Jump to content

BJP games with Supreme Court


Recommended Posts

జస్టిస్‌ జోసెఫ్‌.. జూనియర్‌!
06-08-2018 01:11:02
 
636691146607103222.jpg
  • కేంద్రం అపాయింట్‌మెంట్‌ నోటిఫికేషన్‌
  • జాబితాలో మూడో పేరుగా ప్రస్తావన
  • ప్రాధాన్యం తగ్గిస్తూ సర్కారు తొండి
  • భగ్గుమన్న సుప్రీంకోర్టు న్యాయమూర్తులు
  • నేడు సీజే దీపక్‌ మిశ్రాకు ఫిర్యాదు!
న్యూఢిల్లీ, ఆగస్టు 5: సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్‌ కేఎం జోసె్‌ఫకు పదోన్నతి కల్పించడానికి అయిష్టంగానే అంగీకరించిన కేంద్రం.. ఆయన్ని జూనియర్‌ జడ్జిగా పేర్కొని కొత్త వివాదానికి తెర తీసింది. హైకోర్టు సీజేలుగా ఉన్న జస్టిస్‌ జోసె్‌ఫతోపాటు జస్టిస్‌ ఇందిరా బెనర్జీ, జస్టిస్‌ వినీత్‌ శరణ్‌లను సుప్రీంకోర్టు జడ్జిలుగా నియమించడానికి శుక్రవారం కేంద్ర ప్రభుత్వం ఓకే చెప్పిన సంగతి తెలిసిందే. వీరంతా ఆగస్టు 7న ప్రమాణ స్వీకారం చేస్తారని అనుకొంటున్నారు. అయితే కేంద్రం పంపిన ‘అపాయింట్‌మెంట్‌ నోటిఫికేషన్‌’లో జస్టిస్‌ జోసెఫ్‌ పేరు మూడో స్థానంలో ఉంది. అంటే ఆయన్ని అత్యంత జూనియర్‌గా గుర్తించింది. ఈ చర్యపై సుప్రీంకోర్టులోని కొందరు న్యాయమూర్తులు మండిపడుతున్నారు. ‘ఇది న్యాయవ్యవస్థలో కేంద్రం ఘోరమైన జోక్యంగా’ వారు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. కావాలనే జస్టిస్‌ జోసెఫ్‌ సీనియారిటీని తక్కువ చేసి చూపించారని భావిస్తున్నారు.
 
 
కేంద్రంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రాకు న్యాయమూర్తులు సోమవారం ఫిర్యాదు చేయబోతున్నట్లు తెలిసింది. ఇదే విషయాన్ని ఒక న్యాయమూర్తి చెప్పినట్లు జాతీయ న్యూస్‌ చానల్‌ ఒకటి ఆదివారం పేర్కొంది. ‘అపాయింట్‌మెంట్‌ నోటిఫికేషన్‌లో జస్టిస్‌ కేఎం జోసెఫ్‌ పేరు మొదట్లో ఉండాలని కొలీజియం కోరింది. కానీ మిగతా ఇద్దరు జడ్జిలకంటే జూనియర్‌గా పేర్కొంటూ ఆయన పేరును మూడోస్థానంలో సూచించారు’ అని ఆ న్యాయమూర్తి వివరించినట్లు తెలిపింది. అపాయింట్‌మెంట్‌ నోటిఫికేషన్‌లో జూనియర్‌గా పేర్కొనడం వల్ల భవిష్యత్‌లో జస్టిస్‌ జోసెఫ్‌ ఆయా కేసులు విచారించే ధర్మాసనాలకు నేతృత్వం వహించే వీలుపడదు. వాస్తవానికి జోసె్‌ఫకు పదోన్నతి కల్పించే విషయంలో కేంద్ర ప్రభుత్వం, సుప్రీం కొలీజియం మధ్య తీవ్రస్థాయిలో లేఖల యుద్ధం నడించింది. కొలీజియం సిఫారసులపై న్యాయ శాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ అనేక అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ వచ్చారు. వాటన్నింటినీ సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.
 
 
అదే కారణమా?
2016లో ఉత్తరాఖండ్‌లో హరీశ్‌రావత్‌ నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని పడదోసి కేంద్రం గవర్నర్‌ పాలన విధించడాన్ని.. ఆ రాష్ట్ర హైకోర్టు సీజేగా ఉన్న జస్టిస్‌ జోసెఫ్‌ తప్పుపడుతూ తీర్పు ఇచ్చారు. ఆనాటి నుంచి ఆయనపై కేంద్రం గుర్రుగా ఉంది. సుప్రీంకోర్టు జడ్జి కాకుండా మోకాలడ్డే యత్నం చేసింది. ఈ విషయంలో మోదీ సర్కారు వైఖరి విమర్శలకు దారితీయడంతో చివరకు రాజీ పడింది. అయినా జోసె్‌ఫపై ఉన్న కోపాన్ని ఈ విధంగా తీర్చుకొందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. జూనియర్‌గా పేర్కొంటూ సుప్రీంకోర్టులో ప్రాధాన్యం లేకుండా చేసిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. దీంతో న్యాయమూర్తులు ఇచ్చే ఫిర్యాదుపై సీజే దీపక్‌ మిశ్రా ఏం చేస్తారనేది ఆసక్తి నెలకొంది.
Link to comment
Share on other sites

Modi totally corrupted even judiciary and now it's all open allegations...Chalameswar case lo same chesaru.......kavalani ayyani aprau deliberate ga.....ippudu joseph.....

 

THis is  how courts work in India...WATCH this and feel proud gujju thug fans....

 

 

 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...