Jump to content

ఆధార్‌ చౌర్యం నిజంకాదు


Recommended Posts

ఆధార్‌ చౌర్యం నిజంకాదు

ఐటీ గ్రిడ్స్‌ కేసులో యుఐడీఏఐ స్పష్టీకరణ

ap-main3a_15.jpg

దిల్లీ: ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలోని 7.82 కోట్ల మంది ఆధార్‌ కార్డుదారుల వివరాలను ఐటీ గ్రిడ్స్‌ (ఇండియా) అనే ప్రైవేటు సంస్థ సేకరించిందన్న ఆరోపణలపై భారత విశిష్ఠ గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) బుధవారం స్పందించింది. ఈ కేసుకు సంబంధించి తమ సర్వర్లలోకి అక్రమంగా చొరబడ్డారనడానికి ఎలాంటి ఆధారాలు లేవని వివరించింది. తమ ‘సెంట్రల్‌ ఐడెంటిటీస్‌ డేటా రిపాజిటరీ’ (సీఐడీఆర్‌), సర్వర్లు పూర్తి సురక్షితంగా ఉన్నాయని ఒక ప్రకటనలో వెల్లడించింది. సీఐడీఆర్‌లోకి అక్రమంగా ఎవరూ అనుసంధానం కాలేదని, సర్వర్ల నుంచి ఎలాంటి డేటా అపహరణకు గురికాలేదని పేర్కొంది.

‘‘ప్రజల ఆధార్‌ నెంబర్లు, పేర్లు, చిరునామా తదితరాలను యూఐడీఏఐ సర్వర్ల నుంచి తస్కరించారనడానికి ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) ఎలాంటి ఆధారాలను గుర్తించలేదు. సాధారణంగా వివిధ సేవలు అందించే సర్వీసు ప్రొవైడర్లే వినియోగదారుల నుంచి నేరుగా ఆధార్‌ సంఖ్య, ఇతర వివరాలను సేకరిస్తుంటారు. ఆధార్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ చట్టాల ప్రకారం సున్నితమైన ఈ సమాచారాన్ని నిర్దేశిత అవసరం కోసమే సర్వీసు ప్రొవైడర్లు ఉపయోగించాలి. వినియోగదారుల అనుమతి లేకుండా ఇతరులతో ఈ వివరాలను పంచుకోకూడదు’’ అని యూఐడీఏఐ వివరించింది. ఒకవేళ చట్టాన్ని ఉల్లంఘించి ఆధార్‌ సంఖ్యలను సేకరించడం, వాటిని నిల్వచేయడం, వినియోగించడం, ఇతరులతో పంచుకోవడం చేస్తే ప్రాసిక్యూషన్‌ను ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలిపింది. ఐటీ గ్రిడ్స్‌ సంస్థ ప్రజల నుంచి ఆధార్‌ సంఖ్యలను సేకరించి, నిల్వ చేయడానికి కారణాలపై దర్యాప్తు చేయాల్సిందిగా పోలీసులు తమను కోరారని పేర్కొంది.  ఈ క్రమంలో ఆధార్‌ చట్టంలోని ఏవైనా నిబంధనలను ఉల్లంఘించారా అన్నది కూడా పరిశీలించాలని కోరినట్లు తెలిపింది. ‘‘అయినా ఈ ఘటనతో యూఐడీఏఐ డేటా, సర్వర్లకు ఎలాంటి సంబంధంలేదు. పైగా ఒక వ్యక్తి ఆధార్‌ సంఖ్య బయటకు తెలియడం వల్ల అతడికి ఎలాంటి ముప్పు ఉండదు. ఎందుకంటే బయోమెట్రిక్‌ లేదా వన్‌టైమ్‌ పాస్‌వర్డ్‌ వంటి మరో అంచె రక్షణ ఉంటుంది’’ అని స్పష్టంచేసింది.

 

Link to comment
Share on other sites

4 hours ago, kurnool NTR said:

Hadavidi cheyataniki create chesaru TRS batch. They thought they could bury TDP with this case. Seemed like they are not successful. 

nope... they wanted to steal tdp data and target the cadre..

 

pralobhalu, bedirimpulu valla uddesam

 

ycpcall center nundi calls ela vachayo tdp need to find out for themselves 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...