Jump to content

Electronics hub in Renigunta,Tirupati


Recommended Posts

  • Replies 249
  • Created
  • Last Reply

Top Posters In This Topic

ఇక మేడిన్‌ ఏపీ!
11-02-2019 02:42:22
 
636854551957365027.jpg
  • మేకిన్‌ ఇండియా నినాదం మారింది
  • టీవీ ప్యానళ్ల తయారీ ఇక్కడే
  • మొబైళ్ల ఉత్పత్తిలో ఏపీ వాటా 26%
  • ఎఫ్‌డీఐల్లో నాలుగో స్థానం
  • ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌
  • కార్బన్‌ మొబైల్స్‌ యూనిట్‌ ప్రారంభం
  • మరో పది పరిశ్రమలకు భూమిపూజ
తిరుపతి, ఫిబ్రవరి 10(ఆంధ్రజ్యోతి): ‘సీఎం చంద్రబాబు తీసుకున్న సాహసోపేత నిర్ణయాల వల్ల నాలుగేళ్లలోనే రాష్ట్ర తలసరి ఆదాయం రెట్టింపైంది. 2014లో రాష్ట్రం నుంచి మొబైల్స్‌ తయారీ అన్న మాటే లేదు. ఇప్పుడు దేశంలో మొబైల్‌ ఫోన్స్‌ తయారీ రంగంలో ఏపీ వాటా 26 శాతంగా ఉంది. మేకిన్‌ ఇండియా నినాదం మేడిన్‌ ఏపీగా మారింది’ అని ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వంపైనా, ప్రత్యేకించి సీఎం చంద్రబాబుపైనా పారిశామ్రికవేత్తలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. చిత్తూరు జిల్లా రేణిగుంట విమానాశ్రయం సమీపంలోని తిరుపతి ఎలకా్ట్రనిక్స్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ క్లస్టర్‌ 1, 2లలో వంద ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు కాబోతున్న వోల్టాస్‌, ఎక్స్‌ట్రాన్‌ తదితర పది పరిశ్రమల నిర్మాణానికి ఆదివారం లోకేశ్‌ శంకుస్థాపన చేశారు. రూ.1018 కోట్ల పెట్టుబడితో నెలకొల్పుతున్న ఈ సంస్థల్లో 4,226 మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి.
 
అలాగే క్లస్టర్‌1లోని 15 ఎకరాల్లో రూ.300 కోట్ల పెట్టుబడితో 1000 మందికి ఉపాధి కల్పించేలా నిర్మాణం పూర్తి చేసుకుని ఉత్పత్తికి సిద్ధమైన కార్బన్‌ మొబైల్‌ ఫోన్స్‌ తయారీ యూనిట్‌ను కూడా ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో కంపెనీ ఉద్యోగులు, వివిధ ఇంజనీరింగ్‌ కళాశాలలు, ఐఐటీ విద్యార్థులనుద్దేశించి లోకేశ్‌ ప్రసంగించారు. ‘దేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా చంద్రబాబు సమర్థవంతమైన పాలన కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు ఆసక్తి చూపుతున్నారు.
 
విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరంగా నాలుగేళ్ల కిందట సున్నాగా ఉన్న ఏపీ స్థానం, స్వల్ప వ్యవధిలోనే దేశంలో నాలుగో స్థానానికి చేరుకుంది’ అని లోకేశ్‌ పేర్కొన్నారు. చిన్న, మధ్య తరహా వ్యాపారవేత్తల ప్రయోజనాలను కూడా పరిరక్షించి వారి పెట్టుబడులకు భద్రత కల్పించాల్సి ఉందన్నారు. ‘ఎలకా్ట్రనిక్స్‌ వస్తువుల తయారీకి సంబంధించి తిరుపతిలోనే లక్ష ఉద్యోగాలు కల్పించడం లక్ష్యంగా పనిచేస్తున్నాము. తాజాగా శంకుస్థాపన చేసిన పది పరిశ్రమలు, ప్రారంభించిన ఒక పరిశ్రమ వల్ల రూ.1500 కోట్ల పెట్టుబడులు, 7 వేల ఉద్యోగాలు రాబోతున్నాయి. దేశంలో టీవీ ప్యానెళ్లు తయారు చేసే ఏకైక రాష్ట్రం ఏపీయే. గ్లోబల్‌ వర్క్‌ఫోర్స్‌లో ఏపీ వాటా పదిశాతంగా ఉండడం గర్వించదగ్గ పరిణామం. రాబోయే పరిశ్రమలకు కూడా వర్క్‌ఫోర్స్‌ను అందించగలిగేలా రాష్ట్రం నుంచీ ఐటీ, ఎలకా్ట్రనిక్స్‌ నిపుణులను తయారు చేయాల్సిన అవసరముంది. ఆ క్రమంలోనే తొలిదశలో 15 వేల మంది విద్యార్థులను నిపుణులుగా తీర్చిదిద్దేందుకు ప్రణాళిక రూపొందించాము’ అని లోకేశ్‌ వివరించారు.
 
