Jump to content

Amaravati

Recommended Posts

పారదర్శకంగా అమరావతి ప్రాజెక్టుల ‘పురోగతి’
12-03-2018 06:41:08
 
636564336665789181.jpg
  • రాజధానిలో ఆర్థిక ప్రాజెక్టుల ప్రస్తుత స్థితి విడుదల
  • మొత్తం 1,260.84 ఎకరాల భూమి కేటాయింపు
  • వివరాలు సీఆర్డీయే వెబ్‌సైట్‌లో..
 
అమరావతి రాజధాని పరిధిలో నిర్మాణం జరుగుతున్న ఆర్థిక ప్రాజెక్టుల పురోగతి, ప్రస్తుతస్థితిని సీఆర్డీయే విడుదల చేసింది. మొత్తం 46 ప్రాజెక్టులకు భూములు కేటాయింపులకు సంబంధించిన పూర్తి వివరాలతో నివేదికని నెటిజన్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ సంస్థలకు మొదటి దశలో 910.84 ఎకరాలు, రెండో దశలో 350 ఎకరాలు కలిపి మొత్తం 1,260.84 ఎకరాల భూమిని కేటాయించనుంది. గతంలో మరే ఇతర ప్రభుత్వ సంస్థ చేయని విధంగా ప్రాజెక్టుల స్థితిగతులను పబ్లిక్‌ డొమైన్‌లోకి తీసుకొచ్చి పారదర్శకాన్ని ప్రదర్శిస్తోంది. ఈ నివేదిక వలన రాజధానిలో ఏ ప్రాజెక్టు ఎంతవరకు పూర్తి అయిందనేది ప్రపంచంలో ఎక్కడి నుంచి అయినా తెలుసుకోవచ్చు.
 
గుంటూరు: రాజధాని నగర పరిధిలో సీఆర్డీయే ప్రప్రథమంగా వెల్లూరు ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(విట్‌)కి భూములు కేటాయించింది. ఇంటిగ్రేటెడ్‌ మల్టీ డిసిప్లినరీ యూనివర్సిటీ స్థాపనకు రెండు దశల్లో 100 ఎకరాల చొప్పున 200 ఎకరాల భూములు ఇచ్చేందుకు ఒప్పందం చేసుకొన్నది. ఎకరం రూ.50 లక్షలకు భూములు కేటాయించింది. అగ్రిమెంట్‌ ప్రకారం సంవత్సరంలో మూడు లక్షల చదరపు అడుగుల నిర్మాణాలు ఈ సంస్థ పూర్తి చేసింది. 2017 జూలైలోనే ఎకడమిక్‌ తరగతులను ప్రారంభించింది.
 
    రాజధానిలో రెండో విద్యాసంస్థ అయిన ఎస్‌ఆర్‌ఎం యూనివర్శిటీకి కూడా రెండు దశలో 100 ఎకరాల చొప్పున 200 ఎకరాలు ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకొంది. ఈ సంస్థకు కూడా ఎకరం రూ.50 లక్షలకు విక్రయించింది. నీరుకొండలోని కురగల్లులో ఏడాది వ్యవధిలో ఏడు లక్షల చదరపు అడుగుల నిర్మాణాలు పూర్తి చేసింది. అగ్రిమెంట్‌ ప్రకారం 2017లోనే తరగతులు ప్రారంభించింది. అమృత యూనివర్సిటీకి మొదటి దశలో 150 ఎకరాలు, రెండో దశలో 50 ఎకరాల భూమిని ఎకరం రూ.50 లక్షలకు కేటాయించింది. ఇటీవలే ఈ సంస్థ నిర్మాణానికి నవులూరులో శంకుస్థాపన జరిగింది. యాక్సెస్‌ రోడ్డు, విద్యుత్‌, తాగునీటి సరఫరా అనుమతులు వచ్చాయి.
 
    కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ అయిన నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్‌ సంస్థకు 50 ఎకరాల భూమిని ఉచితంగానే ఇచ్చింది. శాకమూరులో నిర్మాణానికి అనుమతులు తీసుకొని పనులు ప్రాంభించింది. ఇండో - యూకే ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీకి మొదటి దశలో 50 ఎకరాలు, రెండో దశలో 100 ఎకరాల భూమిని ఎకరం రూ.50 లక్షలకు కేటాయించింది. యర్రబాలెంలో ఈ సంస్థ నిర్మాణానికి భూసార పరీక్షలు పూర్తి అయ్యాయి. శంకుస్థాపన కార్యక్రమంగా కూడా జరిగింది. మాస్టర్‌ ప్లానింగ్‌ అనుమతులు ప్రక్రియ ప్రారంభమైంది.
 
    బీఆర్‌ఎస్‌ మెడిసిటీ అండ్‌ హెల్త్‌కేర్‌ రీసెర్చ్‌ ప్రైవేటు లిమిటెడ్‌కు 100 ఎకరాల భూమిని ఎకరం రూ.50 లక్షలకు కేటాయించింది. పిచ్చుకలపాలెంలో శంకు స్థాపన జరగ్గా అనుమతులు కూడా వచ్చాయి. అయితే ఇంకా నిర్మాణ పనులు ప్రారంభం కావాల్సి ఉన్నది.
 
    సబ్‌ డివిజనల్‌ పోలీసు ఆఫీసు నిర్మాణానికి 1.50 ఎకరాల భూమిని కేటాయించారు. వెలగపూడి, మల్కాపురం వద్ద శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ స్మృతివనానికి 20 ఎకరాల భూమిని శాకమూరులో కేటా యించింది. మాష్టర్‌ప్లాన్‌, డిజైన్స్‌ ప్రక్రియ తుదిదశలో ఉన్నది. సెంట్రల్‌ పబ్లిక్‌ వర్క్సు డిపార్టుమెంట్‌కు 28 ఎకరాల భూమిని రాయ పూడిలో ఎకరం రూ.లక్షకు కేటాయించింది. అయితే ఇంకా కొన్ని ఆటంకాలు ఉన్నందున భూమిని స్వాధీనపరచలేదు. భారతీయ రిజర్వు బ్యాంకుకు 11 ఎకరాల భూ మిని రాయపూడిలో ఆఫీసు, ఐన వోలులో నివాసాలకు కేటా యించింది. ఇంకా భూమిని స్వాధీనపరచలేదు. బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్‌ (బీఐఎస్‌) సంస్థకు 0.3 ఎకరాల భూమిని శాఖమూరులో ఎకరం రూ.లక్షకు కేటాయించింది. ఇండియన్‌ నేవీకి కూడా 15 ఎకరాల భూమిని రాయ పూడిలో ఎకరం రూ.లక్ష చొప్పున కేటా యించింది. పోస్ట ల్‌ శాఖకు 5.5 ఎకరాల భూ మిని రాయ పూడిలో ఎక రం రూ.లక్షకు నేలపాడు లో, భారత ఆహార సంస్థకు 1.1 ఎకరాల భూమిని ఎకరం రూ.4 లక్షలకు రాయపూడి, వెలగపూడిలో, ఎల్‌ఐసీకి 0.75 ఎకరాల భూమిని ఎకరం రూ.4 లక్షలకు రాయపూడి, తుళ్లూరులో, స్టేట్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియాకు 3.3 ఎకరాల భూమిని ఎకరం రూ.4 లక్షల చొప్పున రాయపూడి, అనంతవరం గ్రామాల్లో కేటాయించింది.
 
