Jump to content

Vijayawada city Beautification


Recommended Posts

  • Replies 1k
  • Created
  • Last Reply
  • 2 weeks later...

పచ్చందాల బెజవాడ

ఈనాడు, అమరావతి

amr-top2a.jpg

విజయవాడ సుందరీకరణలో భాగంగా రాజీవ్‌గాంధీ పార్కు ఆధునికీకరణకు అమరావతి అభివృద్ధి సంస్థ (ఏడీసీ) ప్రణాళికలు రూపొందించింది. ఇందులో భాగంగా విజయవాడ నగరపాలక సంస్థ కార్యాలయాన్ని తరలించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. దీంతో పాటు ఒక విద్యుత్తు ఉపకేంద్రాన్ని అక్కడి నుంచి తరలించాలని నిర్ణయించారు. విజయవాడ సుందరీకరణ అంశంపై బుధవారం ముఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడు సమక్షంలో జరిగిన సీఆర్‌డీఏ సమావేశంలో చర్చకు వచ్చింది. ఈసందర్భంగా ఏడీసీ రూపొందించిన ప్రణాళికలను సీఎం పరిశీలించారు. ఏడీసీతో పాటు నగరపాలక సంస్థ, కనకదుర్గ దేవస్థానం, కన్సల్టెంట్స్‌, జలవనరుల శాఖ, ఏపీఎస్‌ ఆర్టీసీ, ఏపీ టాన్స్ర్‌కో, దక్షిణ మధ్య రైల్వే శాఖలు సంయుక్తంగా పనులు చేపట్టేలా ప్రణాళికలు రూపొందించారు.

ఇవీ ప్రణాళికలు..!

కృష్ణవేణి , పద్మావతి , భవానీ, పున్నమి ఘాట్‌లను పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. పద్మావతి, కృష్ణవేణి ఘాట్‌లను నగరపాలక సంస్థకు అప్పగించారు. దుర్గగుడి, పర్యాటక సంస్థలకు రెండు అప్పగించారు. వీటిపై సమగ్ర ప్రణాళికలు రూపొందించేందుకు కన్సెల్టెన్సీలను నియమించారు. యాహూ, మైక్రోసాప్ట్‌లాంటి దిగ్గజ సంస్థలకు ఆకృతులు, ఇతర ప్రణాళికలు అందించి ఆర్‌ఎఫ్‌టీ సంస్థకు ఈ బాధ్యతలను అప్పగించారు. ఆర్వీ, జీఐఐసీ సంస్థలు కన్సెల్టెన్సీలుగా ప్రణాళికలు రూపొందించాయి. తాజాగా రాజీవ్‌గాంధీ పార్కు బాధ్యతలను ఆర్‌ఎస్‌పీ సన్‌ఫ్రా కన్సెల్టెన్సీ తీసుకుంది. వారధి నుంచి పవిత్ర సంగమం వరకు నదికి ఒక వైపు నదీ ముఖద్వారాలు, కాలువగట్లు అభివృద్ధి చేయాల్సి ఉంది. పచ్చదనంతో నింపాలి. పాదచారులకు అనువుగా ఏర్పాటు చేయాలి. పర్యాటకప్రాంతాలుగా రూపొందించాలి. బ్యారేజీ దిగువున, బస్టాండ్‌ ప్రాంతం, నగరపాలక సంస్థ కార్యాలయం ప్రాంతం, రైల్వేస్టేషన్‌ ప్రాంతాలు, బందరు కాలువ, ఏలూరు కాలువ, రైవస్‌ కాలువలపై వంతెనలు, ఇతర నిర్మాణం చేయాల్సి ఉంది. ఈ ప్రాంతాల్లో బిజినెస్‌ సెంటర్లు, వాణిజ్య సముదాయాలు, కన్వెన్షన్‌ సెంటర్లు, సర్వీసు అపార్టుమెంట్లు, మల్టీఫ్లెక్సులు, ఫుడ్‌కోర్టులు, సెంట్రల్‌ పార్కులు, పచ్చదనం, ఇతర అంశాలను పరిగణలోకి తీసుకోవాలని సీఎం సూచించారు. ప్రత్యేకంగా పైవంతెనలను ఆకర్షణీయంగా నిర్మాణం చేయాల్సి ఉందని భావించారు. సైకిల్‌ ట్రాక్‌లు నిర్మాణం చేయాలని వాకింగ్‌ ట్రాక్‌లు ఉండాలని సీఎం సూచించారు. కాలువల్లో జలక్రీడలతో పాటు అంతర్గత జలరవాణా ఉండాలని సూచించారు. కన్వెన్షన్‌ సెంటర్లు, వాణిజ్య సముదాయాలు, మల్టీప్లెక్సుల ద్వారా పర్యాటకులను ఆకర్షించడంతో పాటు వారి అవసరాలను తీర్చేవిధంగా ఉంటాయని అభిప్రాయపడ్డారు. నదీ ముఖద్వారాల వద్ద ఫుడ్‌కోర్టులు ఏర్పాటు చేయాలని సూచించారు. వారధి నుంచి కనకదుర్గ దేవాలయం వరకు, పైవంతెన, బస్టాండు, రైల్వే స్టేషన్‌ ప్రాంతం, కాళేశ్వరరావు మార్కెట్‌ రూపురేఖలు పూర్తిగా మారిపోవాలని పచ్చదనం నింపాలని సీఎం సూచించారు. షాపింగ్‌మాల్‌, ఎమ్యూజ్‌మెంట్‌పార్కులు, వినోదాత్మక కార్యక్రమాలను ఏర్పాటు చేయాల్సి ఉంది. 80 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్‌ బిజినెస్‌ పార్కు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. కనకదుర్గ దేవాలయం, బస్‌స్టేషన్‌, రైల్వేస్టేషన్‌ మార్గాలు పచ్చదనంతో గ్రీన్‌వేగా ఉండాలని సూచించారు.

