Jump to content

Recommended Posts

Posted

విశాఖలో ఐటీ అభివృద్ధి.. ఏపీ ప్రభుత్వంతో గూగుల్‌ ఎంవోయూ9fZBion.png

అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్‌ సమక్షంలో గూగుల్‌, ఏపీ ప్రభుత్వ ఉన్నతాధికారులు ఒప్పందం చేసుకున్నారు. విశాఖలో వ్యూహాత్మక పెట్టుబడులకు గూగుల్‌ ముందుకొచ్చింది. రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఐటీ అభివృద్ధి చేస్తామని గూగుల్‌ ప్రకటించింది. ఈ ఒప్పందం ద్వారా భారతదేశ ఐటీ రంగంలో విప్లవాత్మక మార్పులు రానున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు.  రాష్ట్రంలో గూగుల్‌ ప్రతిపాదిత పెట్టుబడులను స్వాగతిస్తున్నామని చంద్రబాబు స్పష్టం చేశారు. 

ఈ ఒప్పందం ద్వారా రాష్ట్రంలో పెట్టుబడుల ఆకర్షణకు పటిష్టమైన ఎకోసిస్టమ్ ఏర్పాటవుతుందన్నారు. అమెరికా పర్యటనలో గూగుల్ ఉన్నతస్థాయి ప్రతినిధులతో జరిగిన చర్చలు ఫలవంతం కావడంపై ఐటీశాఖ మంత్రి నారా లోకేష్ సంతోషం వ్యక్తంచేశారు. రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పాటయ్యాక పెట్టుబడిదారుల్లో నమ్మకం పెరిగిందని తెలిపారు. కొత్తప్రభుత్వం ఏర్పాటైన కొద్దినెలలకే ఆర్సెలర్స్ మిట్టల్/నిప్పన్ స్టీల్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా గ్రూప్, భారత్ ఫోర్జ్‌తో సహా పలు భారీ పరిశ్రమలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయన్నారు.

Posted (edited)

As part of the MoU, Google will offer 10,000 certificates for the Google AI Essentials course, a foundational course that teaches people how to use AI in their work and everyday lives to increase productivity and efficiency. Moreover, Google will also support the state’s startup ecosystem, to fuel innovation & entrepreneurship in the field of AI. ......

Edited by sonykongara
Posted

Google inks MoU with Andhra government to establish AI Data Centre in Vizag

It may be pointed out that Google, on December 5, signed another agreement with the State government to collaborate on various AI initiatives.
Bikash Koleyice-President of Google Global Networking and Infrastructure (GGNI)  after signing a Memorandum of Understanding (MoU) with tech giant Google to establish an Artificial Intelligence (AI) Data Centre in Visakhapatnam
 
Bikash Koleyice-President of Google Global Networking and Infrastructure (GGNI) after signing a Memorandum of Understanding (MoU) with tech giant Google to establish an Artificial Intelligence (AI) Data Centre in Visakhapatnam Photo | X
 
Updated on: 
11 Dec 2024, 9:33 pm
2 min read

VIJAYAWADA: In a significant boost to the digital ecosystem in Andhra Pradesh, the State government signed a Memorandum of Understanding (MoU) with tech giant Google to establish an Artificial Intelligence (AI) Data Centre in Visakhapatnam.

A delegation, led by Vice-President of Google Global Networking and Infrastructure (GGNI) Bikash Koley, met Chief Minister N Chandrababu Naidu at the latter's residence in Undavalli on Wednesday.

The delegation briefed the Chief Minister on Google's operations in India, its strategic plans, and proposed investments, particularly for Visakhapatnam. The agreement was formalised in the presence of Chief Minister N Chandrababu Naidu and IT Minister Nara Lokesh.

It may be pointed out that Google, on December 5, had signed another agreement with the State government to collaborate on various AI initiatives. Naidu stated that December 11 will remain as a memorable day for the State, especially its youth, as Google's presence would significantly transform Visakhapatnam. He envisioned the Port City becoming a game changer with advancements in AI, sea cables, and data centers, attracting global attention.