    ఆంధ్రాబ్యాంకుకు 2.65 ఎకరాల భూమిని రాయపూడి, వెలగపూడిలో, బ్యాంకు ఆఫ్‌ ఇండియాకు 1.5 ఎకరాల భూమిని రాయపూడి, తుళ్లూరులో, నాబార్డుకు 4.3 ఎకరాల భూమిని రాయపూడి, తుళ్లూరు గ్రామాల్లో కేటాయించింది. సీఏజీకి 17 ఎకరాలు ఎకరం రూ.లక్షకు రాయపూడి, ఐనవోలులో కేటాయించింది. న్యూ ఇండియా ఎస్యూరెన్స్‌ కంపెనీకి 1.93 ఎకరాల భూమిని ఎకరం రూ.4 లక్షలకు రాయపూడి, వెలగపూడిలో ఇచ్చింది. హిందూస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమి టెడ్‌కు 0.5 ఎకరాల భూమిని ఎకరం రూ. 4 లక్ష లకు నేలపాడులో ఇచ్చిం ది. సిండికేట్‌ బ్యాంకుకు 1.3 ఎకరాలను ఎకరం రూ.4లక్షలకు రాయపూడి, తుళ్లూరులో, ఏపీఎన్‌ఆర్‌టీ సొసైటీకి ఐదు ఎకరాలు భూమిని ఎకరం రూ.2 లక్షలకు రాయపూడిలో, ఆప్కాబ్‌కు నాలుగు ఎకరాల భూమిని ఎకరం రూ.2 లక్షలకు రాయపూడి, నేలపాడులో కేటాయించింది. ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌కు 0.4 ఎకరాల భూమిని మందడంలో, రాష్ట్ర పురావస్తు శాఖ ప్రదర్శనశాలకు 9 ఎకరాల భూమిని ఉచి తంగా రాజధానిలో ఎక్కడైనా ఇచ్చేందుకు సీఆర్డీయే అంగీకారం తెలిపింది. ఏపీ స్టేట్‌ సివిల్‌ సప్లయిస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌కు నూనెల రిటైల్‌ అవుట్‌లెట్‌ స్థాపనకు 0.4 ఎక రాల భూమిని వెలగపూడిలో కేటాయించింది.
 
    ప్రముఖ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పీవీ సింఽధూకు 0.2 ఎకరాల భూమిని ఉచితంగా వెలగపూడిలో కేటాయించింది. నిఫ్ట్‌ సంస్థకు 10 ఎకరాల భూమిని ఉచితంగా నెక్కల్లులో, రీజనల్‌ ఆఫీసు అండ్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ సంస్థకు ఎకరం భూమిని రూ.నాలుగు లక్షల చొప్పున తుళ్లూరులో, రాష్ట్ర ఫొరెన్‌సిక్‌ సైన్స్‌ లేబొరేటరీకి మూడు ఎకరాల భూమిని తు ళ్లూరులో మంజూరు చేసింది. నందమూరి బసవతారక రామారావు మెమోరియల్‌ క్యాన్సర్‌ ఫౌండేషన్‌కు 15 ఎకరాల భూమిని ఎకరం రూ.25 లక్షలకు తుళ్లూరు, అనంతవరంలో కేటాయించింది.
 
   గ్జేవియర్‌ స్కూల్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌కు 50 ఎకరాల భూమిని ఎకరం రూ.లక్షకే ఐనవోలులో ఇచ్చింది. గోపిచంద్‌ బ్యాడ్మిటన్‌ అకాడమికి 12 ఎకరాల భూమిని ఎకరం రూ.10 లక్షలకు వెంకటపాలెంలో కేటా యించింది. బ్రహ్మకుమారి ఈశ్వరీ సంస్థకు ఇటీవలే 10 ఎకరాల భూమిని ఎకరం రూ.10 లక్షలకు తుళ్లూరులో కేటా యించగా శంకు స్థాపన కార్యక్రమం కూడా పూర్తయింది. బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడు కిడాంబి శ్రీకాంత్‌కు 0.21 ఎకరాల భూమిని నివాసం కోసం వెలగపూడిలో కేటాయించింది. హైదరాబాద్‌ నేత్ర సంస్థకు 12 ఎకరాల భూమిని ఎకరం రూ.25 లక్షలకు అబ్బరాజుపాలెంలో, హెచ్‌సీఎల్‌ టెక్నా లజీస్‌కు 20 ఎకరాల భూ మిని ఎకరం రూ.50 లక్షలకు శాఖమూరులో, సివిల్‌ సర్వీసెస్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌కు నాలుగెకరాల భూమిని ఎకరం రూ.10 లక్షలకు రాజధానిలో ఎక్కడైనా ఇచ్చేందుకు అంగీకారం తెలిపింది.
 
