Jump to content

gandhi bhavan dustbin nundi arupulu


Cyclist

Recommended Posts

ఇంత వరకు నాకు సస్పెన్స్ లేక అందలేదు...

ఈనెల 31న వివరణ ఇస్తాను..అంతవరకు ఆగండి : అంబటి

హైదరాబాద్, జూలై 22 : తనను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ఎలాంటి లేక రాలేదని పీసీసీ ప్రధాన కార్యదర్శి అంబటి రాంబాబు గురువారం పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన సోమాజీగూడలోని ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడుతూ...తనను సస్పెండ్ చేసినట్లు మిత్రులు, అభిమానులు, మీడియా వాళ్లద్వారా తెలిసిందని అన్నారు. నేను పార్టీ క్రమశిక్షణ చర్యలను ఉల్లంఘించలేదని, కొంత మంది వ్యతిరేకులు తనపై కక్ష కట్టి, పార్టీ నుంచి తప్పించాలనే ఉద్దేశంతో తప్పుడు సమాచారం ఇచ్చారని అంబటి పేర్కొన్నారు.

 

తాను ఈనెల 7న చేసిన వ్యాఖ్యలపై 9న షోకాజ్ నోటీసు ఇచ్చారని, 12న క్రమశిక్షణా సంఘం ముందు హాజరై వివరణ ఇచ్చేందుకు రెండు వారాలు గడువు కావాలని సంఘానికి చేసిన విజ్ఞప్తి మేరకు సానుకూలంగా స్పందించిన కమిటీ ఈనెల 31 వరకు గడువు ఇచ్చిందని అంబటి పేర్కొన్నారు. అంచేత తాను 31న వివరణ ఇస్తానని, దానిని చూసిన తర్వాతే అధిష్టానం ఏ నిర్ణయమైనా తీసుకోవాలని అంబటి రాంబాబు విజ్ఞప్తి చేశారు.

 

ఈ మేరకు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ వీరప్ప మొయిలీకి కూడా లేక రాయనున్నట్లు అంబటి తెలిపారు. తనను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు వచ్చిన వార్తలపై ఎంతో మానసిక క్షోభ అనుభవించానని అన్నారు. తనకు ఇరవయ్యేళ్ళ రాజకీయ జీవిత చరిత్ర ఉందని, పార్టీ కోసం ఎంతో కృషి చేసి మంచి పేరు తెచ్చుకున్నాట్లు అంబటి పేర్కొన్నారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...