Jump to content

Amaravati


Recommended Posts

రాజధాని డిజైన్లు ఓకే!
 
  • అయితే.. కృష్ణ కలుషితం కాకుండా చూడండి
  • జలమార్గాలు, మురుగునీటితో కాలుష్య ముప్పు
  • రాజధానికి వరద ముప్పుపైనా దృష్టి పెట్టండి
  • ప్రముఖుల నివాసాలన్నీ ఒకేచోట ఉండాలి
  • గవర్నమెంట్‌ కాంప్లెక్స్‌ డిజైన్లపై నిపుణుల సూచనలు
అమరావతి, ఏప్రిల్‌ 10 (ఆంధ్రజ్యోతి): అమరావతిలోని 900 ఎకరాల్లో నిర్మించనున్న ప్రభుత్వ భవనాల సముదాయం కోసం మాస్టర్‌ ఆర్కిటెక్ట్‌ నార్మన ఫోస్టర్‌ ప్రతినిధులు రూపొందించిన ప్రాథమిక డిజైన్లు స్థూలంగా చూస్తే బాగానే ఉన్నాయని, అయితే వాటిల్లోని కొన్ని అంశాల్లో మార్పులు చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడ్డారు. ఈ డిజైన్లపై వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, నిపుణుల అభిప్రాయాలు తీసుకొనేందుకు ఏపీసీఆర్డీయే విజయవాడలోని తన ప్రధాన కార్యాలయంలో సోమవారం వర్క్‌షాపు నిర్వహించింది. దీనికి దేశం నలుమూలల నుంచే కాకుండా విదేశాల నుంచీ పలువురు నిపుణులు హాజరయ్యారు. తొలుత ప్రసంగించిన సీఆర్డీయే కమిషనర్‌ శ్రీధర్‌.. అమరావతి నిర్మాణంలో ప్రజలు, నిపుణుల భాగస్వామ్యం ఉంటేనే అది అసలు సిసలైన ప్రజా రాజధానిగా రూపుదిద్దుకుంటుందన్న అభిప్రాయంతో సీఎం వారందరి అభిప్రాయాలు, సలహాలు తీసుకోవాల్సిందిగా ఆదేశించినట్లు చెప్పారు. సీఎం ఆలోచనలకు అనుగుణంగా రాజధాని డిజైన్లను తీర్చిదిద్దడంలో సహకరించాలని హాంకాంగ్‌, న్యూఢిల్లీ, ముంబై, తిరుచిరాపల్లి, హైదరాబాద్‌, లావాసా తదితర ప్రాంతాల నుంచి వచ్చిన నిపుణులను కోరారు. ఈ సందర్భంగా నార్మన ఫోస్టర్‌ సంస్థ ప్రతినిధులు తాము రూపొందించిన గవర్నమెంట్‌ కాంప్లెక్స్‌ ప్రాథమిక ఆకృతుల గురించి పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన ద్వారా వివరించారు. అనంతరం ప్రసంగించిన నిపుణులు గవర్నమెంట్‌ కాంప్లెక్స్‌ ప్రాథమిక ఆకృతులకు సంబంధించి కొన్ని సూచనలిచ్చారు.
ఇలా చేస్తే మేలు..
  • కృష్ణా నదీతీరాన రాజధానిని ఏర్పాటు చేయాలనుకోవడం బాగుంది. అయితే రాజధానిలో పెద్దఎత్తున ఏర్పాటు చేయదలచిన జలవనరులు, వాటిల్లో రవాణా వ్యవస్థ, నగరంలోని మురుగునీటిని శుద్ధి చేసే వ్యవస్థల కారణంగా నదీజలాలు కాలుష్యానికి గురయ్యే ప్రమాదం ఉంది. ఈ అంశానికి సముచిత ప్రాధాన్యమిచ్చి, కాలుష్యనివారణకు అవసరమైన చర్యలు తీసుకోవాలి.
  • అమరావతికి ఎటువంటి పరిస్థితుల్లోనూ వరదముప్పు రాకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ భవనాల నిర్మాణాన్ని కృష్ణానది వరదల స్థాయిని దృష్టిలో ఉంచుకొని నిర్మించాలి.
  • నమూనా ఆకృతుల్లో సీఎం అధికార నివాసానికి, అసెంబ్లీ భవనానికి మధ్య దూరం ఎక్కువగా ఉండడం గవర్నమెంట్‌ కాంప్లెక్స్‌లో సాధారణ ప్రజానీకం కదలికలపై తీవ్ర ప్రభావం చూపుతుంది (సీఎం, ఇతర ప్రముఖుల రాకపోకల దృష్ట్యా ట్రాఫిక్‌ను ఆపడం అనివార్యం) కాబట్టి వాటిమధ్య దూరం సాధ్యమైనంత తక్కువగా ఉండేలా చూడాలి.
  • అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించాలనుకుంటున్న 2 భవంతుల (ఐకానిక్‌ బిల్డింగ్స్‌)లో ఒకటైన అసెంబ్లీ ఎత్తు ప్రాథమిక డిజైన్లలో సరిపడినంత లేనందున ఆట్టే ఆకట్టుకోవడం లేదు. అందువల్ల దాని ఎత్తు పెంచాలి.
  • భద్రతా కారణాలు, సామాన్య ప్రజల కదలికలను దృష్టిలో ఉంచుకుని ప్రముఖుల (వీఐపీ) నివాసాలన్నీ ఒకేచోట ఉండేలా చూడాలి.
కాగా, వర్క్‌షాపులో ప్రొఫెసర్‌ ఇఫ్తికర్‌ ముల్క్‌ఛిస్తీ (ఆర్కిటెక్చర్‌ ప్రొఫెసర్‌- స్కూల్‌ ఆఫ్‌ ప్లానింగ్‌ అండ్‌ ఆర్కిటెక్చర్‌, న్యూఢిల్లీ), ప్రొఫెసర్‌ టి. శ్రీనివాస్‌ (ఆర్కిటెక్చర్‌ ఫ్రొఫెసర్‌, ఎన.ఐ.టి., తిరుచిరాపల్లి), ప్రొఫెసర్‌ రమేష్‌ సిరికొండ (డీన ఆఫ్‌ స్టడీస్‌, ఎస్‌పీఏ, విజయవాడ), ప్రొఫెసర్‌ మీనాక్షి జైన (డైరెక్టర్‌, ఎస్‌పీఏ, విజయవాడ), తదితరులు పాల్గొన్నారు.
Link to comment
Share on other sites

