Jump to content

Ranga Maarthaanda 💚🌺💚

GOLI SODA

Recommended Posts

Krishna Vamshi is back finally

old school or melodrama anachu but hits at heart, good subject... Balagam laga but without comedy

Prakash Raj and Brahmi gave great performance 🙏

dialogues are rich, needed good actors to perform

will go big as the talk spreads

Link to comment
Share on other sites

  • GOLI SODA changed the title to Ranga Maarthaanda 💚🌺💚

"రంగమార్తాండ" నేనూ చూశాను.  ఇదో చెడ్డ సినిమానో, చెత్త సినిమానో, పరమ బోరింగ్ సినిమానో అయితే కాదు.  ఏదో 'చతుర' మాసపత్రికలో నవల చదివినట్లు అనిపించే సినిమా. ఎక్కడా అసభ్యతకి, అశ్లీలతకి, హింసాత్మకమైన రొటీన్ ఫార్ములాలకి తావివ్వని సినిమా.  కానీ కథాపరంగా పరమ లోపభూయిష్టమైన సినిమా.   మెలోడ్రామా ద్వారా బలమైన భావోద్వేగాలతో ప్రేక్షకుల గుండెల్ని ఊపేయడం మీద పెట్టిన దృష్టి పాత్రల ఔచిత్యం మీద పెట్టలేదు దర్శకుడు. 

"రంగమార్తాండ"కి మూలం ఐన మరాఠీ సినిమా "నటసామ్రాట్" నేను చూడలేదు.  60 ఏళ్ళ క్రితం రాసిన నాటకాన్ని కొన్నేళ్ళ క్రితం మరాఠీలో సినిమాగా తీశారు.  తెలుగు వెర్షన్ కోసం ఏ ఏ మార్పులు చేశారో నాకు తెలియదు. రంగమార్తాండ అంటే రంగస్థలానికి కథకి ఎంతో కొంత సంబంధం వుంటుందని మనం అనుకోవడంలో తప్పులేదు.  కానీ మనం అనుకున్నట్లు దర్శకుడు అనుకోలేదేమో అనిపించింది. సినిమా చివరిలో  ఒక రంగస్థల నిష్ణాతుడు వివిధ పాత్రల్ని పోషించడంలో అనుభూతి చెందే మానసిక ఘర్షణ గురించి ప్రస్తావన వుంటుంది.  తమ పాత రోజులలో తామాడిన కర్ణ సుయోధన పాత్రల మీద నాటకంలోని సంభాషణలని ప్రకాష్ రాజ్, బ్రహ్మాానందం అభినయిస్తూ చెబుతారు.   అది మినహా ఈ సినిమాకి నాటక రంగానికి  ఏ సంబంధమూ లేదు.  ప్రకాష్ రాజ్ నాటకరంగం నుండి కాకపోతే ఏ ప్రభుత్వోద్యోగం నుండో రిటైర్ అయినట్లు చూపించినా కథలో పడే వ్యత్యాసమేం లేనట్లు తీశారు.  గతంలో దాసరి, వేజెండ్ల సత్యనారాయణ ఇలాంటి సినిమాలు తీశారు.  మళ్లీ అదే సబ్జెక్ట్ మీద తీయడం నేరం కాదు కానీ ఈ కథని తీయడం కూడా పాత పద్థతిలోనే తీయడం మైనస్ పాయింట్. రంగస్థల నటులు సెలబ్రిటీలుగా గుర్తించబడే పాతకాలపు కథావరణం ఆధునిక  కాలానికి సెట్ కాదు.   ఆ రకంగా సినిమా కథాకాలంలొనే confusion వుంది.  ఒక సన్నివేశంలో ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ బస్టాండులో వుండగా చిరంజీవి సినిమా "స్వయంకృషి" పోస్టర్ కనిపిస్తుంది.   పోనీ ఇది ఒక పీరియడ్ ఫిల్మ్ అనుకుందామంటే పోస్ట్ కోవిడ్ పరిణామమైన వర్క్ ఫ్రం హోం ప్రస్తావనలుంటాయి.  పిల్లల అత్యాధునిక జీవితాలుంటాయి.

దర్శకుడు ఈ సినిమాని "మన అమ్మా నాన్నల కథ" అని ప్రకటించారు.  రియల్ ఎస్టేట్ ఎకానమీతో, భవిష్యత్తు పట్ల కెరీర్ ఓరియంటెడ్ అప్రోచెస్ తో, పిల్లల పెంపకంలో యాంత్రిక ధోరణితో, నిత్య జీవితంలో వినిమయదారీ సంస్కృతితో లుప్తమైపోయిన మానవీయ విలువల వల్లనూ దెబ్బతిన్న మానవ సంబంధాల నేపథ్యంలో విశ్రాంతి జీవితం గడపాల్సిన వృద్ధ తల్లిదండ్రుల వెతల్ని ఆర్తిగా చూపించాలనుకున్న దర్శకుడి సదుద్దేశ్యం అర్ధమవుతుంది.  కానీ ఆ స్థాయిలో కథ లేదు.  

