Jump to content

AP Real Time Governance Center


sonykongara

Recommended Posts

 

AndhraPradeshCM: CM ncbn hosted Former British Prime Minister Mr. Tony Blair at the RTG State Centre, Secretariat, Amaravati today. Expressing wonder and amazement at the advanced data-driven governance in AP, he called CM’s efforts revolutionary. #iprap

DwUqbSGXQAAApnF.jpg
DwUqbUSXgAAzaYX.jpg
DwUqbVqXQAAXkYO.jpg
DwUqbSvXcAEihaS.jpg
Link to comment
Share on other sites

ఆర్టీజీఎస్‌ అద్భుతం.. అమోఘం 

 

బాబుకు చేతులు జోడించి కితాబునిచ్చిన టోనీ బ్లెయిర్‌ 
ప్రపంచానికే స్ఫూర్తిదాయకమని ప్రశంస 
ఈనాడు - అమరావతి

7ap-main3a_1.jpg

రియల్‌టైం గవర్నెన్స్‌ పనితీరు అద్భుతం, ఆమోఘం, స్ఫూర్తిదాయకం అంటూ బ్రిటన్‌ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్‌ ప్రశంసల వర్షం కురిపించారు. సచివాలయంలో సోమవారం రాత్రి ఆర్టీజీఎస్‌ పనితీరును 45 నిమిషాల పాటు ఆద్యంతం ఆసక్తిగా గమనించిన ఆయన చివరగా చేతులు జోడించి ముఖ్యమంత్రి చంద్రబాబును     ఉద్దేశించి అమేజింగ్‌.. అంటూ కితాబునిచ్చారు. అది ప్రపంచానికే స్ఫూర్తిదాయకమని అభివర్ణించారు. ప్రకృతి విపత్తులను ఆంధ్రప్రదేశ్‌ సమర్థంగా ఎదుర్కొంటున్న తీరు ముచ్చటగొలిపిందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కొత్త రాష్ట్ర పురోభివృద్ధికి చేస్తున్న కృషి అభినందనీయమని వ్యాఖ్యానించారు. సీఎం ఆహ్వానం మేరకు ఇక్కడికి వచ్చానని, ఆర్టీజీఎస్‌ను సందర్శించడం ఆనందంగా ఉందని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ సాధిస్తున్న విజయాలు అందరికీ ఆదర్శమని, ప్రపంచంలో ఇలాంటి వ్యవస్థ ఎక్కడా లేదని ఆయన పేర్కొన్నారు.