అమరావతి ప్రాథమిక డిజైన్లపై నార్మన్ ఫోస్టర్‌తో చర్చలు
 
636274961666081754.jpg
ఆంధ్రజ్యోతి, అమరావతి: రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి, సీఆర్డీఏ ఉపాధ్యక్షుడు పి.నారాయణ, కమిషనర్‌ సీహెచ్‌ శ్రీధర్‌, అడిషనల్‌ కమిషనర్‌ ఎ.మల్లికార్జున్, ప్రభుత్వ సమాచార సలహాదారు పరకాల ప్రభాకర్‌లతో కూడిన బృందం మంగళవారం లండన్ వెళ్తోంది. అమరావతిలోని గవర్నమెంట్‌ కాంప్లెక్స్‌ డిజైన్లను రూపొందిస్తున్న మాస్టర్‌ ఆర్కిటెక్ట్‌ నార్మన్ ఫోస్టర్‌ ప్లస్‌ పార్ట్‌నర్స్‌ (లండన్) ప్రతినిధులతో వాటిపై సంప్రదింపులు జరిపేందుకు వెళుతున్నారు. వివిధ రూపాల్లో సేకరించిన అభిప్రాయాలు, సూచనలను నార్మన్ ఫోస్టర్‌ సంస్థకు తెలియజేసి, వాటిల్లో ఉపయుక్తమైన వాటిని ఫైనల్‌ డిజైన్ల రూపకల్పనలో పొందుపరిచేలా చూసేందుకు నారాయణ బృందం లండనకు బయల్దేరుతోంది. ఇప్పటికే వివిధ పర్యాయాలు నారాయణ, శ్రీధర్‌ తదితరులు అక్కడికి వెళ్లి రావడం, ఫోస్టర్‌ ప్రతినిధులు కూడా ఇక్కడికి వచ్చి వెళ్లడం విదితమే. గవర్నమెంట్‌ కాంప్లెక్స్‌ తుది ఆకృతులను నార్మన్ ఫోస్టర్‌ మరో 2 లేదా 3 వారాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి అందజేస్తుందని భావిస్తున్న తరుణంలో నారాయణ బృందం వాటిల్లో ఉండాల్సిన అంశాలపై ఆ సంస్థకు తెలియజెప్పడంతోపాటు ఫైనల్‌ డిజైన్ల తయారీ ప్రక్రియలోని పురోగతిని కూడా సమీక్షిస్తుందని సమాచారం. ఈ బృంద సభ్యులు ఈ నెల 14న విజయవాడకు తిరిగి వస్తారని తెలుస్తోంది.
Link to comment
Share on other sites

 

.
ఇలా చేస్తే మేలు..

