Jump to content

NTR Bharosa


Recommended Posts

  • Replies 190
  • Created
  • Last Reply
పండుటాకులకు పింఛన్‌ పండగ

 

సాయం రూ.2వేలకు పెంపు
జనవరి నుంచే అమలు
మహిళల ఆరోగ్యానికి ‘రక్ష’ పథకం
60,596 మందికి భూ హక్కులు
ఒకేరోజు రూ.8వేల కోట్ల విలువైన పట్టాల పంపిణీ
నెల్లూరు జిల్లా జన్మభూమిలో చంద్రబాబు వెల్లడి
ఈనాడు-నెల్లూరు ఈనాడు డిజిటల్‌-అమరావతి

11ap-main1a_3.jpg

గత ఎన్నికల సమయంలో ఇంటికి పెద్ద కొడుకు మాదిరి ఉంటానని హామీ ఇచ్చా. అందుకే పింఛను మొత్తాన్ని పెంచా. ఇంకా ఎంతో చేయాలనుకున్నా. సంపద సృష్టించి ఆదాయాన్ని పెంచి మళ్లీ మీకు పంచుతా.
- ముఖ్యమంత్రి చంద్రబాబు

‘సంక్రాంతికి కానుక ఇస్తున్నా. ఎంత భారమైనా ఫర్వాలేదు. నాకు కావాల్సింది పేదలు. అందుకే ఆలోచించా. ప్రతి నెలా ఇచ్చే పింఛను మొత్తాన్ని రూ.2వేలకు పెంచుతున్నా. నెల్లూరు జిల్లా బోగోలు వేదిక నుంచి అధికారికంగా ప్రకటిస్తున్నా. జనవరి నెల రూ.వెయ్యి బకాయి కలిపి ఫిబ్రవరిలో మొత్తం రూ.3వేలు చెల్లిస్తాం. మార్చి నుంచి రూ.2వేల చొప్పున ఇస్తాం’ అని ముఖ్యమంత్రి చంద్రబాబువెల్లడించారు. శుక్రవారం జన్మభూమి-మాఊరు ముగింపులో భాగంగా నెల్లూరు జిల్లా బోగోలులో ఏర్పాటు చేసిన బహిరంగసభలో, అమరావతిలో అధికారులతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. ‘మహిళలు, 8,9,10 తరగతులు చదివే బాలికల ఆరోగ్య భద్రతకు రక్ష పథకం కింద శానిటరీ నాప్‌కిన్‌లను ఉచితంగా అందిస్తున్నాం. దీనికి ఏటా రూ.120కోట్ల మొత్తాన్ని ప్రభుత్వం వెచ్చిస్తుంది...’ అని వివరించారు. జన్మభూమిలో గొడవలు చేయాలని ప్రతిపక్షం భావించిందని, ఎన్నికల సమయంలో ఇలా చేసి లబ్ధి పొందాలనుకుందని, ప్రజలు సంఘటితంగా తమతో కలిసి వచ్చారని వివరించారు. ఏ ప్రభుత్వమైనా ప్రజల నమ్మకంపైనే మనుగడ సాగిస్తోందన్నారు. వైకాపాను నమ్ముకుంటే అధికారులు, పారిశ్రామికవేత్తలకు జైలు జీవితం వస్తోందని చెబుతూ అలాంటి ప్రభుత్వం మీకు కావాలా అని ఆయన ప్రశ్నించారు. ప్రగతి  ఆగిపోకుండా ముందుకు వెళ్లాలంటే మళ్లీ తెదేపా అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని చెప్పారు. రాష్ట్రాల హక్కులను కేంద్రం తీసుకుందనే కారణంతో గతంలో పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్‌ పోరాటం చేశారని, అదే స్ఫూర్తితో నేడు కేంద్రంపై పోరాటం చేస్తున్నానని పేర్కొన్నారు. తెలుగు రాష్ట్ర ఏర్పాటుకు పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం చేశారని, ఆయన నివసించిన జువ్వలదిన్నెను ఆదర్శ గ్రామంగా ఎంపిక చేసి రూ.110కోట్లతో అభివృద్ధి పనులు చేశామని వెల్లడించారు.

