Jump to content

payakaraopeta(SC) nunchi contest cheyyalanukunna PK


Recommended Posts

source: AndhraJyothy
నదులనూ మింగేస్తున్నారు 
09-06-2018 01:48:29
 
636641103219796351.jpg
  • వరదలు వస్తే టీడీపీ నేతలకు పండుగే
  •  కాలుష్యం ఇచ్చారు, కొలువు ఊసేది?: పవన్‌
పాయకరావుపేట, ఎలమంచిలి, తుని, జూన్‌ 8:తెలుగుదేశం పార్టీ నాయకులు భూములతోపాటు నదులను కూడా కబ్జా చేస్తున్నారని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ఆరోపించారు. ప్రజా పోరాట యాత్రలో భాగంగా శుక్రవారం ఆయన విశాఖ జిల్లా పాయకరావుపేట, ఎలమంచిలిలో ప్రసంగించారు. పాయకరావుపేట వద్ద 150 మీటర్లు ఉండాల్సి తాండవ నది 50 మీటర్లు కూడా లేదన్నారు. వరదలు వచ్చి నదిలో ఇసుక మేటలు వేస్తే టీడీపీ నాయకులకు పండుగేనన్నారు. గురజాడ, అల్లూరి నడయాడిన పాయకరావుపేట నియోజకర్గంలో కనీసం డిగ్రీ కళాశాల కూడా లేదన్నారు. 2018 నాటికి డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తామన్న మంత్రి గంటా శ్రీనివాసరావు ఇచ్చిన హామీ నెరవేరలేదన్నారు. కోస్టల్‌ కారిడార్‌ పేరుతో తీరం వెంబడి ఏర్పాటుచేసిన పరిశ్రమల్లో స్థానికులకు అవకాశాలు కల్పించలేదు సరికదా ఆ వ్యర్థాలను సముద్రంలోకి వదిలి మత్స్య సంపదను నాశనం చేస్తున్నారన్నారు. హెటిరో, డక్కన్‌ పరిశ్రమలు శాశ్వత ఉద్యోగాలు ఇవ్వకుండా తప్పించుకుంటున్నా అడిగేవారు లేకుండా పోయారన్నారు. టీడీపీ పాలనలో ఎవరికీ న్యాయం జరగలేదన్నారు. స్థానిక ఎమ్మెల్యేకు అనధికార క్వారీలపై ఉన్న శ్రద్ధ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో లేదని పవన్‌ విమర్శించారు. ఎర్రచందనం తరలిపోతున్నా పట్టించుకోని పాలకులు జాతీయ స్థాయి ఖ్యాతి ఆర్జించిన ఏటికొప్పాక కళాకారులకు అవసరమైన అంకుడు కర్రపై ఆంక్షలు విధించడం విచారకరమన్నారు. అధికారంలోకి వస్తే ఉద్యోగుల సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేస్తామన్నారు.
 
దోచుకుంటున్న జన్మభూమి కమిటీలు
రాష్ట్రంలో జన్మభూమి కమిటీలు ప్రజలను దోచుకుంటున్నాయని పవన్‌ ఆరోపించారు. బ్రాండిక్స్‌ అరవై వేల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఎకరా రూపాయి చొప్పున వెయ్యి ఎకరాలు తీసుకుందని, కానీ నేటికీ తన హామీని నిలబెట్టుకోలేదని అన్నారు. ప్రైవేటు లాభాల కోసం సహకార వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు. సీఎంకు హెరిటేజ్‌ అభివృద్ధి తప్ప మరో ధ్యాస లేదని విమర్శించారు. పుష్కరాల పేరుతో రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశారని, ఏం చేశారో తన గోదావరి జిల్లాల పర్యటనలో తేలుస్తానని పవన్‌ హెచ్చరించారు.
 
గెలిచే మొదటి సీటు పాయకరావుపేటే
వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో జనసేన పార్టీ గెలుపొందే మొట్టమొదటి సీటు పాయకరావుపేటేనని పవన్‌ కల్యాణ్‌ అన్నారు. 2014 ఎన్నికల్లోనే పాయకరావుపేట నుంచి పోటీ చేయాలనుకున్నా టీడీపీకి మద్దతు ఇవ్వడంతో మిన్నకుండిపోయామన్నారు. 2019 ఎన్నికల్లో జనసేన అధికారంలోకి రావడం ఖాయమని పవన్‌ జోస్యం చెప్పారు.
 
బాధిత కుటుంబాలకు పరామర్శ
‘‘ఫ్లెక్సీలు కట్టొద్దని ఎన్నోసార్లు చెప్పాను. ఒకవేళ కట్టినా జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతూనే ఉన్నాను. ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరం. బాధిత కుటుంబాలను ఆదుకుంటాం. ఆ చిన్నారుల చదువుల బాధ్యత జనసేనదే’’ అని పవన్‌ కల్యాణ్‌ అన్నారు. పాయకరావుపేటలో ఈ నెల 6న పవన్‌ కల్యాణ్‌ కటౌట్‌ కడుతూ విద్యుదాఘాతంతో భీమవరపు శివ, తోలెం నాగరాజు మృతి చెందిన విషయం తెలిసిందే. పాయకరావుపేటలోని శివ కుటుంబాన్ని పరామర్శించి, భార్య విజయలక్ష్మిని ఓదార్చారు. వారి మూడు నెలల బాబును చూసి పవన్‌ కంటతడి పెట్టుకున్నారు. బాబును ఎత్తుకుని అనిరుధ్‌ అని నామకరణం చేశారు. తర్వాత తునిలో ఉంటున్న నాగరాజు ఇంటికి చేరుకుని నాగరాజు భార్య శివసత్యను ఓదార్చారు శివ మూడో కుమారుడికి గౌరీశంకర్‌ అని పేరుపెట్టారు. ఎన్‌ఆర్‌ఐ ఫౌండేషన్‌ ద్వారా సమకూర్చిన రూ.6 లక్షలను రూ.3 లక్షల చొప్పున అందించారు.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...