Reiterating his belief in the transformative power of the IT sector, the Chief Minister noted that Google's investments align with his vision of economic and social progress. He promised to support policies, fostering a robust technology ecosystem and creating employment opportunities in the State.

Naidu also highlighted Andhra Pradesh's progressive industrial policies, which have cultivated a business-friendly environment, attracting global investors.

In a post on X, Naidu expressed optimism about the partnership and said, "Collaborations with global technology leaders like Google will drive Andhra Pradesh's progress and innovation."

Describing Andhra Pradesh as a key partner for Google, Bikash Koley anticipated significant collaborative initiatives in the future. The tech giant shared the announcement on X, stating, "Google has signed an MoU today to establish an AI Data Center in Visakhapatnam, Andhra Pradesh."

During the Collectors' Conference, Naidu lauded Lokesh for playing a pivotal role in making the MoU a reality. Deputy Chief Minister Pawan Kalyan congratulated Naidu, calling the achievement a matter of pride and inspiration.

 

 

Posted (edited)

Official: Google Coming To Andhra Pradesh

Article by Satya B Published on: 5:50 pm, 11 December 2024

 
goole-vizag.jpg

The NDA-led government of Andhra Pradesh has taken a clearly progressive approach when it comes to inviting global investments to the state. In this context, a significant step has been taken today with a high level meeting between the government of Andhra Pradesh and Google’s representatives.

As per the latest reports, Andhra Pradesh government and Google signed a Memorandum of Understanding (MoU) today at Amaravati, exploring various investment opportunities in the state.

 

It is principally understood that the MoU is pertinent to the proposed AI Data Center in Vizag, which will be operated by Google Cloud. This pretty much confirms that Google is indeed coming to Andhra Pradesh as a part of its tech drive in India.

On the matter, CM Chandrababu stated “Our new progressive industrial policies have created a business-friendly ecosystem, attracting investors, and paving the way for employment opportunities. Following up on the MoU signed between the GoAP and Google.

Earlier in the day, Babu met a Google delegation led by VP, Mr Bikash Koley in Amaravati today and the delegation offered him an overview of their operations and shared their ambitious plans in India. “I am proud that Andhra Pradesh has been identified as a key partner.” Babu noted later.

With a global giant like Google on its way to Andhra Pradesh, this could pave way for other leading companies to follow suit. It must also be noted that the government is actively in talks with Tesla as well, in an attempt to bring this global auto giant to the state.

Edited by sonykongara
Posted

Cm chandrababu: గూగుల్‌ ఒప్పందంతో.. ఐటీలో విప్లవాత్మక అభివృద్ధి

ఆర్థిక, సామాజిక అభివృద్ధికి ఐటీ రంగంలో వచ్చే పెట్టుబడులు దోహదపడతాయని ముఖ్యమంత్రి చంద్రబాబు పునరుద్ఘాటించారు. రాష్ట్రంలో పటిష్ఠమైన టెక్నాలజీ ఎకో సిస్టమ్‌ ఏర్పాటు చేయడం ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా గూగుల్‌ సంస్థ వ్యూహాత్మక పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది.

Eenadu icon
By Andhra Pradesh News DeskUpdated : 12 Dec 2024 07:01 IST
 
 
 
 
 
 

సీఎం చంద్రబాబును కలిసిన గూగుల్‌ ప్రతినిధి బృందం
విశాఖలో పెట్టుబడులపై చర్చ
ఏఐ అమలులో రాష్ట్రానికి సహకారం

ap11124main2a.jpg

సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌ సమక్షంలో ఒప్పంద పత్రాలు మార్చుకుంటున్న గూగుల్, రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు. చిత్రంలో సీఎస్‌ నీరబ్‌ కుమార్‌ ప్రసాద్‌ తదితరులు