  • కృష్ణా నదీతీరాన రాజధానిని ఏర్పాటు చేయాలనుకోవడం బాగుంది. అయితే రాజధానిలో పెద్దఎత్తున ఏర్పాటు చేయదలచిన జలవనరులు, వాటిల్లో రవాణా వ్యవస్థ, నగరంలోని మురుగునీటిని శుద్ధి చేసే వ్యవస్థల కారణంగా నదీజలాలు కాలుష్యానికి గురయ్యే ప్రమాదం ఉంది. ఈ అంశానికి సముచిత ప్రాధాన్యమిచ్చి, కాలుష్యనివారణకు అవసరమైన చర్యలు తీసుకోవాలి.
  • అమరావతికి ఎటువంటి పరిస్థితుల్లోనూ వరదముప్పు రాకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ భవనాల నిర్మాణాన్ని కృష్ణానది వరదల స్థాయిని దృష్టిలో ఉంచుకొని నిర్మించాలి.
  • నమూనా ఆకృతుల్లో సీఎం అధికార నివాసానికి, అసెంబ్లీ భవనానికి మధ్య దూరం ఎక్కువగా ఉండడం గవర్నమెంట్‌ కాంప్లెక్స్‌లో సాధారణ ప్రజానీకం కదలికలపై తీవ్ర ప్రభావం చూపుతుంది (సీఎం, ఇతర ప్రముఖుల రాకపోకల దృష్ట్యా ట్రాఫిక్‌ను ఆపడం అనివార్యం) కాబట్టి వాటిమధ్య దూరం సాధ్యమైనంత తక్కువగా ఉండేలా చూడాలి.
  • అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించాలనుకుంటున్న 2 భవంతుల (ఐకానిక్‌ బిల్డింగ్స్‌)లో ఒకటైన అసెంబ్లీ ఎత్తు ప్రాథమిక డిజైన్లలో సరిపడినంత లేనందున ఆట్టే ఆకట్టుకోవడం లేదు. అందువల్ల దాని ఎత్తు పెంచాలి.
  • భద్రతా కారణాలు, సామాన్య ప్రజల కదలికలను దృష్టిలో ఉంచుకుని ప్రముఖుల (వీఐపీ) నివాసాలన్నీ ఒకేచోట ఉండేలా చూడాలి.
కాగా, వర్క్‌షాపులో ప్రొఫెసర్‌ ఇఫ్తికర్‌ ముల్క్‌ఛిస్తీ (ఆర్కిటెక్చర్‌ ప్రొఫెసర్‌- స్కూల్‌ ఆఫ్‌ ప్లానింగ్‌ అండ్‌ ఆర్కిటెక్చర్‌, న్యూఢిల్లీ), ప్రొఫెసర్‌ టి. శ్రీనివాస్‌ (ఆర్కిటెక్చర్‌ ఫ్రొఫెసర్‌, ఎన.ఐ.టి., తిరుచిరాపల్లి), ప్రొఫెసర్‌ రమేష్‌ సిరికొండ (డీన ఆఫ్‌ స్టడీస్‌, ఎస్‌పీఏ, విజయవాడ), ప్రొఫెసర్‌ మీనాక్షి జైన (డైరెక్టర్‌, ఎస్‌పీఏ, విజయవాడ), తదితరులు పాల్గొన్నారు.

 

manchi points chepparu

Link to comment
Share on other sites

అమరావతి డిజైన్లు వచ్చేనెలలో ఖరారు
 
అమరావతి, ఏప్రిల్‌ 11(ఆంధ్రజ్యోతి): అమరావతిలోని గవర్నమెంట్‌ కాంప్లెక్స్‌కు సంబంధించిన తుది డిజైన్లు వచ్చే నెలలో ఖరారవుతాయని మంత్రి నారాయణ వెల్లడించారు. వాస్తవానికి ఈ నెల ద్వితీయార్ధంలో అవి సిద్ధమవ్వాల్సి ఉండగా ప్రాథమిక డిజైన్లపై మరింత అధ్యయనం జరపాలని, ఆయా రంగాల్లో నిపుణులు, ఆచార్యుల అభిప్రాయాలను తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించిన దరిమిలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు విలేకరులకు చెప్పారు. తాను, సీఆర్‌డీఏ కమిషనర్‌ శ్రీధర్‌ తదితరులు మంగళవారం రాత్రి లండన బయల్దేరుతున్నామని, అమరావతి ప్రాథమిక డిజైన్లు అందజేసి, తుది డిజైన్ల రూపకల్పన కసరత్తులో ఉన్న మాస్టర్‌ ఆర్కిటెక్ట్‌ నార్మన ఫోస్టర్‌ ప్లస్‌ పార్ట్‌నర్స్‌ సంస్థతో సంప్రదింపులు జరుపుతామని తెలిపారు.
Link to comment
Share on other sites