    నేషనల్‌ బయోడైవర్సిటీ మ్యూజియంకు 25 ఎకరాలు, కేంద్రీయ విద్యాలయ-1కు ఐదు ఎకరాలు తుళ్లూరులో, కేంద్రీయ విద్యా లయ-2కు ఐదు ఎకరాలు నేలపాడులో, ఏపీ మానవవనరుల అభివృద్ధి సంస్థకు 25 ఎకరాల భూమిని రాజధానిలో ఎక్కడైనా ఉచి తంగానే కేటాయించేందుకు సీఆర్‌డీఏ అంగీ కరించింది. అయితే ఈ ప్రాజెక్టు గన్నవరం మండలంలోని కొండపావులూరుకు తరలిం చాలని తాజాగా నిర్ణయించారు. తిరుమల తిరుపతి దేవస్థానంకు వెంకటేశ్వరస్వామి ఆలయం నిర్మాణం నిమిత్తం 25 ఎకరాల భూమిని ఎకరం రూ.50 లక్షలకు ఇబ్రహీంపట్నంలోని పవిత్ర సంగమం వద్ద కేటాయించింది. సెంట్రల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టూల్‌ డిజైన్‌ సంస్థకు ఐదు ఎకరాల భూమిని నెక్కల్లులో కేటాయించేందుకు అంగీకారం కుదుర్చుకొన్నారు.
Link to comment
Share on other sites

నిర్మాణ పనులు ప్రారంభమెప్పుడు?
11-03-2018 03:11:28
 
  • ఇండో-యూకే హెల్త్‌ ఇన్‌స్టిట్యూట్‌..
  • బీఆర్‌ షెట్టి మెడిసిటీ సంస్థలకు సీఆర్డీయే నోటీసులు
  • విదేశీ విద్యాభాగస్వామిని పెట్టుకోవడంలో అవి విఫలం
  • భూకేటాయింపులు రద్దయ్యే ప్రమాదం!
అమరావతి, మార్చి 10(ఆంధ్రజ్యోతి): నవ్యాంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిని అంతర్జాతీయస్థాయి వైద్యవిద్య, చికిత్సలకు కేంద్రంగా మార్చడంలో కీలకపాత్ర పోషిస్తాయని భావించిన రెండు ప్రఖ్యాత సంస్థలకు రాజధానిలో కేటాయించిన భూములు రద్దయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి! వాటికి భూములు కేటాయించి నెలలవుతున్నప్పటికీ నిర్మాణపనులను ప్రారంభించడంలో ఆయా సంస్థల యాజమాన్యాలు విఫలమవడంతో ఏపీసీఆర్డీయే వాటికి నోటీసులు జారీ చేసింది. నిర్దిష్ట గడువులోగా పనులు ప్రారంభించకపోవడంతో ఒప్పందంలో పేర్కొన్న నిబంధనలను అవి ఉల్లంఘించినట్లయిందని, ఇకనైనా ఏమాత్రమూ ఆలస్యం చేయకుండా నిర్మాణాన్ని చేపట్టకపోతే భూకేటాయింపులను రద్దు చేస్తామని హెచ్చరించింది. ఇదే విషయాన్ని రాజధానిలో వివిధ సంస్థలకు జరిపిన భూకేటాయింపులు, తదనంతర చర్యలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కొద్ది రోజుల క్రితం అసెంబ్లీలో ఇచ్చిన సవివర స్టేటస్‌ రిపోర్ట్‌లోనూ పేర్కొంది.
 
అంతులేని అన్వేషణ
అమరావతిలో వరుసగా 1,000, 1500 పడకల సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులతో సహా వందలాదిమంది విద్యార్థులకు అత్యధునాతన వైద్య విద్యనందించే వైద్య కళాశాలలు, నర్సింగ్‌ విద్యాసంస్థలు, ఇతర అనుబంధ సంస్థలను నెలకొల్పుతామంటూ ఇండో-యూకే హెల్త్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌, బీఆర్‌ షెట్టి మెడిసిటీ హెల్త్‌కేర్‌ అండ్‌ రిసెర్చ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థలు సీఆర్డీయేతో లెటర్‌ ఆఫ్‌ ఇంటెంట్‌ (ఎల్‌ఓఐ)లను కొన్ని నెలల క్రితం కుదుర్చుకున్నాయి. అవి స్థాపించబోయే సంస్థల ఆధారంగా ఇండో-యూకే హెల్త్‌ ఇన్‌స్టిట్యూట్‌కు మొత్తం 150 ఎకరాలు (తొలి దశలో 50, మలి దశలో 100 ఎకరాలు), బీఆర్‌ షెట్టి మెడిసిటీకి ఒకే దశలో 100 ఎకరాలను ఎకరాకు రూ.50 లక్షల చొప్పున ప్రభుత్వం కేటాయించింది. ఒప్పందం ప్రకారం ఆయా సంస్థల యాజమాన్యాలు తమ ప్రాజెక్టులకు సంబంధించిన పనులను ఇప్పటికే ప్రారంభించాల్సి ఉంది. అయితే ఈ రెండు సంస్థలు ప్రవాస భారతీయులకు చెందినవైనందున నిర్మాణ పనులు చేపట్టేముందే ఒక విదేశీ విద్యా భాగస్వామి(ఫారిన్‌ అకడమిక్‌ పార్ట్‌నర్‌)ను కుదుర్చుకోవాలన్న నిబంధనను ఎల్‌ఓఐలో సీఆర్డీయే విధించింది. అయితే, ఎంతగా ప్రయత్నించినా ఈ విషయంలో ఆ సంస్థలు సఫలీకృతం కాలేకపోయాయి. దీంతో విదేశీ విద్యాభాగస్వామిని ఎంపిక చేసుకుని, నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలని, లేనిపక్షంలో భూకేటాయింపులను రద్దు చేస్తామంటూ సీఆర్డీయే కొన్ని రోజుల క్రితం ఈ సంస్థలకు నోటీసులిచ్చింది. దీంతో, ఫారిన్‌ అకడమిక్‌ పార్ట్‌నర్‌ను కనుగొనేందుకు తమకు మరికొంత సమయమివ్వాల్సిందిగా సీఆర్డీయేను అవి కోరినట్లు తెలిసింది. అయితే భూములు కేటాయించి నెలలు గడిచినా ఆశించిన పురోగతి లేనందున సీఆర్డీయే అందుకు సుముఖంగా లేనట్లు తెలిసింది.

