sonykongara Posted June 14, 2024 Author Posted June 14, 2024 Arudra: ధైర్యం వచ్చింది.. ఇక కాకినాడలోనే ఉంటా: ఆరుద్ర వైకాపా నేతలు, పోలీసుల వేధింపులు కారణంగా కూతురు సాయితో కలిసి వారణాసిలో తలదాచుకుంటున్నానని.. చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ధైర్యం వచ్చిందని, కాకినాడలోనే ఉంటానని రాజులపల్లి ఆరుద్ర తెలిపారు. Updated : 13 Jun 2024 09:08 IST రాజులపల్లి ఆరుద్ర సర్పవరం జంక్షన్, న్యూస్‌టుడే: వైకాపా నేతలు, పోలీసుల వేధింపులు కారణంగా కూతురు సాయితో కలిసి వారణాసిలో తలదాచుకుంటున్నానని.. చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ధైర్యం వచ్చిందని, కాకినాడలోనే ఉంటానని రాజులపల్లి ఆరుద్ర తెలిపారు. వైకాపా ప్రభుత్వంలో ఇబ్బందులు పడ్డ వారికి కూటమి ప్రభుత్వం నుంచి అందిన ఆహ్వానం మేరకు ఆమె బుధవారం చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు. రద్దీ ఎక్కువగా ఉండటంతో కుమార్తెను భర్తతో కలిపి వెనక్కి పంపి.. ఆమె మాత్రమే కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఆరుద్ర మాట్లాడుతూ.. విజయవాడలో రెండు రోజులు ఉండి చంద్రబాబు, పవన్‌కల్యాణ్, లోకేష్‌లను కలసి వస్తానన్నారు. కొత్త ప్రభుత్వంలో తన కూతురికి వైద్యం చేయించుకుని, ఆమె ఆరోగ్యం బాగుపడితే చాలని చెప్పారు. తనకు ఆహ్వానం పంపడం సంతోషంగా ఉందన్నారు. గతంలో ఏపీకి రావాలంటే భయపడాల్సి వచ్చేదని, ఇప్పుడు ధైర్యంగా ఉందన్నారు. వైకాపా ప్రభుత్వం నుంచి పెద్దమొత్తంలో డబ్బులు అందుకున్నట్లు తనపై కొందరు వైకాపా నాయకులు ఆరోపణలు చేశారని.. కానీ ఒక్క రూపాయి కూడా అందలేదన్నారు. తనకు సాయం చేసిన వారి వివరాలను ఆమె వెల్లడించారు. తన బిడ్డ ప్రాణాలతో ఉందంటే మీడియానే కారణమన్న ఆమె.. ఇది రాష్ట్రంలోని అందరి ఆడపిల్లల గెలుపన్నారు. తనకు అన్ని రకాలుగా సహకారం అందించిన మీడియా సంస్థలు, ప్రతనిధులకు కృతజ్ఞతలు తెలిపారు.
