Jump to content

Electronics hub in Renigunta,Tirupati


Recommended Posts

  • Replies 248
  • Created
  • Last Reply

Top Posters In This Topic

ఐఫోన్‌ మేడిన్‌ ఆంధ్ర?
అసెంబ్లింగ్‌ యూనిట్‌ పెట్టాలని ముఖ్యమంత్రి ఆహ్వానం
యాపిల్‌ సీవోవో జెఫ్‌ విలియమ్స్‌తో భేటీ
మరోసారి రాష్ట్రానికి రానున్న కంపెనీ ప్రతినిధులు
తిరుపతి వద్ద 150 ఎకరాలప్రతిపాదన
అమెరికాలో పలు దిగ్గజ సంస్థలతో సీఎం చర్చలు
ప్రవాస భారతీయులతో విందు సమావేశం
ఈనాడు - అమరావతి

 

అన్నీ అనుకున్నట్లుగా జరిగితే యాపిల్‌ ఐఫోన్‌ మేడిన్‌ ఆంధ్రప్రదేశ్‌ కానుంది. ఎంతో ప్రతిష్ఠాత్మకమైన ఈ ప్రాజెక్టును రాష్ట్రానికి తెచ్చేందుకు ప్రభుత్వం విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా అమెరికాలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బృందం యాపిల్‌ సంస్థ ప్రధాన నిర్వహణాధికారి (చీఫ్‌ ఆపరేటింగ్‌ అధికారి) జెఫ్‌ విలియమ్స్‌తో భేటీ అయ్యారు. ఈ భేటీలో రాష్ట్ర, యాపిల్‌ కంపెనీ బృందాలు ఆ సంస్థ ఏర్పాటు చేయాలని భావిస్తున్న ఐఫోన్‌ అసెంబ్లింగ్‌ యూనిట్‌కు సంబంధించి సుదీర్ఘ మంతనాలు జరిపినట్లు సమాచారం. దీంతోపాటు రెండోరోజు పర్యటనలో ఐటీ, టెక్నాలజీ రంగాలకు చెందిన పలు దిగ్గజ సంస్థల ప్రతినిధులతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో 12వేలకు పైగా ఉద్యోగావకాశాలు కల్పించేలా మూడు సంస్థలతో ఒప్పందాలు కుదిరాయి. ఆంధ్రప్రదేశ్‌లో యాపిల్‌ ఉత్పత్తుల తయారీ కేంద్రం ఏర్పాటు చేయాలని విలియమ్స్‌ను చంద్రబాబు కోరారు. పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్‌ అత్యుత్తమ రాష్ట్రమని, వృద్ధి, అభివృద్ధి అంశాల్లో సరైన భాగస్వామ్యం కోసం అన్వేషిస్తున్నామని తెలిపారు. ఇటీవలే యాపిల్‌కు చెందిన ఉన్నతాధికారుల బృందం వెలగపూడిలోని సచివాలయానికి వచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఐటీ మంత్రి నారా లోకేష్‌తో చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. వారికి తిరుపతి, అమరావతి వద్ద స్థలాలను ప్రభుత్వం చూపించింది. అయితే యాపిల్‌ సంస్థ ఎక్కువగా తిరుపతివద్దే ఈ యూనిట్‌ ఏర్పాటు చేయడానికి మొగ్గు చూపినట్లు సమాచారం. దీంతో చంద్రబాబు అమెరికా బయలుదేరే ముందు తిరుపతివద్ద యాపిల్‌ ఐఫోన్‌ యూనిట్‌ ఏర్పాటుకు అనుకూలంగా ఉన్న అంశాలను, ఎక్కడ స్థలం కేటాయిస్తున్నదీ, తిరుపతి విశిష్టత గురించి తెలియజేసేలా పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌తో యాపిల్‌ సంస్థ ప్రతినిధులను కలిసినట్లు సమాచారం.