నిధులకు అడ్డుపడుతున్న ప్రధాని మోదీ
‘రాష్ట్ర విభజన జరిగింది. నెత్తిన అప్పులు పెట్టుకుని వచ్చాం. రూ.16 వేల కోట్ల లోటు బడ్జెట్‌ ఉంది. ఇటీవల జయప్రకాష్‌నారాయణ రూ.85వేల కోట్లు రాష్ట్రానికి రావాలని నివేదిక ఇచ్చారు. జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ కూడా నిజనిర్ధరణ కమిటి వేసి రూ.75 వేల కోట్లు కేంద్రం ఇవ్వాల్సి ఉందని చెప్పారు. కేంద్ర ఆర్థిక శాఖ నుంచి రూ.35వేల కోట్లు ఇవ్వటానికి సిద్ధమని అధికారులు చెబుతున్నారు. ప్రధాని మోదీ అనుమతి కావాలంటున్నారు. ఆయన అడ్డుపడుతున్నారు. కేంద్రం సహకరించకున్నా.. మీకు ఇబ్బంది రాకూడదని రూ.24వేల కోట్ల మొత్తాన్ని రుణమాఫీ కింద ఇచ్చాం. రామాయపట్నం ఓడరేవును 20 నుంచి 22 నెలల్లో పూర్తి చేస్తాం.పోలవరం ప్రాజెక్టును మే నెల నాటికి పూర్తి చేయాలన్నదే లక్ష్యం. గోదావరి-పెన్నా నదులను కూడా అనుసంధానం చేస్తున్నాం. సోమశిల జలాశయానికి గోదావరి నీరు వస్తుంది...’ అని వివరించారు. బహిరంగ సభ ముగిసిన తర్వాత దగదర్తి మండలం దామవరం దగ్గర నిర్మిస్తున్న విమానాశ్రయ పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. ఏడాదిలో నిర్మాణాన్ని పూర్తి చేసి సేవలను అందుబాటులోకి తీసుకువస్తామన్నారు.

11ap-main1b_3.jpg

భూ హక్కుల కల్పన
ఈ సందర్భంగానే సహకార సంయుక్త రైతు సంఘాల(సీజేఎఫ్‌ఎస్‌) భూములకు సంబంధించి ఒకే రోజు రూ.8 వేల కోట్ల విలువైన భూ పట్టాలను పేదలకు సీఎం చంద్రబాబునాయుడు అందించారు. మొత్తం 66,276.79 ఎకరాల భూమికి హక్కులను కట్టబెట్టారు. తొలివిడత కింద 60,596 మంది లబ్ధి పొందారు. వీరిలో ఎస్సీలు, ఎస్టీలు, ఇతరులు, బీసీలు ఉన్నారు. ఈ భూమి విలువ ఎకరా సగటున సుమారు రూ.12 లక్షల చొప్పున... మొత్తం విలువ దాదాపు రూ.8వేల కోట్లు. ఈ స్థాయిలో ఒకేసారి పట్టాలను ఇవ్వటం రాష్ట్రంలో సరికొత్త చరిత్రగా మారింది. భూమి పట్టాతో పాటు చీర, పసుపు, కుంకుమ, గాజులు, టెంకాయ కలిపి పంపిణీ చేశారు. ఈ పట్టాలను మహిళలకు అందిస్తూ సీఎం ఉద్విగ్నతకు గురయ్యారు. ఇంతమంది ఆడపడుచులకు రూ.కోట్ల విలువైన భూమిని కానుకగా ఇస్తున్నందుకు సంతోషంగా ఉందని, ఆస్తి భద్రత కల్పించామని చెప్పారు. ఎవరికీ ఒక్కపైసా ఇవ్వాల్సిన అవసరం లేదని, లబ్ధిదారులకు మళ్లీ ఫోన్లు చేసి మాట్లాడతానని స్పష్టం చేశారు.

వినతులు తగ్గడమే ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం
మొదటివిడత నిర్వహించిన జన్మభూమిలో ప్రజల నుంచి 40 లక్షల వినతులు వస్తే... ప్రస్తుతం 4.57 లక్షలు మాత్రమే వచ్చాయని సీఎం చంద్రబాబు తెలిపారు. ఇవి గణనీయంగా తగ్గిపోవడమే ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని టెలీకాన్ఫరెన్స్‌లో పేర్కొన్నారు. శనివారం నుంచి సంక్రాంతి సంబరాలు నిర్వహించాలన్నారు. ‘16వేల గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించడం ఒక చరిత్ర. 16వేల గ్రామాభివృద్ధి ప్రణాళికలను అప్‌లోడ్‌ చేయడం ఒక రికార్డు. ప్రజల భాగస్వామ్యానికి జన్మభూమి, గ్రామవికాసం, జలసిరికి హారతి కార్యక్రమాలను తీసుకొచ్చాం. స్వశక్తితో ముందుకెళ్తున్నాం. ఇదే స్ఫూర్తితో రాబోయే రోజుల్లోనూ పనిచేస్తాం...’ అని వివరించారు.

