Jump to content

‘ఎన్టీఆర్‌’ కోసం... వీరిద్దరూ 


Ramesh39

Recommended Posts

‘ఎన్టీఆర్‌’ కోసం... వీరిద్దరూ 
20tollywood-6a.jpg

‘ఎన్టీఆర్‌’ బయోపిక్‌ నుంచి తేజ తప్పుకోవడంతో దర్శకుడి స్థానం ఖాళీ అయ్యింది. ఆ బాధ్యత కూడా నందమూరి బాలకృష్ణ స్వీకరిస్తారని, ఆయనే ఈ చిత్రానికి దర్శకుడని ప్రచారం జరిగింది. అయితే.. బాలయ్య ఈ విషయంలో పునరాలోచనలో పడినట్టు తెలుస్తోంది. దర్శకుడిగా, నిర్మాతగా, నటుడిగా మూడు బాధ్యతలు మోయడం ఎందుకనో ఏమో.. ఇప్పుడు దర్శకత్వ బాధ్యతలు  మరొకరి చేతుల్లో పెట్టాలని భావిస్తున్నారట. క్రిష్‌తో బాలయ్య సంప్రదింపులు జరుపుతున్నారని, ఈ ప్రాజెక్టులో క్రిష్‌ అడుగుపెట్టడం దాదాపుగా ఖాయమని సమాచారం. మరోవైపు శర్వానంద్‌కి ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర దక్కబోతున్నట్టు తెలుస్తోంది. ఇటీవల ‘ఎన్టీఆర్‌’ చిత్రబృందం శర్వాని సంప్రదించిందని, శర్వా కూడా తన అంగీకారం తెలిపాడని సమాచారం.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...