Jump to content

వారి ఫీలింగ్స్‌పై కూడా చైనా కన్ను


Recommended Posts

China: వారి ఫీలింగ్స్‌పై కూడా చైనా కన్ను

* వీఘర్లపై ప్రత్యేక కెమెరాలతో నిఘా 

China: వారి ఫీలింగ్స్‌పై కూడా చైనా కన్ను

చైనాలో వీఘర్‌ ముస్లింల పరిస్థితి నానాటికీ దారుణంగా మారుతోంది. తాజాగా వారిలో భావోద్వేగాలను కూడా చైనా పసిగట్టి అణచి వేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. నిఘా కెమెరాల్లో ఒక ప్రత్యేకమైన సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి వారిపై కన్ను వేసింది. కెమెరాకు 3 మీటర్ల సమీపంలోకి వచ్చిన వ్యక్తి ముఖ కవళికలు, చర్మం ఆధారంగా వారిలో భావాలను ఇది పసిగడుతుంది. ఈ విషయాన్ని అంతర్జాతీయ మీడియా సంస్థ బీబీసీ వెలుగులోకి తెచ్చింది. దీనిని ఇప్పటికే చైనా పరిశీలించిందని పేర్కొంది. చైనా ప్రభుత్వం ఇప్పటికే వీఘర్లను వివిధ అంశాలపై ప్రయోగాలు చేయడానికి వినియోగించుకుంటోంది. ఈ కెమెరాలు వ్యక్తులను గుర్తించాక వాటి ఆధారంగా కృత్రిమ మేధను ఉపయోగించి ‘పైఛార్టు’లను తయారు చేస్తాయి.  వీటిల్లో కోపం, బాధ, ఆవేశం వంటి ప్రతికూల భావాలను గుర్తిస్తుంది. ఇలా ఎటువంటి ఆధారం లేకుండా వీఘర్లను వేధించడంపై మానవహక్కుల సంఘాలు మండిపడుతున్నాయి.

ఇప్పటికే చైనా షిన్‌జియాంగ్‌ ప్రావిన్స్‌లో వీఘర్లను గుర్తించేందుకు ప్రత్యేకమైన కెమెరాలను అమర్చారు.  ఈ ప్రావిన్స్‌లో దాదాపు 12 మిలియన్ల మంది వీఘర్లు ఉంటున్నారు. ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ చైనా వీరిని నిర్బంధిస్తోంది. వీరందరని రీ ఎడ్యుకేషన్‌ క్యాంపులుగా చెప్పే జైళ్లలోకి తరలిస్తోంది. అక్కడ వీరిని హింసిస్తున్న ఫొటోలు, వీడియోలు బయటకు వచ్చి బాహ్యప్రపంచాన్ని అవాక్కయ్యేలా చేశాయి. 

స్మార్టుఫోన్లు ఉండాల్సిందే..

స్మార్ట్‌ఫోన్ల ఆధారంగా చైనా వీఘర్లపై ఇప్పటికే బలమైన నిఘా ఉంచింది. వీరు స్మార్టుఫోన్లను ఎప్పుడూ తమతోనే ఉంచుకోవాలి. లేకపోతే అధికారులు అరెస్టు చేసే అవకాశం ఉంది. ఈ ఫోన్ల సాయంతో సదరు వ్యక్తి ఎక్కడికి వెళుతున్నాడు? ఎవరిని కలుస్తున్నాడు? వంటి వివరాలను సేకరిస్తుంది. ఇవి మొత్తం ఇంటిగ్రేటెడ్‌ జాయింట్‌ ఆపరేషన్స్‌ ప్లాట్‌ఫామ్‌లో నిక్షిప్తం చేస్తుంది. వీఘర్లు ఇంటి ముందు ద్వారం నుంచి బయటకు వచ్చారా.. వెనక ద్వారం నుంచి వచ్చారా.. పెట్రోల్‌ ఎక్కడ పోయించుకొన్నారు. వంటి అంశాలు కూడా వీటిల్లో ఉంటాయి. వీఘర్ల ఇళ్లపై క్యూఆర్‌కోడ్‌ అంటించి ఉంటుంది. దీని ఆధారంగా ఆ ఇంట్లో ఎంతమంది ఉన్నారో అధికారులకు తెలుస్తుంది.

