KING007 Posted May 10, 2021 Posted May 10, 2021 లక్ష రెమ్‌డెసివిర్ నకిలీ ఇంజక్షన్లు విక్రయించిన వీహెచ్‌పీ జబల్‌పూర్ చీఫ్! May 10 2021 @ 18:37PM భోపాల్: కరోనా బారినపడిన వారి ప్రాణాలను నిలిపే రెమ్‌డెసివిర్‌కు ఇప్పుడు దేశవ్యాప్తంగా విపరీతమైన డిమాండ్ ఉంది. బ్లాక్‌మార్కెట్లో ఈ ఇంజక్షన్‌కు వేలాది రూపాయల ధర పలుకుతోంది. దీనిని ఆసరాగా తీసుకున్న విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) నేత ఒకరు ఏకంగా లక్ష నకిలీ రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లు విక్రయించి ప్రాణాలతో పోరాడుతున్న వారిని నిలువునా ముంచాడు. మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో జరిగిందీ ఘటన. విషయం వెలుగులోకి రావడంతో జబల్‌పూర్ వీహెచ్‌పీ చీఫ్ సరబ్‌జీత్ సింగ్ మోకా, దేవేందర్ చౌరాసియా, స్వపన్ జైన్‌లపై పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అలాగే, విపత్తు నిర్వహణ చట్టం, డ్రగ్స్ అండ్ కాస్మొటిక్స్ చట్టం కింద కూడా కేసులు నమోదు చేసినట్టు జబల్‌పూర్ అడిషనల్ ఎస్పీ రోమిత్ కష్వానీ తెలిపారు. వీహెచ్‌పీ జబల్‌పూర్ చీఫ్ అయిన సరబ్‌జీత్‌కు నగరంలో ఓ ఆసుపత్రి ఉంది. దేవేంద్ర చౌరాసియా ఆ ఆసుపత్రిలో మేనేజర్‌గా పనిచేస్తుండగా, స్వపన్ జైన్ ఫార్మాకంపెనీల డీలర్‌షిప్స్ వ్యవహారాలు చూస్తున్నాడు. స్వపన్ జైన్‌ను సూరత్ పోలీసులు అరెస్ట్ చేయగా, సరబ్‌జీత్, చౌరాసియాలు పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. ప్రభుత్వంలోని ఓ టాప్ మంత్రి కుమారుడితో సరబ్‌జీత్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఇండోర్ నుంచి 500 నకిలీ రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లను తెప్పించిన సరబ్‌జీత్ తన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు ఒక్కో దానిని రూ. 35 వేల నుంచి రూ. 40 వేల చొప్పున విక్రయించాడు. ఉప్పు గ్లూకోజ్ కలిపి లక్షకు పైగా నకిలీ రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లను తయారు చేసి దేశవ్యాప్తంగా ఈ ముఠా విక్రయించింది. ఇప్పుడీ గుట్టు బయపటడడంతో దీనిపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. నకిలీ ఇంజక్షన్లలో 3 వేలు ఇండోర్‌కు, 3,500 జబల్‌పూర్‌కు చేరుకున్నాయని కాంగ్రెస్ రాజ్యభ సభ్యుడు వివేక్ ఠంఖా పేర్కొన్నారు. సీబీఐ విచారణకు ఆదేశించకుంటే కోర్టుకు వెళ్తామని ఆయన హెచ్చరించారు. ఈ కేసులో ఇప్పటి వరకు 11 మందిని అరెస్ట్ చేయగా, వారిలో ఆరుగురిపై జాతీయ భద్రతా చట్టం కింద ఇండోర్ పోలీసులు కేసు నమోదు చేశారు. నకిలీ రెమ్‌డెసివిర్ ముఠా సమాచారాన్ని సూరత్ పోలీసుల నుంచి అందుకున్న విజయ్ నగర్ పోలీసులు ఓ కానిస్టేబుల్‌ను వినియోగదారుడిగా రంగంలోకి దింపారు. అతడు నిందితుడిని కలిసి ఇంజక్షన్ కావాలని కోరి ముఠా బాగోతాన్ని బయటపెట్టాడు. గతవారం తన స్నేహితుడి తల్లిదండ్రుల కోసం తాను రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లను కొన్నానని, అవి తీసుకున్నప్పటికీ గతవారం వారు చనిపోయారంటూ ఓ యువకుడు పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు మాత్రం విక్రయించిన వారి కోసం గాలిస్తున్నట్టు చెబుతున్నారు. కాగా, జబల్‌పూర్‌కు చెందిన చాలామంది ఇలాంటి ఆరోపణలతో పోలీసులను ఆశ్రయిస్తున్నారు.
uravis Posted May 11, 2021 Posted May 11, 2021 Em Gabbu gallu tayaru ayyarra Desam lo sikh person VHP head endi
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.