r_sk Posted May 28, 2021 Posted May 28, 2021 Vendi Thera Ramudu, Krishunudu, Bheemudu & Raavana Radheyudiki... Telugu Janathavali Punya Phalitha Annagariki...
vk_hyd Posted May 28, 2021 Posted May 28, 2021 అందాల అభిమాన నటుడు,విశ్వవిఖ్యాత నటసార్వభౌమ,నటరత్న, అవిభక్త ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రివర్యులు, పద్మశ్రీ నందమూరి తారకరామారావుగారి జయంతి (28-05--2021) సందర్భంగా సమర్పిస్తున్న పద్యాంజలి!💐💐💐 వందనములు నీకు నందమూరి ------------------------------------------ 1) నందమూరి వంటి అందగాడే లేడు ఎన్.టి.యారు సాటి ఎన్.టి. యారె! రంగురూపునందు రారాజు మారాజు వందనములు నీకు నందమూరి! 2) నిమ్మకూరునందు నింగి తారయొకటి నేలపైన బుట్టె వెలుగ భువిని! నందమూరి వంశ అందాల రాముడా! వందనములు నీకు నందమూరి! 3) చిత్రసీమయందు చిత్రాలు చేసావు అన్ని పాత్రలందు అమరినావు ఎట్టి పాత్రయైన ఎంతయో పేరొందె వందనములు నీకు నందమూరి! 4) అందగాళ్ళలోన అందగాడెవరన్న నందమూరి పేరె ముందుయుండు! అందరి అభిమాన అందాల నటుడయా వందనములు నీకు నందమూరి! 5) "పల్లెటూరిపిల్ల "ప్రథమంగ హీరోవి దాని ముందు యొకటి దాటి వచ్చె! మనగ యొక్క పాత్ర "మనదేశ"మందున వందనములు నీకు నందమూరి! 6) ప్రతిభ జూపినావు పాతాళభైరవి చిత్రమందు మంచి సిరులు గురియ మంచి పేరు దెచ్చె మల్లీశ్వరి సినిమా వందనములు నీకు నందమూరి! 7) లవకుశ సినిమాలొ నవరామచంద్రుడై మంచి నటనజూపి మన్ననొందె! నాట్య ప్రతిభ జూపె నర్తనశాలలో వందనములు నీకు నందమూరి! 😎 ఐదు పాత్రలందు ఆ విరాట్ పర్వాన అదరగొట్టినావుయలర నటన! పలు పురాణపాత్ర బ్రహ్మవు నీవయ్య వందనములు నీకు నందమూరి! 9) మాయజేసినావు మాయాబజారులో కృష్ణ వేషమందు తృష్ణ కలుగ! లెస్స నటనజూప మిస్సమ్మ పేరొందె వందనములు నీకు నందమూరి! 10) ఎటుల కృష్ణుడుండొ వివరించవలెనన్న నిట్టె జెప్పవచ్చునిన్నుజూచి! నీవె కృష్ణుడయ్య నీవె రాముండవు వందనములు నీకు నందమూరి! 11) రాజఠీవితోడ రాణించె రాజువై జానపదములందు జనులుబొగడ! వేయికళ్ళు వలయు నీ సోయగం గన వందనములు నీకు నందమూరి! 12) సకల జనులు మెచ్చ సాంఘీక చిత్రాల ప్రజల న్యాయమెంచు పాత్రలందు గొప్పగ వెలుగొంద గొప్పనాయకులైరి వందనములు నీకు నందనమూరి! 13) రావణుండు, కర్ణ, రారాజు పాత్రల యద్భుత నటనంబు ఆహ యనగ! ప్రజలు మెచ్చె మిమ్ము పాత్రలు ఏవైన వందనములు నీకు నందమూరి! 14) తెలుగుజాతి మెచ్చు తెలుగువెలుగు నీవు! తెలుగువారి పేరు వెలుగజేయ నమరజేసినావు ఆత్మాభిమానంబు! వందనములు నీకు నందమూరి! 15) రామతారకమ్మ ధర్మపత్నిగ వచ్చె పదనొకండు సంతు ప్రాప్తమయ్యె నందు బాలకృష్ణ నట వారసుండయ్యె వందనములు నీకు నందమూరి! 16) ఉన్నతంగ ఎదిగె జూనియర్ ఎన్.టి.యార్ మంచి పేరు దెచ్చె మనవడయ్యి! వరుసబెట్టి మీకు వారసులున్నారు వందనములు నీకు నందమూరి! 17) రాజకీయమందు రాణించి నావయ్య అన్న యను పిలుపుతొ మన్ననొంద! చేతులెత్తి ప్రజలు జేజేలు పలికారు వందనములు నీకు నందమూరి! 18) అనతికాలమందె ఆంధ్రరాష్ట్రానికి ముఖ్యమంత్రివయ్యి ముచ్చటగను ప్రజలు మెచ్చు రీతి పథకాలుదెచ్చావు వందనములు నీకు నందమూరి! 19) చవకలోన యిండ్లు చవకగా బియ్యాన్ని పేద ప్రజల కొసగె మోదమంద ఆడవారికాస్తిహక్కు కల్పించావు వందనములు నీకు నందమూరి! 20) గొప్పనటుడవంచు నెప్పుడూ నెంచుచూ గొప్పనాయకుడని గొల్తురయ్య! ప్రజల గుండెలందు పదిలంగ వుంటావు! వందనములు నీకు నందమూరి! ————————————————————— జయ జయహో నందమూరినాయకా!మీకు శతకోటి వందనములు! 💐💐💐💐💐💐💐💐🙏🙏🙏🙏🙏🙏🙏🙏 నోరి రఘురామమూర్తి. హైదరాబాదు,28—05—2021. —————————————————————
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.