అమరావతిలో అందమైన భవంతులు
14-03-2018 09:08:23
 
636566153048225407.jpg
  • వెయ్యి అపార్ట్‌మెంట్ల నిర్మాణానికి సీఆర్డీయే నిర్ణయం
  • తక్కువ ధర.. ఆధునిక సౌకర్యాలతో నిర్మాణం
  • లావాదేవీల కోసం కన్సల్టెంట్‌ నియామకం
  • ఆర్‌ఎఫ్‌పీలను ఆహ్వానించిన సీఆర్డీయే
అమరావతి: రాజధానిలో అత్యాధునిక... నాణ్యమైన గృహాలను నిర్మించి, పూర్తి పారదర్శక విధానంలో తక్కువ ధరకే ప్రజలకు అందజేయాలనే లక్ష్యంతో ఉన్న ఏపీసీఆర్డీయే ఆ దిశగా అడు గులు వేస్తోంది. ఇందులో అమరావతిలో ఏపీసీ ఆర్డీయే నిర్మించదలచిన 1,000 అపార్ట్‌మెంట్లకు సంబంధించి వినియోగదారులతో తన తరపున లావాదేవీలు సాగించేందుకు కన్సల్టెంట్‌ సంస్థను నియమించుకోబోతోంది. వ్యాయామ శాలలు, ఈతకొలనులు, నడక మార్గాలు, క్లబ్‌ హౌస్‌లు తదితర సకల సౌకర్యాలతొ రూపుదిద్దు కోబోతున్న ఈ గృహాల ఖరీదు, చెల్లింపుల విధివిధానాలను సీఆర్డీయేనే ఖరారు చేస్తుంది. వీటిని అనుసరించి ఈ అపార్ట్‌మెంట్ల మార్కె టింగ్‌, వాటి క్రయవిక్రయాలకు సంబంధించిన డాక్యుమెంటేషన్‌ తదితర లావాదేవీలన్నీ ఈ కన్సల్టెన్సీ సంస్థ నిర్వహించాలి.
 
డిమాండ్‌ అసెస్‌మెంట్‌ తర్వాతే కన్సల్టెంట్‌
అమరావతిలో వివిధ వర్గాలు సొంత ఇంటిని కలిగి ఉండేలా చూడడంలో భాగంగా తొలిదశలో సుమారు 1,000 అపార్ట్‌మెంట్లు నిర్మించాలని సీఆర్డీయే నిర్ణయించింది. వీటిని ఒకేచోట నిర్మించాలా లేక రాజధానిలోని వివిధ ప్రాం తాల్లో కట్టాలా అనే విషయాన్ని ఇంకా ఖరారు చేయలేదు. ఈ ఫ్లాట్లలో ఎన్నెన్ని 2,3, 4 బెడ్‌రూంల అపార్ట్‌మెంట్లు ఉండాలో కూడా తేల్చలేదు. అయితే వెయ్యి అపార్ట్‌మెంట్లు కట్టాలని నిర్ణయించిన సీఆర్డీయే.. వాటిలో ఏ బెడ్‌ రూం ఫ్లాట్లకు ఎంత డిమాండ్‌ ఉందో తెలుసుకునేందుకు ‘డిమాండ్‌ అసెస్‌మెంట్‌ సర్వే’ చేయించబోతోంది. ఈ సర్వే రెండు మూడు వారాల్లో పూర్తవుతుంది. ఆ తర్వాత ఎన్ని బెడ్‌ రూంలతో ఫ్లాట్లు నిర్మించాలో నిర్ణయానికి వచ్చి.. వాటి ధరలను ఖరారు చేస్తుంది.
 
    ఈ ప్రక్రియ సాగుతుండగానే అపార్ట్‌మెంట్ల మార్కెటింగ్‌, అగ్రిమెంట్లు, సేల్‌ డీడ్లు, డాక్యుమెంటేషన్‌ తదితర వ్యవహారాలన్నింట్లో సహకరించేందుకు కన్సల్టెంట్‌ను నియమించు కుంటోంది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరొందిన కన్సల్టెంట్‌ను ఎంచుకునే నిమిత్తం ‘ఆర్‌.ఎఫ్‌.పి.(రిక్వెస్ట్‌ ఫర్‌ ప్రపోజల్స్‌)’లను ఆహ్వానిస్తూ ప్రకటన ఇచ్చింది. వీటి స్వీకరణకు ఈ నెల 28వ తేదీ వరకూ అవకాశమిచ్చింది. ఆ తర్వాత రెండు నెలల్లోపు కన్సల్టెంట్‌ను ఎంపిక చేసుకోనుంది. మరోవైపు అపార్ట్‌మెంట్లను నిర్మించే కంపెనీలను గుర్తించేందుకు టెండర్లు పిలిచి, అర్హతలున్న వాటికి బాధ్యతలు అప్ప గిస్తుంది. ఈ దశలన్నీ పూర్తయైు గృహ సముదాయాలు నివాసానికి సిద్ధమయ్యేందుకు ఏడాదికిపైగానే పట్టవచ్చునని తెలుస్తోంది.
 
కమర్షియల్‌ కాంప్లెక్స్‌లు సైతం..
ఎక్కడ డిమాండ్‌ ఉంటే అక్కడ రెసిడెన్షియల్‌ కాంప్లెక్స్‌లను నిర్మించాలనుకుంటున్న సీఆర్డీయే.. కమర్షియల్‌ కాంప్లెక్స్‌లను కట్టేందుకూ సమాయత్తమవుతోంది. పలు ప్రభుత్వరంగ, కార్పొరేట్‌ సంస్థలు తమ కార్యాలయ వసతి కోసం అమరావతిలో స్థలాలు కోరుతున్నప్పటికీ తనకున్న పరిమితుల దృష్ట్యా పెద్దసంఖ్యలో వాణిజ్య సముదాయాలను నిర్మించి, వాటిలోని ఆఫీస్‌ స్పేస్‌లను ఆసక్తి ఉన్న సంస్థలకు ఇవ్వాలనుకుంటోంది.
Link to comment
Share on other sites