రాజధాని నిర్మాణంలో మరో కీలక అడుగు
 
అమరావతి: రాజధాని నిర్మాణంలో మరో కీలక అడుగు పడింది. సెక్రటేరియట్, హెచ్‌వోడీ భవనాల డిజైన్ల రూపకల్పన, ఆర్కిటెక్చర్ ఎంపికపై సీఆర్డీఏలో ప్రీబిడ్ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ఢిల్లీ, ముంబై, హైదరాబాద్‌కు చెందిన 11 సంస్థలు హాజరయ్యాయి. 9,22,594 చదరపు అడుగుల్లో సచివాలయ భవనం నిర్మించనున్నారు. 29,66,682 చదరపు అడుగుల్లో హెచ్‌వోడీ భవనాలు, కోర్ క్యాపిటల్‌లో 4 మిలియన్ చదరపు అడుగుల భవనాల డిజైన్లపై చర్చించారు. కాన్సెప్ట్ డిజైన్, ఇంటీరియర్స్, ల్యాండ్‌స్కేపింగ్ డిజైన్ల కోసం ప్రీబిడ్ సమావేశం నిర్వహించారు.
Link to comment
Share on other sites

మరో 11 ప్రధాన రహదారులు

71.75 కిలోమీటర్ల దూరం... 50 మీటర్ల వెడల్పు

రాజధానిలో రెండోదశ కింద నిర్మాణం

అంచనా వ్యయం రూ.1150 కోట్లు

త్వరలో టెండర్లకు ఆహ్వానం

ఈనాడు - అమరావతి

11ap-main17a.jpg

రాజధాని అమరావతిలో ప్రధాన రహదారుల నిర్మాణాలకు చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే మొదటి దశ కింద రూ.915 కోట్ల అంచనా వ్యయంతో ఏడు ప్రధాన రహదారులను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. రెండో దశలో మరో 11 ప్రధాన రహదారులను నిర్మాణం చేపట్టేందుకు కసరత్తు చేస్తున్నారు. ఏపీ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ), అమరావతి అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ ఆర్టీరియల్‌ రహదారులకు టెండర్లు పిలిచేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ 11 రోడ్లు అంచనా వ్యయం రూ.1150 కోట్లుగా నిర్ణయించారు. మొదటి దశలోని ఏడు ప్రధాన రహదారులకు నాలుగు ప్యాకేజీలుగా టెండర్లు పిలిచారు. ఉత్తర, తూర్పు రోడ్లుగా వీటిని నామకరణం చేశారు. దీనికి గుంటూరు జిల్లాలో గతనెల 29 న శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగానే మరో 11 రోడ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. రెండు దశల్లో మొత్తం 18 ప్రధాన రహదారులను వచ్చే ఏడాది నాటికి పూర్తి చేయాలని ముఖ్యమంత్రి తాజాగా ఆదేశాలు జారీచేశారు.

రెండు ప్యాకేజీలు!

రెండోదశ కింద నిర్మించే 11 రోడ్లను రెండు ప్యాకేజీలుగా విభజించి టెండర్లు పిలవాలని నిర్ణయించారు. వీటి అంచనా వ్యయం రూ.1150 కోట్లుగా నిర్ణయించినా...కొన్ని వంతెనలు, కల్వర్టులు అదనంగా చేర్చే అవకాశం ఉండటంతో ఇది రూ.1450 కోట్లకు చేరవచ్చని భావిస్తున్నారు.

ఇవీ నిర్మాణ విశేషాలు..

* ఈ ప్రధాన రహదారులు తూర్పు, ఉత్తర దిశలో నిర్మించనున్నారు. వీటికి ఎన్‌(నార్త్‌), ఈ (ఈస్ట్‌) అని సాంకేతికంగా నామకరణం చేశారు.