11ap-main1c_2.jpg

మన ‘1100’ ప్రపంచానికే నమూనా

‘ఒక్క రోజులో రూ.లక్ష కోట్ల పెట్టుబడులు రావడం ఒక చరిత్ర. వీటి వల్ల 1.30లక్షల మందికి ఉపాధి రానుంది. అదానీ సంస్థ రూ.30వేల కోట్లతో డేటా పార్కులు, రూ.40వేల కోట్లతో సౌర పార్కులు ఏర్పాటు చేయనుంది. ప్రకాశంలో ఏర్పాటు కానున్న కాగితం గుజ్జు పరిశ్రమతో 50వేల రైతు కుటుంబాలకు ప్రయోజనం కలగనుంది. మన ఆర్టీజీఎస్‌ని బ్రిటన్‌ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్‌ ప్రశంసించారు. సింగపూర్‌ మంత్రి ఈశ్వరన్‌ అభినందించారు. సింగపూర్‌లో లేని వ్యవస్థకు మనం శ్రీకారం చుట్టాం. ‘1100’ పరిష్కార వేదిక ప్రపంచానికే నమూనాగా నిలిచింది. మన ఆవిష్కరణలపై అందరూ ఆసక్తిగా ఉన్నారు. భవిష్యత్తులో ప్రపంచ దృష్టి మన డేటా సేవలపైనే ఉంటుంది...’ అని వివరించారు. ‘అభివృద్ధిలో ఇతర రాష్ట్రాలు మన కన్నా ముందుకు పోతే నాకు అసూయ. ఆ అసూయనే కసిగా మార్చుకుని మరింత పట్టుదలతో పనిచేస్తా. రాష్ట్ర ప్రగతికి ఉపయోగపడేలా పని చేస్తా. 2014లో కొందరు రాష్ట్రానికి వచ్చేందుకు ఆసక్తి చూపలేదు.  ఏపీ బృందాన్ని బలహీన బృందం అన్నారు. ఇప్పుడా బృందంతోనే అద్భుతాలు సృష్టిస్తున్నాం. నాలుగేళ్లలో వచ్చిన 670 అవార్డులే మన కృషికి రుజువు...’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు.

 

 

 

 

Link to comment
Share on other sites

పింఛన్‌... పెంచెన్‌!
12-01-2019 02:52:34
 
636828583551128234.jpg
  • అన్ని సామాజిక పెన్షన్లు రెట్టింపు..
  • వృద్ధాప్య, వితంతువులకు 2వేలు
  • దివ్యాంగులకు రూ.3 వేలు
  • డయాలసిస్‌ రోగులకు 3500
  • ఈ నెల నుంచే అమలు
  • 54 లక్షల మందికి ‘భరోసా’
అమరావతి, జనవరి 11(ఆంధ్రజ్యోతి ? ‘రెట్టింపు పింఛనుతో రెట్టింపు ఆనం దం’ అంటూ రాష్ట్ర ప్రభుత్వం సుమారు 54 లక్షల మందికి తీపి కబురు వినిపించింది. గతంలో రూ.200 ఉన్న వృద్ధాప్య పింఛనును ఒకేసారి వెయ్యి చేసిన సీ ఎం చంద్రబాబు.. ఇప్పుడు దానిని ఏ కంగా రూ.2వేలకు పెంచారు. దీంతోపాటు సామాజిక పింఛన్లను రెట్టింపు చేశారు. ఈ పెంపు ఈ నెలనుంచే అమలులోకి వచ్చినట్లే! జనవరి పింఛను ఇప్పటికే లబ్ధిదారుల ఖాతాలో జమ చేసినందున.. ఫిబ్రవరిలో పెరిగిన పింఛనుతోపాటు, జనవరి తాలూకు సగం కలిపి జమ చేస్తారు. ప్రభుత్వం ఎన్టీఆర్‌ భరోసా కింద సామాజిక పింఛన్లను అందిస్తోంది. వృద్ధాప్య, వితంతు, చేనేత, నేత కార్మికులు, మత్స్యకారులు, కళాకారులు, డప్పు కళాకారులు, ఒంటరి మహిళలకు ఇప్పటిదాకా రూ.వెయ్యి పింఛను ఇస్తోంది. ఇకపై వీరందరికీ రెండు వేలు అందుతుంది. ఇక.. ట్రాన్స్‌జెండర్లు, దివ్యాంగులకు ఇస్తున్న రూ.1500ని రూ.3వేలకు పెంచారు. కిడ్నీ రోగులకు ఇస్తున్న రూ.2500ను 3500కు పెంచారు. ‘‘దేశంలో మరే రాష్ట్రంలోనే ఈ స్థాయిలో సామాజిక పింఛన్లు చెల్లించడంలేదు. ప్రభుత్వం రూ.15,600 కోట్లను పింఛన్ల కోసం వెచ్చిస్తుంది. అంటే... ఐదేళ్లకు రూ.78 వేల కోట్లు. ఇది అసాధారణ సాయం’’అని టీడీపీవర్గాలు పేర్కొన్నాయి.
Link to comment
Share on other sites