రాజధాని నిర్మాణాలపై డెడ్‌లైన్..!
15-03-2018 09:00:00
 
636567012020100717.jpg
  • అమరావతిలో టవర్లు, ఇతర నిర్మాణాలపై డెడ్‌లైన్‌
  • పెట్టుబడులు, అభివృద్ధికి అగ్రశ్రేణి డెవలపర్లను గుర్తించండి
  • భూ కేటాయింపులు, ప్రాజెక్టుల పురోగతిపై సీఎం సమీక్ష
అమరావతి: రాజధానిలో నిర్మిస్తున్న వివిధ టవర్లు, నిర్మాణాలు డిసెంబరుకల్లా పూర్తయ్యేలా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. మంత్రులు, న్యాయమూర్తులు, ఉన్నతాధికారులు, ఉద్యోగుల కోసం నిర్మించ తలపెట్టిన బంగళాలు, గృహ సముదాయాల నిర్మాణాలను అప్పటిలోగా తుది దశకు చేరేలా చూడాలన్నారు. దేశంలో పేరొందిన 20 మంది అగ్రశ్రేణి డెవలపర్లను గుర్తించి వారు అమరావతిలో పెట్టుబడులు పెట్టేలా, స్థిరాస్తిరంగ అభివృద్ధికి చేయూతనిచ్చేలా కృషి చేయాలని చంద్రబాబు సూచించారు. టెండర్లను ఈ నెలాఖరుకల్లా పిలవాలని ఆదేశించారు. ఉండవల్లిలోని తన నివాసంలో ఏపీసీఆర్డీయే, ఏడీసీ అధికారులతో బుధవారం సీఎం సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. రాజధానిలోని వివిధ ప్రాజెక్టులు, సంస్థలకు భూకేటాయింపు ప్రక్రియలో పురోగతితోపాటు వచ్చే నెలలో జరగనున్న హ్యాపీ సిటీస్‌ సమిట్‌ సన్నాహకాలపైనా సమీక్ష జరిపారు.
 
   అమరావతి నిర్మాణానికి భూములిచ్చిన రైతులు వాటి రిజిస్ట్రేషన్లను సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయం అనుమతి లభించిన 15 నిమిషాల్లోనే పూర్తి చేసుకునేందుకు అవసరమైన చర్యలను చేపట్టామని సీఆర్డీయే కమిషనర్‌ చెరుకూరి శ్రీధర్‌ సీఎంకు వివరించారు. అమరావతిలో 5,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో హ్యూమన్‌ ఫ్యూచర్‌ పెవిలియన్‌ను నిర్మించేందుకు జపాన్‌కు చెందిన కుమి యుమి అస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ అధ్యక్షుడు యుసుయో యమజాకి ప్రతిపాదించినట్టు తెలిపారు. ఇందుకు అవసరమైన భూమిని అప్పగించిన 5 నెలల్లోగా(ఈ ఏడాది ఆగస్టులో) దీని నిర్మాణాన్ని పూర్తి చేస్తారన్నారు. జపాన్‌లోని ప్రఖ్యాత ఆర్కిటెక్ట్‌లలో ఒకరైన షిగెరు బన్‌ ఈ బహుళ ప్రయోజనకర కన్వెన్షన్‌ సెంటర్‌కు డిజైన్‌ చేయనున్నారని తెలిపారు. జపాన్‌ సంస్కృతికి అద్దం పట్టబోయే ఈ సెంటర్‌ అమరావతిలో జపాన్‌ పెట్టుబడులు పెరిగేందుకు దోహదపడటంతోపాటు పర్యాటకరంగాభ్యున్నతికీ తోడ్పడగలదని పేర్కొన్నారు.
Link to comment
Share on other sites

అభివృద్ధి పనుల్లో వేగం పెరగాలి
17-03-2018 07:26:03
 
636568683647599522.jpg
  • సీఆర్డీయే కమిషనర్‌ డాక్టర్‌ చెరుకూరి శ్రీధర్‌
అమరావతి: రాజధాని రైతులకు కేటాయించిన రిటర్నబుల్‌ ప్లాట్లతో కూడిన ఎల్పీఎస్‌ జోన్ల అభివృద్ధి పనులు చేపట్టిన కాంట్రాక్ట్‌ సంస్థలు ఆ పనుల్లో వేగం పెంచాలని సీఆర్డీయే కమిషనర్‌ డాక్టర్‌ శ్రీధర్‌ ఆదేశించారు. తగినంత యంత్ర, నిర్మాణ సామగ్రితోపాటు కార్మికులనూ అవి వెంటనే సమకూర్చుకోవాలన్నారు. విజ యవాడలోని సీఆర్డీయే ప్రధాన కార్యా లయంలో శుక్రవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో పనుల ప్రగతి నివేదికలను పరిశీలించిన ఆయన కాంట్రాక్ట్‌ సంస్థల ప్రతి నిధులకు తగిన సూచనలిచ్చారు. వర్షా కాలంలోనూ పనులను కొనసాగించేందుకు వీలుగా సైట్లలో ఏర్పాట్లు చేసుకోవాలని, డిజైన్లలో ఎలాంటి జాప్యం చోటు చేసుకోకుండా సంబంధిత ప్రాజెక్ట్‌ మేనేజ్‌మెంట్‌ కన్సల్టెన్సీలు, సీఆర్డీయే అధికారులు చూడాలని చెప్పారు. అంతర్గత రహదారులను జూన్‌ ఆఖరుకల్లా జీఎస్‌బీ లెవెల్‌కు తేవాలని ఆదేశించారు.
 
భద్రత, నాణ్యతపైన సమీక్ష..
అనంతరం సీఆర్డీయే అదనపు కమిషనర్‌ సగిలి షణ్మోహన్‌ రాజధాని ప్రభుత్వ నగర హౌసింగ్‌ ప్రాజెక్టుల పురోగతిపై సమీక్షించారు. ఇందులోని 3 ప్యాకేజీల పనులను చేస్తున్న ఎన్‌.సి.సి., ఎల్‌ అండ్‌ టి, షాపూర్జీ పల్లోంజీ సంస్థల ప్రతినిధులు పనుల పురోగతిని వివ రించారు. భద్రత, నాణ్యతలకు సంబంధించిన నివేదికలను కూడా ఆయన సమీక్షించారు. అన్ని స్ట్రక్చరల్‌ డిజైన్లకు వచ్చే మార్చి 30లోపు అప్రూవల్స్‌ పొందాలని, 3 ప్యాకేజీ సైట్లలో ఏప్రిల్‌ ఆఖరుకల్లా మోడల్‌ ఫ్లాట్లను సిద్ధం చేయాలని చెప్పారు. ఈ నమూనా ఫ్లాట్లను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి పి.నారాయణ, ఉన్నతాధికారులు పరిశీలించి, తుది ఆమోదం తెలుపుతారన్నారు. సమావేశంలో సీఈలు టి.ఆంజనేయులు, ఎం.జక్రయ్య, జక్కా శ్రీనివాసులు, ఎస్‌.ఇ.లు సీహెచ్‌ ధనుంజయ, ఎం.ప్రభాకరరావు, ప్రాజెక్ట్‌ మేనేజర్‌ సీహెచ్‌ దొరబాబు, పీఎంసీలు, కాంట్రాక్ట్‌ సంస్థల ప్రతి నిధులు పాల్గొన్నారు.
 