* మొదటి ప్యాకేజీలో ఇ-2, ఇ-4, ఇ8, ఎన్‌18, ఎన్‌11, పేర్లతో చేపట్టే రోడ్లు దాదాపు 40.82 కిలోమీటర్లు నిర్మించాల్సి ఉంది. మరో ఆరు రోడ్లు ఇ12, ఇ15, ఎన్‌1, ఎన్‌2, ఎన్‌5, ఎన్‌7 రోడ్లు రెండో ప్యాకేజీలో చేర్చారు. వీటి పొడవు 30.93 కిలోమీటర్లు దూరం.

* మొదటి దశలోని 66.22 కిలోమీటర్లు, రెండో దశలో 71.75 కిలోమీటర్లు కలిపి మొత్తం 137.97 కిలోమీటర్ల దూరం రహదారులు ఏర్పాటు చేయనున్నారు. దీనికి అదనంగా సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు నిర్మిస్తున్నారు.

* ప్రధాన రహదారులు అన్నీ ఆరు వరసలుగా నిర్మాణం చేయాలనేది ప్రభుత్వ నిర్ణయం. కొన్నిటిని మాత్రం నాలుగు వరసలుగా ఏర్పాటు చేస్తున్నారు. ప్రధాన ఆర్టీరియల్‌ రోడ్లు 60 మీటర్లు, స్పీడ్‌ యాక్సెస్‌ రోడ్లు 60 మీటర్ల వెడల్పు నిర్మాణం చేస్తున్నారు. మరికొన్ని

* 50 మీటర్లు వెడల్పుతో ఉంటాయి. రాజధానికి ఏప్రాంతం నుంచి వచ్చినా త్వరితగతిన చేరుకొనేవిధంగా ఈ రోడ్లు ఉపయోగపడనున్నాయి. ఆయా గ్రామాల మధ్య నుంచి వెళ్లడంతో గ్రామాల్లోనూ మౌలిక వసతులు మెరుగుపడతాయని భావిస్తున్నారు.

* ఈ ప్రధాన రహదారులను అమరావతి అభివృద్ధి సంస్థ (ఏడీసీ) పర్యవేక్షిస్తోంది. రహదారులను అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మాణం చేయడంతో పాటు పచ్చదనానికి ప్రాధాన్యం ఇవ్వనున్నారు. మొదటి దశలో నిర్మాణం చేయనున్న ఏడు రహదారులకు రూ.6.93 కోట్లు వెచ్చించి మొక్కలు నాటేందుకు ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం దాదాపు 69,500 మొక్కలను తెప్పించేందుకు ఏడీసీ ప్రణాళిక రూపొందించింది.

Link to comment
Share on other sites

అమరావతి డిజైన్లపై మంత్రి నారాయణ లండన్ ప్రతినిధులతో చర్చ
 
అమరావతి: ఏపీ మంత్రి నారాయణ, ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్‌ లండన్‌ చేరుకున్నారు. నార్మన్‌ ఫోస్టర్‌ కార్యాలయంలో ప్రతినిధులతో సమావేశమయ్యారు. రాజధాని అమరావతి డిజైన్లపై చర్చిస్తున్నారు.
Link to comment
Share on other sites

లండన్‌లో మంత్రి నారాయణ బృందం పర్యటన
 
అమరావతి: లండన్‌లో మంత్రి నారాయణ బృందం పర్యటన కొనసాగుతోంది. అమరావతి రాజధాని డిజైన్లపై నార్మన్ ఫోస్టర్ ప్రతినిధులతో మంత్రి నారాయణ బృందం చర్చిస్తోంది. తెలుగు సంస్కృతీ సంప్రదాయాలపై పరకాల ప్రజెంటేషన్ ఇచ్చారు.
Link to comment
Share on other sites