sonykongara Posted June 14, 2024 Author Posted June 14, 2024 కువైట్ అగ్ని ప్రమాద మృతులకు ఏపీ ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా – కువైట్ అగ్ని ప్రమాదంలో ఏపీకి చెందిన ముగ్గురు కార్మికులు మృతి - మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన సీఎం చంద్రబాబు
sonykongara Posted June 14, 2024 Author Posted June 14, 2024 ఆరుద్ర కుమార్తెకు పింఛను, వైద్యానికి రూ.5 లక్షల సాయం.. చంద్రబాబు హామీ కాకినాడ గ్రామీణ మండలం రాయుడుపాలెంనకు చెందిన వైకాపా బాధితురాలు ఆరుద్ర.. శుక్రవారం సాయంత్రం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. Updated : 14 Jun 2024 20:33 IST అమరావతి: కాకినాడ గ్రామీణ మండలం రాయుడుపాలెంనకు చెందిన వైకాపా బాధితురాలు ఆరుద్ర.. శుక్రవారం సాయంత్రం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. దివ్యాంగురాలైన ఆమె కుమార్తెకు రూ.10వేల పింఛను మంజూరు చేస్తామని, వైద్య ఖర్చుల కోసం రూ.5 లక్షలు సాయం చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఆమె ఆస్తి వివాదాలను పరిష్కరించేందుకు ప్రభుత్వం సాయం చేస్తుందని హామీ ఇచ్చారు. ఆరుద్ర కుమార్తె సాయిలక్ష్మిచంద్ర కొంతకాలంగా వెన్నెముక సమస్యతో బాధపడుతోంది. కుమార్తె వైద్యం కోసం ఇంటిని అమ్మేందుకు యత్నించిన ఆరుద్రను.. గత ప్రభుత్వ హయాంలో వైకాపా నేతలు అడ్డుకున్నారు. ఈ విషయంపై అనేక సార్లు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చినా.. జగన్‌ను కలవకుండా అప్పట్లో పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. న్యాయం జరగడంలేదనే బాధతో అప్పట్లో సీఎం క్యాంపు ఆఫీసు వద్దే ఆరుద్ర ఆత్మహత్యాయత్నం కూడా చేశారు. చంద్రబాబు దృష్టికి సమస్యను తీసుకెళ్లగా.. కూటమి అధికారంలోకి వచ్చాక ఆదుకుంటామని ఆమెకు హామీ ఇచ్చారు.
sonykongara Posted June 15, 2024 Author Posted June 15, 2024 ప్రజల కష్టాలు వినే ముఖ్యమంత్రి, ప్రజలకు అందుబాటులో. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న కడప పట్టణం, రాజారెడ్డి వీధికి చెందిన కనపర్తి మనోజ్ కుమార్ అనే దివ్యాంగుడు, వైద్యం కోసం సాయం చేయాలని కోరగా, వీల్ చైర్ కే పరిమితమైన మనోజ్ పరిస్థితి చూసి, సీఎం చంద్రబాబు నాయుడు గారు రూ.3 లక్షల సాయాన్ని ప్రకటించారు.
sonykongara Posted July 30, 2024 Author Posted July 30, 2024 https://www.eenadu.net/videos/playvideo/cm-chandrababu-rs-10-lakh-financial-assistance-to-a-student-who-was-injured-by-road-accident/1/56590
sonykongara Posted July 30, 2024 Author Posted July 30, 2024 మాజీ ఎమ్మెల్యే చొరవతో.. రోడ్డు ప్రమాద బాధితుడికి సీఎం చంద్రబాబు ఆర్థిక సాయం రోడ్డు ప్రమాదానికి గురై తీవ్రంగా గాయపడిన న్యాయ విద్యార్థికి ముఖ్యమంత్రి చంద్రబాబు రూ.10 లక్షలు ఆర్థిక సాయం అందించారు. Published : 30 Jul 2024 16:58 IST రోడ్డు ప్రమాదానికి గురై తీవ్రంగా గాయపడిన న్యాయ విద్యార్థికి ముఖ్యమంత్రి చంద్రబాబు రూ.10 లక్షలు ఆర్థిక సాయం అందించారు. బాపట్ల జిల్లా పెసర్లంకకు చెందిన కె.సాయిఫణీంద్ర ఇటీవల ఉద్యోగం కోసం తెనాలి వెళ్తుండగా కొల్లూరు వద్ద రోడ్డు ప్రమాదానికి గురై కోమాలోకి వెళ్లారు. కుమారుడి చికిత్స కోసం బాధితుడి తల్లిదండ్రులు అప్పు చేసి దాదాపు రూ.14లక్షలు ఖర్చు చేశారు. ఈ విషయాన్ని తెలుసుకున్న సత్తెనపల్లి మాజీ ఎమ్మెల్యే పి.భారతి.. ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు సీఎం రిలీఫ్ ఫండ్ కింద రూ.10 లక్షలు విడుదల చేసి చెక్కును పి.భారతికి అందించారు.
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.