ఈనాడు, అమరావతి: ఆర్థిక, సామాజిక అభివృద్ధికి ఐటీ రంగంలో వచ్చే పెట్టుబడులు దోహదపడతాయని ముఖ్యమంత్రి చంద్రబాబు పునరుద్ఘాటించారు. రాష్ట్రంలో పటిష్ఠమైన టెక్నాలజీ ఎకో సిస్టమ్‌ ఏర్పాటు చేయడం ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా గూగుల్‌ సంస్థ వ్యూహాత్మక పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. అమరావతిలో జరిగిన కార్యక్రమంలో సీఎం సమక్షంలో అధికారులు, గూగుల్‌ ప్రతినిధులు దీనిపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ద్వారా రాష్ట్ర ఐటీ రంగంలో విప్లవాత్మక మార్పులు రానున్నాయని సీఎం పేర్కొన్నారు. రాష్ట్రంలో గూగుల్‌ సంస్థ ఏర్పాటుకు పాలసీ నిబంధనల మేరకు ప్రోత్సాహకాలు అందిస్తామన్నారు. ‘గూగుల్‌ రాకతో రాష్ట్రంలో పటిష్ఠమైన టెక్నాలజీ ఎకోసిస్టం కల్పించడం సాధ్యమవుతుంది. ఉపాధి అవకాశాలు పెరుగుతాయి’ అని చెప్పారు. గూగుల్‌ గ్లోబల్‌ నెట్‌వర్కింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఉపాధ్యక్షుడు బికాశ్‌ కోలే నేతృత్వంలో ప్రతినిధి బృందం సీఎంను కలిసింది. అంతర్జాతీయంగా గూగుల్‌ కార్యకలాపాలు, భవిష్యత్‌ ప్రణాళికలతో పాటు విశాఖలో వ్యూహాత్మక పెట్టుబడుల ప్రణాళికలను ఆయనకు వివరించింది. గూగుల్‌కు ఏపీ కీలక భాగస్వామ్య రాష్ట్రమని, భవిష్యత్తులో కొత్త కార్యకలాపాలను చేపట్టే అవకాశం ఉందని కోలే ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో మంత్రి లోకేశ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌కుమార్‌ ప్రసాద్, పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్‌ పాల్గొన్నారు. 

గూగుల్‌ పెట్టుబడుల కేంద్రంగా విశాఖ: మంత్రి లోకేశ్‌

గూగుల్‌ సంస్థ పెట్టుబడులకు విశాఖ కేంద్రంగా మారనుందని మంత్రి లోకేశ్‌ పేర్కొన్నారు. ‘అమెరికా పర్యటనలో గూగుల్‌ ఉన్నతస్థాయి ప్రతినిధులతో నేను జరిపిన చర్చలు ఫలవంతమయ్యాయి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పెట్టుబడిదారుల్లో నమ్మకం పెరిగింది. ఆర్సెలార్‌ మిత్తల్, రిలయన్స్‌ ఇండస్ట్రీస్, టాటా గ్రూప్, భారత్‌ ఫోర్జ్‌ వంటి భారీ పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయి. ప్రభుత్వంతో ఇప్పటికే కుదుర్చుకున్న ఒప్పందం మేరకు భవిష్యత్తు ప్రణాళికలపై చర్చించేందుకు గూగుల్‌ ప్రతినిధి బృందం వచ్చింది’ అని పేర్కొన్నారు. 

ap11124main2b.jpg

ఒప్పందం అనంతరం గూగుల్‌ సంస్థ ప్రతినిధులు, అధికారులతో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌

ప్రగతిశీల విధానాలతో పెట్టుబడులు

తమ నూతన ప్రగతిశీల పారిశ్రామిక విధానాలు.. వ్యాపార అనుకూల వాతావరణాన్ని సృష్టించాయని సీఎం చంద్రబాబు ‘ఎక్స్‌’ వేదికగా పేర్కొన్నారు. అవి పెట్టుబడిదారులను ఆకర్షించి, ఉపాధి అవకాశాలకు మార్గాన్ని సుగమం చేశాయని చెప్పారు. ‘ఈ రోజు అమరావతిలో గూగుల్‌ ప్రతినిధి బృందం నన్ను కలిసింది. ఆ సంస్థ కీలక భాగస్వామిగా రాష్ట్రాన్ని గుర్తించడం నాకెంతో గర్వంగా ఉంది. ఈ సమావేశంలో రాష్ట్రంలో వివిధ అంశాల్లో సాంకేతిక సహకారానికి సంబంధించిన అంశాలపై చర్చించాం. సాంకేతిక రంగంలో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన దిగ్గజ సంస్థ గూగుల్‌తో ఒప్పందం మన రాష్ట్రాన్ని శక్తిమంతంగా మార్చుతుందని, అంతిమంగా దేశ డిజిటల్‌ వృద్ధికి దోహదం చేస్తుందని విశ్వసిస్తున్నాను’ అని చంద్రబాబు ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు.   