మూడు సరికొత్త నమూనాలు

శాసనసభ భవనంపై గోపురం వంటి నిర్మాణాలు

లండన్‌లో పరిశీలించిన మంత్రి నారాయణ

13ap-main9a.jpg

ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిలో నిర్మించే శాసనసభ, మండలి సంయుక్త భవనానికి నార్మన్‌ ఫోస్టర్‌ సంస్థ మూడు సరికొత్త నమూనాల (డిజైన్‌)ను రూపొందించింది. లండన్‌లోని సంస్థ ప్రధాన కార్యాలయంలో గురువారం మంత్రి నారాయణ ఆధ్వర్యంలోని ఉన్నత స్థాయి బృందం ఈ నమూనాలను పరిశీలించింది. 900 ఎకరాల విస్తీర్ణంలోని పాలన నగరంలో ప్రభుత్వ భవన సముదాయాలకు ఈ సంస్థ నమూనాలు రూపొందిస్తున్న విషయం తెలిసిందే. పాలన నగరంలో కృష్ణా నది నుంచి దక్షిణం వైపు మూడు బ్లాకుల లోపల శాసనసభ, మండలి భవనం రానుంది. మూడు నమూనాల్లోనూ భవనాలపైన గోపురం వంటి (ఐఫిల్‌ టవర్‌లా కనిపించే) భారీ నిర్మాణం ఉంది. ఈ నమూనాలపై మంత్రి నారాయణ బృందం సంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. వీటిపై ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చించాక వీటిలో ఒకదానిని ఎంపిక చేసే అవకాశముంది. లండన్‌లో పట్టణాభివృద్ధికి అనుసరిస్తున్న విధానాలపైనా అక్కడి అధికారులతో నారాయణ బృందం చర్చించింది. మూడు రోజుల వీరి పర్యటన శుక్రవారంతో ముగియనుంది. ఈ పర్యటనలో ప్రభుత్వ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్‌, రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) కమిషనర్‌ శ్రీధర్‌, అదనపు కమిషనర్‌ మల్లికార్జున్‌ ఉన్నారు.

13ap-main9b.jpg
 
Link to comment
Share on other sites

అదనంగా 450 ఎకరాలకు ఆకృతులు
పరిపాలన నగరానికి కొనసాగింపు
శాసనసభ భవనం వచ్చేది దీనిలోనే
మే 10కి శాసనసభ, హైకోర్టు ఆకృతులు
మూడేసి ఆకృతులతో రానున్న నార్మన్‌ ఫోస్టర్‌ సంస్థ
ఈనాడు - అమరావతి

రాజధాని అమరావతిలో 900 ఎకరాల పరిపాలనా నగరానికి స్థూల ప్రాధమిక ప్రణాళిక రూపొందించిన లండన్‌కు చెందిన నార్మన్‌ ఫోస్టర్‌ అండ్‌ పార్ట్‌నర్స్‌ సంస్థ... దానికి కొనసాగింపుగా మరో 450 ఎకరాలకూ ప్రణాళిక సిద్ధం చేస్తోంది. 450 ఎకరాలు న్యాయనగరంలో భాగంగా ఉంటుంది. హైకోర్టు ఇందులోనే వస్తుంది. ఈ 1350 ఎకరాలకు పూర్తిస్థాయి ప్రణాళికతో పాటు, మకుటాయమాన భవనాలుగా నిర్మించే హైకోర్టు, శాసనసభ ఆకృతుల్ని నార్మన్‌ ఫోస్టర్‌ సంస్థ త్వరలోనే అందజేయనుంది. పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ నేతృత్వంలో సీఆర్‌డీఏ అధికారుల బృందం ఇటీవల లండన్‌ వెళ్లి ఆకృతుల్ని పరిశీలించి వచ్చింది. శాసనసభ, హైకోర్టు భవనాలకు సంబంధించి ఆ సంస్థ ఒక్కొక్క ప్రాథమిక ఆకృతిని సిద్ధం చేసింది. ఈ రెండు భవనాలకు మూడేసి ఆకృతులు సిద్ధం చేయాలని, వాటిలో ఉత్తమమైన వాటిని ఎంపిక చేస్తామని నారాయణ సూచించారు. దానికి అదనంగా మరో రెండు వారాలు(మే 10) గడువు కావాలని నార్మన్‌ ఫోస్టర్‌ సంస్థ కోరింది. షెడ్యూల్‌ ప్రకారం ఆ సంస్థ ఈ నెలాఖరుకి ఆకృతులు అందించాల్సిఉంది.

