Jump to content

Vijayawada Riverfront


Recommended Posts

  • Replies 458
  • Created
  • Last Reply
Guest Urban Legend

mana expectations ki aa reality ki navvosthundhi. Kanisam outer looks ayina decent ga maintain cheyyalsindhi

 

Goa lo kuda same bus same company running

Link to comment
Share on other sites

  • 2 weeks later...
  • 2 weeks later...
  • 1 month later...
రివర్‌ ఫ్రంట్‌ ఘాట్లకు..న్యూ లుక్‌
 
 
636363103766899075.jpg
  • నిర్వహణ బాధ్యతలు తీసుకున్న కృష్ణాజిల్లా యంత్రాంగం
  • లాంగ్‌ ఓపెన్‌ స్విమ్మింగ్‌పూల్‌ అందుబాటులోకి
  • మురికినీటిని తోడించాలని ఇరిగేషన్‌ అధికారులకు కలెక్టర్‌ ఆదేశం
  • తాజా నీటిని విడుదల చేయాలని ఆదేశం
  • మరికొద్ది రోజుల్లో అందుబాటులోకి పబ్లిక్‌ స్విమ్మింగ్‌ పూల్‌
 
 
(ఆంధ్రజ్యోతి, విజయవాడ): కృష్ణా రివర్‌ ఫ్రంట్‌ ఘాట్ల నిర్వహణ బాధ్యతలను కృష్ణాజిల్లా యంత్రాంగం తీసుకుంది. రూ.వందల కోట్ల వ్యయంతో అత్యద్భుతంగా నిర్మించిన ఘాట్లు సందర్శనీయ ప్రాంతంగా ఉండాల్సింది పోయి వెలవెల పోవటం, కళా విహీనంగా మారటంతో జిల్లా యంత్రాంగం వీటి బాధ్యతలను తామే నిర్వహించాలని నిర్ణయించింది. ఘాట్ల నిర్వహణ ప్రస్తుతం ఇరిగేషన్‌ శాఖ పరిధిలో ఉంది. ఇరిగేషన్‌ శాఖ నిర్వాకం కారణంగా ముఖ్యంగా నగరంలో బ్యారేజీ దిగువున ఏకీకృతంగా ఉన్న కృష్ణవేణి, పద్మావతి ఘాట్లు మురుగునీటితో కంపు కొడుతున్నాయి. సందర్శకులకు ఆహ్లాదం పంచాల్సింది పోయి.. ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకు వచే్చేలా ఉంది. కార్పొరేషన్‌ ఎలాంటి శానిటేషన్‌ కూడా నిర్వహించటం లేదు. ఘాట్లు కూడా అపరిశుభ్రంగా తయారయ్యాయి. పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) అడపా దడపా ఫెస్టివల్స్‌, ఫుడ్‌ కోర్టులు ఏర్పాటు చేస్తున్నా.. ఇక్కడ వాతావరణం ఏమాత్రం బాగుండకపోవటంతో ఆదరణ లేకుండా పోతున్నాయి. దీంతో కృష్ణా కలెక్టర్‌ లక్ష్మీకాంతం ఘాట్ల నిర్వహణ బాధ్యతలను స్వయంగా నిర్వహించాలని నిర్ణయించారు. శుక్రవారం దీనిపై ఆయన ఒక నిర్ణయం తీసుకుని సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడారు. ఘాట్లను సందర్శనీయంగా చేయటానికి ఇరిగేషన్‌ అధికారులతో చిన్న చిన్న మరమ్మతులు చేయించటం, కార్పొరేషన్‌ ద్వారా శానిటేషన్‌ బాగా ఉండేలా చేయించనున్నారు. బ్యారే జి దిగువన కృష్ణా ఘాట్‌ నుంచి పద్మావతి ఘాట్‌ వరకు కిలోమీటర్‌ పొడవున ఉన్న కెనాల్‌ను పబ్లిక్‌ స్విమ్మింగ్‌ పూల్‌గా అందుబాటులోకి తీసుకు రావాలని నిర్ణయించారు.
 