ఇవీ బాధ్యతలు..!

రాజీవ్‌గాంధీపార్కు ప్రణాళికలను ఏడీసీ సీఎండీ లక్ష్మీపార్ధసారథి సీఎంకు అందజేశారు.

జలవనరుల శాఖ, విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో 3 ఎకరాల భూమిని అభివృద్ధి చేయాల్సి ఉంది. కనకదుర్గ దేవస్థానం అందజేసిన ఈ భూమిని ముందుగా డీమార్కింగ్‌ చేయాల్సి ఉంది. జలవనరుల శాఖ, వీఎంసీ కలిసి 1.5లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం భవనాలను నిర్మాణం చేయాల్సి ఉంది. బిల్డప్‌ ఏరియా అంత పరిమాణంలో నిర్దేశించారు.

ఇక్కడ కన్వెన్షన్‌ సెంటర్‌, గ్రీన్‌ కారిడార్‌, గార్డెన్స్‌, ల్యాండ్‌ స్కేప్‌ ఏర్పాటు చేస్తారు. వీటి బాధ్యతలను జలవనరుల శాఖ, వీఎంసీకి అప్పగించారు. కాలువలపై ఉన్న వంతెనల ఎత్తు విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. ప్రతిపాదిత భవనం నిర్మాణానికి కాలపరిమితి నిర్ణయించాల్సి ఉంది.

ఏపీఎస్‌ ఆర్టీసీ ఆధ్వర్యంలో 0.2 ఎకరాల్లో గ్రీన్‌ కారిడార్‌ ఏర్పాటు చేయాల్సి ఉంది. ప్రస్తుతం పీఎన్‌బీ పరిధిలో 0.2 ఎకరాల స్థలాన్ని ఆర్టీసి కి అప్పగించనున్నారు. ఆర్టీసి ప్రధాన కార్యాలయం ఎదురుగా ఉన్న స్థలంలో ఈ గ్రీన్‌ కారిడార్‌ వస్తుంది. ఇక్కడ ఫుడ్‌ ప్లాజా ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు.

ఏపీ ట్రాన్స్‌కో ఆధ్వర్యంలో 1.14 ఎకరాలను అభివృద్ధి చేయాల్సి ఉంది. ఇక్కడ ప్రస్తుతం ఉన్న రిసీవింగ్‌ స్టేషన్‌ను వేరే ప్రాంతానికి తరలించాల్సి ఉంది. ఇది శాశ్వతంగా తరలించాలని అభిప్రాయపడ్డారు. కాలువ గట్టు అభివృద్ధికి ఇది ఆటంకంగా ఉంటుంది. దీనికి కాలపరిమితి నిర్ణయించాలని అభిప్రాయపడ్డారు.

దక్షిణ మధ్య రైల్వే శాఖ 0.2 ఎకరాలను అభివృద్ధి చేయాల్సి ఉంది. ఈ ప్రాంతంలో గ్రీన్‌ కారిడార్లు పెంచాల్సి ఉంది. రైల్వే ట్రాక్‌ వెంట గ్రీన్‌ కారిడార్‌ రావాల్సి ఉంది. రైల్వే ట్రాక్‌ క్రాసింగ్‌ వద్ద ఎత్తుపై స్పష్టత క్లియరెన్సు రావాల్సి ఉంది. మరి కొంత ఎత్తు పెంచితే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తమైంది. దక్షిణ ప్రవేశం నుంచి ఒకటో పట్టణ ప్రాంతం ప్రవేశం వరకు పూర్తిగా సమగ్రంగా గ్రీన్‌ కారిడార్‌ అనుసంధానం కావాల్సి ఉంది.

నగరపాలక సంస్థ బాధ్యత కీలకంగా ఉంది. వీఎంసీ ఆధ్వర్యంలో 26 ఎకరాలను అభివృద్ధి చేయాల్సి ఉంది. నగరపాలక సంస్థ కార్యాలయాం ఇక్కడి నుంచి తరలించాల్సి ఉంటుంది. దీనిలో బిల్డప్‌ ఏరియా 20లక్షల చదరపు అడుగులు ఉంటుంది. కార్యాలయాలు, రిటైల్‌ మాల్స్‌, హోటళ్లు, పిల్లల పార్కు, ఎగ్జిబిషన్‌ సెంటర్‌, పార్కింగ్‌, గ్రీన్‌ కారిడార్లు, గార్డెన్‌లను రూపొందించాల్సి ఉంటుంది.

Link to comment
Share on other sites

  • 3 weeks later...

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...