హువావే సాయంతో చైనీస్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌  ముఖ కవళికల ఆధారంగా జాతిని గుర్తించే టెక్నాలజీ అభివృద్ధి చేసిందని అమెరికాకు చెందిన ఓ పరిశోధన సంస్థ పేర్కొంది. ప్రతి వ్యక్తికి సంబంధించిన వ్యక్తిగత వివరాలతో చైనా ప్రభుత్వం ఓ డేటాబేస్‌ రూపొందించేందుకు అవసరమైన సాయం కూడా హువావే చేసిందని వెల్లడించింది. దీనిని హువావే ఖండించింది. ప్రపంచంలో వినియోగంచే 80 కోట్ల నిఘా కెమెరాల్లో సగం చైనానే వినియోగిస్తోంది. వీటి సాయంతోనే వీఘర్ల కదలికలను గమనిస్తోంది.

ఎవరీ వీఘర్లు..

షిన్‌ జియాంగ్‌ ప్రావిన్సులోని వీఘర్లు టర్కీ భాష మాట్లాడే ముస్లింలు.  చైనా జనాభాలో సుమారు రెండు కోట్లకు పైగా ముస్లింలు ఉన్నారు. వీరిలో ప్రధానంగా హూయ్‌ జాతీయులు, వీఘర్లు (టర్కీ జాతీయులు), తర్వాత స్థానంలో కజక్‌లు ఉంటారు. హూయ్‌ జాతీయులు చైనీయుల సంప్రదాయాలనే పాటిస్తారు. వీఘర్లు ప్రధానంగా వాయువ్య ప్రాంతంలోని షిన్‌జియాంగ్‌ ప్రావిన్సులో విస్తరించారు. హూయ్‌ జాతీయులు జిన్‌జియాంగ్‌ ప్రావిన్సుకు కుడివైపున గల గాన్సు, నింగ్జియా, కింగాయ్‌, మధ్యప్రాంతంలోని హెనాన్‌, నైరుతిలో ఉన్న (మియన్మార్‌ సరిహద్దు) యున్నాన్‌ ప్రావిన్సుల్లో ఉన్నారు. వీఘర్లు ఎక్కువగా.. ముస్లింలు మెజారిటీగా ఉన్న షిన్‌జియాంగ్‌ ప్రావిన్సులో ఉంటారు.

మైనార్టీలుగా మార్చేందుకు కుట్ర

వీఘర్లను షిన్‌ జియాంగ్‌ ప్రావిన్సులో మైనారిటీలుగా మార్చటానికి చైనా ప్రభుత్వం పథకం ప్రకారం హాన్‌ జాతీయులను ఆ ప్రాంతానికి వలస పంపింది. షిన్‌జియాంగ్‌ రాజధాని నగరమైన ఉర్మిఖీలో ప్రస్తుతం హాన్‌ జాతీయులదే ఆధిక్యం. మొత్తం ప్రావిన్సులో దాదాపు 40 శాతం హాన్‌ జాతీయులు స్థిరపడ్డారు. వారు ఇస్లాం సంప్రదాయాలను మార్చటం మొదలుపెట్టారు. మసీదుల్లో చైనా సంప్రదాయాలను చొప్పించారు. జాతీయ జెండాతో పాటు చైనా భవన నిర్మాణ శైలిని తప్పనిసరి చేశారు. మసీదుల్లో బోధనలను, పాఠశాలలను పర్యవేక్షించటం మొదలు పెట్టారు. చైనా భాషను తప్పనిసరి చేశారు. పురుషులు గెడ్డాలు, మహిళలు బురఖాలు ధరించడాన్ని నిషేధించారు. ఇటీవల వరకూ షిన్‌జియాంగ్‌ ప్రావిన్సుకే పరిమితమైన నిర్బంధం.. మిగిలిన ముస్లిం ప్రాంతాలకూ విస్తరించింది. వారి మతాచారాలను చైనా నియంత్రిస్తోంది.