ఇరిగేషన్‌ అధికారులకు ఫోన్‌ చేసి కాల్వలో ఉన్న నీటిని బయటకు వదిలి, శుభ్రపరిచి తాజా నీటిని తక్షణం విడుదల చేయాలని సూచించారు. కలెక్టర్‌ ఫోన్‌ చేయటంతో అందులో పూడిక పేరుకు పోయిందని, తొలగించాల్సి ఉందని ఆ అధికారి సమాధానం ఇచ్చారు. కాలువను కాంక్రీట్‌తో నిర్మించినందున అందులోని నీటిని బయటకు వదిలితే సరిపోతుందని, పూడిక తీయించేదేముందని ప్రశ్నించారు. వెంటనే తాజా నీటిని విడుదల చేయాలని ఆదేశించారు. కెనాల్‌లో ఉన్న మురుగునీటిని డీ సిల్టింగ్‌ చేయనవసరం లేదు. వార ధివైపు న దీభాగంలోకి వదిలేయవచ్చు. నీటిని వదలగా అడుగున చెత్త ఏమైనా ఉంటే వాటిని తొలగించవచ్చు.
 
క్లోరిన్‌ వేసి శుభ్రం చేసి తాజానీటిని కాలువ లోకి విడుదల చేయటం ద్వారా.. పబ్లిక్‌ స్విమ్మింగ్‌ పూల్‌ అందుబాటులోకి వస్తుంది. సాయంత్రాలు బ్యారేజీ ఆఫ్రాన్‌ ప్రాంతంలోనూ తాడేపల్లి వైపు తీరం వెంబడి ఎంతో ఆహ్వాదంగా కనిపిస్తుంది. ఆ వాతావరణాన్ని విజయవాడ వైపు తీసుకు రావాలని కలెక్టర్‌ భావిస్తున్నారు. సాయంత్రాలు ఇక్కడ కోలాహలం ఉండటంతో ఫుడ్‌కోర్టులకు డిమాండ్‌ ఉంటుంది. ప్రస్తుతం బెంజిసర్కిల్‌, ఇందిరాగాంధీ స్టేడియం తదితర ప్రాంతాలలో ఉన్న ఫుడ్‌ కోర్టులన్నింటినీ ఘాట్ల దగ్గరకు తీసుకురాగలితే... అత్యద్భుతంగా ఉంటుంది. ప్రస్తుతం రోడ్ల మీద విపరీతమైన ట్రాఫిక్‌ ఉంటుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని ఫుడ్‌కోర్టులను ఘాట్లకు తరలించాలన్న ఆలోచన కూడా జిల్లాయంత్రాంగం చేస్తోంది. పర్యాటక శాఖ అధికారులతో ఈవెంట్లు నిర్వహించటం, ప్రదర్శనలు వంటివి నిర్వహించటం చేయనున్నారు.
Link to comment
Share on other sites

  • 4 weeks later...
  • 1 month later...
అమరావతి బోటింగ్ క్లబ్‌కు గ్రీన్ సిగ్నల్.. తాజాగా మరో వివాదం!
 