ప్రణాళిక దాదాపు సిద్ధం..!
పరిపాలనా నగరాన్ని 900 ఎకరాల్లో నాలుగు బ్లాకులుగా విభజించి ప్రణాళిక రూపొందించిన నార్మన్‌ ఫోస్టర్‌ సంస్థ, ప్రభుత్వ సూచన మేరకు దానికి కొనసాగింపుగా 450 ఎకరాల్ని రెండు బ్లాకులుగా విభజించి ప్రణాళిక సిద్ధం చేస్తోంది. వాస్తు సూత్రాలను అనుసరించి స్థూల ప్రాథమిక ప్రణాళికలో సీఆర్‌డీఏ అధికారుల బృందం కొన్ని మార్పులు సూచించింది. 1350 ఎకరాలకు ప్రణాళిక దాదాపుగా సిద్ధమైనట్టేనని, నార్మన్‌ ఫోస్టర్‌ సంస్థ మే 10న పూర్తిస్థాయి ప్రణాళికతో వస్తుందని సీఆర్‌డీఏ అధికారులు తెలిపారు. 900 ఎకరాల పరిపాలనా నగరంలో దక్షిణ దిశలో ఉన్న మొదటి బ్లాక్‌లో నైరుతి దిశలోనే సచివాలయం, ఆగ్నేయంలో విభాగాధిపతుల కార్యాలయం, వాటి మధ్యలో శాసనసభ భవనం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ముఖ్యమంత్రి, గవర్నర్‌ నివాసాలు కూడా ఈ బ్లాకులోనే ఉంటాయి. పరిపాలనా నగరంలో కాలువల్లో నీరు స్థిరంగా కాకుండా, నిరంతరం ప్రవహించేలా ఉంచాలంటే ఏం చేయాలన్న కోణంలో నార్మన్‌ ఫోస్టర్‌ సంస్థతో సీఆర్‌డీఏ అధికారులు చర్చించారు. రెండు మూడు రోజుల్లో మరో సమావేశం నిర్వహిస్తున్నారు. దీనిలో నార్మన్‌ ఫోస్టర్‌ సంస్థ ప్రతినిధి, రాజధాని బ్లూకన్సల్టెంట్‌ టాటా ఆర్కాడిస్‌ సంస్థ ప్రతినిధి, నీటిపారుదల శాఖ అధికారులు పాల్గొంటారు.

విలక్షణం సచివాలయ భవనం
నార్మన్‌ ఫోస్టర్‌ సంస్థ నాలుగు వైపులా నాలుగు నిర్మాణాలు, వాటిపైన పొడవైన ఓ టవర్‌ ఉండేలా ఆకృతి రూపొందించింది. ఆ నాలుగు నిర్మాణాల్లో ఒకటి శాసనసభ, మరొకటి శాసనమండలి, ఇంకొకటి సెంట్రల్‌ హాల్‌, మరొకటి కార్యాలయ భవనాలుగా పేర్కొంది. ఈ నాలుగు నిర్మాణాలకు మధ్యలో సుమారు 5 ఎకరాల ఖాళీస్థలం ఉటుంది. దీన్ని పబ్లిక్‌ స్క్వేర్‌గా తీర్చిదిద్దుతారు. ఈ నాలుగు నిర్మాణాలపైనా... సుమారు 160 అడుగులు ఎత్తైన టవర్‌ వస్తుంది. ఈ టవర్‌పైకి వెళ్లేందుకు మెట్లు, లిఫ్ట్‌లు ఉంటాయి. టవర్‌ మధ్యలో ఒక చోట 100 మంది కూర్చునేలా వీక్షణప్రాంతం(వ్యూడెక్‌) ఉంటుంది. అక్కడి నుంచి చూస్తే నగరమంతా కనిపిస్తుంది. సందర్శకుల్ని దీనిలోకి అనుమతిస్తారు. టవర్‌కు రంధ్రాలు ఉంటాయి. టవర్‌ అడుగు భాగం నుంచి గాలి లోపలికి ప్రవేశించి, ఈ రంధ్రాల ద్వారా బయటకు వచ్చేలా దీన్ని అభివృద్ధి చేస్తున్నారని, నిరంతర గాలి ప్రవాహం ఈ ప్రాంతాన్ని చల్లగా ఉంచేందుకు దోహదం చేస్తుందని సీఆర్‌డీఏ అధికారులు పేర్కొన్నారు.

Link to comment
Share on other sites

తుది డిజైన్లు వచ్చేస్తున్నాయ్‌!
 