 

సిద్ధంగా 150 ఎకరాలు
యాపిల్‌ సంస్థ కోసం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 150 ఎకరాలు సిద్ధం చేసినట్లు సమాచారం. తిరుపతి, శ్రీకాళహస్తి మధ్య ఉన్న ఏర్పేడువద్ద ఈ భూమిని ఏపీఐఐసీ ఇప్పటికే గుర్తించినట్లు తెలిసింది. యాపిల్‌ సంస్థ ఎప్పుడంటే అప్పుడు ఆ భూమిని వారికి అప్పగించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. విశ్వసనీయ సమాచారం మేరకు యాపిల్‌ నుంచి మరోమారు ప్రతినిధుల బృందం రాష్ట్రానికి వచ్చి ఆ సంస్థకు కేటాయిస్తామన్న భూములను పరిశీలించి వెళతారని సమాచారం. ఐఫోన్‌ యూనిట్‌కోసం ఆ సంస్థ భారీ పెట్టుబడులు పెట్టే అవకాశాలున్నాయి. అయితే ఎంత పెట్టుబడులు పెడుతుందనే విషయాన్ని గోప్యంగా ఉంచుతున్నారు. కియా కార్ల కంపెనీ తరహాలో యాపిల్‌ ప్రతిష్ఠాత్మక సంస్థ కావడంతో ఈ కంపెనీ ఎట్టి పరిస్థితుల్లోనూ చేజారకుండా రాష్ట్రానికి రప్పించాలనే పట్టుదలతో ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది.

Link to comment
Share on other sites

తిరుపతిలో స్కైవర్త్‌ అసెంబ్లింగ్‌ యూనిట్‌
 
636302339972352688.jpg
  •  మార్కెట్లోకి 4కె ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ టీవీ
హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌) : హాంకాంగ్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న స్కైవర్త్‌.. భారతలో రెండు అసెంబ్లింగ్‌ యూనిట్లను ఏర్పాటు చేసేందుకు రెడీ అవుతోంది. సంస్థకు ఇప్పటికే హైదరాబాద్‌లో ఒక అసెంబ్లింగ్‌ యూనిట్‌ ఉండగా కొత్త యూనిట్లను ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి, హర్యానాలోని గుర్గావ్‌లో ఏర్పాటు చేయాలని చూస్తున్నట్లు స్కైవర్త్‌ ఓవర్సీస్‌ వైస్‌ జనరల్‌ మేనేజర్‌ వికీ జు, స్కైవర్త్‌ ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌ జాంగ్‌ షికాన్‌ జాక్సన్‌ చెప్పారు. శుక్రవారం నాడిక్కడ మార్కెట్లో ఔల్‌ఇడి, 4కె ఆండ్రాయిడ్‌ టీవీని విడుదల చేసిన సందర్భంగా మాట్లాడుతూ... భారత మార్కెట్లో మరింత పట్టును చేజిక్కించుకోవాలనే లక్ష్యంతో స్కైవర్త్‌ కార్యకలాపాలను విస్తరించాలని చూస్తున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగానే తిరుపతిలోని ఎలకా్ట్రనిక్‌ హబ్‌లో అసెంబ్లింగ్‌ యూనిట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు జాక్సన్‌ తెలిపారు. యూనిట్‌ ఏర్పాటుకు సంబంధించి ప్రస్తుతం చర్చలు సాగిస్తున్నామని, ఆగస్టు నాటికల్లా దీన్ని ప్రారంభించాలని చూస్తున్నట్లు చెప్పారు.
Link to comment
Share on other sites

  • 2 weeks later...

కాగితాల నుంచి..కార్యరంగంలోకి!

నోడ్‌ సమగ్ర నివేదిక సిద్ధం

భూసేకరణకు రూ.350 కోట్లు?

త్వరలోనే నోటిఫికేషన్‌ జారీ

ఈనాడు, తిరుపతి

శ్రీకాళహస్తి, తొట్టంబేడు మండలాల నడుమ నెలకొల్పనున్న భారీ పారిశ్రామిక ప్రాంతం (నోడ్‌)కు సంబంధించి సవివర నివేదిక రూపుదిద్దుకుంది. క్షేత్రస్థాయిలో రంగంలోకి దిగేముందు కాగితాలపై సమగ్ర సమాచారంతో ‘డాక్యుమెంటేషన్‌’ ప్రక్రియను జిల్లా అధికారులు పూర్తి చేశారు. ఈ నివేదిక ఆధారంగా త్వరలోనే భూసేకరణ ప్రకటన జారీ చేయనున్నారు. చెన్నై-విశాఖ పారిశ్రామిక నడవా (సీవీఐసీ)లో కీలకంగా భావిస్తున్న శ్రీకాళహస్తి నోడ్‌.. జిల్లాలో పారిశ్రామిక రంగానికి మణిహారంగా మారనుంది.

జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేసే దిశగా ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో ఎలక్ట్రానిక్‌ పరికరాల తయారీ కేంద్రాలను ఏర్పాటు చేసిన ప్రభుత్వం.. తాజాగా భారీ పరిశ్రమల ఏర్పాటుకు అనుగుణంగా శ్రీకాళహస్తి-తొట్టంబేడు ప్రాంతాలను ఎంపిక చేసింది. ఇందుకోసం సుమారు 11 వేల ఎకరాలు అవసరమని గుర్తించిన అధికారులు ఆ మేరకు భూసేకరణకు సిద్ధమయ్యారు. ఇందుకు రూ.350 కోట్ల వ్యయం అవుతుందని ప్రాథమికంగా అంచనా రూపొందించారు. దీనిపై డాక్యుమెంటేషన్‌ సిద్ధం చేసినందున.. ప్రభుత్వం నుంచి ఆమోదముద్ర వచ్చిన వెంటనే భూసేకరణ నోటిఫికేషన్‌ జారీ చేయాలని యోచిస్తున్నారు. నిర్దేశించిన స్థలాన్ని ఏపీఐఐసీకి అప్పగిస్తే.. పరిశ్రమల స్థాపనకు మార్గం సుగమం కానుంది. రెవెన్యూ అధికారులు వెల్లడించిన సమాచారం ప్రకారం మొత్తం సేకరించాల్సిన భూమి 11 వేల ఎకరాలు కాగా.. పట్టా భూములు సుమారు 322.98 ఎకరాలు. అసైన్డ్‌ భూములు 7744.81 ఎకరాలు, ప్రభుత్వ భూములు 2937.40 ఎకరాలుగా గుర్తించారు. ఈ మొత్తం 16 గ్రామాల పరిధిలో ఉంది. పట్టా భూముల అనుభవదారులు ఎవరనేది అధికారులు రికార్డులు పరిశీలించి సిద్ధం చేశారు. ప్రభుత్వ, అసైన్డ్‌ భూములు ఎక్కడెక్కడ, ఎన్ని, ఎవరి ఆధీనంలో ఉన్నాయో ఒక నివేదిక రూపొందించారు. తద్వారా నష్టపరిహారం చెల్లించేందుకు న్యాయపరమైన చిక్కులు రాకుండా జాగ్రత్త పడుతున్నారు.

భూసేకరణ చట్టం-2013 ప్రకారం ప్రైవేటు స్థలాలతో పాటు ప్రభుత్వ, డీకేటీ భూముల్లో సేద్యం చేసుకుంటున్న వారికి సైతం పరిహారం అందించాల్సి ఉంది. ప్రస్తుతం వేలవేడు గ్రామ పరిధిలో అత్యధికంగా 2101.83, ఇనగలూరులో 1317.30 ఎకరాలను సేకరించాల్సి ఉంది. మొత్తంగా చూస్తే భూసేకరణకు సుమారు రూ.350 కోట్లు ఖర్చవుతుందని రెవెన్యూ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఇప్పటికే భూసేకరణకు అవసరమైన కసరత్తును సైతం అధికారులు పూర్తి చేశారు. త్వరలోనే నోటిఫికేషన్‌ జారీ చేసి ఆయా ప్రాంతాల్లో సభలు నిర్వహించి లబ్ధిదారులకు పరిహారం చెల్లించనున్నారు. జిల్లాలోని తూర్పు ప్రాంతంలోనే సత్యవేడు శ్రీసిటీ సెజ్‌లో భారీగా పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. ఈ పారిశ్రామిక వాడను ఆనుకుని హీరో మోటార్స్‌ తమ కంపెనీ ఏర్పాటుకు చర్యలు ప్రారంభించింది. వీటికి అనుసంధానంగా నోడ్‌ను అభివృద్ధి చేస్తే.. చెన్నై-విశాఖ పారిశ్రామిక కారిడార్‌లో ఇది కీలకం కానుంది. అంతర్జాతీయ విమానాశ్రయం, కృష్ణపట్నం, చెన్నై పోర్టులు దగ్గరగా ఉండటం వల్ల పారిశ్రామికవేత్తలు ఆసక్తి చూపుతారని ప్రభుత్వ వర్గాలు ఆశిస్తున్నాయి.