అమెరికాకు శ్రీధర్‌
సీఆర్డీయే కమిషనర్‌ డాక్టర్‌ చెరుకూరి శ్రీధర్‌, స్ట్రాటజీ విభాగపు డైరెక్టర్‌ జేఎస్సార్కే శాస్త్రి అమెరికాకు పయ న మ య్యారు. రాజ ధానికి రుణం మంజూరుపై ప్రపంచ బ్యాం కుతో మరోవిడత సంప్రదింపులు జరిపేందుకు వారు అక్కడికి వెళ్తున్నట్లు తెలు స్తోంది. ఈ సందర్భంగా వారు ప్రపంచ బ్యాంకు రుణసహాయంతో అమరావతిలో చేపట్టే రహదారులు, ఇతర ప్రాజెక్టులకు సంబంధించిన సమగ్ర వివరాలతో రూ పొందించిన ప్రజెంటేషన్‌ను ఇవ్వనున్నట్లు సమాచారం. దీంతో పాటు ‘భూమి మరియు పేదరికం’ అనే అంశంపై ప్రపంచబ్యాంకు ఆధ్వర్యంలో జరగనున్న వర్క్‌షాపులో కూడా వారు పాల్గొంటారు. శుక్రవారం రాత్రి విజయవాడ నుంచి బయల్దేరనున్న ఈ ఇద్దరు అధికారులు అమెరికా నుంచి ఈ నెల 26వ తేదీన తిరిగి రానున్నట్లు తెలిసింది. కమిషనర్‌ శ్రీధర్‌ తిరిగి వచ్చే వరకూ సీఆర్డీయే ఇన్‌చార్జి కమిషనర్‌గా ప్రత్యేక కమిషనర్‌ వి.రామమనోహరరావు వ్యవహరించనున్నారు.
 
15 దరఖాస్తులకు ఆమోదం
విజయవాడలోని సీఆర్డీయే ప్రధాన కార్యాలయంలో శుక్రవారంనాడు జరిగిన ఓపెన్‌ ఫోరంలో అందిన దరఖాస్తుల్లో నిబంధనలకు అనుగుణంగా ఉన్న 15ను అధికారులు అప్పటికప్పుడే ఆమోదించి, ప్రాథమిక అనుమతి పత్రాలను మంజూరు చేశారు. మొత్తం 21 దరఖాస్తులందగా, వాటిల్లో అయిదింటికి సంబంధించి అదనపు సమాచారం కోరిన అధికారులు మరొకదానిని మాత్రం తిరస్కరించారు. ఈ కార్యక్రమంలో సీఆర్డీయే డెవలప్‌మెంట్‌ ప్రమోషన్‌ విభాగం డైరెక్టర్‌ కె.నాగసుందరి, జాయింట్‌ డైరెక్టర్లు కె.ధనుంజయరెడ్డి, బి.బాలాజీ, జీవీ జీఎస్వీ ప్రసాద్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.
 
అభ్యంతరాలకు గడువు పొడిగింపు..
అమరావతి అంతర్‌ వలయ రహదారి (ఐ.ఆర్‌.ఆర్‌.) ముసాయిదా ప్రణాళికపై ప్రజల నుంచి అభ్యంతరాలు, సూచనలను స్వీకరించేందుకు ఇచ్చిన గడువును ఈ నెల 19వ తేదీ వరకు పెంచినట్లు సీఆర్డీయే కమిషనర్‌ డాక్టర్‌ చెరుకూరి శ్రీధర్‌ తెలిపారు. ఐ.ఆర్‌.ఆర్‌. మరియు రాజధాని పరిధి నుంచి దానిని అనుసంధానించేందుకు ఉద్దేశించిన 27 రహదారుల విస్తరణకు సంబంధించిన డ్రాఫ్ట్‌ నోటిఫికేషన్‌ను గత నెల 17న జారీ చేసిన సీఆర్డీయే దానిపై వ్యక్తులు, స్థానిక సంస్థలు తమ అభిప్రాయాలు, అభ్యంతరాలను తెలిపేందుకు తొలుత ఈ నెల 18వ తేదీ వరకు గడువునిచ్చింది. అయితే ఈ నెల 18న ఆదివారం సెలవుదినమైనందున గడువును మరొక రోజు అంటే 19వ తేదీ వరకు పొడిగించినట్లు శ్రీధర్‌ పేర్కొన్నారు. సోమవారంనాడు విజయవాడలోని సీఆర్డీయే ప్రధాన కార్యాలయంలో ప్రజల నుంచి అభ్యంతరాలు, సలహాలను స్వీకరిస్తామని తెలిపారు.
Link to comment
Share on other sites

ప్లాట్లు.. పాట్లు.. వాస్తును బట్టి రేటు..!
18-03-2018 08:11:06
 
636569574656504514.jpg
  • వీధి పోటులుంటే తక్కువ ధరకు..
  • తూర్పు ఫేసింగ్‌ అయితే హాట్‌ కేక్‌
  • గజానికి రూ.ఐదు వేలు తేడా
 
తుళ్ళూరు: రాజధాని రైతులకు సీఆర్డీయే ఇచ్చిన రిటనబుల్‌ ప్లాట్లు కొన్ని వీధిపోటులకు గురయ్యాయి. దీంతో రైతులు మదన పడుతున్నారు. తూర్పు ఫేసింగ్‌ ఉన్న ప్లాట్లకి.. దక్షిణ ఫేసింగ్‌ ఉన్న ప్లాట్లకి గజానికి రూ. ఐదువేలు వరకు తేడా ఉంది. తూర్పు రోడ్డున్న ప్లాటుకి మంచి గిరాకీ కనబడుతోంది. దాని తరువాతే ఉత్తర ఫేసింగ్‌ ఉన్న ప్లాటుకి కొనుగోలు దారులు ప్రాధాన్యం ఇస్తున్నారు. మూడవ ప్రాధాన్యంగా పడమర ఫేసింగ్‌ ఉన్న ప్లాటులు కొనుగోలు చేయటానికి ఆసక్తి కనబరుస్తున్నారు. ఇక మిగిలేవి దక్షిణ ఫేసింగ్‌ ప్లాటులే. వాటికి తీసుకోవటానికి ఎవరూ ముందుకు రావటం లేదు. దక్షిణ ముఖం ఉన్న ప్లాట్లు రాకుండా సీఆర్డీయే తగిన జాగత్త్రలు తీసుకున్నప్పటికీ కొంతమంది రైతులకు ఇవ్వటం తప్పలేదని అధికారులు చెపుతున్నారు. దీంతో దక్షిణ ఫేసింగ్‌ ప్లాటుకి రాజధానిలో గిరాకి లేదు.
 