  • సీఎం వరాల వెల్లువ
  • అన్నిరకాల పింఛన్లు రెట్టింపు
  • పెన్షన్‌ 2 వేలు!
  • వచ్చే నెల నుంచే ఇస్తాం.. జనవరిదీ కలిపి రూ.3 వేలు
  • వృద్ధులకు నేనిచ్చే సంక్రాంతి కానుక ఇది
  • ఏప్రిల్‌ నుంచి వైద్యానికి 5 లక్షలు
  • సిద్ధమవుతున్న మరిన్ని వరాలు
  • పాడి పశువుకు 30 వేల బీమా
  • ఇంటింటికీ స్మార్ట్‌ ఫోన్‌ పంపిణీ
  • డ్వాక్రా మహిళలకు మరో 10వేలు
  • ఆటోలు, ట్రాక్టర్లపై పన్నులన్నీ రద్దు
సంక్రాంతికి ముందే ‘సర్కారు సంబరాలు’ తీసుకొచ్చింది. రాష్ట్ర ప్రజలకు వరాల మీద వరాలు ప్రకటించేందుకు సిద్ధమైంది. ‘సంక్షేమ అస్త్రాలకు’ ఎన్నికల ముందు మరింత పదును పెడుతోంది. వృద్ధుల నుంచి దివ్యాంగుల వరకు... నేత నుంచి గీత దాకా... పాడిరైతు నుంచి ఆటో డ్రైవర్‌ వరకు అనేక వర్గాల వారికి లబ్ధి చేకూర్చేలా ‘సంక్షేమ సంక్రాంతి’ తెస్తోంది. ‘ఎన్టీఆర్‌ భరోసా’ కింద అందిస్తున్న అన్నిరకాల సామాజిక పింఛన్లను రెట్టింపు చేశారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం ‘జన్మభూమి’ సభలో అధికారికంగా ప్రకటించారు. అలాగే... అతి త్వరలో ప్రతి పేద కుటుంబానికి ఉచితంగా స్మార్ట్‌ఫోన్‌ అందించాలని భావిస్తున్నారు. పాడికీ అండగా ఉండేలా పశువులకూ బీమా కల్పించాలని యోచిస్తున్నారు. రైతుకు అదనపు ఆదాయాన్ని ఇచ్చే పాడి పశువు చనిపోతే రూ.30 వేలు చెల్లిస్తారు. డ్వాక్రా మహిళలకు ‘పసుపు కుంకుమ’ కింద అదనంగా రూ.10వేలు చెల్లించాలని భావిస్తున్నారు. ఇక... వ్యవసాయంలో రైతులు విరివిగా ఉపయోగించే ట్రాక్టర్లు, బడుగులు ఉపాధి కోసం ఉపయోగించే ఆటోలపై అన్నిరకాల పన్నులను రద్దు చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది.
 
 
నెల్లూరు, జనవరి 11(ఆంధ్రజ్యోతి): వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు శుభవార్త. కొత్త సంవత్సరంలో వారికి సంతోషాన్ని కలిగిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు సంక్రాంతి కానుక ప్రకటించారు. ఫిబ్రవరి నుంచి రూ.2వేల చొప్పున పెన్షన్‌ ఇవ్వనున్నట్లు ప్రజల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. జనవరి నెలది కూడా కలిపి ఫిబ్రవరిలో ఒకేసారి రూ.3 వేలిస్తామని వెల్లడించారు. ఆర్థిక బలహీన వర్గాలకు పది శాతం రిజర్వేషన్‌ ప్రకటించిన ప్రధాని మోదీ.. ఆంధ్రలోని కాపుల కోటా బిల్లును ఎందుకు ఆమోదించలేదని ప్రశ్నించారు. వాల్మీకులు, మత్స్యకారులు, రజకులను వేరే వర్గాల్లోకి ఎందుకు చేర్చలేదని నిలదీశారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బోగోలులో శుక్రవారం ఆరో విడత ‘జన్మభూమి-మా ఊరు’ ముగింపు సభలో చంద్రబాబు ఉద్వేగభరితంగా ప్రసంగించారు. ఏమన్నారో ఆయన మాటల్లోనే.. ‘నిన్నా మొన్నా గ్రామసభలకు వెళ్లి చూశాను. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులను చూస్తే బాధేసింది. మళ్లీ ఆలోచించాను. వారికి మరింత భరోసా ఇవ్వాలని సంకల్పించాను. ఇప్పుడిస్తున్న పింఛనును రూ.2 వేలు చేసి ఇస్తానని సభాముఖంగా మాటిస్తున్నా. ఇది మీ అందరికీ నూతన సంవత్సర కానుక.. సంక్రాంతి కానుక. ఎంత ఖర్చయినా ఫర్వాలేదు. నాకు కావలసింది పేదవాళ్లే. జనవరి నెల రూ.1,000 కూడా కలిపి ఫిబ్రవరిలో మూడు వేలిస్తా. తర్వాతి నుంచి రూ.2 వేల చొప్పున ఇస్తా. సంతోషమా..? నేను కష్టపడేదే మీ కోసం. ఇంకా కష్టపడతా. సంపద సృష్టిస్తా.. సంపాదించింది తిరిగి మీకే ఇస్తా. నాకూ ఇబ్బందులున్నాయి. డబ్బులు లేవు. అయినా మీ కష్టాలు తీర్చే బాధ్యత, మీ కంట నీరు తుడిచే బాధ్యత నాది. తెలుగుదేశం ప్రభుత్వం అంటే నమ్మకం. జగన్‌ అంటే భయం. రాష్ట్రంపై ముగ్గురు మోదీలు కన్నేశారు. ఒక మోదీనే భరించలేకపోతున్నాం. ఇక ఆ ముగ్గురు కలిస్తే ఎంత భయంకరంగా ఉంటుందో ఊహించుకోండి. సంక్షోభ పరిస్థితుల్లో సుస్థిర ప్రభుత్వం అవసరం. ప్రపంచదేశాల ప్రజలు ఇలాంటి తీర్పు ఇవ్వడం వల్లే అమెరికా, జర్మనీ సహా పలు దేశాలు అభివృద్ధిలో దూసుకుపోతున్నాయి.’
 