Link to comment
Share on other sites

  • 3 weeks later...

ఈ-హబ్‌’గా రాయలసీమ

ఈనాడు, అమరావతి: రాయలసీమను ఎలక్ట్రానిక్స్‌ తయారీ కేంద్రంగా (ఈ-హబ్‌) అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు రూపొందించాలని రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి నారా లోకేష్‌ గురువారం అధికారులకు సూచించారు. ఈ విషయంలో కర్నూలు జిల్లాపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించాలన్నారు. రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్‌ రంగం అభివృద్ధి, ఉపాధిహామీ పథకం అమలుతీరుపై ఆయన సంబంధిత విభాగాల అధికారులతో సచివాలయంలో సమీక్షించారు. ఎలక్ట్రానిక్స్‌ విధానంలో స్వల్ప మార్పులు చేస్తూ కొత్త విధానం ప్రకటించాలని కూడా ఈ సమావేశంలో నిర్ణయించినట్లు సమాచారం. ఒక కంపెనీ పెట్టే పెట్టుబడి ఆధారంగా ఆ కంపెనీకి రాయితీలు ఇవ్వడం కాకుండా... ఆ సంస్థ ఎంత ఎక్కువ ఉద్యోగాలు కల్పిస్తుందో చూసి, దాని ఆధారంగా రాయితీలు ఇస్తే బాగుంటుందని సమావేశంలో ఒక అభిప్రాయానికి వచ్చారు. రూ.వెయ్యి కోట్లు పెట్టుబడి పెట్టడానికి ముందుకొచ్చే కంపెనీకి రూ.250 కోట్ల రాయితీ ఇస్తామన్నారు. ఎలక్ట్రానిక్స్‌ రంగంలో విశాఖపట్నం నగరాన్ని అభివృద్ధి చేద్దామని పరిశ్రమల శాఖ అధికారులు సూచించినా మంత్రి ఆ ప్రతిపాదనపై భిన్నాభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఇప్పటికే విశాఖపట్నం నగరాన్ని ఫిన్‌టెక్‌ వ్యాలీ, ఐటీ హబ్‌గా అభివృద్ధి చేస్తున్నామని, రాయలసీమ జిల్లాల్లో కరవు కారణంగా వలసలు ఎక్కువగా ఉన్నాయని, అక్కడ ప్రజలకు ఉపాధి లభించేలా ఎలక్ట్రానిక్స్‌ రంగాన్ని అభివృద్ధి చేద్దామని ఆయన సూచించారు.

ఉపాధి హామీ పథకం వేతనదారుల హాజరును బయోమెట్రిక్‌ విధానంలో సేకరించే ప్రాజెక్టును చిత్తూరు జిల్లా కుప్పంలో ప్రయోగాత్మకంగా ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి లోకేష్‌ అధికారులను ఆదేశించారు.

Link to comment
Share on other sites

  • 2 weeks later...

From Eenadu - 18 June 2017:

 

తిరుపతిలో ‘సెల్‌’పువ్వు! 
ఎలక్ట్రానిక్స్‌ హబ్‌లో తొలి కంపెనీ 
22న సీఎం చేతుల మీదుగా ప్రారంభం 
 

అమరావతి: తిరుపతి సిగలో ‘సెల్‌’ పువ్వు ఫూయనుంది. త్వరలో అత్యాధునిక ఫోన్ల తయారీకి కేంద్రంగా అవతరించనుంది. ఈ నెల 22న రేణిగుంట విమానాశ్రయంవద్ద నిర్మించిన సెల్‌కాన్‌ మొబైల్‌ ఫోన్ల తయారీ యూనిట్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు. సెల్‌కాన్‌ సంస్థ ఇక్కడి నుంచి నెలకు 4 లక్షల మొబైల్‌ ఫోన్లను తయారు చేయనుంది. వాటిని దేశీయ, విదేశీ మార్కెట్లకు ఎగుమతి చేయనుంది. ఆ తర్వాత మరో మొబైల్‌ ఫోన్ల తయారీ కంపెనీలు రానున్నాయి.

