Jump to content

Vonteru Prathap Reddy Interview


anil Ongole

Recommended Posts

గజ్వేల్‌లో టీఆర్ఎస్‌కు 30 వేల ఓట్ల మైనస్..! కేసీఆర్ ఓటమి ఖాయమైందా..?

 
36-trs-2353252.png
 

గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి‌ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. ఉత్తమ్, విజయశాంతితో మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి మంతనాలు జరుపుతున్నారు. ఆయన రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉంది. ఈ విషయం తెలిసి… టీఆర్ఎస్ ఆయనపై సస్పెన్షన్ వేటు వేసింది. గత ఎన్నికల్లో నర్సారెడ్డి కాంగ్రెస్ తరపున పోటీ చేశారు. ఆయన సిట్టింగం్ ఎమ్మెల్యే హోదాలో పోటీ చేశారు. అయితే.. కేసీఆర్ ఓటమి దిశగా ఉన్నారన్న విశ్లేషణలు వచ్చాయి. దాంతో హరీష్‌రావు రంగంలోకి దిగారు. కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే నర్సారెడ్డితో రహస్య ఒప్పందం కుదిర్చుకుని.. ఆయన పోటీ నుంచి తప్పుకునేటట్లు చేశారు. కీలకమైన సమయంలో ఆయన ప్రచారం నిలిపివేసి.. తన క్యాడర్ మొత్తం టీఆర్ఎస్‌కు ఓట్లు వేసేలా చేశారు.

36-trs-party-3525.jpg

 

దీంతో కేసీఆర్ 19,391 ఓట్ల తేడాతో విజయం సాధించారు. అప్పుడు 86,694 ఓట్లు కేసీఆర్ సాధించగా, 67,303 ఓట్లు ప్రతాప్‌రెడికి వచ్చాయి. నర్సారెడ్డికి 34,0 85ఓట్లు పోలయ్యాయి. ఈ సారి ఆయన టీఆర్ఎస్ ప్రభుత్వం తనను పట్టించుకోకపోవడంతో.. ఎన్నికలకు ముందు కేసీఆర్ కు షాక్ ఇచ్చారు. కాంగ్రెస్ లో చేరేందుకు రంగం సిద్దం చేసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ గెలవడం కష్టమని ఆయన అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం అక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వంటేరు ప్రతాప్ రెడ్డి చురుగ్గా ప్రచారం చేస్తున్నారు. వంటేరు ప్రతాప్‌రెడ్డి పేరు తెలువని వారు గజ్వేల్ నియోజకవర్గంతో ఉండరు. అంతగా ప్రజా జీవితంలో మమేకమయ్యాడు. గత ఎన్నికల్లో ఓటమి పాలైనా ప్రజలను అంటి పెట్టుకుని ఉండటంతో.. ఆయనపై ప్రజల్లో సానుభూతి ఉంది. పైపై అభివృద్ధినే ముఖ్యమంత్రి గజ్వేల్ లో చూపించారు. ప్రజల గురించి పట్టించుకోలేదు. దీంతో.. ప్రజల్లో కేసీఆర్ పై కోపం ఉంది. కేసీఆర్ కు వ్యతిరేకంగా గజ్వేల్ మొత్తం ఏకం కావడంతో.. టీఆర్ఎస్ అక్కడ మైనస్ లోకి వెళ్లిపోయింది.

36-trs-5325325.jpg

టీఆర్‌ఎస్ శ్రేణుల్లో లోలోపల భయం ఉన్నా బయటకు మాత్రం మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారనే ప్రచారం ఉంది. అయితే ట్రబుల్ షూటర్‌గా పేరొందిన హరీష్‌రావు రంగప్రవేశం చేసి పరిస్థితులను మామకు అనుకూలంగా మార్చే ఎత్తులు వేస్తున్నారు. కానీ అవన్నీ పైపైనే చేస్తున్నారని.. హరీష్ రావు సిన్సియర్ గా ప్రయత్నిస్తే.. ఎవరూ బయటకు పోరని అంటున్నారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...