విశాఖ సిగలో ‘గూగుల్‌’ 

తొలుత ఇన్ఫోసిస్‌.. ఆ తర్వాత టీసీఎస్‌.. తాజాగా గూగుల్‌.. ఇలా వరుసగా దిగ్గజ ఐటీ కంపెనీలు విశాఖను ఎంచుకుంటున్నాయి. గూగుల్‌తో  అవగాహన ఒప్పందం (ఎంఓయూ) వల్ల విశాఖలో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) డేటా క్లౌడ్‌ సెంటర్‌ ఏర్పాటుకు అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే సంస్థ ప్రతినిధులు క్షేత్రస్థాయిలో అనుకూలతలు పరిశీలించి, సంతృప్తి వ్యక్తం చేసినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. గూగుల్‌ వచ్చాక ప్రపంచంలోని పెద్దపెద్ద సంస్థలు కూడా రానున్నాయని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు. 

అంతర్జాతీయంగా పెరగనున్న బ్రాండ్‌ విలువ

‘గూగుల్‌ రాకతో విశాఖ ఒక పెద్ద గేమ్‌ ఛేంజర్‌గా మారిపోతుంది. గూగుల్‌కు కావాల్సిన సహకారం అన్ని ఐటీ కంపెనీల ద్వారా అందిస్తాం. దీంతో విశాఖ బ్రాండ్‌ అంతర్జాతీయంగా పెరిగే అవకాశం ఉంది’ అని విశాఖ ఐటీ పార్క్‌ అసోసియేషన్‌ ఉపాధ్యక్షులు ఒ.నరేష్‌కుమార్‌ చెప్పారు.  

Posted

గూగుల్‌.. గేమ్‌ చేంజర్‌!

ABN , Publish Date - Dec 12 , 2024 | 03:18 AM

 

ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్‌కు మైక్రోసాఫ్ట్‌, గూగుల్‌ వచ్చిన తర్వాతే అక్కడ సాఫ్ట్‌వేర్‌ ముఖ చిత్రం మారిపోయింది.

 
 
గూగుల్‌.. గేమ్‌ చేంజర్‌!
 

 

 

 

 

 