కథకి వస్తే రంగస్థలం నుండి రంగమార్తాండ బిరుదాంకితుడై రిటైర్మెంట్ తీసుకున్న రాఘవరావు తన ఇంటిని కోడలు పేరున రాస్తాడు.  తన సేవింగ్స్ మొత్తం కూతురుకి ఇచ్చేస్తాడు.  ఇంత పెద్ద స్టెప్ తీసుకునే ముందు భార్యని గారూ అని అతి గౌరవంతో పిలిచే వ్యక్తి భార్యని సంప్రదించడు.  తనకి, తన భార్యకి ఏమీ మిగిల్చుకోకుండా తామింక ఫ్రీ బర్డ్స్ అని డిక్లేర్ చేస్తాడు.  నిజానికి రాఘవరావు, ఆయన భార్య అంటే కొడుకు, కూతురు, కోడలు  ఎంతో ప్రేమగా, అభిమానంగా వుంటారు.  ఆధునిక జీవితం పట్ల అవగాహన గల కోడలు ఈ వృద్ధుల ఆరోగ్యం కోసం ఆహారంలో మార్పులు చేసి, కొన్ని నియమాల్ని ప్రవేశపెడితే అత్తమామలు ఒప్పుకోరు. "మనుషులు తినే తిండి పెట్టమ"ని ఈసడిస్తారు.   పాత ఇంటిని పడగొట్టి డెవలప్మెంట్ కి ఇద్దామని కోడలు అంటే రాఘవరావు ఒప్పుకోడు.  "మేం పోయాక మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండి" అంటాడు.  మరి అలాంటప్పుడు అసలు ఆస్తి ఆమె పేరున ఎందుకు పెట్టాలి?  నిజమే తాము బతికుండగానే పిల్లలకి ఆస్తి సంక్రమింప చేయడం తప్పే కానీ చెడ్డది కాని కోడల్ని ఆల్మోస్ట్ విలన్ గా చూపించడమనేది ఆధునిక కాలంలో స్వతంత్ర ఆలోచనలతో వ్యవహరించే స్త్రీలని కించపరచడమేనని అనుకుంటున్నా.    పెద్దలు ఎప్పుడూ తప్పు చేయరని, పెద్దలకి రుచించని పనులు యువతరం చేస్తారు కాబట్టి యువతరం స్వార్ధపూరితమైందనే రొడ్డకొట్టుడు ఆలోచనలతో నేను ఏకీభవించను. తప్పులు ఎవరైనా చేయొచ్చు.  స్వార్ధంగా వ్యవహరించే తల్లిదండ్రుల గురించి నాకు తెలుసు.      తరాల మధ్య ఘర్షణ అనేది పాత కధే.  ఏ కాలంలో అయినా వుంటుంది.  కానీ దానికి  పాత సినిమాటిక్  ట్రీట్మెంట్ ఇవ్వడం సరైంది కాదు.  

నిజానికి ఈ సినిమాలో లీడ్ కారెక్టర్స్ ఐన రాఘవరావు దంపతుల కంటే వారి పిల్లలే రీజనబుల్ గా అనిపించారు.  వాళ్ళేమీ వారిని బలవంతంగానో, కుట్ర పూరితంగానో ఆస్తులు రాయించుకొని బైటకి తరిమెయ్యలేదు.  కోడలి పేరున ఆస్తి రాసిచ్చినా ఒక ఏడెనిమిదేళ్ళ తరువాతే డెవలప్మెంట్ కి వెళతారు.  స్థలం డెవలెప్మెంట్ కి ఇచ్చాక ఒక ఆర్నెల్లు కూతురు దగ్గర ఉండమనడం ఘొరమైన విషయం కాదే!  వార్ధక్యం సాకుగా చూపి పెళ్లైన పిల్లలతో కలిసి జీవించాలనుకోవడమే తప్పు.  వార్ధక్యం వల్ల ఏర్పడే అనారోగ్య సమస్యలకి తగ్గ కేర్ ఏర్పాటు వరకే పిల్లల హెల్ప్ తీసుకోవాలే కానీ పెద్దవాళ్లమనే వంకతో పిల్లల బతుకుల మీద పెత్తనం చేయాలని చూడటం ఆధిపత్య విలువల కిందకే వస్తుంది.  చాలామంది పెద్దలు తమ పిల్లలు చిన్నగా వున్నప్పుడైతే కొట్టి సాధిస్తారు. వాళ్లు పెద్దవాళ్లయ్యాక అలిగి సాధిస్తారు.  ఈ సినిమాలో రెండో ధోరణి కనిపిస్తుంది. సమాజంలో తల్లిదండ్రుల్ని నిరాదరించే పిల్లలు లేరా అంటే ఎందుకుండరు? వుంటారు. కానీ ఈ సినిమాలో రాఘవరావు పిల్లలు ఆ బాపతు కాదు.  పెద్దల చాదస్తం, మూర్ఖత్వం వారి హక్కులైనట్లు, అవి విలువలైనట్లు చూపడమే అభ్యంతరకరం.