636280735670743020.jpg
  • మే 2వ వారంలో ఇవ్వనున్న నార్మన్‌ ఫోస్టర్‌
  • తుది దశలో గవర్నమెంట్‌ కాంప్లెక్స్‌ మాస్టర్‌ ప్లాన్‌
  • 2-3 డిజైన్లను అందించనున్న మాస్టర్‌ ఆర్కిటెక్ట్‌
  • అత్యుత్తమమైన వాటిని ఖరారు చేయనున్న సీఎం
అమరావతి, ఏప్రిల్‌ 17 (ఆంధ్రజ్యోతి): నవ్యాంధ్ర రాజధానిలో 900 ఎకరాల్లో నిర్మించనున్న గవర్నమెంట్‌ కాంప్లెక్స్‌కు మాస్టర్‌ ప్లానను, అందులోని రెండు ఐకానిక్‌ భవంతులైన అసెంబ్లీ, హైకోర్టులకు సంబంధించిన తుది డిజైన్లను మాస్టర్‌ ఆర్కిటెక్ట్‌ నార్మన ఫోస్టర్‌ ప్రతినిధులు మే రెండో వారంలో అందజేయనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. వాస్తవానికి వీటిని ఈ నెల 20- 25 తేదీల మధ్య సమర్పిస్తారని తొలుత భావించినప్పటికీ మరింత పక్కాగా, సృజనాత్మకంగా డిజైన్లను రూపొందించే ఉద్దేశంతో సుమారు 2 వారాలు ఆలస్యంగా వాటిని ఇవ్వనున్నట్లు సమాచారం. రెండు మూడు డిజైన్లను రూపొందించి అందజేయనున్నట్లు తెలిసింది. వాటిలో అత్యుత్తమమైన డిజైన్‌ను సీఎం ఖరారు చేయనున్నారు.
ఇప్పటికే ఫైనల్‌ డిజైన్ల రూపకల్పన ప్రక్రియ దాదాపు ఒక కొలిక్కి వచ్చింది. ఇటీవల లండనకు వెళ్లిన రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి, సీఆర్డీయే ఉపాధ్యక్షుడైన పి. నారాయణ, సీఆర్డీయే కమిషనర్‌ శ్రీధర్‌, తదితరులకు నార్మన ఫోస్టర్‌ ప్రతినిధులు తాము రూపొందించిన గవర్నమెంట్‌ కాంప్లెక్స్‌ మాస్టర్‌ ప్లాన, 2 ఐకానిక్‌ భవంతుల ముసాయిదా డిజైన్లను చూపించారు. అవి బాగానే ఉన్నాయన్న వారు మరింత మెరుగ్గా వాటిని రూపొందించేందుకు అవసరమైన సూచనలిచ్చారు. ప్రధానంగా అసెంబ్లీ భవనపు ఆకృతులు అమరావతికే ఒక ఐకానగా ఉండాలన్న సీఎం చంద్రబాబు ఆకాంక్షను నార్మన ఫోస్టర్‌కు తెలియజేసి, తదనుగుణంగా మార్పుచేర్పులు చేయాలని కోరారు. ఈ డిజైన్లను మే 2వ వారంలో నార్మన ఫోస్టర్‌ సంస్థ రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించనుంది. వాటిని పరిశీలించిన అనంతరం వాటిల్లో ఒక దానికి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలుపుతుందని సమాచారం.
 
ప్రభుత్వానికి సమర్పించే గవర్నమెంట్‌ కాంప్లెక్స్‌ మాస్టర్‌ ప్లానలో.. ఎక్కడెక్కడ ఏయే భవంతులు (అసెంబ్లీ, హైకోర్టు, సెక్రటేరియట్‌, హెచవోడీల కార్యాలయాలు, రాజ్‌భవన, సీఎం, మంత్రులు, శాసనసభ్యులు, ఉన్నతాధికారులు, ఉద్యోగుల నివాసాలు ఇత్యాదివి) ఉండాలి, వాటి మధ్య ఖాళీ ఎంతుండాలి, రహదారులు, పచ్చదనం, జలవనరులు, పబ్లిక్‌ స్పేస్‌లు ఒక్కొక్కటి ఎంతెంత విస్తీర్ణంలో ఉండాలన్న విషయాన్ని వివరించనున్నారు. దాంతోపాటు అసెంబ్లీ, హైకోర్టు భవనాలకు సంబంధించిన ఆకృతులు, ఎలివేషన్లు, ప్రవేశద్వారాలు, ఇంటీరియర్లు, తదితర అంశాలకు సంబంధించిన సూక్ష్మ, సవివర ఆకృతులు (డిటైల్డ్‌ డిజైన్లు) ఇవ్వనున్నారు. నార్మన్‌ ఫోస్టర్‌ రూపొందించే డిజైన్లలో మన సంస్కృతి, సంప్రదాయాలు, నిర్మాణరీతులు, శిల్పకళ ఇత్యాది అంశాలు ఉండేలా చూడాలని ప్రభుత్వం భావిస్తోంది.
Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...