విశాఖలో డేటా సెంటర్‌.. స్థలం అన్వేషణలో గూగుల్‌ బృందం

విశాఖపట్నం, డిసెంబరు 11(ఆంధ్రజ్యోతి): ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్‌కు మైక్రోసాఫ్ట్‌, గూగుల్‌ వచ్చిన తర్వాతే అక్కడ సాఫ్ట్‌వేర్‌ ముఖ చిత్రం మారిపోయింది. ఇప్పుడు... విశాఖకు గూగుల్‌ రాక ‘గేమ్‌ చేంజర్‌’ కానుందని నిపుణులు పేర్కొంటున్నారు. బుధవారం అమరావతిలో ముఖ్యమంత్రి సమక్షంలో కుదిరిన ఒప్పందంతో ఈ దిశగా మరో అడుగు ముందుకు పడింది. ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ ఇటీవల పెట్టుబడుల సేకరణకు విదేశీ పర్యటన చేసినప్పుడు గూగుల్‌ ప్రతినిధులతో చర్చించారు. ఈ నెల 6వ తేదీన విశాఖలో నిర్వహించిన డీప్‌ టెక్నాలజీ సదస్సులో దీనిపై ఒప్పందం జరిగింది. అప్పుడే గూగుల్‌ బృందం విశాఖపట్నం అంతా తిరిగి అనువైన స్థలం కోసం అన్వేషణ చేపట్టింది. ఇంటర్‌నెట్‌కు గుండెకాయ వంటి కేబుల్‌ లైన్లను సింగపూర్‌ నుంచి సముద్ర గర్భంలో (అండర్‌ సీ) విశాఖపట్నం వరకూ తీసుకొస్తారు. కేబుల్‌ ల్యాండ్‌ అయిన చోట ఇది శక్తిమంతంగా పనిచేస్తుంది. అందుకే ఇక్కడ డేటా సెంటర్‌ పెట్టడానికి అప్పుడు అదానీ, ఇప్పుడు గూగుల్‌ ముందుకొచ్చాయి. దీని ద్వారా రాష్ట్ర ప్రభుత్వం కోరుకుంటున్న డీప్‌ టెక్నాలజీస్‌ అన్నింటిలో గూగుల్‌ సహకరిస్తుంది. గూగుల్‌తో రెండు దశాబ్దాల కిందటే ఒప్పందం చేసుకుని... ఆ సంస్థతో కలిసి పని చేసిన కంపెనీ విశాఖపట్నంలోనే ఉండడం విశేషం. చంద్రబాబు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు.. హైదరాబాద్‌లో గూగుల్‌ ఏర్పాటుకు విశాఖకు చెందిన ప్రవాసాంధ్రుడు కాట్రగడ్డ లలితేశ్వర్‌ కీలక పాత్ర పోషించారు. అప్పట్లో లలితేశ్వర్‌ సమీప బంధువు, ‘సింబియోసిస్‌’ నరేశ్‌కుమార్‌ కూడా ఆ చర్చల్లో పాల్గొన్నారు. గూగుల్‌ రాక విశాఖకు వరమని, దీని ద్వారా పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని నరేశ్‌కుమార్‌ ‘ఆంధ్రజ్యోతి’కి వివరించారు.

  • 2 weeks later...
Posted

గూగుల్‌ డేటా సెంటర్‌కు రక్షణ..

విశాఖ నగరంలో ఎఐ డేటా సెంటర్‌ ఏర్పాటుకు గూగుల్‌ సంస్థ రాష్ట్ర ప్రభుత్వంతో ఇటీవల ఎంఓయూ కుదుర్చుకొంది. గూగుల్‌కు ఇప్పటికే ముంబై, ఢిల్లీలో డేటా సెంటర్లు ఉన్నాయి. ఐటీలో వేగంగా దూసుకువెళ్తున్న వైజాగ్‌లో కృత్రిమ మేధస్సు (ఏఐ)కు ప్రత్యేకంగా ఒక డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయాలని గూగుల్‌ సంస్థ నిర్ణయించినట్లు సమాచారం. విదేశాలతో సమాచార మార్పిడికి విశాఖ నుంచి సముద్రం అడుగున కేబుళ్లు వేసే యోచనలో కూడా గూగుల్‌ ఉన్నట్లు తెలుస్తోంది. గూగుల్‌ డేటా సెంటర్‌ రాకతో రాష్ట్రానికి మరిన్ని ఐటీ సంస్థలు వచ్చే వీలుందని ప్రభుత్వం ఆశిస్తోంది. ఈ డేటా సెంటర్‌ విషయంలో గూగుల్‌ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి కొన్ని అనుమతుల కోసం ఎదురు చూస్తోంది. డేటా సెంటర్‌కు కేంద్రం ప్రత్యేక రక్షణ కల్పించాలని ఆ సంస్థ కోరుతున్నట్లు సమాచారం. గూగుల్‌ దరఖాస్తు ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఉంది. అయితే దీనికోసం కొన్ని చట్టాలను మార్చాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. గూగుల్‌కు అనుమతులన్నీ త్వరగా రాబట్టడానికి సీఎం చంద్రబాబు తన వంతు ప్రయత్నం చేస్తున్నారు. కొత్త ఏడాదిలో ఇవన్నీ సాకారం అవుతాయన్న నమ్మకంతో రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు ఉన్నాయి.

  • 2 weeks later...
Posted

Visakhapatnam: విశాఖలో మళ్లీ ఐటీ వెలుగులు

‘విశాఖలో పెట్టుబడులకు గూగుల్‌ సంస్థ ఓ ప్రతిపాదనతో ముందుకొచ్చింది. ఇప్పుడున్న పన్ను విధానాలను మార్చి, భవిష్యత్‌లో పెంచితే ఎలాగన్న డైలమాలో వారు ఉన్నారు.

