Jump to content

May expect Babai - Abbayi in one pic today


Disco King

Recommended Posts

Balayya initiated this meeting...
twood1524562353.jpg

టాలీవుడ్ హీరోలు దాదాపు ఇరవై మంది వరకు ఈరోజు సమావేశం అవుతున్నారు. ఇది చాలా రేర్ మీటింగ్ అనే చెప్పాలి. ఇంతమంది హీరోలు ఒకేచోట సమావేశం కావడం చాలా అరుదుగా జరుగుతుంటుంది.

టీవీ 9, ఏబీఎన్, మహా, టీవీ 5 చానెళ్ల విషయంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రేకెత్తించిన అభ్యంతరాలు, ఆయన టీవీ 9, ఏబీఎన్ చానెళ్లపై జరుపుతున్న పోరు నేపథ్యంలో ఈ సమావేశం జరుగుతోంది.

ఈ సమావేశం నిర్వహణకు ఇటు బాలకృష్ణ, అటు చిరంజీవి చర్యలు తీసుకుని, ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు టాప్ 20హీరోలకు కబురు వెళ్లినట్లు తెలుస్తోంది. పవన్, ఎన్టీఆర్, మహేష్ లగాయతు నాని, శర్వా, ఇలా అందరు హీరోలు హాజరవుతారని బోగట్టా.

మరి ఇంతమందిని సమావేశం జరిపి ఏంచేస్తారన్నది చూడాలి. కొన్ని చానెళ్లు ఈ సమస్యను రాజీ ద్వారా సద్దుమణిగించే ఆలోచనలో వున్నాయి. అందులో భాగమే ఈ మీటింగ్ అనుకోవాలి. లేదూ అంటే బాలయ్య బాబు ఎందుకు చొరవ చూపిస్తారు? న్యూస్ చానెళ్లపై బ్యాన్ ఆలోచన వుంది అని వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో ఈ సమావేశం ఏర్పాటు జరగడం విశేషం.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...