 
మీ నమ్మకాన్ని వమ్ముచేయలేదు..
‘నేనైతేనే రాష్ట్రాన్ని కాపాడుతానని నమ్మి 2014లో నాకు ఓట్లు వేసి అధికారంలో కూర్చోబెట్టారు. మీ నమ్మకాన్ని వమ్ము చేయలేదు. రేయింబవళ్లు కష్టపడుతున్నా. రాజధాని రాష్ట్ర ప్రజల కల. దానికి సహకరిస్తామని చెబితే ఎన్డీఏతో జత కట్టాను. ఏదైనా ఇస్తాడని ప్రధాని మోదీని రాజధాని శంకుస్థాపనకు పిలిచాను. ఆయన మట్టి..నీళ్లు తెచ్చి మన ముఖాన కొట్టేసిపోయారు. అయినా నేను వెనక్కి తగ్గలేదు. రాజధాని ప్రాంత రైతులకు పిలుపిచ్చా. నన్ను నమ్మి 34 వేల ఎకరాల భూమి ఇచ్చారంటే అదీ నా ప్రభుత్వంపై ఉన్న నమ్మకం. సింగపూర్‌కు వెళ్లాను. రాజధాని నిర్మాణానికి సహకరించమని అడిగాను. వాళ్లు పైసా కూడా తీసుకోకుండా కేబినెట్‌లో పెట్టి మనకు మాస్టర్‌ ప్లాన్‌ ఇచ్చారు. ఇదీ నాపై ఉన్న నమ్మకం. రామాయపట్నం పోర్టుకు శంకుస్థాపన చేస్తే అక్కడ భారీ పరిశ్రమలు పెట్టడానికి పలు కంపెనీలు ముందుకు వచ్చాయి. ఒకే రోజు లక్ష కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఇది నమ్మకం వల్ల జరిగింది కాదా? నమ్మకం లేకపోతే జరిగేవేనా..? వైసీపీ అధినేత జగన్‌ అంటే అందరికీ భయం. ఆయనతో జైలుకు తీసుకుపోతాడనే భయంతో పెట్టుబడులు పెట్టడానికి భయపడుతున్నారు. పారిశ్రామికవేత్తలు వాళ్ల జీవితాలనే నాశనం చేసుకున్నారు. కొంతమంది అధికారులు ఈయన మాటలు విని జైలుకు పోయే పరిస్థితి వచ్చింది. మనం ఏ పనిచేసినా నీతిగా చేస్తాం. అదీ వాళ్లకు, మనకు ఉన్న తేడా.’
 
 
కుక్కలు చింపిన విస్తరి కాకుండా..
‘ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని సోషల్‌ మీడియాలో చాలామంది మెసేజ్‌లు చేస్తున్నారు. ఒకతను రాశాడు. ‘మీకేం సార్‌. మీరు బాగానే ఉంటారు. మేం నాశనమైపోతాం. అందుకే మళ్లీ మీరే (చంద్రబాబు) రావాలి. 135 కోట్ల మంది ప్రతినిధిగా ఉన్న ప్రధాని కూడా స్థాయి మరచి మీపై కత్తి కట్టారు.. రాష్ట్రం మీద కత్తి కట్టారు. మీరింకే పదవీ కోరుకోరు.. కానీ మా పిల్లల భవిష్యత్‌ కోసం మీరే రావాలి సార్‌.. దేశంలో నాశనం అవుతున్న వ్యవస్థలను తిరిగి గాడిలోపెట్టాలంటే మీరు రావాలి. అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్న రాష్ట్రాన్ని అవినీతి, అరాచక, అటవిక పాలనవైపు వెళ్లకుండా ఉండాలంటే మీరే రావాలి సార్‌.. అని ఇలా చాలామంది మెసేజ్‌లు పెడుతున్నారు. నేను నాలుగున్నరేళ్లు రాత్రింబవళ్లూ మీ కోసం కష్టపడ్డాను. రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరి కాకూడదంటే మళ్లీ టీడీపీయే రావాలి. ఈ ప్రభుత్వానికి అండగా ఉండే బాధ్యత మీది. మిమ్మల్ని అన్ని విధాలా ఆదుకునే బాధ్యత, కష్టాలు లేకుండా చూసే బాధ్యత ఈ ప్రభుత్వానిది. అండగా నిలవండి. ఆశీర్వదించండి. విభజన హామీలను నెరవేర్చండని మోదీని అడిగాం. ప్రత్యేక హోదా కోరాం.. అడుక్కున్నాం.. గట్టిగా అడిగాం.. ఏమీ చేయకుంటే విధిలేక విడిపోయాం. దీనికి మోదీ కక్ష కట్టారు. నియంతలా వ్యవహరిస్తున్నారు. మనవాళ్లపై సీబీఐ దాడులు చేయించారు. మరోఅడుగు ముందుకేసి మన టెలిఫోన్లన్నీ ట్యాప్‌ చేస్తున్నారు. మన కంప్యూటర్లలోకి ప్రవేశించి సమాచారం దొంగిలించబోతున్నారు. దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ అమలు చేస్తున్నారు.’
 