రేణిగుంట విమానాశ్రయానికి సమీపంలో రెండు ‘ఎలక్ట్రానిక్స్‌ తయారీ క్లస్టర్లను’ (ఈఎంసీ) ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. శ్రీ వెంకటేశ్వర మొబైల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ హబ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరిట ఒక స్పెషల్‌ పర్పస్‌ వెహికల్‌ను ఏర్పాటు చేసి ఈ ప్రాజెక్టును నిర్వహిస్తున్నారు. 120 ఎకరాల విస్తీర్ణంలో ఈఎంసీ-1 హబ్‌ను అభివృద్ధి చేస్తున్నారు. ఇందులో ‘సెల్‌కాన్‌’, ‘లావా’, మైక్రోమ్యాక్స్‌, కార్బన్‌ కంపెనీలు తమ మొబైల్‌ ఫోన్ల తయారీ యూనిట్‌లను ఏర్పాటు చేస్తున్నాయి. ఈ నాలుగు కంపెనీలు కలిపి భారీగా పెట్టుబడి పెట్టనున్నాయి. ఇందులో శరవేగంగా యూనిట్‌ నిర్మాణం పూర్తి చేసి తయారీకి సిద్ధమైన తొలి కంపెనీ ‘సెల్‌కాన్‌’. 2015 నవంబరులో ఈఎంసీ-1కు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. ఏడాది క్రితం సెల్‌కాన్‌ కంపెనీ రూ.150 కోట్ల పెట్టుబడితో యూనిట్‌ నిర్మాణ పనులు ప్రారంభించి ఇటీవలే పూర్తి చేసింది. ఈ నెల 22న ఈ యూనిట్‌ను లాంఛనంగా ప్రారంభిస్తున్నారు. మరోవైపు రేణిగుంటకు సమీపంలోని వికృతమాల వద్ద 500 ఎకరాల విస్తీర్ణంలో ఆంధ్రప్రదేశ్‌ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ మరో ‘ఈఎంసీ-2’ను అభివృద్ధి చేస్తోంది.

40 వేల మందికి ఉద్యోగావకాశాలు 
సెల్‌కాన్‌ తయారీ యూనిట్‌ ఏర్పాటు చేసిన ఈఎంసీ-1 ప్రాంతంలో వచ్చే మొబైల్‌ కంపెనీలన్నింటిద్వారా మొత్తం 40వేల మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. ఎలక్ట్రానిక్స్‌ తయారీ హబ్‌-1లో ఏర్పాటవుతున్న ఈ నాలుగు కంపెనీల నుంచి ఏటా 7 కోట్ల సెల్‌ఫోన్లు తయారు కానున్నాయి. దేశీయ మొబైల్‌ మార్కెట్‌లో ఈ నాలుగు కంపెనీల వాటా 45 శాతం.

తిరుపతిలోని ఎలక్ట్రానిక్స్‌ హబ్‌లో ఈ కంపెనీలు పెట్టబోయే పెట్టుబడులు, వాటి వివరాలు... 
సెల్‌కాన్‌: దేశీయ మొబైల్‌ తయారీ సంస్థల్లో ఐదో అతిపెద్ద మార్కెట్‌ ఉన్న సంస్థ. 20 ఎకరాల విస్తీర్ణంలో యూనిటú నెలకొల్పింది. రూ.150 కోట్ల పెట్టుబడి. సెల్‌కాన్‌ ఇక్కడ యూనిట్‌ను మరింత విస్తరించనుంది. ఆరంభంలో 2500 మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగావకాశాలు కల్పించనుంది. 2020 కల్లా ఈ కంపెనీ యూనిట్‌ నుంచీ 10వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. మొబైల్‌ తయారీతోపాటు, వాటి పరికరాలను కూడా ఆ సంస్థ ఇక్కడి నుంచీ తయారు చేయనుంది.

లావా: ఈ సంస్థ ఇక్కడ ‘సోజో’ మొబైల్‌ ఫోన్లను తయారు చేయనుంది. మొత్తం 20 ఎకరాల్లో తయారీ యూనిట్‌ను నెలకొల్పనుంది. రూ.500 కోట్ల పెట్టుబడి పెడుతోంది. ఆరంభ దశలో నెలకు 5 లక్షల మొబైల్‌ ఫోన్లను ఇక్కడి నుంచి తయారు చేయనుంది. 12 వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పించనుంది.

