Jump to content

AP:Phone Tapping


Recommended Posts

కేశినేని చిన్ని, టీడీపీ నేత,విజయవాడ పార్లమెంటు అభ్యర్థి.*

*నా ఫోన్ ట్యాప్ చేసేలా ఇంటెలిజెన్స్ ప్రయత్నించింది.*

ఆ ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ ను పట్టుకుంటే అసలు విషయాలు వచ్చాయి.

వ్యక్తిగత స్వేచ్ఛని హరించేలా కొందరు పోలీస్ ఉన్నతాధికారులు వ్యవహరిస్తున్నారు.

సీఎం జగన్ కు తొత్తుల్లా కొదరు పోలీస్ ఉన్నతాధికారులు వ్యవహరిస్తున్నారు.

Link to comment
Share on other sites

ఇంటెలిజెన్స్‌ డీజీ నేతృత్వంలో ఫోన్‌ ట్యాపింగ్‌.. తెదేపా వర్క్‌షాప్‌లో పట్టుబడిన కానిస్టేబుల్‌

ఇంటెలిజెన్స్‌ డీజీ సీతారామాంజనేయులు నేతృత్వంలో ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాపింగ్‌కు గురవుతున్నాయని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు బోండా ఉమామహేశ్వరరావు ఆరోపించారు.

Updated : 24 Mar 2024 10:39 IST
 
 
 
 
 
 

పక్కా ఆధారాలు సేకరించిన తెదేపా నేతలు
కేశినేని చిన్ని ఫోన్‌ ట్యాప్‌ చేసినట్లు బోండా ఉమా ఆరోపణ

ap230324main4a_1.jpg

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ఇంటెలిజెన్స్‌ డీజీ సీతారామాంజనేయులు నేతృత్వంలో ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాపింగ్‌కు గురవుతున్నాయని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు బోండా ఉమామహేశ్వరరావు ఆరోపించారు. శనివారం విజయవాడలోని ఏ1 కన్వెన్షన్‌ హాల్లో తెదేపా అభ్యర్థులకు నిర్వహించిన వర్క్‌షాప్‌పై నిఘాపెట్టిన ఇంటెలిజెన్స్‌ కానిస్టేబుల్‌ జి.విశ్వేశ్వరరావును పట్టుకున్నామని తెలిపారు. ఆయన నుంచి కేశినేని చిన్ని ఫోన్‌ ట్యాప్‌ చేస్తున్నట్లు పలు ఆధారాలను సేకరించామన్నారు. ఈ వ్యవహారంపై ఆరాతీయగా డీజీ పంపితేనే వచ్చినట్టు ఆయన చెప్పారని బోండా ఉమా వెల్లడించారు. దీనికి బాధ్యులైన సీతారామాంజనేయులు, కొల్లి రఘురామిరెడ్డి, ఇతర ఉన్నతాధికారులను ముఖ్య ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్‌కుమార్‌ మీనా వెంటనే విధుల నుంచి తొలగించాలని డిమాండు చేశారు. విజయవాడలో కేశినేని చిన్ని, పట్టాభిరాంతో కలిసి బోండా ఉమా విలేకర్ల సమావేశం నిర్వహించారు.

‘‘తమ ప్రభుత్వం ఫోన్లు ట్యాప్‌ చేస్తోందని ఓ సందర్భంలో మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ కూడా వెల్లడించారు. పెగాసస్‌ సాఫ్ట్‌వేర్‌ను తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌తో కలిసి సీఎం జగన్‌ కూడా కొనుగోలు చేశారు. చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌, పురందేశ్వరి సహా పలువురు ప్రతిపక్ష నాయకులపై నిఘా పెట్టారు. మేము ఏం మాట్లాడినా ఫోన్‌ ట్యాప్‌ చేసి వింటున్న పోలీసులు.. మా ఇళ్లు, ఆఫీసుల వద్ద గస్తీ కాస్తున్నారు. మా విషయాలన్నీ పోలీసులకు ఎలా చేరుతున్నాయని సాంకేతిక నిపుణులతో పరిశీలన చేయిస్తే ఫోన్లు ట్యాప్‌ అయినట్లు నిర్ధరణ అయింది. దీనిపై సీఎం జగన్‌ వెంటనే సమాధానం చెప్పాలి. ఈ కుట్రచేసిన, చేయిస్తున్న అందరిపై చర్యలు తీసుకుంటేనే రాష్ట్రంలో ఎన్నికలు ప్రశాంతంగా, నిష్పాక్షికంగా జరుగుతాయి. ఈ వ్యవహారంపై సీఈఓను కలిసి అన్ని ఆధారాలు సమర్పిస్తాం’’ అని బోండా ఉమా పేర్కొన్నారు.


జగన్‌కు అనుకూలంగా కొంతమంది పోలీసులు

‘‘నా ఫోన్‌ ట్యాప్‌ చేసేలా ఇంటెలిజెన్స్‌ విభాగం ప్రయత్నించింది. కానిస్టేబుల్‌ను పట్టుకుంటే అసలు బండారం బయటపడింది. జగన్‌కు అనుకూలంగా కొంతమంది పోలీసు ఉన్నతాధికారులు వ్యవహరిస్తున్నారు.’’

కేశినేని చిన్ని, విజయవాడ తెదేపా లోక్‌సభ అభ్యర్థి


ట్యాపింగ్‌లో కేశినేని నాని పాత్ర

‘‘కొంతమంది పోలీసు ఉన్నతాధికారులు ఐపీఎస్‌లా కాకుండా జేపీఎస్‌ (జగన్‌ పోలీస్‌ సర్వీస్‌) మాదిరిగా వ్యవహరిస్తున్నారు. ఈ ట్యాపింగ్‌లో కేశినేని నాని పాత్ర కూడా ఉంది. ఓటమి భయంతో కుటిల యత్నాలకు తెర తీస్తున్నారు’’

కొమ్మారెడ్డి పట్టాభిరాం, తెదేపా అధికార ప్రతినిధి

Link to comment
Share on other sites

  • 2 weeks later...
  • sonykongara changed the title to AP:Phone Tapping

Nara Lokesh: ఫోన్‌ ట్యాపింగ్‌కు యత్నం.. నారా లోకేశ్‌కు ‘యాపిల్‌’ అలర్ట్

తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ (Nara Lokesh)కు యాపిల్‌ సంస్థ సెక్యూరిటీ అలర్ట్‌ పంపింది.

Published : 12 Apr 2024 13:12 IST
 
 
 
 
 
 

124070691_120424lokesh-brk1a.jpg

అమరావతి: తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ (Nara Lokesh)కు యాపిల్‌ సంస్థ సెక్యూరిటీ అలర్ట్‌ పంపింది. ఫోన్‌ ట్యాపింగ్‌, హ్యాకింగ్‌కు ప్రయత్నం జరుగుతోందని ఈమెయిల్‌లో పేర్కొంది. దీనికి సంబంధించి జాగ్రత్తలు తీసుకోవాలని ఆయనకు సూచించింది. మరోవైపు లోకేశ్ ఫోన్‌ను వైకాపా ప్రభుత్వమే ట్యాప్‌ చేస్తోందని తెదేపా నేతలు ఆరోపిస్తున్నారు. దీనిపై ఎన్నికల కమిషన్‌, సీఈవోకు ఫిర్యాదు చేయనున్నారు.

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...