 
636420126274451364.jpg
ఆంధ్రజ్యోతి, విజయవాడ: కనకదుర్గ అమ్మవారి దేవస్థానం అధికారుల విధానాలు.. ఒంటెద్దు పోకడలు అత్యంత వివాదాస్పదమవుతున్నాయి. తాజాగా దేవస్థాన అధికారులు తీసుకున్న నిర్ణయం పర్యాటక అభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ)కి శరాఘాతంగా మారింది. దుర్గాఘాట్‌లో ఏపీటీడీసీ బోటింగ్‌ యూ నిట్‌ మూసివేతకు దేవస్థాన అధికారులు కారణమయ్యారు. తెప్పోత్సవానికి రూపొందించాల్సిన హంసవాహనం కోసం ఏపీటీడీసీ అధికారులు తమ బోటింగ్‌ యూనిట్‌ మూసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఏపీటీడీసీ బోటింగ్‌ పాయింట్‌ను స్వాధీనం చేసుకున్న దేవస్థాన అధికారులు అక్కడ హంసవాహనాన్ని రూపొందిస్తున్నారు. సమీపంలో ఉన్న ప్రైవేటు బోటింగ్‌ సంస్థపై దేవస్థాన అధికారులు అంతులేని మమకారాన్ని చూపుతున్నారు. ప్రభుత్వ రంగ సంస్థ ఏపీటీడీసీని కాదని అమరావతి బోటింగ్‌ క్లబ్‌ అనే ప్రైవేటు సంస్థకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. దీంతో ఏపీటీడీసీ బోటింగ్‌ యూనిట్‌ కాస్తా ఏలాంటి ఆపరేషన్స్‌ నిర్వహించకుండా పడకేస్తే...ప్రైవేటు సంస్థ మాత్రం అందినకాడికి యాత్రికుల నుంచి అదనంగా దండుకుంటూ ఆపరేషన్స్‌ నిర్వహిస్తుంది.
 
ఫంట్‌పైనే హంసవాహనం
హంసవాహనం రూపొందించడానికి ప్రతి ఏటా దేవస్థాన అధికారులు ఫంట్‌ను తెప్పిస్తారు. దుర్గాఘాట్‌లో ప్రతి ఏటా ఈ ఫంట్‌ మీదనే హంసవాహనం అలంకరణ చేస్తారు. దాదాపుగా వారం రోజుల పాటు దీనిని ముస్తాబు చేస్తారు. కృష్ణా పుష్కరాల సందర్భంగా దుర్గాఘాట్‌ విస్తరించారు. దీంతో విశాలమైన ఘాట్‌ ఇక్కడ ఉంది. ఈ విశాలమైన దుర్గాఘాట్‌లో ఎక్కడైనా హంసవాహనాన్ని రూపొందించుకోవచ్చు. కానీ దేవస్థాన అధికారులు ఏపీటీడీసీ బోటింగ్‌ను నిలుపుదల చేయించి అక్కడ హంసవాహనాన్ని తయారు చేయిస్తున్నారు. దసరా ఏర్పాట్లకు తెలుగు రాష్ట్రాల నుంచి లక్షలాది సంఖ్యలో యాత్రికులు వస్తారు.
 
అమ్మవారిని దర్శించుకున్న తరువాత దుర్గాఘాట్‌కు వచ్చి కృష్ణానదిలో నదీవిహారం చేస్తారు. వేలాది మంది యాత్రికులు భవానీ ఐల్యాండ్‌, హరిత బెర్మ్‌పార్కులకు వస్తారు. ఏపీటీడీసీ బోట్లను ఎక్కితేనే అక్కడికి చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రైవేటు బోటింగ్‌ కేవలం నదీ విహారానికి మాత్రమే అనుమతులు ఉన్నాయి. ఏపీటీడీసీ బోటింగ్‌ మూతపడటంతో భవానీ ఐల్యాండ్‌, హరితబెర్మ్‌ పార్క్‌లకు కూడా వెళ్లే అవకాశం లేదు. ఇదే అదునుగా భావించిన అమరావతి బోటింగ్‌ క్లబ్‌ నిర్వాహకులు.. పర్యాటకుల నుంచి అందినకాడికి దండుకుంటున్నారు. యాత్రికుల నుంచి భారీ రేట్లను వసూలు చేస్తున్నారు. ఏపీటీడీసీ వసూలు చేసే చార్జి కంటే ఎక్కువగా వసూలు చేస్తున్నారు. కలెక్టర్‌ లక్ష్మీకాంతం ఈ విషయంలో చర్యలు తీసుకోవలసిన అవసరం ఉంది.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...