Jump to content

Universe


chanu@ntrfan

Recommended Posts

  • Replies 156
  • Created
  • Last Reply
On 9/5/2019 at 6:35 AM, uravis said:

i am always skeptical to believe in space theories as most of them are just hypothesis and no one ever saw anything in person (or) sent some robots to take take pics beyond pluto :dream:

Beyond pluto is too much yaa..2jV3x9uLukWATQ8T9Zne_cUsOY5j8-jsumlsVyttWe have diffrent kinds of telescopes kno...you can trust them.,

Link to comment
Share on other sites

  • 2 weeks later...
సౌర ‘ధ్రువ తార’!

సూర్యుడి ధ్రువాలపై పరిశీలనకు తొలి వ్యోమనౌక
 వచ్చే నెల ప్రయోగం

సౌర ‘ధ్రువ తార’!

వాషింగ్టన్‌: సూర్యుడి ఉత్తర, దక్షిణ ధ్రువాలను తొలిసారిగా చిత్రీకరించేందుకు అమెరికా, ఐరోపా అంతరిక్ష సంస్థలు సంయుక్తంగా ‘సోలార్‌ ఆర్బిటర్‌’ అనే వ్యోమనౌకను ప్రయోగించనున్నాయి. వచ్చే నెల 7న దీన్ని ప్రయోగించనున్నట్లు అమెరికా రోదసి సంస్థ ‘నాసా’ ఒక ప్రకటనలో పేర్కొంది. సూర్యుడి మధ్యరేఖా ప్రాంతానికి సమాంతరంగా విస్తరించి ఉన్న ప్రదేశాన్ని ‘ఎక్లిప్టిక్‌ ప్లేన్‌’గా పేర్కొంటారు. గ్రహాలన్నీ ఇందులోనే పరిభ్రమిస్తుంటాయి. సూర్యుడి వద్దకు ఇప్పటివరకూ ప్రయోగించిన వ్యోమనౌకలన్నీ ఈ ఎక్లిప్టిక్‌ ప్లేన్‌లోనో.. దానికి దగ్గర్లోనో ఉన్నాయి. సోలార్‌ ఆర్బిటర్‌ మాత్రం దాన్ని దాటి వెళుతుంది. ఇందుకోసం శుక్రుడు, భూమి గురుత్వాకర్షణ శక్తిని ఉపయోగించుకుంటుంది. ఫలితంగా ఎగువ నుంచి సూర్యుడిని పరిశీలించవచ్చని రస్సెల్‌ హోవర్డ్‌ అనే శాస్త్రవేత్త పేర్కొన్నారు.  మన చుట్టూ ఉన్న వాతావరణంపై సూర్యుడి ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. సౌర గోళం నుంచి ఆవేశిత రేణువులు దూసుకొస్తుంటాయి. వీటిని సౌర గాలిగా పేర్కొంటారు. ఒక్కోసారి విస్ఫోటంలా వచ్చే సౌర గాలులు భూమి ఎగువ వాతావరణ పొరలను తాకినప్పుడు అక్కడ సౌర తుపాన్లు చెలరేగుతుంటాయి. ఫలితంగా జీపీఎస్‌, కమ్యూనికేషన్‌ ఉపగ్రహాల పనితీరుపై ప్రభావం పడుతుంది. వ్యోమగాములకూ హాని కలగొచ్చు. అందువల్ల ఈ సౌర తుపాన్లకు సన్నద్ధమయ్యేందుకు శాస్త్రవేత్తలు సూర్యుడి అయస్కాంత క్షేత్రాన్ని పర్యవేక్షిస్తుంటారు. ఎక్లిప్టిక్‌ ప్లేన్‌లో ఉంటూ ప్రస్తుత ఉపగ్రహాలు సాగిస్తున్న పరిశీలనల్లో కొన్ని లోపాలు ఉంటున్నాయి. అత్యంత కచ్చితత్వంతో అంచనాలు వేయాలంటే సూర్యుడి ధ్రువ ప్రాంతాలపై పరిశీలనలు చేపట్టాలని శాస్త్రవేత్తలు తెలిపారు. సోలార్‌ ఆర్బిటర్‌ ద్వారా అది సాధ్యమవుతుందని వివరించారు. ఇది బుధ గ్రహాన్ని దాటి వెళ్లి సూర్యుడిని నిశితంగా పరిశీలిస్తుందన్నారు.

Link to comment
Share on other sites

సూర్యుడి మధ్యరేఖా ప్రాంతానికి సమాంతరంగా విస్తరించి ఉన్న ప్రదేశాన్ని ‘ఎక్లిప్టిక్‌ ప్లేన్‌’గా పేర్కొంటారు. గ్రహాలన్నీ ఇందులోనే పరిభ్రమిస్తుంటాయి. సూర్యుడి వద్దకు ఇప్పటివరకూ ప్రయోగించిన వ్యోమనౌకలన్నీ ఈ ఎక్లిప్టిక్‌ ప్లేన్‌లోనో.. దానికి దగ్గర్లోనో ఉన్నాయి. 

idhi kastha Explain chesthara,

Link to comment
Share on other sites

సూర్యుడిని దగ్గర్నుంచి చూశారా..?

సూర్యుడిని దగ్గర్నుంచి చూశారా..?

హవాయి(యూఎస్‌): ఏంటీ మండే అగ్నిగోళాన్ని దగ్గర్నుంచి చూడటమా.. అసలు సాధ్యమయ్యే పనా? అనేగా మీ సందేహం. అది అసాధ్యమే.. అయితే సూర్యుడి ఉపరితలం ఎలా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేశారు ఖగోళ శాస్త్రవేత్తలు. అందులో వారు సఫలమయ్యారు కూడా. టెలీస్కోప్‌ ద్వారా సూర్యుడి ఉపరితలాన్ని చిత్రీకరించి వాటిని ప్రపంచానికి చూపించారు. 

అమెరికా ప్రభుత్వ సంస్థ అయిన నేషనల్‌ సైన్స్‌ ఫౌండేషన్‌(ఎన్‌ఎస్‌ఎఫ్‌) తమ పరిశోధనల్లో భాగంగా సూర్యుడి ఉపరితలం ఫొటోలను చిత్రీకరించింది. హవాయిలోని డేనియల్‌ కె. ఇనోయి సోలార్‌ టెలీస్కోప్‌ ద్వారా ఈ ఫొటోలు, వీడియోలు తీసింది. ఇందులో సూర్యుడి ఉపరితలంపై ఉండే ప్లాస్మా బంగారు వర్ణంలో భగభగ మండుతూ కన్పించింది. ఈ ఫొటోలను నేషనల్‌ సైన్స్‌ ఫౌండేషన్‌ తన ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేసింది. ‘ఇంతకుముందు ఎన్నడూ చూడని సూర్యుడిని చూడండి..! సూర్యుడి ఉపరితలానికి సంబంధించిన పూర్తి తొలి చిత్రం ఇది’ అని ఎన్‌ఎస్ఎఫ్‌ పేర్కొంది. ఈ చిత్రాలతో సూర్యుడిని మరింత అర్థం చేసుకునేందుకు, భూమిపై దాని ప్రభావాన్ని తెలుసుకునేందుకు వీలు లభించినట్లయిందని వెల్లడించింది. ఇంకేం.. మండుతున్న అగ్నిగోళాన్ని మీరూ ఓసారి చూసేయండి..!

 

 

Link to comment
Share on other sites

  • 3 weeks later...

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...