sskmaestro Posted December 5, 2018 Share Posted December 5, 2018 13 minutes ago, Saichandra said: Ya only in gajwel anta,hope pratap gives tough fight,ela ante 10k lopu votes tho bayatapadi kcr gadu I feel KCR will lose Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted December 5, 2018 Author Share Posted December 5, 2018 గజ్వేల్‌లో టీఆర్ఎస్కు షాక్! గ్రామాల్లో గట్టి పట్టున్న లీడర్లు ఆఖరి నిమిషంలో కాంగీలో చేరిక! గజ్వేల్ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. అధికార పార్టీకి చెందిన పలువురు నాయకులు శనివారం వంటేరు ప్రతాప్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వర్గల్ మండలం వర్గల్ గ్రామ మాజీ సర్పంచ్ టేకులపల్లి శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీటీసీ గజ్వేల్ ప్రవీణ్‌గౌడ్, మాజీ ఎంపీటీసీ, సీనియర్ నాయకులు పూదరి యాదగిరి, టీఆర్ఎస్ నాయకులు జయరాములు సహా 150 మంది వరకు కార్యకర్తలు కాంగ్రెస్‌లో చేరారు. వీరందరిని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వంటేరు ప్రతాప్‌రెడ్డి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా వంటేరు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో చేరిన ప్రతి నాయకున్ని, కార్యకర్తను కడుపులో పెట్టుకుని కాపాడుకుంటామని అన్నారు. రానున్నది కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రజాకూటమి ప్రభుత్వమే అని అన్నారు. ప్రతి కార్యకర్త, నాయకులు కలిసికట్టుగా పని చేసి కాంగ్రెస్‌కు ఓటు వేసేలా ప్రజలను చైతన్య పరచాలని కోరారు. గజ్వేల్‌లో ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ నియంత పాలన సాగిస్తున్నారని, ప్రజలను కలవకుండా ఫాం హౌజులో ఉంటూ విచ్చలవిడిగా డబ్బులు వెదజల్లుతూ ఓటర్లను ప్రలోభ పెట్టి గెలుద్దామని కలలు కంటున్నారని అన్నారు. కేసీఆర్ ఎన్ని కుట్రలు పన్నినా గజ్వేల్ నుంచి తానే గెలవబోతున్నట్టు తెలిపారు. కేసీఆర్‌కు డబ్బు బలం ఉంటే తనకు ప్రజా బలం ఉందని అన్నారు. అంతకుముందు కొండపాక మండలం దుద్దెడ గ్రామంలో ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గజ్వేల్ పట్టణంలో వంటేరు సతీమణి సుజాత ఎన్నికల ప్రచారం నిర్వహించి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు నాగరాజు, తిరుమల్‌రెడ్డి, గణేష్, తదితరులు ఉన్నారు.ప్రత్యర్ధులుగా ఉన్న వంటేరు ప్రతాప్ రెడ్డి, తూంకుంట నర్సారెడ్డిలు చేతులు కలపటంతో గజ్వేల్ లో కేసీఆర్ ఓటమి ఖాయం అయిపోయింది. కేసీఆర్ గెలిచిన నాటి నుండి, ఇంతవరకు నియోజకవర్గ సమస్యలు… ఆయా గ్రామాల్లో మంచి చెడ్డా చూసుకున్న పరిస్థితి లేదు. ఇతర నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలను నేరుగా కలిస్తే, చిన్న చిన్న పనులు నిమిషాల్లో అవుతున్నాయి. కానీ గజ్వేల్ పరిస్థితి వేరు. దీంతో చాలా గ్రామాల్లో ప్రజలు… అభివృద్ది దేవుడు ఎరుగు, నాకు కావాల్సిన పని ఎన్ని నెలలు అయినా కావటం లేదు, ప్రతాప్ అన్న గెలిస్తే.. నర్సారెడ్డి-ప్రతాపన్నలు మాకు అండగా ఉంటరు అని జనం అభిప్రాయపడుతున్నారు. మంచి రాజకీయ వ్యూహరచన చేసే వ్యక్తిగా పేరున్న ట్రబుల్ షూటర్ హరీష్ రావు.. రంగంలోకి దిగటంతో, గజ్వేల్ రాజకీయం రంజుగా మారుతోంది. అంతిమ విజయం మాత్రం కాంగ్రెస్ పార్టీదే అని చెబుతున్నారు. Link to comment Share on other sites More sharing options...
vinayak Posted December 5, 2018 Share Posted December 5, 2018 13 hours ago, sskmaestro said: I feel KCR will lose If Poll happens in democratic way Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.