలక్ట్రానిక్‌ తయారీ కంపెనీల ఏర్పాటుకు కావాల్సిన అనుమతులు, రాయితీలను సకాలంలో కల్పిస్తున్నామని చెప్పారు. లోకేశ్‌ ప్రతిపాదనల మేరకు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు డెలాయిట్‌, నోబెల్‌ గ్రూప్‌ కన్జ్యూమర్‌, కిమాషీ ఎలక్ట్రానిక్స్‌ సంస్థల ప్రతినిధులు సానుకూలంగా స్పందించారు. ఏపీలో తమ సంస్థ ఏర్పాటుకు త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు.
 

ముఖ్యాంశాలు

Link to comment
Share on other sites

  • 2 weeks later...

అమరావతిలో టెక్నో టవర్స్ నిర్మాణం, ఎంత వేగంగా జరుగుతుందో చూడండి...

   
tech-21032018-1.jpg
share.png

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నిర్మాణ సంస్థ రామకృష్ణ హౌజింగ్‌ మంగళగిరిలోని ఖాజా గ్రామంలో రామకృష్ణ టెక్నో టవర్జ్‌ పేరిట అధునాతన వాణిజ్య సముదాయాన్ని నిర్మిస్తోంది... 11 లక్షల చ.అ.ల్లో 25 అంతస్తుల్లోని ఈ భవన సముదాయంలో 500 చ.అ. నుంచి 20 వేల చ.అ. స్థలాన్ని కొనుగోలు చేసుకోవచ్చు, లేకపోతే రెంట్ కు తీసుకోవచ్చు. 973 కార్లు పెట్టుకునే విధంగా 5 హై లెవల్స్‌ పార్కింగ్, 18 ఎలివేటర్స్, ఫిట్‌నెస్, లైఫ్‌ స్టయిల్‌ సెంటర్స్, ఫుడ్‌ కోర్ట్స్, రెస్టారెంట్లు, షాపింగ్‌ కేంద్రాలతో పాటూ ఈ ప్రాజెక్ట్‌లో ఆధునిక ఫర్నీచర్, లైటింగ్, ఔట్‌డోర్‌ వ్యూ, హై స్పీడ్‌ ఇంటర్నెట్‌ వంటి అన్ని రకాల వసతులను కల్పిస్తున్నారు..

 

tech 21032018 2

అయితే, ఈ ప్రాజెక్ట్ మొదలు పెట్టటానికి ప్రధాన కారణం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన DTP Policy... దీని ప్రకారం, మొదటి మూడు సంవత్సరాలకు ప్రభుత్వమే, ఈ ఐటి కంపనీలకు అద్దె చెల్లిస్తుంది... ఐటి కంపెనీలను ప్రోత్సహించటానికి ప్రభుత్వం ఈ పాలసీ తీసుకుంది... దానికి అనుగుణంగా, ఈ వెంచర్ మొదలు పెట్టారు... ప్లగ్ అండ్ ప్లే, వాక్ తో వర్క్, రెంటల్ గ్యారెంటీతో, ఇక్కడ ఐటి కంపెనీలు మొదలు పెట్టుకోవచ్చు...

tech 21032018 3

రామకృష్ణ టెక్నో టవర్జ్‌, అధినేత రామకృష్ణ చెప్పిన ప్రకారం, హైదరాబాద్ కు హై టేక్ సిటీ ఎలా ఉందో, మన అమరావతిలో అలాంటి టవర్ నిర్మాణం కోసం, ఇది చేపట్టామని, ప్రభుత్వం కూడా ఐటి ని ఇక్కడ ప్రోత్సహిస్తుంది కాబట్టి, ఇక్కడ ఈ టవర్స్ నిర్మాణం చేపడుతునట్టు చెప్పారు... అక్టోబర్ 2017లో పనులు మొదలు పెట్టామని, పనులు వేగంగా జరుగుతున్నాయని, నవంబర్ 2018 నాటికి ప్రభుత్వానికి అప్పచేప్తామని చెప్పారు... ప్రభుత్వం ప్లగ్ అండ్ ప్లే కోసం, ప్రభుత్వం డిజైన్ ఫైనల్ చేస్తున్నారని, దాదాపు 100 కంపనీలు ఈ టవర్ లో వస్తాయని, 10 వేల మందికి ఉద్యోగాలు వస్తాయని, ఇప్పటికే 80 శాతం కంపెనీలు ఇప్పటికే బుక్ చేసుకున్నట్టు చెప్పారు...

 

 
Link to comment
Share on other sites

  • 2 weeks later...

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...