Jump to content

BG to Kejriwal 🛑🛑🛑


GOLI SODA

Recommended Posts

అన్ని మతాలలో ఉన్న మతస్తుల కోసం తీర్థయాత్రలు ఏర్పాటు చేస్తున్న, ఇదే లౌకికవాదం అన్న భ్రమలో ఉన్న కేజ్రీవాల్ గారూ, ఇది మీకోసమే!

తమ ఆధ్యాత్మిక ప్రయాణాలకీ, తమ దేవుడి కోసం, సొంత డబ్బులు ఖర్చుపెట్టుకొవడం ఇష్టం లేని బిఖారీ మనస్తత్వం ఉన్నవారు అంటారా మతస్తులు? 

సరే! మనది బీద దేశం. మన దేశంలో పేదవారు ఉన్నారు. మరి ఈ పేదవారికి హుండీ ల నిండా డబ్బులు జమ చేయించుకుంటున్న గుడి కానీ, మసీదు కానీ, చర్చి కానీ సహాయం చేయవచ్చే! మీకు ఏమి పని?

లేదూ, టాక్స్ కట్టనవసరం లేని, కోట్ల కోట్ల రూపాయలు కూడగట్టుకుని కూర్చున్న ధార్మిక సంస్థలు తమ స్వంత మతస్తులకు సహాయం చేయవచ్చు కదా! 

మీకు ఏమిటి సంబంధం?

అసలు మతానికీ, రాజ్యానికి ఏమిటి సంబంధం?

ఇప్పుడు మతం లేని వారికి, దేవుడి మీద నమ్మకం లేని వారికి మీ ప్రభుత్వం వారు ఏమి చేస్తారు? సమానత్వం అన్నది ప్రాథమిక హక్కు గా ఉన్న దేశంలో మీ ఈ పార్షియలిటి ని, వివక్ష ను, ఎలా సమర్థించుకుంటారు?

ఇదేదో నాస్తికులు యాచిస్తున్నారు అనుకునేరు! సమానత్వ పు హక్కుల ఢంకా మోగిస్తున్నారు అంతే! 

నిజానికి మీరు ఎవరికీ ఏమీ చేయవద్దు ఈ విషయంలో. మీరు మీ ప్రస్థానాన్ని ఎలా ప్రారంభించారు, చివరికి ఎక్కడ తేలారు?

ఒకసారి పాఠం చదువుకోండి:

రాజ్యం-నమ్మకాలు

హిందూ, క్రైస్తవం, ఇస్లాం,
బౌద్ధం, జైనం, నాస్తికత్వం,
మానవవాదం, నిరీశ్వరవాదం:
నిజానికి, ఏ వాదమయినా అప్రస్తుతం.

రాజ్యమేదయినా విశ్వాసానికి గాని, లేదా 
విశ్వాసరాహిత్యానికి గాని వెన్ను దన్నుగా ఉంటే, 

అది కొంతమందికి ప్రత్యేకాధికారంగాను , 
మిగతా అందరికీ అన్యాయంగానూ మారుతుంది.

రాజ్యాధికారం, దాని సహాయం కోరుకునే ఏ నమ్మకమయినా, మతమయినా తన నైతిక సత్తా కోల్పోయినట్లే;

ఏ విశ్వాసంతోనైనా అంటకాగిన ఏ రాజ్యమైనా తన తటస్థవైఖరిని కోల్పోయినట్లే; అందరి విశ్వాసాలను గౌరవిస్తాను అని చెప్పడం అర్థరహితం. 

వివక్ష తో కూడిన వ్యవస్థను కోరుకునే ఏ ప్రజలైనా సమాజంలో అలజడి సృష్టించేవారే.

రాజ్యమంటే సమాజంయొక్క రాజకీయ నిర్మాణం. దానికి కావలసినది ప్రజాస్వామ్యం, మానవ హక్కులు, మానవ విలువలు మరియు సైన్సు. అంతే. 

~ బాబు గోగినేని

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...