సాదర స్వాగతం: సచివాలయానికి టోనీ బ్లెయిర్‌ చేరుకోగానే ముఖ్యమంత్రి చంద్రబాబు సాదర స్వాగతం పలికారు. అనంతరం ఆయనను ఆర్టీజీఎస్‌ కార్యాలయంలోనికి తోడ్కొని వెళ్లారు. మంత్రి లోకేష్‌, అధికారులను పరిచయం చేశాక సీఎం మాట్లాడుతూ ‘‘ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టోనీ బ్లెయిర్‌ అనుకోకుండా హైదరాబాద్‌ వచ్చారు. అమెరికా అధ్యక్షుడు బిల్‌ క్లింటన్‌ చెబితే అక్కడకు వచ్చానని చెప్పడం ఆనందానిచ్చింది. టోనీ బ్లెయిర్‌ గొప్పనేత. చిన్న వయసులోనే బ్రిటన్‌కు ప్రధాని అయ్యారు. ఇటీవల సింగపూర్‌ పర్యటనలో ఆయన్ను కలిసి ఏపీకి రావాల్సిందిగా ఆహ్వానించా. ఆయన ఇక్కడికి రావడం, టోనీ బ్లెయిర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ గ్లోబల్‌ఛేంజ్‌ కోసం పనిచేయడం ఆనందంగా ఉంది. విభజన అనంతరం 2014లో ఇక్కడికి అనేక కష్టాలతో వచ్చాం. విజన్‌-2050 రూపొందించి 2022 నాటికి దేశంలోనే మూడు అత్యుత్తమ రాష్ట్రాల్లో ఒకటిగా ఏపీ ఉండాలని శ్రమిస్తున్నాం. ఇందుకోసం ఏడు మిషన్లు, వీటిని సాధించడానికి గ్రిడ్‌లు ఏర్పాటుచేశాం. పవర్‌ గ్రిడ్‌తో అందరికీ విద్యుత్తు, గ్యాస్‌ గ్రిడ్‌ ద్వారాతో ప్రజలకు గ్యాస్‌ సరఫరా చేస్తున్నాం. ఫైబర్‌ గ్రిడ్‌ చాలా ఆసక్తికరమైన ప్రాజెక్టు. చాలా ఖర్చుతో కూడుకున్నది. ప్రతి ఇంటికి 15 ఎంపీబీఎస్‌ వేగం ఉన్న అంతర్జాలం, టీవీ కనెక్షన్‌, టెలిఫోన్‌ కేవలం రెండు డాలర్లకు ఇస్తున్నాం. ఆధార్‌కు సమానంగా ప్రతి భూభాగానికి భూధార్‌ పేరుతో ప్రత్యేకంగా నంబరును ఇస్తున్నాం. రియల్‌టైం గవర్నెన్స్‌ ద్వారా నేను ఇక్కడ కూర్చునే రాష్ట్రమంతా పర్యవేక్షిస్తున్నా. గ్లోబల్‌ డేటా సెంటర్లపై రాష్ట్ర విధాన ప్రకటన చేస్తోంది. ఈ రంగంలో రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయి. విద్య, వ్యాపారం, విజ్ఞానాది రంగాలకు ఊతమిచ్చే కంటెంట్‌ కార్పొరేషన్‌, అలాగే డ్రోన్‌ కార్పొరేషన్‌ ఏపీలో తప్ప దేశంలో ఎక్కడా లేవు. అవేర్‌ విభాగం ద్వారా ప్రకృతి విపత్తులను, భూగర్భ జలాలను రియల్‌టైంలో పర్యవేక్షిస్తున్నాం. 1100 కాల్‌ సెంటర్‌ ద్వారా ప్రజా సమస్యలను పరిష్కరిస్తున్నాం. సులభతర వాణిజ్యంలో గత రెండు ఏళ్లుగా దేశంలోనే ప్రథమస్థానంలో నిలిచాం’’ అంటూ వివరించారు.

7ap-main3b.jpg

ఛాయాచిత్రాన్ని చూసి: 2001లో టోనీ బ్లెయిర్‌ ఉమ్మడి రాష్ట్రంలో పర్యటించినప్పుడు తీసిన ఛాయాచిత్రాన్ని సీఎం తన పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌లో చూపించగా ఆయన ఆశ్చర్యం ప్రకటించారు. ఈ చిత్రంలో ఐటీ సలహాదారు సత్యనారాయణ, ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నారు. 2001 తరువాత మళ్లీ ముగ్గురూ అమరావతిలో ఒకేచోట కలిశారు. 


ధన్యవాదాలు.. అభినందనలు 
ఆర్టీజీఎస్‌ సందర్శకుల పుస్తకంలో బ్లెయిర్‌

ఆర్టీజీఎస్‌ పనితీరును ప్రత్యక్షంగా పరిశీలించిన టోనీ బ్లెయిర్‌ సందర్శకుల పుస్తకంలో ధన్యవాదాలు అంటూ రాయటం ప్రారంభించి అభినందనలతో ముగించారు. ఆర్టీజీఎస్‌ పనితీరు ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉందంటూ సంతకం చేశారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం తరఫున నంది వెండి విగ్రహంతోపాటు అరకు కాఫీ ప్యాకెట్‌ని అందజేసి వాటి ప్రత్యేకతలను వివరించారు. టోనీ బ్లెయిర్‌కు గౌరవార్థం సచివాలయంలో ముఖ్యమంత్రి విందు ఇచ్చారు

Link to comment
Share on other sites

  • 5 years later...

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...