 
4ఏళ్లల్లో 54 పరిశ్రమలు
సీఎం చంద్రబాబు గత నాలుగున్నరేళ్లలో చేసిన కృషి వల్ల ఇప్పటి వరకూ రాష్ట్రంలో 54 పరిశ్రమలు ఏర్పాటయ్యాయని, 2 బిలియన్‌ అమెరిన్‌ డాలర్లు పెట్టుబడిగా పెట్టడం ద్వారా 22 వేల మందికి ఉద్యోగాలు వచ్చాయని ఆయన వివరించారు. ‘నేను ఐటీ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నప్పుడు రాష్ట్రంలో 2 లక్షల ఐటీ ఉద్యోగాలు, లక్ష ఎలకా్ట్రనిక్‌ రంగ ఉద్యోగాలు సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకున్నాను. దానికోసం నిరంతం పనిచేస్తున్నాం’ అని లోకేశ్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్బన్‌ మొబైల్స్‌ కంపెనీ తయారు చేసిన సరికొత్త వి9 ప్రో మోడల్‌ సెల్‌ఫోన్‌ను మంత్రి లోకేశ్‌ ఆవిష్కరించారు.
 
 

Advertisem

Link to comment
Share on other sites

  • 2 weeks later...
సెకనుకో మొబైల్‌ చేస్తారు!

ఎం.ఐ, వన్‌ప్లస్‌, నోకియా, అసూస్‌, జియానీ, ఐఫోన్‌... మనదేశంలో 60 శాతం మంది వాడే సెల్‌ఫోన్‌ బ్రాండ్లు ఇవి! బ్రాండ్లు వేరైనా ఈ సెల్‌ఫోన్‌లన్నింటినీ ‘ఫాక్స్‌కాన్‌’ సంస్థే తయారుచేస్తుంది. వాటిలోనూ ఎక్కువభాగం మన తెలుగుప్రాంతంలోనే ఉత్పత్తవుతాయి. అంతేకాదు, వీటి తయారీలో పాలుపంచుకునేవారిలో 90 శాతం మహిళలే ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రానిక్స్‌ పరికరాల తయారీలో 40 శాతం వాటాని సొంతం చేసుకున్న ఫాక్స్‌కాన్‌ తన ఫ్యాక్టరీ ఉన్న ప్రతిచోటా దీన్నో పాలసీగానే అనుసరిస్తోంది!

ఒకప్పుడు వ్యవసాయపు పనులు తప్ప మరో ఉపాధి ఎరగని మహిళలు వాళ్లు. ఒక్కో ఏడాది వర్షాభావంతో సాగుపనులు ఆగిపోతే పక్కనుండే పట్టణాలకు భవన నిర్మాణ కార్మికులుగా వెళ్తుంటారు! కానీ గత మూడేళ్లుగా వాళ్ల ఆర్థిక స్థితిగతులు పూర్తిగా మారిపోయాయి. ఒక్కొక్కరూ తక్కువలో తక్కువగా నెలకి 15 వేల రూపాయల వరకూ జీతం తీసుకుంటున్నారు! శ్రీసిటీలోని ఫాక్స్‌కాన్‌ సంస్థలో వీళ్లు సెల్‌ఫోన్‌ అసెంబ్లింగ్‌ పనులు చేస్తున్నారు. ఈ యూనిట్‌లో మొత్తం పదమూడువేలమంది ఉద్యోగులుంటే వాళ్లలో 90 శాతం మహిళలే! వీళ్లంతా చిత్తూరు జిల్లా సత్యవేడు, పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని తడ, సూళ్ళూరుపేట మండలాల్లోని పల్లెలకి చెందినవాళ్లు. మనం వాడుతున్న ఫోన్లలో ఎక్కువ వీళ్ల చేతుల్లో అసెంబుల్‌ అవుతున్నవే! వీళ్ల చేత సెకనుకో మొబైల్‌ తయారుచేయిస్తోంది ఫాక్స్‌కాన్‌.

