Jump to content

అసలు మార్పు మొదలయ్యిందా?


Cyclist

Recommended Posts

అసలు మార్పు మొదలయ్యిందా?

ఇప్పటికే మారారు
ఇంకా మారుతున్నారు 
ఎప్పటికీ మారరు

అప్పటికి తీర్పు చెప్పేవారు

ఇలా నాలుగు రకాలుగా వర్గీకరించవచ్చు, జగన్ రెడ్డికి ఒక్క ఛాన్స్ ఇచ్చిన వర్గాలను. 

సమాజం మొత్తం ఒక ఇరుసులా తిరిగితే అభివృద్ధి జరుగుతుంది. కానీ ఆ ఇరుసుకు, ఒక రంగానికి ఇంకో రంగం అనుసంధానం అయ్యి చక్రాల్లా వుంటాయి.

చక్రాలకు మధ్య పాలకులు గ్రీసు పూయాలి. దాని బదులు తామే రాయిలా మారితే, ఒక్కో చక్రం పాడవుతుంది & మొరాయిస్తుంది. ఒక్క చక్రం తిరగకున్నా.. మొత్తం ఇరుసు తిరగదు.    

జగన్ రెడ్డి వచ్చీ రాంగానే ఇసుకతో మొదలైన సమస్యతోనే ఇరుసు తిరగడం మొరాయించింది. 

దాని తరువాత కరోనాల దశలు వచ్చాయి. అప్పుడు కాళ్లు చాపేసి కూర్చొన్నాడు. అన్ని చక్రాలు పాడయ్యాయి. గ్రీసు అవసరం లేని, సినిమా లాంటి చక్రానికి కావాలని సమస్య సృష్టించారు. అదొక్కటే కాదు అలా చాలా. 

అలా ప్రతి రంగం నాశనం అయిన తరువాత, దాని మీద బ్రతికే వారి బతుకులు దుర్భరం అయ్యింది. ఇప్పుడిప్పుడే కోలుకోలేము అనే మానసిక స్థితికి చేరారు. 

వీరు మారారు. 

కొందరి దగ్గర సొమ్ములు వుంటాయి. మరికొందరి దగ్గర తమ ఆలోచనలే పెట్టుబడులు అని భావించే వారు వుంటారు. ఒక ఉపాయం రావాలేగాని దాని ఆచరణకు డబ్బులు సమకూర్చుకోవడం సమస్య కాదు అని అనుకొనే వారు వుంటారు. 

ఇప్పటి దారుణ పరిస్థితులలో అన్నీ మూసుకొని వుండడం ఉత్తమం. వేచి వుండడం మంచింది అని భావిస్తున్నారు. 

వీరు మారారు. 

ప్రపంచం చాలా విశాలమైంది అని భావించే వారు బతుకుల కోసం, అవకాశాలకోసం, పెట్టుబడులను పెట్టడానికి వలసలు వెళ్లారు. అక్కడ కుదురుకొంటూ,  భారమైన హృదయాలతో గాయపడి ఇక్కడి పరిస్థితులు గమనిస్తున్నారు. 

వీరు మారారు. 

కావాలనే సృష్టించిన సమస్యలు తీరుస్తారని ఎదురుచూసి, ఇక వీరికి చేతకాదు అని మారుతున్నారు. కావాలని అహంతో, అసూయతో, కసితో, కక్షగట్టినట్లు చేశారు అని భావించే వారు మారుతున్నారు. 

బయటకు ప్రక్కనే వున్నా.. మనసులో ఎప్పుడో మార్పులు మొదలయ్యి, బయటపడలేక మారుతున్నారు. 

భయంతో బయటకు మారినట్లు కనిపించలేక మారుతున్న వారు వున్నారు. 

మేము కూడా ఇలా చేస్తాడని అనుకోలేదు, ఇంత దరిద్రంగా చేస్తాడని అనుకోలేదు, ఇంత చేతగాని తనం అని అస్సలు ఊహించలేదు అని పైకి మాట్లాడుతూ ఎప్పటికీ మారని వారు వున్నారు. 

మా వాడు ఎలా చేసినా మేము ఆయన వెంటే వుంటాం అని ఎప్పటికీ మారని వారు వున్నారు. 

మా వాడు బ్రహ్మాండంగా చేస్తున్నాడు అని బాహాటంగా ప్రచారం చేస్తూ, ఎప్పటికీ మారని వారు వున్నారు. 

తమ కులపోన్ని గెలిపించుకోవాలి అని డబ్బులు కూడా యాచించకుండా అప్పటికి తీర్పు చెప్పేవారు వుంటారు. అయ్యో ఓటుకు ఇన్ని వేలు ఇచ్చారే అని కుటుంబం మొత్తం తీసుకొన్న లెక్కలు వేసుకొని, ఓట్లను ప్రపోర్షనేట్ గా పంచుదామని అనుకొనే ధర్మ ప్రభువుల రూపంలో అప్పటికి తీర్పు చెప్పేవారు వుంటారు. 

ఇలా మార్పు అనేది నిత్యంగా, శాశ్వతంగా & తూకంగా ఎప్పుడూ వుంటుంది. 

ఒక్క ఛాన్స్ అని జాలిపడకుండా.. అనుభవానికే అవకాశం ఇచ్చి వుంటే, ఇలాంటి సమస్యలను అవకాశాలుగా మలిచే వారేమో అని  పశ్చాత్తాప మార్పు సామూహికంగా మొదలయ్యింది. 

కొందరు గమనిస్తారు. 
మరికొందరు మార్పును చూశాక ఆశ్చర్యపోతారు. #చాకిరేవు.

Link to comment
Share on other sites

6 hours ago, Siddhugwotham said:

NFDB lo 

అసలు మార్పు మొదలయ్యిందా?

Ikkada vala ego kosam tdp meeda ediche janalu ekkuva 

Tdp tittu tappu ledu nee  personal priority kosam  tdp ni palachana chese batch ekkuva db lo 

 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...