Jump to content

తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి పవన్ కల్యాణ్..!


swarnandhra

Recommended Posts

తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి పవన్ కల్యాణ్..!
21-11-2018 17:12:20
 
636784172232132809.jpg
రేపు నిర్మల్‌కు గులాబీ దళపతి కేసీఆర్‌..
కాంగ్రెస్‌ అభ్యర్థి కోసం వారంలోగా రేవంత్‌రెడ్డి
బీఎల్‌ఎఫ్‌ తరపున సినీ నటుడు పవన్‌ కల్యాణ్‌
బీజేపీ అభ్యర్థి కోసం ఫైర్‌బ్రాండ్లు..
ఇక అగ్రనేతల ఎదురుదాడులు
వేడెక్కనున్న ప్రచార పర్వం..
 
(ఆంధ్రజ్యోతి, అదిలాబాద్/నిర్మల్‌ ? నామినేషన్ల పర్వం ముగియడంతో ఇక ప్రచారం ఉధృత రూపం దాల్చబోతోంది. ఇప్పటివరకు ఆయా పార్టీల అభ్యర్థులు, సాధారణ స్థాయి నేతలు ప్రచారం నిర్వహించి మొదటి దశను పూర్తిచేశారు. మలిదశ ప్రచారమంతా వీఐపీల క్యాంపెయిన్‌ మధ్య జరగబోతోంది. ఇందులో భాగంగా గురువారం జిల్లాలోని నిర్మల్‌, ఖానాపూర్‌, ముథోల్‌, బోథ్‌ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ ఎన్నికల ప్రచారం చేపట్టబోతున్నారు. తన పర్యటనతో పార్టీలో కొత్త ఉత్సాహం నింపాలని భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాగా కేసీఆర్‌తో పాటు కేటీఆర్‌, కవిత, హరీష్‌రావులు కూడా ఆయా నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ఇదిలా ఉండగా కాంగ్రెస్‌ తరపున ఫైర్‌బ్రాండ్‌ రేవంత్‌రెడ్డి వారం రోజుల్లోగా నిర్మల్‌ జిల్లాలోని మూడు సెగ్మెంట్లలో ఎన్నికల ప్రచారాన్ని చేపట్టనునున్నారు. అలాగే సినీనటి విజయశాంతి, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి తదితర సీనియర్‌ నాయకులు కాంగ్రెస్‌ అభ్యర్థుల తరపున ప్రచారం చేపట్టేందుకు రంగంలోకి దిగనునున్నారు. బహుజన లెఫ్ట్‌ ప్రంట్‌ (బీఎల్‌ఎఫ్‌) అభ్యర్థుల తరపున సినీనటుడు పవన్‌ కల్యాణ్‌ ప్రచారం చేపట్టనున్నట్లు ఆ పార్టీ అభ్యర్థి వెల్లడించారు. పవన్‌ కల్యాణ్‌ సభల కోసం సరైన స్థలాలను, ప్రాంతాలను అన్వేషిస్తున్నట్లు ఆ పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. బీజేపీ అభ్యర్థుల తరపున పార్టీలోని జాతీయ, రాష్ట్రస్థాయి ఫైర్‌బ్రాండ్‌ నేతలు, కేంద్ర మంత్రులు ప్రచారం చేసే అవకాశాలున్నట్లు సమాచారం. వీరందరి బహిరంగ సభలతో నిర్మల్‌ జిల్లా రాజకీయంగా మరింత వేడెక్కనుంది.
 
 
అగ్రనేతలపై గులాబీ గురి...
కాగా టీఆర్‌ఎస్‌ పార్టీ తమ పార్టీలోని అగ్రనేతలపైనే ప్రచార ఆశలు పెంచుకుంటోంది. ఇప్పటికే ఆ పార్టీ అభ్యర్థులు తమ తమ పరిధిలో పెద్ద ఎత్తున ప్రచారాన్ని చేస్తూ దూసుకుపోతున్నారు. అయితే కాంగ్రెస్‌ , బిజెపిలు కూడా తమ ప్రచార తీవ్రతను పెంచి పోటీ ఉదృతం చేస్తుండడంతో టిఆర్‌ఎస్‌ మరింతగా అప్రమత్తమవుతోంది. ఎలాగైనా గెలుపు సాధించాలన్న లక్ష్యంతో ఆ పార్టీ అగ్రనేతలను రంగంలోకి దించి రాజకీయ వాతావరణాన్ని తమకు అనుకూలంగా మలచుకోవాలని భావిస్తోంది. తెలంగాణ సెంటిమెంట్‌, రాష్ట్ర ఏర్పాటుకు జరిగిన ద్రోహం, త్యాగాలు, గత నాలుగున్నరేళ్ళలో అమలైన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు తోడుగా ప్రస్తుత ఆకర్షణీయ మేనిఫెస్టోతో ఓట్లు రాబట్టాలని టీఆర్‌ఎస్‌ ప్రయత్నిస్తోంది.
 