 
మీ ఆరోగ్యమే మా భాగ్యం
‘పేదలపై వైద్యం ఖర్చులు భారాన్ని తగ్గించేందుకు ఏప్రిల్‌ నుంచి ఎన్టీఆర్‌ వైద్య సేవల పరిమితిని రూ.5లక్షలకు పెంచుతున్నాం. వైద్య ఖర్చులు తగ్గించడం కోసం ఇప్పటికే చాలా చర్యలు తీసుకున్నాం. ఆస్పత్రుల్లో వైద్య పరీక్షల ఖర్చులు, మందుల ఖర్చులు తగ్గించాం. ప్రజలు ఒక విషయం ఆలోచించాలి. ప్రజల కష్టాలు గమనించి ఎప్పటికప్పుడు కొత్త కొత్త సంక్షేమ పథకాలు అమలు చేసుకుంటూ వెళ్తున్నాం. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఏ ఒక్క కార్యక్రమాన్నీ నిలిపివేయలేదు. కిలో రూపాయికే బియ్యం ఇస్తున్నాం. సంక్రాతి కానుక, చంద్రన్న బీమా, చంద్రన్న పెళ్లికానుక ఇస్తున్నాం. మన ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న నాయకులు అభివృద్ధి, సంక్షేమాల్లో మన దరిదాపుల్లో అయినా ఉన్నారా..?’
 
 
60,590 మంది రైతులకు పట్టాల పంపిణీ..
జన్మభూమి ముగింపు సభ పేదలు, వృద్ధుల్లో మరపురాని మధురానుభూతి కలిగించింది. పింఛన్ల పెంపు ప్రకటనతో వారి ఆనందానికి అవధుల్లేవు. వేదికపైన ఉన్న నాయకులు, సభాప్రాంగణంలోని ప్రజలందరూ లేచి నిలబడి కరతాళ ధ్వనులు చేశారు. నెల్లూరు జిల్లా పరిధిలోని 66,276 ఎకరాల సీజేఎ్‌ఫఎస్‌ భూమిని 60,590 మంది ఎస్సీ, ఎస్టీ రైతులకు సీఎం పట్టాలుగా పంపిణీ చేశారు. పట్టాలన్నీ మహిళల పేర్లపై ఇవ్వడం గమనార్హం. పసుపు-కుంకుమ కింద ఈ పట్టాలు ఇస్తున్నానని, ఇది తన అదృష్టంగా భావిస్తున్నానని సీఎం అన్నారు. రూ.8వేల కోట్ల విలువైన భూములు తమ పేర్ల మీద పట్టాలు చేతికి అందడంతో ఎస్సీ, ఎస్టీ మహిళలు ఆనందపడ్డారు. పదే పదే పట్టా కాగితాలను చూసుకుంటూ మురిసిపోయారు.
Link to comment
Share on other sites

జన్మభూమిలో 5.6లక్షల ఫిర్యాదులు: చంద్రబాబు

12brk159a.jpg

అమరావతి: రాష్ట్రంలో ఇప్పటి వరకు ఆరుసార్లు జన్మభూమి కార్యక్రమాలు నిర్వహించామని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. అమరావతిలోని ప్రజావేదికలో చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. ‘‘జన్మభూమిలో ప్రజా సమస్యలపై ఫిర్యాదులు స్వీకరించి పరిష్కరిస్తున్నాం. సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లాం. మండల స్థాయిలో తహసీల్దార్‌, ఎంపీడీవోలతో కలుపుకొని పనిచేశాం. జన్మభూమిలో 1800 మండల బృందాలతో కలిసి పనిచేశాం.  రాష్ట్రంలో 12,918 గ్రామ పంచాయతీల్లో కార్యక్రమాలు చేపట్టాం. నాలుగేళ్లపాటు చేసిన అభివృద్ధి పనులను సమర్థంగా ప్రజల్లోకి తీసుకెళ్లాం. జన్మభూమిలో 1.28లక్షల మంది అధికారులు  1.70లక్షల కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గ్రామ, వార్డు అభివృద్ధి ప్రణాళికలు తయారు చేశాం. జరిగిన అభివృద్ధిపై గ్రామాల్లో డిజిటల్‌ పెయింటింగ్స్‌ వేయిస్తున్నాం. రాష్ట్ర, జిల్లా అభివృద్ధి ప్రణాళిక త్వరలో తయారు చేస్తాం. జన్మభూమిలో పది రోజుల్లో 61.13 శాతం మంది పాల్గొన్నట్లు చెప్పారు. సుస్థిర అభివృద్ధి, ఇతర అంశాలపై చర్చ జరిగిందని 83శాతం మంది చెప్పారు. జన్మభూమి కార్యక్రమం బాగుందని 77.97 శాతం మంది చెప్పారు. జన్మభూమిలో 5.60లక్షల ఫిర్యాదులు వచ్చాయి. ఫిర్యాదుల్లో 33వేలకు పైగా రియల్‌టైమ్‌లో పరిష్కరించాం’’ అని సీఎం చంద్రబాబు తెలిపారు.