Eenadu icon
By Andhra Pradesh News DeskPublished : 12 Jan 2025 06:43 IST
Ee
Font size
 
 
 
 
 
 

ప్రణాళికాబద్ధంగా ముందుకెళుతున్న కూటమి ప్రభుత్వం
పన్ను పెంచబోమన్న ప్రధాని హామీతో గూగుల్‌కు భరోసా
సాగర తీరాన ఐటీ కంపెనీలకు కేటాయించేందుకు భవనాలు సిద్ధం

AP110125main6a.webp

ఐటీ హిల్స్‌లోని మిలీనియం టవర్స్‌

‘విశాఖలో పెట్టుబడులకు గూగుల్‌ సంస్థ ఓ ప్రతిపాదనతో ముందుకొచ్చింది. ఇప్పుడున్న పన్ను విధానాలను మార్చి, భవిష్యత్‌లో పెంచితే ఎలాగన్న డైలమాలో వారు ఉన్నారు. ఈ నేపథ్యంలో నేను ప్రధానిని కలిసి సమస్య వివరించాను. పన్ను విధానంలో మార్పు ఉండదని, భవిష్యత్‌లో పెంచబోమని ఆయన హామీ ఇచ్చాకే గూగుల్‌ను ఆహ్వానించాం’  

ఈ నెల 8న విశాఖలో ప్రధాని మోదీ  బహిరంగ సభలో సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు


ఈనాడు, విశాఖపట్నం: సాగర తీరంలో మళ్లీ ఐటీ వెలుగులు నింపేందుకు కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కొత్తగా వచ్చే ఐటీ సంస్థలకు ఇబ్బందులు ఎదురవకుండా చర్యలు ఆరంభించింది. ప్రభుత్వ చొరవతో ఐటీ దిగ్గజాలు గూగుల్, టీసీఎస్‌ కంపెనీలు విశాఖలో అడుగుపెట్టేందుకు ఒప్పందం చేసుకున్నాయి. కొత్త ఐటీ పాలసీ ప్రకారం ప్రభుత్వ భవనాల్లో ఐదేళ్లపాటు అద్దె మినహాయింపు ప్రకటించారు. అందుకు తగ్గట్లు భవనాలు అందుబాటులో ఉంచడానికి కొన్ని చిక్కుముళ్లను తొలగిస్తూ పెట్టుబడులను ఆహ్వానించారు. 

కేంద్రం భరోసాతో.. 

‘ఐదేళ్ల జగన్‌ పాలనలో నెలకొన్న భయాందోళనలను పెట్టుబడిదారులు ఇంకా మరవలేదు. ఐపీపీ (ఇండిపెండెంట్‌ పవర్‌ ప్రొడ్యూసర్స్‌) రాష్ట్రప్రభుత్వంతో ఒప్పందం చేసుకుని, కేంద్రం కౌంటర్‌ గ్యారంటీ ఇచ్చినా జగన్‌ ప్రభుత్వం వారిని వేధించింది. కేంద్రమంత్రులు చెప్పినా, ఐపీపీ కోర్టుకెళ్లి ఉత్తర్వులు తెచ్చుకున్నా పూర్తి చెల్లింపులు చేయలేదు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని రాష్ట్రం ఇచ్చే రాయితీలకు కేంద్ర భరోసా కోసం పెట్టుబడిదారులు ఎదురు చూస్తున్నారు. పవర్‌ ప్రాజెక్టుల తరహా ఇతర పెట్టుబడులకు కేంద్రం కౌంటర్‌ గ్యారంటీ ఇస్తే చాలామంది ముందుకొచ్చే అవకాశం ఉంది’ అని విశాఖలోని రుషికొండ ఐటీ హిల్స్‌ అసోసియేషన్‌ ఉపాధ్యక్షుడు ఒ.నరేష్‌కుమార్‌ చెప్పారు. ప్రభుత్వాలు మారినప్పుడు ఇబ్బందులు పడకూడదనే విశాఖకు రావడానికి గూగుల్‌ ఆచితూచి వ్యవహరించినట్లు తెలుస్తోంది. సింగపూర్‌ నుంచి హైస్పీడ్‌ ఇంటర్నెట్‌ కేబుల్‌ ఏర్పాటు, డేటా సెంటర్‌కు అవసరమైన గ్రీన్‌ ఎనర్జీని ఎక్కడ నుంచైనా నేషనల్‌ గ్రిడ్‌ ద్వారా పన్నుల్లేకుండా తీసుకునే వెసులుబాటుకు కేంద్రం నుంచి భరోసా వచ్చాకే అడుగులు పడినట్లు అర్థమవుతోంది.