జిన్‌జియాంగ్‌, గాన్సు, నింగ్జియా, కింగాయ్‌ ప్రావిన్సుల్లో నిర్బంధ చర్యలేవీ తీవ్రవాద ప్రభావాన్ని ఆపలేకపోతున్నాయన్నది ప్రభుత్వ భావన. దీంతో 'పునర్విద్య' పేరుతో పెద్దయెత్తున నిర్బంధ శిబిరాలను నిర్వహిస్తోంది. అయిదో దశకం చివర్లో 'మితవాదంపై పోరాటం' పేరుతో మావో నాయకత్వాన జనాన్ని శిక్షణ శిబిరాలకు తరలించారు. అంతకన్నా భారీగా ఇప్పుడు దాదాపు పది లక్షల మంది వీఘర్లు, కజక్‌ ప్రజల్ని నిర్బంధ శిబిరాల్లోకి తరలించారు. ఇవి కారాగారాలను తలపిస్తున్నాయి. శిబిరాల్లో ఉదయం అయిదు గంటలకు నడకతో శిక్షణ ప్రారంభమవుతుంది. రోజంతా రాజకీయ తరగతులు ఉంటాయి. మతాన్ని గురించి, దేవుడి ఉనికికి వ్యతిరేకంగా, కమ్యూనిస్టు పార్టీ సిద్ధాంతాలు, జిన్‌పింగ్‌ సూక్తులు, వీడియోలు, దేశభక్తి గీతాలు ప్రబోధిస్తారు. 'విద్య ద్వారా పరివర్తన' పేరుతో ప్రభుత్వం ఈ శిబిరాలను నిర్వహిస్తోంది. విదేశాల్లో చదువుతున్న, ఉద్యోగాలు చేస్తున్న వీఘర్‌ జాతి చైనీయులపై నిఘా పెడుతున్నారు. వారిపై అనుమానం ఉంటే దేశానికి రప్పిస్తున్నారు. రాకపోతే దేశంలోని వారి కుటుంబ సభ్యులకు ప్రమాదమని భయపెడుతున్నారు. కొంతమంది పాస్‌పోర్టులు రద్దు చేస్తూ ఆయా దేశాల రాయబార కార్యాలయాలకు సమాచారం పంపించారు.  చైనాతో ఉన్న ఆర్థిక సంబంధాల కారణంగా పలు అరబ్‌ దేశాలు ఈ అంశపై నోరుమెదపవు. తన ఆర్థికశక్తితో చైనా ఆయా దేశాల నోరుమూయిస్తుంది. అమెరికా, ఐరోపా సంఘంలోని దేశాలు తరచూ ఈ అంశంపైనే చైనాను విమర్శిస్తుంటాయి. ఇదే అంశంపై బీజింగ్‌ ఒలింపిక్స్‌ను దౌత్య బహిష్కరణ చేయాలని అమెరికా నేతలు కోరుతున్నారు. మరోపక్క ఐరోపా సంఘం కూడా చైనాతో ఇదే అంశంపై వాణిజ్య ఒప్పందాన్ని పక్కనపెట్టింది.

Link to post
Share on other sites

Technology bagundi but it’s really not possible to know the emotions of a person using technology. 
 

If there are really terrorists in that area, the work done by China is appreciable. 

Link to post
Share on other sites
3 minutes ago, kurnool NTR said:

Technology bagundi but it’s really not possible to know the emotions of a person using technology. 
 

If there are really terrorists in that area, the work done by China is appreciable. 

3 mtrs paridhi lo face ni study chestundi, doubtful ga unte musestharu

Link to post
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    No registered users viewing this page.

×
×
  • Create New...