Jump to content

Kanna Comedy


vinayak

Recommended Posts

ఆపరా కాకమ్మ కథలు....
ప్రపంచంలోనే కార్ల తయారీలో అత్యంత భారీ పరిశ్రమ ఏదీ అంటే కొరియా దేశపు కార్ల కంపెనీ కియా మోటార్స్ అని చెబుతారు. ఈ సంస్థ సప్త సముద్రాలు దాటి ఆంధ్రాకు వచ్చి ఇక్కడ కార్లను, దాని విడి భాగాలను తయారు చేసే పరిశ్రమలు పెట్టడం అనేది ఆశ్చర్యకర విషయం. ఈ పరిశ్రమ రావ‌డం వెన‌కున్న ఒకే ఒక్క కార‌ణం… ఏపీలో చంద్ర‌బాబు అందిస్తున్న సుప‌రిపాల‌న‌. ఈ కొరియ‌న్ సంస్థ మొద‌ట త‌మిళ‌నాడులో ప‌రిశ్ర‌మ‌ ఏర్పాటు చేయాల‌ని ప్ర‌య‌త్నించింది.
అక్క‌డి రాష్ట్ర ప్ర‌భుత్వంతో మంత‌నాలు జ‌రిపింది. అప్ప‌టికే ఓ ప్ర‌క‌ట‌న కూడా చేసేసింది. కానీ, చివ‌రి నిమిషంలో కియా సంస్థ నిర్ణ‌యాన్ని మార్చుకుంది. త‌మిళ‌నాడు నుంచి ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని అనంత‌పురానికి త‌మ ప‌రిశ్ర‌మ వెళ్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. దీనికి వారు చూపిన ఒకే ఒక్క కార‌ణం… ‘సంస్థ‌కు అవ‌స‌ర‌మైన భూమి ధ‌ర కంటే, అక్క‌డి రాజ‌కీయ నాయ‌కులు అడుగుతున్న లంచాలు యాభై శాతం ఎక్కువ‌గా ఉన్నాయని’! పరిశ్ర‌మ ఏర్పాటుకు కావాల్సిన రోడ్లు, నీటి సౌక‌ర్యం, మురుగునీటి పారుద‌ల వ్య‌వ‌స్థ‌, ప్రభుత్వ శాఖల నుంచి త్వ‌రితగ‌తిన అనుమ‌తులు ఇవ్వాలంటూ త‌మిళ‌నాడు నేత‌ల్ని కోరితే… వారు అడిగిన లంచాలకు కియా సంస్థ ఖంగుతినాల్సి వ‌చ్చింది. నిజానికి, భార‌త్ లో ఈ సంస్థ ఏర్పాటు చేయాల‌ని అనుకున్న‌ప్పుడు దేశ‌ వ్యాప్తంగా వారు ఒక అధ్య‌యం చేశార‌ట‌. దాని ప్ర‌కారం త‌మిళ‌నాడులో త‌మ‌కు అనువైన ప‌రిస్థితులు ఉన్నాయ‌ని వారు గుర్తించారు. ఆ త‌రువాత‌ గుజ‌రాత్‌, మూడో ఛాయిస్ ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని శ్రీ సిటీ వారి జాబితాలో ఉన్నవి.
అయితే, రెండోదిగా ఉన్న గుజ‌రాత్ ను కాద‌ని, ఆంధ్రాకు రావ‌డం వెన‌క ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ప్ర‌య‌త్నం చాలా ఉంద‌నేది ప్ర‌త్యేకంగా చెప్పుకోవాల్సిన ప‌నిలేదు. ప్రధాని మోడీ కూడా గుజరాత్‌కు తీసుకుని వెళ్లేందుకు ఎంత ప్రయత్నించినా ఈ ఇంటర్నేషనల్‌ సంస్థ అంగీకరించలేదు. ఆల్‌ రెడీ మేము ఏపీ సీఎంకు కమిట్‌మెంట్ ఇచ్చేశామని మొహమాటం లేకుండా చెప్పేసిందట. ఈ సంస్థ అనంత‌పురానికి రావ‌డం వెన‌క ఆంధ్రా సీయీవోగా చంద్ర‌బాబు ప్రయత్నాన్ని, పరిశ్రమలకు అనువైన ప్రాంతంగా ఆంధ్రాని ఆయన ప్రొజెక్ట్ చేస్తున్న విధానాన్ని మెచ్చుకుంటూ అప్ప‌ట్లో జాతీయ మీడియాలో కొన్ని క‌థ‌నాలు కూడా వ‌చ్చాయి. ప‌రిశ్ర‌మ‌లు రావాలంటే అనువైన వాతావ‌ర‌ణం ఒక్క‌టే ఉంటే స‌రిపోదు, పాల‌కుల చిత్త‌శుద్ధి కూడా కొల‌మాన‌మే అవుతుంది. పాల‌న అవినీతిమ‌యం అయితే , వచ్చిన ప్రాజెక్టులు కూడా ఎలా వెనక్కి పోతాయ‌నేదానికి ప‌క్క రాష్ట్రం త‌మిళ‌నాడే ఉదాహ‌ర‌ణ‌. ఒక సంస్థ రాష్ట్రానికి వ‌చ్చి, ప‌రిశ్ర‌మ‌ స్థాపించాల‌నుకుంటే… నాయ‌కుల ప‌నితీరును ప‌రిశీలించాకే సదరు సంస్థలు వ‌స్తాయ‌న్న‌ది వాస్త‌వం. కియా మోటార్స్ విష‌యంలో జ‌రిగింది ఇదే. ఎన్ని రాయితీలు ఇచ్చినా, ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని ప్రకటించినా, పాలనలో అవినీతి కనిపిస్తే అభివ్రుద్ధికి ఆస్కారం ఉండదు...
Link to comment
Share on other sites

1 hour ago, koushik_k said:

Vedini elections ayyaka oka sari man handle chesthe line loki osthadu 

vadi ni ma ouri lo  pagala kotteru oksari,a taruvtha ne mla ayyadu,vadini kodithe vadiki adrustam baga pattindi leka pothe lekapothe ma ouri lone pani chesukuntu undevadu chaputaru ani paripoyi mla ayyadu

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...