Jump to content

'Nara Hamara - TDP Hamara'


sonykongara

Recommended Posts

ముస్లింలకు తెదేపా పెద్దపీట: మంత్రులు
రేపు జరిగే బహిరంగ సభ ఏర్పాట్లు పరిశీలన
04200727BRK-TDP-MINISTERS.JPG

గుంటూరు: దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వమూ అమలు చేయని రీతిలో ముస్లింలకు తెదేపా ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు అందించిందని రాష్ట్ర మంత్రులు అన్నారు. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం గుంటూరులో నిర్వహించనున్న ముస్లిం మైనార్టీ సదస్సు ‘నారా హమారా.. టీడీపీ హమారా’ సదస్సు ఏర్పాట్లను తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు, మంత్రి కళా వెంకట్రావు, మంత్రులు అయ్యన్నపాత్రుడు, ప్రత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనందబాబు పరిశీలించారు. తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక మతసామరస్యానికి అధిక ప్రాధాన్యం ఇచ్చిందని, తెదేపా హయాంలో మత కలహాలు ఎప్పుడూ జరగలేదని కళా వెంకట్రావు అన్నారు. ఏ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయని రీతిలో సంక్షేమ కార్యక్రమాలను తెదేపా అమలు చేసిందన్నారు. కిందటి ప్రభుత్వాలు ముస్లింలను ఓటు బ్యాంకుగా ఉపయోగించుకున్నాయి గానీ వారి సంక్షేమాన్ని పట్టించుకోలేదని మంత్రులు పుల్లారావు, ఆనందబాబు అన్నారు. భాజపాకు మద్దతిచ్చామన్న కారణంతో మైనార్టీలు దూరం జరిగినా.. తెదేపా ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలను గుర్తించారని వారు అన్నారు. మోదీ ప్రభుత్వంపై తెదేపా చేస్తున్న పోరాటాన్ని వారంతా స్వాగతిస్తున్నారని, పెద్ద ఎత్తున ఈ సదస్సులో పాల్గొనేందుకు ఉత్సాహం చూపుతున్నారని చెప్పారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...