 
దూకుడు దిశగా కాంగ్రెస్‌...
ఇక నుంచి ప్రచారాన్ని దూకుడుగా చేపట్టేందుకు కాంగ్రెస్‌ పార్టీ సన్నహాలు మొదలుపెట్టింది. దీని కోసం పార్టీకి చెందిన అగ్రనేతలందరిని రంగంలోకి దింపి బహిరంగ సభలు ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఇందులో భాగంగానే వారం రోజుల్లోగా నిర్మల్‌ జిల్లా కేంద్రంతో పాటు ముథోల్‌, ఖానాపూర్‌లలో ఆ పార్టీ ఫైర్‌బ్రాండ్‌ రేవంత్‌ రెడ్డి సభలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఒకటి, రెండు రోజుల్లో రేవంత్‌రెడ్డి పర్యటనలకు సంబంధించిన షెడ్యూల్‌ను పార్టీ అధిష్ఠానం ఖరారు చేయనుంది. రేవంత్‌రెడ్డి సభల తరువాత సినీనటి, మాజీ ఎంపీ విజయశాంతి, సీనియర్‌ నేతలు భట్టి విక్రమార్క, ఉత్తంకుమార్‌రెడ్డి, మైనార్టీ ఓటర్లను ఆకట్టుకునేందుకు షబ్బీర్‌ అలీ, బీసీ ఓట్లను కూడగట్టేందుకు హన్మంత్‌రావు తదితరులను కాంగ్రెస్‌ పార్టీ నిర్మల్‌కు రప్పించబోతున్నట్లు తెలుస్తోంది.
 
 
బీఎల్‌ఎఫ్‌ తరపున పవన్‌ ప్రచారం
బహుజన లెఫ్ట్‌ ప్రంట్‌(బీఎల్‌ఎఫ్‌) అభ్యర్థుల తరపున జనసేన అధినేత, సినీనటుడు పవన్‌ కల్యాణ్‌ ప్రచారం చేపట్టనున్నట్లు తెలుస్తోంది. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు తమ్మినేని వీరభద్రం, పవన్‌ కల్యాణ్‌ను రంగంలోకి దించేందుకు ఇక్కడి ఆ పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. దీని కోసం స్థల సేకరణ, జన సమీకరణలాంటి అంశాలపై పార్టీ అభ్యర్థులు దృష్టి సారిస్తున్నారు. సినీ నటుడుగా పవన్‌ కల్యాణ్‌కు యువకులు, మహిళల్లో మంచి ఇమేజ్‌ ఉన్నందున ఆ రెండు వర్గాల ఓట్లను కూడగట్టవచ్చని బీఎల్‌ఎఫ్‌ భావిస్తోంది.
 
 
రంగంలోకి బీజేపీ ఫైర్‌బ్రాండ్‌లు...
కాగా బీజేపీ కూడా తమ ఫైర్‌బ్రాండ్‌లను రంగంలోకి దించి ఓటర్లను ఆకట్టుకోవాలని వ్యూహరచన చేస్తోంది. దీని కోసం ఎమ్మెల్యే రాజాసింగ్‌, పరిపూర్ణానందలతో పాటు జాతీయస్థాయి అగ్రనేతలను జిల్లాకు రప్పించాలని పార్టీ నాయకులు సమాయత్తమవుతున్నారు. అలాగే బీజేపీలో కొనసాగుతున్న పలువురు సినీనటులను కూడా రంగంలోకి దించాలని యోచిస్తున్నారు. దీనికి తోడుగా తమ అనుబంధ సంఘాల్లోని అనర్గళ ప్రసంగకర్తలను ఇక్కడికి రప్పించే ప్రయత్నాలు కూడా పార్టీ చేస్తోంది.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...