   ఒక వేళ కొన్నా మిగిలిన ఫేసింగ్‌ మీద కన్నా ఐదువేలు తక్కువకే అడుగుతుండటం గమనార్హం. దీనిపై పలుమార్లు సీఆర్డీయే కమిషనర్‌ శ్రీధర్‌, మంత్రి నారాయణను రైతులు కలసి సమస్యను విన్నించారు. అటువంటి ప్లాట్లలు సరిచేస్తామని చెపుతున్నారు.. కాని ఇంతవరకు చర్యలు తీసుకోలేదని రైతులు వాపోతున్నారు. ఇకపోతే వాణిజ్య ప్లాట్లలో కూడా బజారు పోటులు ఉన్నాయి. అయితే వాణిజ్య(వ్యాపార సంబంధ) ప్లాట్లలో పోటుల ఇబ్బంది ఉండదని వాస్తు పండితులు కొంతమంది చెపుతున్నప్పటికీ అదీ కూడా కొంతమేర ఇబ్బందేనని రైతులు పేర్కొంటున్నారు. సీఆర్డీయే మాత్రం వాణిజ్య ప్లాట్ల వీధిపోటుల విషయంలో తామేమి చేయలేమని పేర్కొంది. నివాస ప్లాట్లు కొనుగోలు చేసుకునే వారు, రైతులు కచ్చితంగా వాస్తును పరిగణలోకి తీసుకోవటంతో వీధిపోటుల సమస్యను సీఆర్డీయే అధికారు సరిచేయాల్సి అవసరముంది.
 
   ఏ ప్లాట్లకైనా కొన్ని వీధిపోట్లు మంచివేనని. కొన్ని మాత్రం చెడు ప్రభావం చూపిస్తాయని వాస్తుశాస్త్ర పండితులు చెపుతున్నారు. రాజధానిలో దాదాపు 23 వేల మంది రైతులు రినబుల్‌ ప్లాట్లు కలిగి ఉన్నారు. ఇందులో వాణిజ్య ప్లాట్లను పరిగణలోకి తీసుకోకుండా నివాసప్లాట్ల వీధి పోటులను తీసుకుంటే దాదాపు 400 మంది రైతులు ఉన్నట్లు తెలిసింది. పోటులు కలిగిన ప్లాట్లు కేటాయించటంతో మానసిక వేదనకు రైతులు గురవుతున్నారు. దీనిపై సీఆర్డీయే అధికారులు తక్షణం స్పందించాలని కోరుతున్నారు. మార్కెట్‌లో ఆ ప్లాట్లకు గిరాకి కూడా తక్కువగా ఉండటంతో నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Link to comment
Share on other sites

మరో 4 మేజర్‌ ఆర్టీరియల్‌ రోడ్లకు టెండర్లు
18-03-2018 08:13:31
 
636569576105876741.jpg
అమరావతి: రాజధాని నగరంలో నిర్మించనున్న మరో నాలుగుమేజర్‌ ఆర్టీరియల్‌ రోడ్లకు అమరావతి అభివృద్ధి సంస్థ (ఏడీసీ) టెండర్లను ఆహ్వానించింది. ‘ఈపీసీ (ఇంజినీరింగ్‌, ప్రొక్యూర్‌మెంట్‌, కన్‌స్ట్రక్షన్‌)’ ప్రాతిపదికన మొత్తం రూ.1393.04 కోట్ల అంచనా వ్యయంతో ప్యాకేజీ నెంబర్లు 17, 18ల్లో భాగంగా ఈ రహదారులను నిర్మించనున్నారు. కేవలం రోడ్లనే కాకుండా వాటి వెంబడి సకల మౌలిక వసతులను కూడా కల్పించనున్నారు. 17వ ప్యాకేజీలో ఎన్‌-6, ఈ-13 రోడ్లుండగా వాటి నిర్మాణానికి రూ. 684.65 కోట్లు అవసరమని అంచనా వేశారు.
 
   18వ ప్యాకేజీలో ఎన్‌-13, ఈ-5 రహదారులుండగా, వాటి నిర్మాణానికి రూ.708.39 కోట్లతో అంచనాలు రూపొందించారు. టెండర్ల స్వీకరణకు ఏడీసీ వచ్చే నెల 9వ తేదీ వరకూ గడువునిచ్చింది. ఈ టెండర్లను దక్కించుకున్న నిర్మాణ కంపెనీలు పరిశోధన జరిపి, సవివర డిజైన్లను రూపొందించుకోవడంతోపాటు ఆయా రహదారులను, వాటి పక్కన స్మార్ట్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ (అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన స్టార్మ్‌వాటర్‌ డ్రెయిన్లు, నీటిసరఫరా నెట్‌వర్క్‌, సీవరేజ్‌ నెట్‌వర్క్‌, యుటిలిటీ డక్ట్‌లు, రీయూజ్‌ వాటర్‌లైన్‌, నడక, సైక్లింగ్‌ ట్రాక్‌లు, అవెన్యూ ప్లాంటేషన్‌, వీధి దీపాలు ఇత్యాదివి)ను నిర్మించాల్సి ఉంటుంది. ఆయా ప్యాకేజీల్లోని ఎలివేటెడ్‌ కారిడార్లను ఈ టెండర్ల నుంచి మినహాయించారు. వాటి నిర్మాణానికి విడిగా టెండర్లను పిలుస్తారు.

రిజిస్ట్రేషన్లకు ఏడు సబ్‌ సెంటర్లు
19-03-2018 08:06:45
 
636570436046653762.jpg
  • రిటర్నబుల్‌ ప్లాట్ల రిజిస్ట్రేషన్ల వేగవంతానికి చర్యలు
  • రెండుమూడు రోజుల్లో తాత్కాలిక కార్యాలయాలు
మంగళగిరి: రాజధాని అమరావతి ఏరియాలో రిటర్నబుల్‌ ప్లాట్ల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం రాజధాని గ్రామాల్లో కొత్తగా ఏడు అదనపు రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలను ఏర్పాటు చేయబోతున్నారు. వీటిని తాత్కాలిక రిజిస్ట్రేషన్‌ సబ్‌ సెంటర్లుగా వ్యవహరిస్తారు. రెండు మూడు రోజుల్లో ఈ తాత్కాలిక కార్యాలయాలను ప్రారంభించేందుకు సీఆర్‌డీఏ, స్టాంప్స్‌ అండ్‌ రిజిసే్ట్రషన్స్‌శాఖతో కలిసి సన్నాహాలను చేస్తుంది.
 