తనకు పిల్లలు లేకపోవడం ఒక తన అదృష్టమని పదేపదే చెప్పే బ్రహ్మానందం పాత్ర ప్రయోజనం ఏమిటో అర్ధం కాలేదు.  కేవలం ప్రేక్షకుల్ని ఏడిపించడానికి మాత్రమే ఆ పాత్రని అతి దారుణంగా అంతం చేశారు. చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకొని తన ప్రాణ స్నేహితుడికి కారుణ్య మరణం ఇవ్వడాన్ని నేనైతే దుర్మార్గంగా భావిస్తాను.  అది ఖచ్చితంగా హత్యే.  ఈ సన్నివేశం  సమాజానికి చాలా తప్పుడు సంకేతాల్ని ఇస్తుంది.  డిప్రెషన్లో వున్న స్నేహితుడిని కౌన్సెలింగ్ ఇచ్చి లేక ఇప్పించి సరైన దారిలో పెట్టుకోవాలి, జీవితం మీద ఆశ రేకెత్తించే యాక్టివిటీని పరిచయం ఛేసి, అందులో నిమగ్నమయ్యేలా చూడాలి కానీ ఒంటరితనం భరించలేక పోతున్నా అంటే చంపేస్తారా?   ఇంత అసమంజసంగా, బాధ్యతారాహిత్యంగా ఎలా తీశారనిపించింది.

ఆ వృద్ధ దంపతులు తమ చాదస్త, సంక్లిష్ట మనస్తత్వాలతో తమని తాము రోడ్డున పడేలా చేసుకుంటారు.  భార్య రోడ్డు మీద చనిపోతే కనీసం పిల్లలకి తెలియచేయకపోవడం పిల్లల పట్ల రాఘవరావు కచ్చమోత్తనానికి ప్రతిబింబం.  అలా ఎలా చేయగలడు? ఎంత కర్కశమైన నిర్ణయం! మితృడు భరధ్వాజ రంగావఝ్ఝల అన్నట్లు రాఘవరావు దంపతులకి, వారి పిల్లలకు మధ్యనున్నది మిత్ర వైరుధ్యమే.  దాన్ని దర్శక రచయితలిరువురు శతృవైరుధ్యంగా మార్చి చూపారు. దిసీజ్ ఇండీడ్ ఏ బాడ్ ట్రీట్మెంట్ టు ద స్టోరీ.  మెలోడ్రామాతో ప్రేక్షకుల్ని ఏడిపించడమే ఆర్ట్ అనుకునే అమాయక, అపరిపక్వ ధోరణికి ఇదో ఉదాహరణ.

కథాపరంగా ఎంత బలహీనంగా వున్నా సినిమాని గట్టెక్కించింది మాత్రం నటుల ప్రతిభ, కృష్ణవంశీ టేకింగే.  ప్రకాష్ రాజ్ చాలా చోట్ల బాగా చేశాడు. కొన్ని చోట్ల అతి చేశాడు.  ముఖ్యంగా క్లైమాక్సులో.  ఎప్పుడో ముప్ఫై ఏళ్ల క్రితం "అమ్మ" సినిమాలో ఏడిపించిన బ్రహ్మానందం జనాల్ని ఏడిపించడానికి ఇప్పుడొచ్చిన అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకున్నాడు. రమ్యకృష్ణ కూడా పాత్రోచితంగా చేశారు.  రాహుల్ బాలకృష్ణ, రాహుల్ సిప్లిగంజ్, అనసూయ తమని తీసుకున్నందుకు న్యాయం చేశారు.  శివాత్మిక ప్రశంసనీయమైన నటన ప్రదర్శించింది.  ఆమె రూపంలో ఒక మంచి పెర్ఫార్మర్ తెలుగు సినిమాకి దొరికిందని చెప్పుకోవచ్చు. తన స్క్రీన్ ప్రెజన్స్ తో ఆమె ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ  వంటి సీజన్డ్ ఆర్టిస్టుల్ని కూడా డామినేట్ చేసింది. మిగతా విషయాలకొస్తే ఇళయరాజా మ్యుజిక్ లో ఆయన మ్యాజిక్ లేదు.   

కథలో వున్న లోపాల్ని దృష్టిలో పెట్టుకుంటే నటుల పెర్ఫార్మెన్స్ కోసం ఒకసారి చూడదగ్గ సినిమా.  కానీ దిక్కుమాలిన మెలోడ్రామాలో పడి కొట్టుకుపోవద్దని నా సూచన.

పి ఎస్.: మిత్రుల సూచన మేరకు ఈ ఒక్క రివ్యూ కోసం వచ్చానని, మళ్ళీ నా సెలవు కొనసాగుతుందని తెలియచేస్తున్న  వ్యక్తిగత పనుల ఒత్తిడిలో నిండా మునిగి వున్నా.

from FB

Link to comment
Share on other sites

3 hours ago, GOLI SODA said:

Content intha bad aah 🤣

Link to comment
Share on other sites

2 hours ago, NAGA_NTR said:

Content intha bad aah 🤣

no content is good 

dasari surigadu type ... 

PR and Brahmi performance bonus 

yaa content is open for discussion... one side tilt yekuva vundhi anachu...

it is about Parents and Kids ... must watch ye may be in OTT

note: serious movie 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...