రెండు చేతులు లేని దివ్యాంగులకు రూ.10వేల పింఛను

రెండు చేతులు లేని దివ్యాంగులకు నెలకు రూ.10వేల చొప్పన ఫింఛను ఇవ్వాలని నిర్ణయించినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. రెండు చేతులు లేనివారు ఇతరులపై ఆధారపడి జీవిస్తున్నారని, అలాంటి వారికి మానవతా దృక్పథంతో సాయం చేయాలని భావించినట్లు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా అలాంటి దివ్యాంగులు 200-300 మంది ఉంటారని, లబ్ధిదారులను గుర్తించాలని అధికారులను ఆదేశించినట్లు సీఎం తెలిపారు.

 

Link to comment
Share on other sites

రెండు చేతులు లేని దివ్యాంగులకు రూ.10వేల పింఛను

రెండు చేతులు లేని దివ్యాంగులకు నెలకు రూ.10వేల చొప్పన ఫింఛను ఇవ్వాలని నిర్ణయించినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. రెండు చేతులు లేనివారు ఇతరులపై ఆధారపడి జీవిస్తున్నారని, అలాంటి వారికి మానవతా దృక్పథంతో సాయం చేయాలని భావించినట్లు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా అలాంటి దివ్యాంగులు 200-300 మంది ఉంటారని, లబ్ధిదారులను గుర్తించాలని అధికారులను ఆదేశించినట్లు సీఎం తెలిపారు.

Link to comment
Share on other sites

ఇంటింటికీ భరోసా 

 

అర్హులందరికీ ఇళ్లు సమకూరుస్తాం 
ఆకలి బాధను దూరం చేస్తాం 
దేశంలోనే తొలిసారిగా గ్రామాభివృద్ధికి ప్రణాళిక 
ముఖ్యమంత్రి చంద్రబాబు 
ఈనాడు - అమరావతి

‘రెండు చేతులు లేని దివ్యాంగులకు నెలకు రూ.10వేల చొప్పున పింఛను ఇవ్వాలనే అభ్యర్ధన వచ్చింది. ఈ విషయాన్ని తీవ్రంగా ఆలోచిస్తున్నాం. చర్చించి త్వరలో నిర్ణయం తీసుకుంటాం.

పింఛన్లు ఇవ్వకముందు వృద్ధులను పిల్లలు సరిగా పట్టించుకునేవారు కాదు. వారికి నెలకు రూ.1,000 ఇవ్వడం ప్రారంభించాక భరోసా లభించింది. ఇప్పుడు నెలకు రూ.2వేలు చేయడంతో వారి బాగోగులకోసం  పోటీపడతారు.

- సీఎం చంద్రబాబు

    

‘జన్మభూమి- మావూరు’లో 5,68,616 అర్జీలు వచ్చాయని, ఇప్పటికే చాలా వాటిని పరిష్కరించామని, మిగిలిన అన్నింటికీ పరిష్కారం చూపిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. దరఖాస్తు పరిష్కరించామో లేదో తెలియజేస్తూ అర్జీదారులందరికీ లేఖలు రాస్తామని చెప్పారు. ఒకవేళ పరిష్కారం కాకుంటే ఎందుకు చేయలేకపోయామో వివరిస్తామని వెల్లడించారు. ఆకలి అనే బాధ తెలియనీయకుండా ప్రతి ఒక్కరికీ తిండి పెడతామని, ఇల్లు లేదనే పరిస్థితి రాకుండా అర్హులైన వారందరికీ ఇళ్లు కట్టించి ఇస్తామని, పేదరికం అనేది లేకుండా అందరి కుటుంబాల ఆదాయం పెంచుతామని తెలిపారు. దేశానికే తెలుగుదేశం ఒక ట్రెండ్‌ సెట్టర్‌లా మారుతుందని పేర్కొన్నారు. ‘ఇళ్లు నిర్మించాలని కోరిన అర్హులందరికీ నిధుల విడుదలకు అనుమతులిస్తాం. ఇళ్ల స్థలాలు అడిగిన వారికి తక్కువ ధరలో భూమి దొరికితే కొని ప్లాట్లు కేటాయిస్తాం. భూమి ధర ఎక్కువ ఉన్న చోట జీ+3 విధానంలో ఇళ్లు నిర్మించి ఇస్తాం’ అని తెలిపారు. అనుమతుల మంజూరులో ఎలాంటి రాజకీయం, సిఫార్సులకు తావులేదని స్పష్టం చేశారు. ప్రతి కుటుంబానికి ఒక స్మార్ట్‌ ఫోన్‌ అందిస్తామని పునరుద్ఘాటించారు. ఆరో విడత ‘జన్మభూమి -మావూరు’ శుక్రవారం ముగిసిన నేపథ్యంలో శనివారం సాయంత్రం ఉండవల్లి ప్రజా వేదికలో ఆయన విలేకరులతో మాట్లాడారు.