రాజధాని నిర్మాణం కోసం సుమారు 34వేల ఎకరాలను భూసమీకరణ కింద తీసుకున్న ప్రభుత్వం...అందుకు ప్రతిగా భూములిచ్చిన రైతులకు అభివృద్ధి చేసిన నివాస, వాణిజ్య ప్లాట్లను పంపిణీ చేస్తుంది. మొత్తం 59వేల రిజిస్ట్రేషన్లను జరిపించాల్సివుంది. సుమారు ఏడాది కిందటి నుంచి ఈ రిజిస్ట్రేషన్లను జరిపిస్తున్నప్పటికీ ఇప్పటివరకు ఆ సంఖ్య 12వేలను దాటలేకపోయింది. లక్ష్యాన్ని సాధ్యమైతనంత త్వరగా చేరుకోవాలంటే సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల సంఖ్యను గణనీయంగా పెంచాల్సివుంది. ఈ కార్యాలయాల సంఖ్యను పెంచకుంటే ఏడాదిలో రిటర్నబుల్‌ ప్లాట్ల పంపిణీ ప్రక్రియ పూర్తికాదని క్షేత్రస్థాయి పరిశీలనలో ఇప్పటికే తేలిపోయింది. అయితే సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలను ఇబ్బడిముబ్బడిగా పెంచడం సహేతుకం కాదన్న ఆలోచనల నేపధ్యంలో మధ్యేమార్గంగా తాత్కాలిక రిజిస్ట్రేషన్‌ సబ్‌ సెంటర్లను ఏర్పాటుచేయాలని నిర్ణయించారు.
 
  రాజధాని గ్రామాల్లో ప్రస్తుతం మంగళగిరితో పాటు తుళ్లూరు, మందడం, అనంతవరం లలో వున్న సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో రిటర్నబుల్‌ ప్లాట్లను రైతులకు రిజిస్ట్రేషన్‌ చేయిస్తున్నారు. ఈ నాలుగింటిలో మంగళగిరి మినహా మిగతా మూడు కొత్తగా ఏర్పాటుచేసిన కార్యాలయాలే! అయినప్పటికీ రిటర్నబుల్‌ ప్లాట్ల రిజిస్ట్రేషన్‌లు ప్రభుత్వం ఆశించిన స్థాయిలో జరగడం లేదు. మంగళగిరి మినహా మిగతా మూడు సెంటర్లలో రిజిస్ట్రేషన్లు బాగా మందకొడిగా జరుగుతున్నాయి. తుళ్లూరు, మందడం, అనంతవరంలలో రోజుకు 50కి మించి రిజిస్ట్రేషన్లను జరిపించలేకపోతున్నారు. మంగళగిరిలో మాత్రం సాధారణ రిజిస్ట్రేషన్లకు తోడు రిటర్నబుల్‌ ప్లాట్లను రోజుకు వందకుపైగా రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. దీంతో మంగళగిరి సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం నిత్యం కోలాహలంగా మారిపోయింది. ఈ గందరగోళం నడుమ తప్పులు చోటు చేసుకుంటాయన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
 
  దీంతో రాజధాని గ్రామాల్లో ఏడు తాత్కాలిక రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. నిడమర్రు, నవులూరు, వెంకటపాలెం, శాఖమూరు, తుళ్లూరు, మందడం, రాయపూడి గ్రామాలలో వీటిని ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఈ కార్యాలయాల ఏర్పాటుకోసం ఆయా గ్రామాలలో అద్దె భవనాలను కూడ తీసుకున్నారు. తాత్కాలిక కార్యాలయాలలో ఓ సబ్‌ రిజిస్ట్రార్‌ హోదా అధికారితో పాటు ఒక్క జూనియర్‌ అసిస్టెంట్‌, మరో అటెండర్‌ను రిజిస్ట్రేషన్‌ శాఖ ఏర్పాటు చేస్తుంది. కార్యాలయాలలో అవసరమైన మిగతా సిబ్బందిని సీఆర్‌డీఏ సమకూరుస్తుంది. నూతనంగా ఏర్పాటయ్యే ఈ తాత్కాలిక కార్యాలయాల వలన రైతులకు మంచి వెసులుబాటు కలిగినట్టవుతుంది.
 
  తాత్కాలిక సబ్‌ సెంటర్ల ఏర్పాటు ఆలోచనైతే బాగానే వుందికానీ...ఇందులో కూడ కొన్ని సాంకేతిక ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం వుంది. ముఖ్యంగా రిజిస్టర్‌ అయ్యే దస్తావేజులకు నెంబరు ఏ ప్రాతిపదికన ఇస్తారన్నది పెద్ద సమస్యగా మారింది. తాత్కాలిక కార్యాలయాలలో ఒరిజినల్‌ పర్మినెంటు నెంబరు ఇవ్వరాదని నిబంధనలు చెబుతున్నాయని అంటున్నా రు. పెండింగ్‌ నెంబరు ఇచ్చి ఆనక ఆ తాత్కాలిక కార్యాలయం ఏ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం పరిధిలో ఏర్పాటవుతుందో ఆ కార్యాలయంలో నమోదవుతున్న నెంబర్లతో పాటే అసలు నెబరింగ్‌ను ఇవ్వొచ్చునని అంటున్నారు. ఇది కూడ ఓ గందరగోళంగానే వుంటుంది. దీనిని పరిష్కరించేందుకు కొత్తగా ఉండవల్లి లేదా ఎర్రబాలెం కేంద్రంగా ఓ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాన్ని ఏర్పాటుచేసి ఆ కార్యాలయం పేరుతో నెంబర్లను ఇవ్వొచ్చునన్న ప్రతిపాదనను కూడ అధికారులు పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఏదేమైనా రెండుమూడు రోజుల్లో రాజధాని గ్రామాల్లో ఏడు తాత్కాలిక రిజిస్ట్రేషన్‌ సబ్‌ సెంటర్లు ప్రారంభం కాబోతున్నాయి.

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...