అంతర్జాతీయ పెట్టుబడిదారులకు అనువుగా భవనాలు

ఐటీ హిల్స్‌లో హిల్‌-3 మొత్తం ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్‌) పరిధిలో ఉంది. ఇక్కడే మిలీనియం టవర్లున్నాయి. తెదేపా హయాంలో పూర్తిచేసిన టవర్‌-1లో నాలుగు అంతస్తులు కాండ్యుయెంట్‌ కంపెనీకి కేటాయించారు. వైకాపా అధికారంలోకి వచ్చాక మిగిలిన నాలుగు అంతస్తులు ఖాళీగానే పెట్టారు. టవర్‌-2లో ఏపీఐఐసీ మరో 8 అంతస్తులు నిర్మించింది. మొత్తంగా ఈ రెండు టవర్ల పరిధిలో 3.50 లక్షల చదరపు అడుగుల స్థలం ఖాళీగా ఉంది. అంతర్జాతీయ పెట్టుబడిదారు ఎవరైనా వస్తే కొత్త ఐటీ పాలసీ ప్రకారం ఈ మిలీనియం టవర్స్‌ కేటాయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీఎంఆర్డీఏ సిరిపురంలో నిర్మిస్తున్న మల్టీలెవెల్‌ కార్‌ పార్కింగ్‌ ఐదంతస్తుల భవనాన్ని సైతం ఐటీ కంపెనీకి అద్దెకిచ్చేందుకు ఆలోచన చేస్తోంది.

  • 2 weeks later...
Posted

విశాఖలో డిజైన్‌ కేంద్రం పెట్టండి

ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు,సాంకేతికంగా తమ రాష్ట్రాన్ని బలోపేతం చేసేందుకు ముందుకు రావాలంటూ దావోస్‌ వేదికగా ప్రతిష్ఠాత్మక కంపెనీలను సీఎం చంద్రబాబు కోరారు. సర్వర్ల కోసం సొంత చిప్‌లను రూపొందిస్తున్న గూగుల్‌ క్లౌడ్‌ సంస్థ తన డిజైన్‌ కేంద్రాన్ని ఏపీలో ఏర్పాటుచేసే విషయం యోచించాలని ఆ సంస్థ సీఈవో థామస్‌ కురియన్‌కు సూచించారు. క్లౌడ్‌ ప్రొవైడర్‌లో ప్రపంచంలోనే మూడో అతిపెద్ద సంస్థ ఇది. ఢిల్లీ, ముంబైల్లో 2కేంద్రాలను ఇప్పటికే నెలకొల్పింది. విశాఖలో డేటాసిటీ ఏర్పాటుకు; ఏఐ వినియోగాన్ని అభివృద్ధి చేయడానికి, రాష యువతకు నైపుణ్యాభివృద్ధి అవకాశాలను పెంచడానికి ప్రభుత్వంతో గూగుల్‌ ఇప్పటికే పలు ఒప్పందాలు చేసుకుంది. ఈ క్రమంలోనే సీఈవో కురియన్‌తో చంద్రబాబు చర్చలు జరిపారు. రాష్ట్రంలో నైపుణ్యం కలిగిన యువత అందుబాటులో ఉందని ఆయనకు చంద్రబాబు చెప్పారు. డిజైన్‌ కేంద్రానికి విశాఖ అత్యంత సానుకూలమైనదని చెప్పారు.

  • 2 weeks later...

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...