ఇదే అతిపెద్దది... 
యాపిల్‌ ఐ ఫోన్లూ, ఇంటెల్‌ కంప్యూటర్లూ, అమెజాన్‌ కిండిల్‌, ఎకో స్పీకర్లూ, గూగుల్‌ స్మార్ట్‌ ఫోన్లూ, సోనీ సంస్థ ప్లే స్టేషన్‌... వీటన్నింటినీ ఆయా సంస్థలు డిజైన్‌ మాత్రమే చేస్తాయి. వాటిక్కావాల్సిన విడి భాగాల ఉత్పత్తీ, వాటి అసెంబ్లింగ్‌లను బయటి సంస్థలకి అప్పగిస్తాయి. ఆ పనుల్ని చేసిపెట్టే సంస్థల్నే ‘కాంట్రాక్ట్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌’ కంపెనీలని అంటారు. అలాంటివాటిల్లో ప్రపంచంలోనే నంబర్‌ వన్‌ కంపెనీ ఫాక్స్‌కాన్‌! ఐటీ సంసల్లో రెవెన్యూ పరంగా యాపిల్‌, శాంసంగ్‌, అమెజాన్‌ తర్వాతి స్థానం ఈ సంస్థదే. గూగుల్‌ కూడా దీని తర్వాతే. అంతేకాదు, ఆ నాలుగు సంస్థల మొత్తం ఉద్యోగులు దాదాపు పదకొండు లక్షలమంది ఉంటే... ఒక్క ఫాక్స్‌కాన్‌ సంస్థలోనే 13 లక్షలమంది పనిచేస్తున్నారు. చైనాలో అత్యధికంగా ఉద్యోగావకాశాలిస్తున్న ప్రైవేటు కంపెనీ కూడా ఇదే! 1974లో తైవాన్‌-లో ఓ చిన్న ఎలక్ట్రికల్‌ వస్తువుల తయారీ సంస్థగా మొదలైంది ఫాక్స్‌కాన్‌. టెర్రీ గౌ దీని వ్యవస్థాపకుడు. 2001 వరకూ చైనాకే పరిమితమై ఉండేది. ఆ ఏడాది ఇంటెల్‌ సంస్థ తన మదర్‌బోర్డుల తయారీ కాంట్రాక్ట్‌ని ఇవ్వడంతో దాని దశ మారింది. తరవాత యాపిల్‌, గూగుల్‌, సోనీ వంటి బడా సంస్థలూ వరసకట్టాయి. ఆ ఊపుతో ఈ సంస్థ మిగతా దేశాల్లోనూ విస్తరించింది ఫాక్స్‌కాన్‌. 2006లో భారత్‌లో అడుగుపెట్టింది.

అందిపుచ్చుకున్న ఆంధ్రప్రదేశ్‌... 
చెన్నైకి దగ్గర్లోని శ్రీపెరంబదూరులో నోకియా సంస్థ టెలికామ్‌ సెజ్‌ని ఏర్పాటుచేసింది. అక్కడే తన ఫోన్ల ఉత్పత్తి మొదలుపెట్టింది. దానికి అనుబంధంగా నోకియా విడిభాగాల తయారీని ప్రారంభించింది ఫాక్స్‌కాన్‌. దాదాపు రెండువేలమందికి ఉద్యోగాలిచ్చింది. 2014 వరకూ బాగానే సాగింది కానీ... నోకియా ఫోన్‌ల యాజమాన్యం మైక్రోసాఫ్ట్‌ చేతుల్లోకి వచ్చాక పరిస్థితి మారింది. కేంద్రప్రభుత్వానికి ఇవ్వాల్సిన కోట్ల రూపాయల పన్ను బకాయిపడ్డంతో నోకియా యూనిట్‌ ఉత్పత్తుల్ని ప్రభుత్వం రద్దు చేసింది. అది ఫాక్స్‌కాన్‌ లాభాలనీ దెబ్బతీసి 2015లో కంపెనీ మూతపడింది! మరోచోట యూనిట్‌ ఏర్పాటు కోసం ఫాక్స్‌కాన్‌ ప్రయత్నిస్తుండగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం దాన్ని తడ దగ్గర్లోని శ్రీసిటీ సెజ్‌లోకి ఆహ్వానించింది. పదేళ్లపాటు జీఎస్‌టీనీ, కేంద్ర అమ్మకం పన్నునీ మినహాయించింది. అంతేకాదు, ఈ సంస్థలో కొత్తగా చేరే ఉద్యోగులకి మొబైల్‌ అసెంబ్లింగ్‌లో శిక్షణ ఇవ్వడం కోసం... ఒక్కొక్కరి కోసం 10వేల రూపాయల చొప్పున అందిస్తామని హామీ ఇచ్చింది. అలా ఇక్కడికొచ్చిన ఫాక్స్‌కాన్‌ సంస్థకి రెండేళ్లకిందట ఎమ్‌.ఐ స్మార్ట్‌ఫోన్ల ఉత్పత్తి సంస్థ షామీ తన భారత్‌ కాంట్రాక్టుని అప్పగించింది. ప్రస్తుతం వినియోగదారులు వాడుతున్న 95 శాతం షామీ ఫోన్లు తయారయ్యేదీ ఇక్కడే!