కార్బన్‌: 15 ఎకరాల విస్తీర్ణంలో మొబైల్‌ ఫోన్ల తయారీ యూనిట్‌ను నెలకొల్పుతోంది. రూ.200 కోట్ల పెట్టుబడి పెడుతోంది. 2వేల మందికి ఉద్యోగాలు కల్పించనుంది. నెలకు ఈ యూనిట్‌ నుంచీ 5 లక్షల మొబైల్‌ ఫోన్లను తయారు చేయనుంది.

మైక్రోమ్యాక్స్‌: 20 ఎకరాల విస్తీర్ణంలో తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది. రూ.100 కోట్ల పెట్టుబడి పెట్టనుంది.

Link to comment
Share on other sites

సెల్‌కాన్‌ @ మేడ్ ఇన్ ఆంధ్రా... Super User 18 June 2017 Hits: 407  
cellkon-18062017.jpg
share.png

ఆంధ్రప్రదేశ్ సెల్ ఫోన్ల తయారీ కేంద్రంగా ముందుకు సాగుతుంది. ఇప్పటికే ఫాక్స్ కాన్, షియామీ లాంటి సంస్థలు, మొబైల్ ఫోన్ లను ఆంధ్రప్రదేశ్ నుంచి తయారు చేస్తుండగా, ఇప్పుడు మరో కంపెనీ కూడా ఆంధ్రప్రదేశ్ నుంచే ఫోన్ ల తయారీకి సిద్ధమయింది.

తిరుపతి కేంద్రంగా సెల్‌కాన్‌, అత్యాధునిక ఫోన్ల తయారీ చెయ్యనుంది. ఈ నెల 22న రేణిగుంట విమానాశ్రయంవద్ద నిర్మించిన సెల్‌కాన్‌ మొబైల్‌ ఫోన్ల తయారీ యూనిట్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు. ఇక్కడ నుంచే, సెల్‌కాన్‌, నెలకు 4 లక్షల మొబైల్‌ ఫోన్లను తయారు చేయనుంది.

20 ఎకరాల విస్తీర్ణంలో యూనిటú నెలకొల్పింది. రూ.150 కోట్ల పెట్టుబడి. సెల్‌కాన్‌ ఇక్కడ యూనిట్‌ను మరింత విస్తరించనుంది. ఆరంభంలో 2500 మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగావకాశాలు కల్పించనుంది. 2020 కల్లా ఈ కంపెనీ యూనిట్‌ నుంచీ 10వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. మొబైల్‌ తయారీతోపాటు, వాటి పరికరాలను కూడా ఆ సంస్థ ఇక్కడి నుంచీ తయారు చేయనుంది.

 

శ్రీ వెంకటేశ్వర మొబైల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ హబ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరిట, రేణిగుంట వద్ద 122 ఎకరాలలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న మొబైల్ అండ్ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫాక్చరింగ్ హబ్ లో సెల్కొన్ 20 ఎకరాలు, మైక్రో మాక్స్ 15 ఎకరాలు, కర్బోన్ 15.28 ఎకరాలు, లావా 20 ఎకరాలు ఉపయోగించుకుని తమ విభాగాలను నెలకొల్పుతున్నారు. ఈ నాలుగు సంస్థలు వివిధ దశల్లో రూ.2000 కోట్ల పెట్టుబడులను పెడుతున్నారు. ఇంకా వీటితో పాటు అసుస్, వన్ ప్లస్ సంస్థలు కూడా రాష్ట్రానికి రానున్నాయి. 2015 నవంబరులో ఇక్కడ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. ఇందులో శరవేగంగా యూనిట్‌ నిర్మాణం పూర్తి చేసి తయారీకి సిద్ధమైన తొలి కంపెనీ ‘సెల్‌కాన్‌’.

ఈ ఎలక్ట్రానిక్స్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ హబ్‌ ప్రాంతంలో, మొబైల్‌ కంపెనీలన్నింటిద్వారా మొత్తం 40వేల మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగావకాశాలు లభించనున్నాయి.

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...