‘పండగలకు కానుకలు, పేదలకు బీమా, పింఛన్లు, పెళ్లి కానుక, ఎస్సీ, ఎస్టీలకు నెలకు 100 యూనిట్ల ఉచిత విద్యుత్తు, విద్యార్థులకు రుసుములు, ఉన్నత విద్యకు సాయం, అన్న క్యాంటీన్లు తదితర ఎన్నో సంక్షేమ పథకాలను మా ప్రభుత్వం అమలు చేస్తోంది. గాడి తప్పిన పాలనను జాతీయ రహదారిపైకి తెచ్చాం. ఇక వేగం అందుకోవడమే. ప్రజల భాగస్వామ్యంతో చేపట్టిన ‘జన్మభూమి- మావూరు’ విజయవంతమైంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి గ్రామ కార్యదర్శి, ఆశా కార్యకర్తలదాకా బాగా పనిచేశారు’ అని చంద్రబాబు వివరించారు.

దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో అన్ని గ్రామాలు, వార్డులు, మండల స్థాయిలో 2019 నుంచి 2024 వరకు ఏం చేయాలనే విషయమై ప్రణాళికలు రూపొందించామని ముఖ్యమంత్రి వెల్లడించారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామ ప్రజలు కలిసి వీటిని తయారు చేసి గంట వ్యవధిలోనే ఆన్‌లైన్లో అప్‌లోడ్‌ చేశారని చెప్పారు. జిల్లా ప్రణాళికలను ఈ నెల 21 నుంచి విడుదల చేస్తామని తెలిపారు. తర్వాత రాష్ట్ర స్థాయి ప్రణాళిక రూపొందిస్తామని వెల్లడించారు. ‘జన్మభూమి- మావూరు’ కార్యక్రమంలో 80 శాతం వార్తలు సానుకూలంగా వచ్చాయి. వ్యతిరేకంగా వచ్చిన 20 శాతం వార్తలనూ సమీక్షిస్తాం. అందులో వాస్తవాలుంటే సరిదిద్దుకుంటాం. కావాలని రాసిన వాటిని ప్రజల ముందుంచుతాం’ అని స్పష్టం చేశారు.

సంక్రాంతి గీతం ఆవిష్కరణ 
సంక్రాంతి సందర్భంగా రూపొందించిన ప్రత్యేక వీడియోను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. ఇందులో గ్రామీణ సంప్రదాయాలు, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు.

భరోసా అంటే ఇదే.. 
‘పింఛను రూ.3వేలు చేయడం జీవితంలో మర్చిపోలేను. నా తల్లికి కూడా రూ.2వేల పింఛను వస్తోంది. రూ.5వేలతో నేను, నా తల్లి ధీమాగా జీవిస్తాం. భరోసా అంటే నిజంగా ఇదే.. ఆజన్మాంతం సీఎంకు రుణపడి ఉంటా’ అని కృష్ణా జిల్లా కపిలేశ్వరం గ్రామానికి చెందిన ఓంకార రాజు పెట్టిన పోస్టును సమాచారశాఖ కార్యదర్శి రామాంజనేయులు సమావేశంలో చదివి వినిపించారు.

12ap-main7b.jpg

 

 

ముఖ్యాంశాలు

Link to comment
Share on other sites

సీఎం ఫ్లెక్సీలకు పాలు, పుష్పాలతో అభిషేకాలు
13-01-2019 03:38:05
 
636829474866439813.jpg
(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌): పెన్షన్‌ వెయ్యి రూపాయల నుంచి రెండు వేలకు పెంచుతూ సీఎం చంద్రబాబు తీసుకున్న నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. కర్నూలు జిల్లాలోని పోలీసు పరేడ్‌ గ్రౌండ్‌లో జరిగిన సంక్రాంతి సంబరాలలో వృద్ధులు, పింఛనుదారులు సీఎం ఫ్లెక్సీకి పాలతో అభిషేకం నిర్వహించారు. ఊహించని విధంగా సంక్షేమ పథకాలను చంద్రబాబు ప్రభుత్వం అమలు చేస్తోందని ఈ సందర్భంగా డిప్యూ టి సీఎం కేఈ కృష్ణమూర్తి అన్నారు. కార్యక్రమంలో వృద్ధులు, మహిళలు థ్యాంక్యూ సీఎంగారు అంటూ ప్ల కార్డులను ప్రదర్శించారు. అలాగే, పింఛన్‌లు రెట్టింపు చేయడంపై అనంతపురం జిల్లాలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర మాంసపు ఉత్పత్తుల కార్పొరేషన్‌ చైర్మన్‌ చంద్రదండు ప్రకా్‌షనాయుడు ఆద్వర్యంలో పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. చంద్రబాబు చిత్రపటానికి పుష్పాభిషేకం చేశారు. పింఛన్ల పెంపుతో అన్ని వర్గాల ప్రజల గుండెల్లో సీఎం చంద్రబాబు చిరస్థాయిగా నిలిచిపోతారని ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు అన్నారు. శ్రీకాకుళంలో చంద్రబాబు చిత్రపటానికి ఎంపీ పాలాభిషేకం చేశారు. ప్రకాశం జిల్లా గిద్దలూరులో మహిళలు ఎమ్మెల్యే అశోక్‌ రెడ్డి నివాసానికి ర్యాలీగా వచ్చి అక్కడ చంద్రబాబు చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...