‘యాపిల్‌’ వచ్చేస్తోంది...! 
యాపిల్‌ సంస్థ తన ఐఫోన్‌-ఎక్స్‌ రకం ఫోన్లని ఈ ఏడాది నుంచి ఫాక్స్‌కాన్‌ ద్వారా భారత్‌లోనే తయారుచేయబోతోంది. ఇందుకోసం ఫాక్స్‌కాన్‌ శ్రీపెరంబుదూరు యూనిట్‌లో సుమారు 2,500కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టనుందని అంచనా! కొత్త ఐఫోన్‌ల తయారీ కోసం సిబ్బంది సంఖ్యని దాదాపు పాతికవేల మందికి పెంచుకుంటామనీ అంటోంది ఫాక్స్‌కాన్‌. అంటే... ఇకమీద ప్రపంచంలోనే అతిఖరీదైన ఐఫోన్‌-ఎక్స్‌ మొబైల్‌ ఫోన్‌లు కూడా మన మహిళల చేతుల్లోనే రూపుదిద్దుకుంటాయన్నమాట! 

- గెడి మణిప్రతాప్‌, న్యూస్‌టుడే, సత్యవేడు

Link to comment
Share on other sites

  • 2 weeks later...
రూ.2,690 కోట్లతో పారిశ్రామిక పెట్టుబడులు

 

పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశంలో ప్రతిపాదనలు ఆమోదం

07ap-main15a.jpg

ఈనాడు-అమరావతి: రాష్ట్రంలో రూ.2,690.99 కోట్ల పెట్టుబడులతో ఐదు ఎలక్ట్రానిక్‌ ఉపకరణాల తయారీ పరిశ్రమల ఏర్పాటుకు అనుమతి లభించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన  గురువారం ఉండవల్లిలో నిర్వహించిన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్‌ఐపీబీ) సమావేశం ఈ మేరకు ప్రతిపాదనలకు అనుమతి తెలిపింది. వీటితో 14,094 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఐటీ, ఎలక్ట్రానిక్‌ శాఖల మంత్రి లోకేశ్‌, ముఖ్య కార్యదర్శి విజయానంద్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సమావేశం దృష్టికొచ్చిన మరికొన్ని ప్రతిపాదనలివి.
* వాల్సిన్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇండియా తిరుపతిలో రూ.734.47 కోట్లతో ఎలక్ట్రానిక్‌ ఉపకరణాల తయారీ యూనిట్‌ని ఏర్పాటు.. ఇందులో 1,026 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. తిరుపతిలోనే జీఎం మాడ్యూలర్‌ ఆధ్వర్యంలో  రూ.133.65 కోట్ల పెట్టుబడితో మరో ఎలక్ట్రానిక్‌ ఉపకరణాల తయారీ యూనిట్‌ ఏర్పాటు.. ఇందులో 2,230 మంది ఉద్యోగాలు, తిరుపతిలో వింగ్‌టెక్‌ మోబైల్‌ కమ్యూనికేషన్స్‌ ఆధ్వర్యంలో రూ.1,031.07 కోట్లతో ఏర్పాటు.. 10,098 మందికి ఉపాధి లభిస్తుంది.
* టెచురిన్‌ బ్యాటరీస్‌ చిత్తూరు శ్రీసిటీలో రూ.445.86 కోట్లతో ఏర్పాటు చేసే ఎలక్ట్రానిక్‌ ఉపకరణాల తయారీ ప్లాంట్‌తో 200 మందికి ఉపాధి లభించనుంది.
* ‘వీర్‌ ఓ మెటల్స్‌’ ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా గుడిపల్లిలో రూ.41.94 కోట్లతో నెలకొల్పే ఎలక్ట్రానిక్‌ ఉపకరణాలతయారీ యూనిట్‌లో 240 మందికి ఉపాధి.
* నాయుడుపేట సెజ్‌లో రూ.304 కోట్లతో ఇండస్‌ కాఫీ లిమిటెడ్‌ ఆధ్వర్యంలో ‘ఫ్రీజర్‌ ఢ్రైడ్‌ కాఫీ’ యూనిట్‌ని ఏర్పాటుతో 300 మందికి ఉపాధి కల్పిప్తారు.

 

Link to comment
Share on other sites

  • 4 weeks later...
  • 5 years later...

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...